Wednesday, September 29, 2010
భలే భలే అందాలు
పొద్దున్నే కాఫీ గ్లాస్ తీసుకొని బయట కూర్చుందామని వెళ్ళాను . కాని అడుగు ముందుకు వేయలేక పోయాను . ఎదురుగా , నిన్న వేసిన ముగ్గు మీద ఎవరో చల్లినట్లు గుప్పెడు , వైలెట్ , పింక్ కలర్ లో వున్న పూరేకులు కనిపించాయి . ఎవరిక్కడ వేసారా అనుకుంటూ తలెత్తి చూస్తే , మా వాకిలి లో వున్న పెద్ద చెట్టుకు గుత్తులుగుత్తులు గా పూలున్నాయి . అరే ఈ చెట్టు పూలు పూస్తుందా ? పేంట్ చేసినట్లుగా ఎంత అందముగా వున్నాయి అనుకున్నాను. అసలు ఎప్పుడు పూసాయో కూడా తెలీలేదు !
రోజూ వానల మూలము గా వెళ్ళలేక పోతున్నాను . అమ్మయ్య ఈ రోజు వాన లేదు అని సాయంకాలం వాకింగ్ కు బయిలుదేరాను . వాకింగ్ చేస్తుండగా , చుట్టూ పూల చెట్లన్ని రంగు రంగుల పూలతో కనువిందుగా వున్నాయి . చెట్ల్లన్నీ ఆకుపచ్చలో వున్న షేడ్స్ అన్నిటితో పచ్చ పచ్చగా వున్నాయి . అంతే ఇంటికి తిరిగొచ్చి నా కెమేరాకు పని చెప్పాను . ఇన్ని రంగులతో వెలిగిపోతున్న మా అడవితల్లి ని చూస్తే చక్కని కవిత ఈ పచ్చదనానికి తోడుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను . కాని ఏంచేయను ? నాకా కవితలల్లటము రాదు అందుకే రాత్రంతా ఆలోచించి ఓ ప్లాన్ వేసాను . అర్ధరాత్రే శ్రీలలిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఓ కవిత రాయండి అదే మీ పుట్టినరోజున మీకు పరీక్ష అన్నాను . పుట్టిన రోజున పరీక్ష ఏమిటని అడగొద్దు . అదంతే !
పాపం వెంటనే ఇదో ఈ కవిత రాసి ఇచ్చారు . మరి ఈ కవిత ఇంకోరోజెందుకు ప్రచురించటము . శ్రీలలిత కే శుభాకాంక్షలు చెప్పుతూ కానుక గా ఇస్తే పోలే !
ఓ కదంబవనవాసినీ,
ప్రతినిత్యం ’శుభమస్తు" అంటూ
మామిడి తోరణాలను తలపించే మంగళతోరణాలను వనమంతా పరచిన ప్రకృతిశోభను వర్ణింప నాతరమా..
ప్రతి జీవికీ ప్రాణవాయువు నందించే ఈ వనాల నిస్వార్ధ సేవతో
మనసంతా మధురమై పలుకంతా తీయనై
ఉబికివచ్చే ఉత్సాహాన్ని ఆనకట్ట వేయకుండా పరుగులిడనిస్తే
అంతకన్న అదృష్టం వుందా...
ఆ పచ్చదనంలో ఎన్నెన్ని శోభలో...
పసిడికాంతులు ప్రసరించే
పురిటిసూరీడు ప్రతిఫలించే
పసుపుపచ్చని ఛాయ....
కెంజాయకు చేయందించి
అరుణాన్ని అంతదూరముంచే
సంజకెంజాయ ఛాయ....
తీయనిరాగాల కోకిలకు
సుమధుర స్వరాన్నందించే
లేతమామిడిచిగురు ఛాయ.....
మధురమైన వాక్కులతో
మానసాన్ని మీటే
చిలకపచ్చ ఛాయ....
లేలేత తమలపాకుల
కుచ్చుటోపీల కిళ్ళీలను
అయిదువేళ్ళకీ అలంకరించుకుని
మగనిని మురిపించే
లేతాకుపచ్చ ఛాయ....
వయసులో పెద్దయినా
మనసు లేతదేనని తెలియచెప్పే
అసలైన ఆకుపచ్చ ఛాయ....
మధుర మీనాక్షి కంచి కామాక్షి
నారంగే నని సగర్వంగా చాటిచెప్పే
ముదురాకుపచ్చ ఛాయ....
పచ్చగా పదికాలాలుండమని
అందరినీ దీవించే
అడవితల్లి అందాలు వర్ణించడం ఎవరితరం?
పలుఛాయలు వెదజల్లే అడవి అందాలు వర్ణించడం ఆ మహానుభావులు కృష్ణశాస్త్రిగారికే చెల్లింది.
ఇన్నిరకాల ఛాయలతో కూడిన ఆకులతో నిండిన అడవిలో తిరుగాడే ఓ వనకన్యా...
పుట్టినరోజునే పరీక్ష పెట్టడం న్యాయమా.......
ప్రేమతో,
శ్రీలలిత..
ఇంత అందమైన కవిత అడగగానే ఇచ్చినందుకు శ్రీలలితగారికి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ , ఇది మీకు మీజన్మదిన కానుకగా ఇస్తున్నాను .
శ్రీలలితకు జన్మదిన శుభాకాంక్షలు .
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
kavita chaala bagundandi..chaala chakkaga raasharu
ముగ్గు మీద పూల రెక్కలు ఎంత బావున్నాయో!
ఆ గులాబీ రంగు పట్టు కుచ్చుల లాంటి పువ్వుల పేరేమిటి మాలా గారూ?
ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.
malagaaru naasku photos ravatam ledu..:(..
srilalitagaariki happybirthday cheppandi..
kavita super..
malagaaru meeru inka super..
srilalita garni bhale wish chesaru..
చాలా బాగున్నాయండి ఫొటోస్.కవితకుడా చాలా బాగుంది .శ్రీ లలిత గారికి మీ బ్లాగ్ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
chaala bagundandi.
ఆహ్లాదకరం గా ఉన్నాయి ఫొటోలు. ఇంతకీ ఇవి మన భాగ్యనగరం అందాలే?
బాగున్నాయండీ ఫోటోలూ, కవితా..
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు...
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
బాగున్నాయండీ ఫోటోలూ, శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు
అశోక్ పాపాయ్ గారు ,
థాంక్స్ అండి .
& లలిత గారు ,
ఈ పూల పేరు తెలీదండి . ఈ చెట్టు మా ఇంటి కాంపౌండ్ లో వుంది . నీహారిక , వీటికి అడవి పూలని పేరు పెట్టరండి .
& సుభద్ర ,
మీ కామెంటే అన్నిటికన్నా సూపరో సూపర్ అండి .
రాధిక గారు ,
పద్మార్పిత గారు ,
ఆవకాయ గారు ,
థాంక్స్ అండి .
మురళి గారు ,
సునీత గారు ,
శివరంజని గారు ,
హరే కృష్ణ గారు ,
మీ అందరి విషెస్ శ్రీలలిత గారికి అందజేస్తానండి .
థాంక్స్ అండి .
మాలాగారు రెండుకళ్ళు చాలట్లేదు మీ అడవి అందాలు చూడటానికి ..నాకైతే సొగసు చూడతరమా ...అని వచ్చేస్తోంది గొంతులోనుండి అప్రయత్నంగానే!
పరిమళం గారు ,
అందుకే రమ్మని పిలిచాను , రాలేదు కదా !
Post a Comment