Sunday, December 12, 2010

ఐ లవ్ యు లిల్లీ




తెలుపు రంగుతో సై అంటే సై అంటుంది . ఎందుకుండదు ? పూల కుండే బేలతనమే లేదు . దోరాకు పచ్చని బుడిపె మీద మందముగా త్రికోణాకారము తో , మందమైన రేకుల తో ఠీవిగా , తలెత్తుకొని మరీ నిలబడి వుంటుంది . ఏ తుఫానులకూ దడవను , నాకు నేనే సాటి అని పొగరుగా చూస్తుంది ఇంకెవరు తెల్లని లిల్లీ పూవు :) తెల్ల తెల్లగా శ్వేత వర్ణము లో మెరిసిపోతూ చక్కని సువాసనలు వెదజల్లే లిల్లి పూవంటే నాకు చాలా ఇష్టము . మనసుకు స్వాంతన కలిగించేట్లుగా , సన్న సన్నని సువాసనలు వెదజల్లుతుంది . ఎంతసేపు చూసినా చూడాలీ అనే అనిపిస్తూ వుంటుంది .

మా చిన్నప్పుడు , మా ఇంట్లో రెగ్యులర్గా వుండే సన్నని లిల్లీ కాకుండా చిన్ని తెల్ల గులాబీలా వుండే తెల్ల లిల్లీ పూల చెట్లు వుండేవి , ఆ తరువాత అవి ఎక్కడా నాకు కనిపించలేదు .మామూలు లిల్లీ నైతే మా ఇంట్లో పెంచుకుంటున్నాను కాని , ఈ లిల్లీ చెట్లు ఇక్కడ దొరకవట . బెంగుళూరు నుంచి తెచ్చుకోవాలట ! ఇదిగో ఇన్ని సంవత్సరాలకు నాగార్జున సర్కిల్ దగ్గర వున్న పూల షాప్స్ లో కనిపించాయి . ఎప్పుడు అటు నుండి వెళుతున్నా కొందామనుకోవటము , ఇప్పుడే కొంటే కార్ లో వాడి పోతాయేమో తిరిగి వచ్చేటపుడు కొందాములే అనుకోవటమూ , తిరిగి వచ్చేటప్పుడు వేరే రూట్లో రావటము తో కొనటము మూడునెలలనుండీ వాయిదా పడుతోంది . అందుకే నిన్న ఎలాగైనా కొనాలి అనుకున్నాను . స్చప్ . . . అదేమిటో ఒక్కొక్క షాపే చూసుకుంటూ వెళుతున్నాము , ఎవరిదగ్గరా లేవు . సీజన్ ఐపోయింది అనటమే ! నిరుత్షాహం వచ్చేసింది . మావారు పట్టువదలని విక్రమార్కునిలా చివరి షాప్ వరకూ వెళ్ళారు .( అవును మరి అడగక అడక అడిగాను కదా ! ఆమాత్రం వెతకకపోతే ఎలా :)) అదృష్టం :) అతని దగ్గర వున్నాయి ! ఎన్ని కావాలి అన్నాడు . నీ దగ్గర వున్నవన్నీ ఇచ్చేయన్నారు , మావారు ( మరే మళ్ళీ మళ్ళీ ఎవరెళ్ళి కొంటారు ). ఏదైతేనేం ఇంత పెద్ద గుత్తి నా చేతిలోకి వచ్చేసింది .

దానిని ఇంట్లో ఏ రూం లో పెట్టాలా అని , బెడ్ రూం లో , డ్రాయింగ్ రూంలో , బాల్కనీలో తిప్పీ తిప్పి , చూసుకొని చూసుకొని మురిసిపోతున్నాను . ఎంత ముద్దుగా వుందో ! ఏ గది లో వుంచినా ఇల్లంతా సువాసనలే సువాసనలు .

