Sunday, December 5, 2010

' మగధీర ' కు ' చండేరీ ' నవల ఆధారమా ? నిజమేనా ?????




సినిమాలు గా వచ్చిన నవలలు , ఆ సినిమాలు కలిపి రాద్దాము అని ఆలోచన రాగానే దేర్ కిస్ బాత్ కీ అనుకుంటూ నవలలు , సినిమాల సి. డి లూ తెచ్చుకుందామని బడీచావిడీ కి వెళ్ళాను . బుక్ షాప్ లో ఏ నవలలు కావాలి మేడం అని అడిగాడు శోభన్ బాబు . అయ్యో సినిమా హీరో కాదండీ బాబు . ఆయనెక్కడి నుంచి వచ్చాడా అని ఆశ్చర్య పోకండి . ఆ బుక్ షాప్ ఓనర్ పేరు ' శోభన్ బాబు ' :) సినిమాలు గా వచ్చిన నవలలు ఏమైనా వుంటే ఇవ్వండి అని అడిగాను . ' చండేరీ ' నవల తీసి ఇచ్చాడు . ఇది సినిమాగా వచ్చిందా అని అడిగాను . అవును మేడం ' మగధీర ' ఈ నవలే అన్నాడు . అవునా అని బోలెడు హాశ్చర్య పోయి , నేను వినలేదే అన్నాను . పేపర్ లో కూడా వచ్చింది మేడం అన్నాడు . ఏ పేపర్ లో వచ్చిందో ? సరే కానీయ్ తీసుకొని చదువుతే నీ సొమ్మేం పోతుంది అనుకొని కొన్నాను . ఆ తరువాత ' మగధీర ' సి. డీ కూడా కొన్నాను .

రాజులూ , రాణులూ వారి పునర్జన్మ కథలూ చదవటము ఇష్టమేకనుక ఆ రాత్రే ఏకబిగిన నవల చదివేసాను . ఆ తరువాతే వచ్చింది ప్రాబ్లం ! పెళ్ళికి ముందు ఎండాకాలం సెలవల్లో ఏదో ' పాండవ వనవాసం ' , ' పల్నాటియుద్ధం ' లాంటి సినిమాలు చూసినా , పెళ్ళి తరువాత ఓ నాలుగు సంవత్సరాల క్రితం వరకూ బాగానే చూసాను . ఉదయ్ కిరణ్ నిలదొక్కు కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు పాపం ఎంకరేజ్ చేద్దాం అనే సదుద్దేశం తో ఏదో ఉదయ్ కిరణ్ ది పిచ్చి సినిమా కూడా చూసాను ! ఎందుకో ఆ తరువాత సినిమాల మీద విరక్తి వచ్చి అడపా దడపా తప్ప ఈ నాటి హీరోల సినిమాలేవీ చూడలేదు . అనుకోకుండా పోయిన నెల జూనియర్ ఎన్ టి ఆర్ సినిమా ' బృందావనం ' చూసాను . దాని కథ మళ్ళీ చెపుతానులే . ఇక తప్పదు అనుకొని ' మగధీర ' బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటము మొదలు పెట్టాను . హబ్బా . . . . . మగధీర బ్లాక్ అండ్ వైట్ ఏమిటని హాశ్చర్యమా ? మా సి. డి ప్లేయర్ లో పంచవన్నెల సినిమా ఐనా బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తుంది అంటే అర్ధం చేసుకోరూ . . . .

నవల చదివి , సినిమా చూసాక చాలా చాలా అనుమానాలూ క్వెశ్చన్ మార్కులూ నూ ! వాకే ముందుగా చండేరీ కథ ఆ తరువాత మగధీర కథ చెపుతాను . సావధానము గా విని నా అనుమానాలు తీర్చండి .




