Sunday, July 25, 2010

కమల






హిమగిరులలోని ఒకానొక తటాకము లో జలకాలాడు తోంది సంజ్ఞాదేవి . అప్పుడే అటుగా వచ్చిన దినకరుడు సంజ్ఞా దేవి మోహన రూపాన్ని చూసి పులకించి పోయాడు . ప్రభాకరుని తీక్షణ దృష్టి ని తట్టుకోలేని సంజ్ఞా దేవి , కోమలమైన తన అరచేతి నుండి , సుందరము , అతి కోమలము , శీతలమైన రెండు మొగ్గలను సృస్టించి , తన కను దోయికి అడ్డుగా వుంచుకుంది . ప్రభాకరుని , తీక్షణ కిరణాలు సోకి , అవి , లేత గులాబీ , శ్వేత వర్ణములలో , మృదువైన రెక్కలు ఒకటొకటిగా , సహస్ర రేకులు గా విచ్చుకున్నాయి . అందమైన కమలములను చూసి ప్రభాకరుడు పరవశించి పోయాడు . . అలా సంజ్ఞా దేవి చేత సృష్టించపడిన కమలము దేవతలందరికీ ప్రీతిపాత్ర మైంది . గబ గబా అందరూ ,తమ చేతుల లో ధరించటమో , ఆసనముగా చేసుకోవటమో చేసారు . అవును మరి , మానవుల కోరికలు వినీ , వినీ వాటిని తీర్చి తీర్చి బుర్రలు వేడెక్కి వున్నారాయే . బుర్రలను చల్లబరుచుకునేందుకు వారికి చల్ల చల్ల గా , ముద్దులు గొలిపే కమలమే రక్షణ ఐంది పాపం .

చక్కటి లేలేత గులాబీ వర్ణం లో , మృదువైన రేకుల తో వున్న కమలము ను చూసి , లక్ష్మీ దేవి ముచ్చట పడి , అందులో హాయిగా పద్మాసనం తో ఆసీనురాలై , కమల నామమును స్వీకరించి ,

పద్మాసన స్తితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ ,
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే .
అని భక్తుల చే స్తుతించ బడి సంతృష్టు రాలైంది .

ఇహ శ్రీదేవీ వల్లభుడైన వెంకటాచలపతి ,
కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీల తనో
కమలాయత లోచన లోక పతే
విజయీభవ వెంకట శైల పతే .

అని సుప్రభాతం పలుకుతే కాని మేలుకొనడు .

బ్రహ్మదేవుడైతే ఏకం గా , విష్ణుమూర్తి నాభి లోనుండి వచ్చిన తామర పువ్వులోనే జన్మించి , సుఖాసీనుడై , సృష్టి బ్రహ్మైనాడు .

అలా దేవతల చేత కొనియాడబడిన కమలము భూలోకము లోని కొలనుల లోనికి చేరింది .ముని కన్య లు , కరకంకణములుగా , మెడలో హారములుగా ధరించి , మురిసిపోయారు .

తామర కొలను లో నుండి వినిపిస్తున్న కిల కిలా రావము లు ఎక్కడి నుండి వస్తున్నయో తెలుసుకోలేక , కొలనంతా కలయచూసాడుట రాకుమారుడు . అవి తామర పువ్వులా , లేక రాకుమారి నేత్రాల తేల్చుకోలేక విస్త్తు పోయి , పద్మాక్షీ , నీరజాక్షీ అని కవితలల్లేశాడుట . తామరపత్రాల మీద కొన గోటి తో ప్రేమలేఖలు రాసేదిట రాకుమారి . చాలా మంది రాకుమారులూ , రాకుమార్తెలూ ఇలా ప్రేమలో పడ్డవారే !


ఇహ కన్నె పిల్లలే మో ,
తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యవే అనీ గొబ్బిగౌరమ్మ ను వేడుకుంటారు . .

ప్రాచీన కవులు తామరతూడులని అమ్మాయి చేతులని , పద్మాక్షి అని , జలజాక్షీ అనీ ఇలా బోలెడు నామధేయాల తో పొగిడేసారు .
కమలము మన జాతీయ పుష్పం కూడానండోయ్ !

ఆధునిక , యండమూడి లాంటి రచయితలు మాత్రం తక్కువ తిన్నారా ? వాళ్ళ హీరో లు , స్మగులర్స్ ను పట్టుకునేందుకు , కొలనుల లో తామర కాడ ను నోటి లో వుంచుకొని , దాని ద్వారా గాలి పీలుస్తూ గంటల కొద్ది నీళ్ళ లో ఎదురుచూస్తూ వుంటారు .
కొత్త పెళ్ళి కొడుకులు , అలకపానుపు మీద తామరాకు రూపము లోని వెండి కంచం కావాలని కోరుకునేవారు . అదిస్తే గాని అలకపానుపు దిగే వారు కాదు .
పెళ్ళిళ్ళ లో ఉప్మా వడ్డించాలంటే తామరాకు తప్పనిసరి . అసలు తామరాకులో ఉప్మా రుచే వేరు .

ఒకానొక్కప్పుడు ' కమల ' అనే పేరు అందరికీ నచ్చిన పేరు . నవల లో , సినిమాల లో నాయికలకు కమల అనే పేరుండేది . భావకురాలైన అమ్మ నాజూకైన పేరు ను , . . ఏళ్ళ క్రితం , రోజు పుట్టిన తన పాపాయి కి పెట్టుకుందిట . పదిహేడు సంవత్సరాలు ' కమల ' గా వున్న అమ్మాయి . . . సంవత్సరాల క్రితం , ప్రభాతుని కోరిక పై మరింత నాజుకుగా ' మాల ' గా మారి పోయిందిట !!!