' రజనీగంధ ' సినిమా లోని ఈపాట కూడా నాకు చాలా ఇష్టం . విద్యాసిన్ హా చాలా చక్కగా వుంది ఈ పాటలో .చాలా బాగా తీసారు .

9 comments:

Hima bindu said...

హాయ్ మాలా గారు మా ఇంట్లో కూడా లిల్లీ సువాసనలే ,అలానే పున్నాయి పూలు కూడా .ఒకసారి నేను పి.జి లో వుండగా ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినపుడు పూల మార్కెట్ వైపు వెళ్ళడం జరిగింది ,రాసులు రాసులుగా లిల్లీ పూలు చూసి ఒక వంద రూపాయలకి ఇమ్మంటే వాళ్ళు పెద్ద గంపెడు ఇచ్చారు ,అది హోల్ సెల్ మార్కెట్ అంట ..అందుకే అన్ని ఇచ్చారట .అన్ని గదుల్లో అవే ..చాలా రోజులు ఆ పరిమళాలు ఇల్లు ని అట్టే పెట్టుకున్నాయి .
మీ పెళ్లి రోజు ఆనందంగా లిల్లీ లతో గడిపారన్నమాట ....గుడ్ .
ఐ టూ లవ్ లిల్లీ :-)

Srujana Ramanujan said...

అప్పుడే రాసేశారా? :)

Unknown said...

నాకు కూడా లిల్లీలంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా తెచ్చి అన్ని గదుల్లోనూ పెడుతూ ఉంటాను.. ఇల్లాంతా పరుచుకునే వాసన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. అలాగే మీరిచ్చిన రజనీగంధా లోని పాట కూడా.

ramya said...

ఈ పూలమొక్కలు మా అమ్మ వాళ్ళింట్లో వుండేవి. ఇక్కడ మా ఇంటిదగ్గర గుళ్ళో పూజ చేయించాక సాయంకాలం అలంకరణకుముందు స్వామివారిపైని తీసినవి దండతీసి ఇస్తారు. (సాధారణంగా గులాబీలూ లిల్లీలు.) అది గుమ్మానికి కట్టేస్తాను ఓ రెండురోజులు హాలంతా సువాసనలు.లిల్లిల గుభాలింపు తగిలిందంటే పెళ్ళివారిల్లులా untundi :)

భావన said...

అబ్బ నాకెంత ఇష్టమో ఈ లిల్లీ లంటే.. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఫోటోలు. మాకు కూడా పంచినందుకు థ్యాంక్స్ మాల గారు. మరొక్క మారు పెళ్ళి రోజు శుభా కాంక్షలు.

మాలా కుమార్ said...

చిన్ని గారు ,
బుట్టెడు లిల్లీలి ఇచ్చారా ? ఎంత అదృష్టవంతులండీ ? మాకిక్కడ హోల్ సేలైనా గీరి గీరి ఇస్తారు :)
మీ విషెస్ కు థాంక్స్ అండి .

* సృజనా ,
అనుకున్నాక ఆలశ్యం ఎందుకు ? అప్పుడే రాసేస్తే ఓ పనై పోతుంది గా :)

మాలా కుమార్ said...

ప్రసీద గారు ,
థాంక్స్ అండి .

* రమ్య గారు ,
ఐతే మీ ఇల్లు రోజూ పెళ్ళివారిల్లులా కళ కళ లాడిపోతూవుంటుందన్నమాట .
మీ వాఖ్య కు దన్యవాదాలండి .

మాలా కుమార్ said...

భావన ,
మా లిల్లీలు నచ్చినందుకు , మెచ్చినందుకు , నన్ను మళ్ళీ విష్ చేసినందుకు
అన్నింటికీ థాంక్ యు .

Unknown said...

నాకు కూడా లిల్లి పూలు అంటే బోలెడు ఇష్టం.మీ పెళ్లి రోజు ఆనందంగా లిల్లీ లతో గడిపారన్నమాట...Lilly lovers jindabad