'చండేరీ ' నవలా రచయత శేషం పురుషోత్తమాచారి యస్సీచారిగా పాఠకులకు పరిచితులు. " గ్వాలియర్ లో కొంతకాలము ' ఏయిర్ ఫోర్స్ ' లో పని చేసినప్పుడు ఓసారి ' ఓర్చా ' వెళ్ళాను . ఆ ప్రాంతపు వివరాలు సేకరిస్తున్నప్పుడు , అక్కడి ప్రాచీన రాజవంశపు విశేషాలు కొన్ని నాకు తెలిసాయి . వాటిలో వదినగారి తో సంబంధము వుందని ఓ అన్నగారు తమ్ముడిని అనుమానించిన సంఘటన , అందుకా తమ్ముడు ఆత్మాహుతి చేసుకున్నాడని తెలియజేసే చారిత్రిక ఆధారాలు వున్నాయి . ఆ పాయింట్ ఆధారము గా ' చండేరీ ' నవలను విస్తరించి రాయటము జరిగింది " అని రచయిత నవల చివరలో గొల్లపూడి మారుతీరావు కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు .

చండేరి నవల కథ బుందేల్ బావి దగ్గర మొదలవుతుంది . అన్నపూర్ణ బైనాక్యులర్స్ ద్వారా "మాళవ కాజిల్ టవర్" పైనుండి బుందేల్ దిగుడుబావి దగ్గర జరిగిన పులి, దుప్పి మధ్య జరిగిన పోరాటంలో దుప్పి చేతిలో పులి పడిన మరణయాతనను గమనిస్తుంది.
. పులి మరణానంతరము ' వ్యాఘ్ర రుధిరం సమర్పయామి ! వ్యాఘ్ర రుధిరం సమర్పయామి ' అంటూ ఒక వింత అనుభవాని కి లోనై సృహ తప్పి పోతుంది . ఓ రకమైన సుషుప్తావస్తలోకి వెళ్ళిపోయిన అన్నపూర్ణ ముందు ఓ యోగి సాక్షాత్కరిస్తాడు . తెలివి వచ్చిన తరువాత ఆ దిగుడు బావి లోని కి వడి వడిగా వెళుతుంది . అక్కడ శివలింగము , దాని కింద ఒక రాగిరేకు కనిపిస్తుంది . ఆ శివలింగము నుండి ఓ కాంతి పుంజము అన్నపూర్ణను తాకుతుంది . ఆ తరువాత 20 సంవ్త్సరాలకు కథ మొదలవుతుంది . . . . .

400 ఏళ్ళ క్రితము చండేరీ యువరాణి ఇందుమతి , ఓర్చా మహరాజు ఐన జూజావర్ సింహుని తమ్ముడైన వువరాజు హరదౌల్ ప్రేమించుకుంటారు . వారి ప్రేమను ఇరువైపుల పెద్దలు ఆమోదిస్తారు .దాని తో ఇరువురి ఆనందానికి హద్దులేకపోతుంది . ఇంతలో రాజ నర్తకి కుతంత్రము వలన మహారాజు జుజావర్ సింహా తమ్ముని పెళ్ళి మాటలు మాట్లాడేందుకు వెళ్ళి , తనే ఇందుమతి ని వివాహమాడి తెచ్చుకుంటాడు . ఆ సంగతి తెలిసి హతాసుడైన హరదౌర్ ఇందుమతి ని ఆమె గది లో కలుసుకొని తమ వివాహానికై తాను స్వయముగా మణి మాణిక్యాలు పొదిగి రూపొందించిన చీరను చూపి , ఆమెను తీసుకొని వెళ్ళి,ఆ చీరను ఆ పడక గది లో , భూగర్భము లో దాస్తాడు . వారిరువురూ పొంది ,వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఆ చీర ఎక్కడ వున్నదో గుర్తుకు వస్తుంది అని చెపుతాడు . వారు మాట్లాడుకుంటూ వుండగా వచ్చిన జుజావర్ , తమ్ముడు తన భార్యైన ఇందుమతి తో సంబంధము పెట్టుకున్నాడని భావించి , హరదౌల్ కు మరణ శిక్ష విధిస్తాడు . అప్పుడే వారి రాజ గురువు అదేశము ప్రకారము ఇందుమతి వోర్చా దిగుడు భావిలో ప్రాణ త్యాగము చేసుకుంటుంది . 400 ల సంవత్సరాల తరువాత హరదౌల్ ప్రవీణ శర్మ గా ఓ ప్రఖ్యాత కోటీశ్వరుడైన చీరల వ్యాపారి కి పుత్రుని గాను , ఇందుమతి ఐశ్వర్య గా నూ జన్మిస్తారు . చిన్న తనము నుండే ప్రవీణ శర్మకు గత జన్మ జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా వసంటాయి . పెద్ద వాడై బిజినెస్ ను తన చేతిలోకి తీసుకున్నప్పుడు అందగత్తె ఐన ఇందుమతి ఎక్కడో జన్మించేవుంటుందని భావించి , ఆమెను తెలుసు కునేందుకు వూరూరా అందగత్తెల పోటీలు నిర్వహిస్తూవుంటాడు . ఆ క్రమము లోనే ఐశ్వర్య గా జన్మించిన ఇందుమతి ని ఆమె శరీర పరిమళము ద్వారా గుర్తిస్తాడు . చాలా ఫైటింగుల , కిడ్నాపుల తరువాత ఇద్దరూ ఒకటవుతారు . వారి చీరను వెలికి తీసి ఇప్పటి కాలము ప్రకారము 4 కోట్ల ( అమ్మో అమ్మో ) ధరపలికే ఆ చీరను వారి వివాహములో ఐశ్వర్య కట్టుకున్నాక ప్రభుత్వానికి అందజేస్తారు ! అదీ ' చండేరీ ' నవల కథ .