ఇదంతా నిన్న , మొన్న జరిగినట్లుగా వుంది .
కాలమా ఎందుకే నీకింత తొందర ?
ఏమి చేయాలని , ఏమి చూడాలని , ఎవరో తరుముతున్నట్లు అలా కను రెప్పల మాటునుండి పోతున్నావు ? ? ?
స్చప్ ! నా మాట వినిపించుకోని కాలం , అలుపు సొలుపు లేకుండా . . . అలా . . . పరుగెడుతూనే . . . పరుగెడుతూనే . . . వుంది . . .

( ఇందులోని కమలములు కొన్ని నేను ఫొటో తీసినవి , కొన్ని తామరకొలను నుండి తెచ్చినవవి , కొన్ని నెట్ నుండి తీసుకున్నవి . )

మా అమ్మాయి చిన్నప్పుడు , తన పుట్టిన రోజున ఇలా పాడుకునేది .

" హాపీ బర్త్ డే టు మి "

20 comments:

భావన said...

Happy Birthday to you Mala gaaru.
జన్మ దిన శుభాకాంక్షలు. ఈ కమల సహస్ర రేకల వికసించి సహస్ర కమలాల మాల గా మారి ఇలానే మా మాల గారు గా కూడా స్నేహ సుగంధాలను అందించాలని కోరుకుంటూన్నా

శ్రీలలిత said...

కమలం వలె వికసించి,
ప్రభాతుని భావంలో మాలవై
పిల్లలకు ప్రేమను పంచు తల్లివై
మనవలకు మురిపాలనిచ్చు స్నేహమయివై
మరిన్ని పుట్టినరోజులు ఇంత ఆనందంగానూ జరుపుకోవాలని కోరుకుంటూ...
శ్రీలలిత...

భాస్కర రామిరెడ్డి said...

మాలా కుమార్ గారూ జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సుందరమైన జన్మదినాలు జరుపుకుంటూ మా అందరినీ వైవిధ్యమైన వ్యాసాల పరంపరలతో అలరించాలని కోరుకుంటుంన్నాను.

ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే ఇక్కడ అసందర్భ ప్రేలాపీ అని తిట్టుకొనే ప్రమాదం వుంది కదా.. అందుకని మరొక్కసారి మళ్ళీ "హ్యాపీ బర్త్ డే టు యు"

జయ said...

వన్నె చిన్నెల ఈ కమలం తోట కలకాలం కళకళలాడాలి----హృదయపూర్వక జన్మ దినశుభాకాంక్షలు.

sunita said...

Happy Birthday to you Mala gaaru.

sunita said...

Happy Birthday to you Mala gaaru.

హరే కృష్ణ said...

Happy Happy Birthday!

Anonymous said...

కమల మాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
మీరిలానే ఉత్సాహంగా ఉల్లాసంగా బోలెడన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ( సొరకాయ పరోటాలతో) కోరుకుంటున్నాను
మా అత్తగారి పేరు కూడా ' కమల ' నే

సి.ఉమాదేవి said...

మీ జీవితం నిత్య కమలకోమలై మీ బ్లాగ్మాలలు ఆ వాగ్దేవి గళాన అక్షరమాల కావాలని,మీరు మరెన్నో పుట్టినరోజులతో మీ కుటుంబ కదంబమాలను అలరించాలని మీ పుట్టినరోజున నా అభినందనమాల!

అశోక్ పాపాయి said...

మాల గారు మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు విజయాలు ప్రసాదించాలని ఆ దేవున్ని మనసార కోరుకుంటూ మీకు మరోసారి..... Many Many Happy Returns Of The DAY MAALA GAARU.

రాజ్యలక్ష్మి.N said...

మాలాకుమార్ గారూ మీకు హృదయపూర్వక
జన్మదినశుభాకాంక్షలు.

సుజ్జి said...

Mala garu.. puttinaroju shubakankshalu..

i wish u tons of fun, with loads of happyness..

కొత్త పాళీ said...

కమల మాల అయిన "కమాల్" కథ అదన్న మాట!
అన్నమయ్య మాటల్లో ..
కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళమూ

జ్యోతి said...

ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రమదావనం పర్మనెంటు టీమ్ మేనేజర్ ని చేయడమైంది. మీ చేతికింద ఎవరినన్నా తీసుకోండి.

అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయిగా..:))

Happy Birthday Again...

శిశిర said...

జన్మ దినశుభాకాంక్షలు మాలాకుమార్ గారు.

నేస్తం said...

మాలగారు జన్మదిన శుభాకాంక్షలు .. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఈ మెయిల్ ఐడి నా బ్లాగ్ కి పంపగలరు .. :)

మధురవాణి said...

మాలా గారూ,
మీ పుట్టినరోజుకి విష్ చేస్తూ.. మీర్రాసిన ఇంతందమైన పోస్టుకి నేను తీసిన కమలం ఫోటోలు ఉపయోగపడినందుకు చాలా సంతోషంగా ఉంది. :-) కమలం ఎలా పుట్టిందని మంచి విషయాలు తెలియజేసారు. చాలా చాలా చాలా బాగుంది మీ పోస్టు. :-) మళ్ళీ ఇంకోసారి మీకు హ్యాపీ బర్త్డే! :-)

psm.lakshmi said...

asale andamaina kamalani mee unnatha bhavaalatho marintha unnatha sthayilo nilabettaru.
once again happy birthday.
psmlakshmi

ఆ.సౌమ్య said...

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఆలశ్యంగానైనా విష్ చేద్దామని!

మాలా కుమార్ said...

థాంక్ యు ఫ్రెండ్స్