ఇహ మగధీర కథ ;
ఇది 400 సంవత్సరాల క్రితము జరిగే యుద్దము తో మొదలవుతుంది . లోయలోకి జారి పోతున్న యువరాణి ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ' కాల భైరవుని ' చేతికి చమక్ మటూ చేయి తగులుతూ చిక్కకుండా లోయలోకి జారిపోతుంది ఉదయగిరి , యువరాణి 'మిత్రవింద '. కాల భైరవ కూడా లోయలోకి జారి పోయి మరణిస్తాడు . మిత్రవింద తన అంగరక్షకుడైన కాల భైరవుని ప్రేమిస్తుంది . దాని కి మహారాజు అమోదిస్తాడు . కాని వారి సమీప బంధువు మిత్రాను వివాహము చేసుకోవాలని ఎత్తు వేసి , కాలభైరవ చేతి లో చిత్తై , ఉదయగిరిని ఆక్రమించుకునేందుకు వచ్చిన 'షేర్ఖాన్ ' దగ్గర ఆశ్రయము పొంది , కుతంత్రము తో ఉదయగిరి మహరాజును సంహరిస్తాడు . . మిత్రను సొంతము చేసుకోబోగా పొరపాటున కత్తి గాయమై లోయలో పడి మరణిస్తుంది . అతని తో యుద్దము లో అతనిని సంహరించి , కాలభైరవడు కూడా రాకుమారిని రక్షించబోయి తనూ లోయ పడి మరణిస్తాడు . వారిద్దరి ప్రేమకు , కాల భైరవుని శక్తికి ముగ్ధుడవుతాడు షేర్ ఖాన్ . 400 సంవత్సరాల తరువాత నలుగురూ పునర్జన్మిస్తారు ! . పునర్జన్మలో ఇందు గా జన్మించిన మిత్ర చేతి స్పర్స ద్వారా ఆమెను గుర్తించి దక్కించుకునేందుకు నానా పాట్లు పడతాడు హర్ష గా జన్మించిన కాలభైరవుడు . నానా తిప్పలు పడి ఆమెకు గతం గుర్తు తెప్పించి , విలన్ ను గత జన్మ లో సంహరించిన ప్రదేశము లోనే సంహరించి , ఇందును వివాహమాడుతాడు హర్ష . అనట్లు షేర్ ఖాన్ ఈ జన్మలో హర్షకు సాయ పడతాడు లెండి . ఇదీ స్తూలంగా మగధీర కథ . ఐనా నా పిచ్చి కాని మగధీర కథ తెలీని వాళ్ళు ఎవరు :)

ఇదంతా చదివితే మీకే మనిపిస్తోంది ? ' చండేరీ ' నవల ' మగధీర ' సినిమా కు ఆధారమని పిస్తోందా ? 400 సంవత్సరాల క్రితం కథ , నాయిక పేరు ఇందు , పునర్జన్మ . అంతవరకే రెంటిలోనూ వున్న కామన్ పాయింట్స్ అనిపించింది నాకైతే ! ఆ(( . . . సినిమాలో హీరో హీరోయిన్ చేతి స్పర్శ ద్వారా గుర్తుపడితే , నవలలో నాయిక శరీర పరిమళము తో గుర్తుపడతాడు నాయకుడు ! మరైతే శోభన్ బాబు అలా ఎందుకు చెప్పాడు చెప్మా ? చివరలో , గొల్లపూడి మారుతీరావు రచయతని , మీ నవలలో సినిమా కు కావలసిన మసాలా సరుకులూ , దినుసులు అన్ని చేరాయనిపిస్తోంది . అన్నప్పుడు రచయత నేను సినిమా కోసం అంటూ ఈ నవలను రాయలేదండీ ! అసలీ సబ్జెక్ట్ సినిమాకు పనికొస్తుందని కూడా అప్పట్లో నాకు తెలీదు . నేనెతో నిజాయితిగా నాదంటూ ఏర్పరుచుకోని అలవరుచుకున్న శైలి లో వ్రాశానీ నవలని . అన్నారు . మరదైతే ఈ నవల ఆధారముగా తీసిన సినిమా ఏమిటి ? ఏమిటో బాబు నాకైతే ఏమీ అర్ధం కాలేదు . శోభన్ బాబు పుణ్యమా అని ఓ మంచి నవల చదివి , రాం చరణ్ సినిమా చూసాను :) ఏమో అనుకున్నాను కాని రాం చరణ్ బాగానే వున్నాడు సుమీ ! మా చిన్నప్పుడు ముద్దుగా వున్న పాపలను ' జపాన్ బొమ్మ ' అనేవారు . కాజోల్ అలానే వుంది బొమ్మలా !

19 comments:

Anonymous said...

బాగుంది. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. కామాలు ఎక్కువ పెట్టేస్తున్నారు. అక్కరలేని చోట్ల చాలా ఉన్నాయి కామాలు. ఒక్కసారు చూడండి.

Malakpet Rowdy said...

400 ల సంవత్సరాల తరువాత హరదౌల్ , "ప్రవీణ శర్మ" గా
__________________________________________

:O :O :O :O

Srujana Ramanujan said...

:)

హరే కృష్ణ said...

:) :)
కాజల్ అగర్వాల్ పేరు మీరా కాదు మిత్రవింద కదా..
వివరాలకు ఇక్కడ..

http://harekrishna1.blogspot.com/2009/10/blog-post.html?zx=9adbfdc8235fe163

మాలా కుమార్ said...

హరికృష్ణ ,

మిత్ర అని రాయబోయి , పొరపాటున మీరా అని రాసాను . థాంక్ యు.

మాలా కుమార్ said...

అనానమస్ గారు ,
మీ సలహాకు థాంక్స్ అండి . చాలా తీసేసానండి . థాంక్ యూ వెరీ మచ్ అండి .

అశోక్ పాపాయి said...

మగధీర సినిమా దుబాయ్ లో 50 రోజులు ఆడింది...))

మనసు పలికే said...

మాలా కుమార్ గారు, టపా చాలా బాగుంది. ఆ నవల గురించీ, దాని ఆధారితంగా తీసిన సినిమా గురించి నాకైతే తెలియదు కానీ, మీరన్నట్లు గానే మగధీర చిత్రం చాలా బాగుంది. కాజోల్ నిజంగా బొమ్మ లాగానే ఉంది..:)

Anonymous said...

ఆ విషయం హీరో కూడా చెప్పుకోలేదు కదా
యాభై రోజులు ఆఫీసు పనులు మానుకొని సినిమాలను ఆడించే మనుషులు దుబాయ్ లో కూడా ఉన్నారా..

రుక్మిణిదేవి said...

మాల గారు, బాగా వ్రాసారు.. ఆ నవల నేనూ చదివాను ఎప్పుడో చిన్నప్పుడు.. నేను పుట్టకముందు నాటి బాలమిత్ర, చందమామ కధలు చదివేదాన్ని..ఎంతో బాగుండేవి..మీరు పాఠకులతో మాట్లాడుతూ వ్రాసినట్లున్నారు కద..

అశోక్ పాపాయి said...

అవునండీ హిరో చెప్పకున్న పర్వలేదు మేము హిరోకి పెద్ద పెద్ద పంకలము ఉన్నాము కదా!! ఇంక మా హిరో ఎందుకు??

ఆఫీస్ పనులు ఎందుకు మనుకుంటారు?? సినిమా నడిచేది ఆఫీస్ లో కాదు సినిమా థియెటర్లో

Anonymous said...

రోజుకి అర్ధ షో ని మాత్రమే వేసి మొత్తం ఇరవై అయిదు షో లు వేసి యాభై రోజులు జరిగిందని గోల చేస్తే ఇలాగే ఉంటుంది
బయటవాళ్ళకు అదేదో నాలుగు ఆటలు ఆడింది అనే అపవాదు ఒకటి

అశోక్ పాపాయి said...

మీరు ఒక్కసారి సినిమా థియెటర్ దగ్గర సినిమా టిక్కెట్స్ అమ్మండి. ఎప్పుడు ఎని షోలు జరుగుతాయే మీకే తెలుస్తుంది.

బయటవాళ్ళకు అదేదో నాలుగు ఆటలు ఆడింది అనుకోవడం కాదు అసలు మీరు తెరచాటు నుండి బయటకు రండి

మురళి said...

ఈ 'చందేరీ' నవల సీరియల్ గా వచ్చినప్పుడు చదివానండీ.. నేనైతే 'మగధీర' చూడలేదు.. కాబట్టి పోలికలు చెప్పడం కొంచం కష్టమే.. కాకపొతే 'స్ఫూర్తి'పొంది ఉండొచ్చునేమో..

మాలా కుమార్ said...

రౌడీ గారు ,
మీరు పెట్టే గుర్తులు నాకు కంప్యూటర్ క్లాస్ లో నేర్పించలేదండి . తెలుసుకోవటానికి నేను మళ్ళీ కంప్యూటర్ క్లాసెస్ లో చేరాలేమో ! ఇప్పుడు నాలుగంతస్తుల మెట్లు ఎక్కి వెళ్ళే ఓపిక లేదండి :))))

@ సృజన
థాంక్ యు.

@ మనసు పలికే ,
థాంక్ యు.

మాలా కుమార్ said...

అశోక్ పాపాయ్ ,
మీకేనా అంత కోపం వచ్చింది ? మీరు చాలా నెమ్మది అనుకుంటున్నానే: )

@ రుక్మిణీ దేవి గారు ,
ధన్యవాదాలండి .
పాఠకులకు చెపుతున్నట్లుగా రాస్తున్ననా ! హి హి హి , మరి పిల్లలకు కథలు చెప్పీ చెప్పీ అలా అల్వాటై పోయింది :)

మాలా కుమార్ said...

మురళి గారు ,
స్పూర్తి పొంది వుండవచ్చు . మీరు ఇంకా ఈ సినిమా చూడలేదా ? చూడండి . పరవాలేదు చూడొచ్చు :)

@ హరే కృష్ణ గారు ,
మీరిచ్చిన లింక్ రాలేదండి .

రాధిక(నాని ) said...

ఈ నవలఎప్పుడో చదివానండి. సినిమావచ్చేక చాలామంది చండేరి నవల కథే అంటుంటే మళ్ళి చదివాను కానీ నాకేమి పోలిక కనిపించలేదు.ఒక్క గతజన్మ విషయం లో మాత్రం పోలిక ఉంది అనిపించింది . మీరు చాలా బాగా రాసారండి.

సి.ఉమాదేవి said...

ఆధారమని చెప్పలేముకాని కథలలో సారూప్యత అలా భ్రమింపచేయవచ్చు.కాని మీరు విశ్లేషించిన నవల దృశ్యీకరించిన సినిమాలా ఆకట్టుకుంది.