Tuesday, November 2, 2010

కొడుకు - కొడక్మాం వన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యు అనుకుంటూ వచ్చాడు , మా అబ్బాయి , నాపుట్టినరోజు సాయంకాలం . కెమేరా తెచ్చావా అని అడిగాను . హుం . . . నువ్వస్సలు సర్ప్రైజ్ కాలేదా ??? ఐనా ఎలా తెలుసుకున్నావు మాతే అని బోలెడు హాచర్యపోయాడు . మరి నెల రోజుల నుండి , నాకో కెమేరా కావాలీ . . . అని అడుగుతున్నాను కదా . అదే తెచ్చివుంటావులే అనుకున్నాను హి హి హి . అని నవ్వేసాను . ఎంత వూహించుకుంటూ వచ్చానో తెలుసా అన్నీ వేస్ట్ చేసావు అన్నాడు . నువ్వు కొడక్ తెచ్చినందుకు సర్ప్రైజ్ కావటంలేదు కాని , నా కొడకా ( ఉష్ . . . తిట్టుకాదు , మురిపెం ) నీకు గుర్తుండి తెచ్చిన్నందుకు మాత్రం సర్ప్రైజ్ అవుతున్నాను . నిజం చెప్పు ఇది నీ ఐడియా యేనా ? అని అడిగాను . హుం . . . నువన్నీ గెస్ చేసేస్తావు మమ్మీ . బామ్మ బర్త్ డే కి ఏం గిఫ్ట్ ఇద్దాము అంటే . బామ్మ కు కెమేరా అవసరం అదే ఇద్దామన్నారు పిల్లలు . ఐనా నేను కొననేమిటి అన్నాడు . ఎందుకు తేవు , తెస్తావు . కాని ఆ లాప్ టాప్ లో నుండి , సెల్ లో నుంచి తల బయటకు రావాలి , అప్పుడు నీకు గుర్తుండాలి , ఎంత తతంగం ! అన్నాను . అలా నా బర్త్ డే రోజు , నా కొడుకు ( మురిపెం . . . మురిపెం . . . ముచ్చట ) నాకోసం కొడక్ తెచ్చాడు .
ముందుగా ఏ ఫొటో తీద్దామా అని ఆలోచించీ . . . చి . . . ఈ ఫొటో తీసాడు . ఆ తరువాత బర్త్ డే ఫొటోస్ చాలానే తీసామనుకోండి . ఎంతైనా మొదటి ఫొటో ప్రత్యేకతే వేరు కదా . ఆ మరునాడు కష్టపడి ఓ చేత్తో కెమేరా పట్టుకొని నా రెండో చేయి ఫొటో నేనే తీసుకున్నాను . అది నేను నా మొదటి కెమేరాతో , నేను తీసిన మొదటి ఫొటో అన్నమాట ! ఆపైన ఈ పూలను తీసాను . అప్పటి నుంచి నా కొడక్ , వేరెవర్ ఐ గో , ఇట్స్ ఫాలోయింగ్ మి $$$$$

అలా నాతోపాటు వచ్చి నా ప్రయాణములో సరిగమలు పలికించింది . అప్పుడైతే ఫుటువాలు తీసేటప్పుడు ఎవరు నా వైపు చూసినా , నా బుజ్జి కెమేరానే చూస్తున్నారు , ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో , ఎక్కడ దిష్ఠి పెట్టేస్తారో అని తెగ టెన్షన్ పడ్డానను కోండి . చున్నీ చాటున దాచుకొని మరీ తీసాను ఫొటోలను . ఎంతైనా కొత్తది , జిందగీలో మొదటిసారి నాకంటూ వచ్చిన కెమేరా కదా ఆ మాత్రం మురిపెమూ , భయమూ వుండదేమిటి ?

అంతేకాదండోయ్ , ఆ తరువాత నెలలో నా సుపుత్రుడు నాకోసం సరికొత్త లాప్ టాప్ కూడా తెచ్చిచ్చాడు . పాపం అదేమిటో . . . అప్పుడూ నేను సర్ప్రైజ్ అవలేదు &&&& మమ్మీ కోసం గిఫ్ట్ తెస్తే సర్ప్రైజే కాదు అని నామీద వాళ్ళ అక్కకు కంప్లైంట్ చేసాడు * నువ్వు తేక పోతే సర్ప్రైజ్ అయ్యేదానిని , నా పరువు పోయేది . మా ఫ్రెండ్స్ కొత్త లాప్ టాప్ కొనుక్కోండి , ఈ పాత దానితో ఏం తిప్పలు పడుతారు అంటుంటే , మా అబ్బాయి యు. యస్ వెళ్ళాడు తీసుకొస్తాడు అని చెప్పానురా సుపుత్రా అన్నాను .

ఇదిగో ఇదే నా కొత్త లాప్ టాప్ . ఏమిటీ ఇంత కిట కిట లాడిపోతోంది అని ఆశ్చర్యపోతున్నారా ? ఇంతకు ముందు చెప్పాను కదా నా ఆంకోపరి షేరింగ్ ఆటో అని . కొత్త లాప్ టాప్ రావటము ఆలశ్యం , నా మనవళ్ళూ , మనవరాళ్ళూ వచ్చేసారు . మరి అడుగులో అడుగేస్తూ మా వారు వచ్చేసారు . నేను తప్ప వాళ్ళంతా ఎడ్మిన్స్ ట్రేటర్ లే ! బతిమి లాడి బామాలి నేను ఎడ్మిన్స్టర్ అయ్యాను లెండి . మరి , నేనూ , మా అక్కో అన్నాడు మా అబ్బాయి . ఆ ((( . . . మీ ఇద్దరూ నా చేయిజారిపోయారు కదరా అనేసాను .

11 comments:

..nagarjuna.. said...

same pinch మాలాగారు.... :D నాదికూడా ఇదే లాప్‌టాప్ (cq61-132)...ఇకనుండి కొత్త లాపినుండి టపాలు వేగంగా పడతాయన్నమాట

మధురవాణి said...

So cute! :)

శ్రీలలిత said...

హృదయపూర్వక అభినందనలు..
(కనీసం దీనికైనా సర్ప్రైజ్ అవుదురూ..)

శ్రీలలిత said...

హృదయపూర్వక అభినందనలు..
(కనీసం దీనికైనా సర్ప్రైజ్ అవుదురూ..)

వేణూశ్రీకాంత్ said...

బాగు బాగు రెండు ఉపకరణములునూ అద్భుతముగా యున్నవి :-)

3g said...

హ్హ..హ్హ..హ్హ... భలే రాసారండీ.... ఇలాంటప్పుడు సర్ప్రైజ్ కాకపోయినా అయినట్టు నటించెయ్యాలండీ. తరువాతి డిమాండ్లకి పనికొస్తాయ్.

>>ఎలా తెలుసుకున్నావు మాతే...
హ్హ హ్హ మీ అబ్బాయి కాన్వర్సేషన్ బాగుంది. ఇది చదివి ఒకసారి ఫ్రీగా ఇంటికెళ్ళొచ్చాను.

sunita said...

hahaha! baagunnaayi mee Kodak, compaq, plus mee koduku:-) Enjoy.

ఆ.సౌమ్య said...

ఏదీ కొత్త లాప్ టాప్ నుండి ఒక సొరకాయ వంటకం టైప్ చేసి మా మొహాన పడేయండి. :)

మాలా కుమార్ said...

నాగార్జున ,
సేంపించ్ రెడ్ ఆర్ బ్లూ ?
అదేకదా , ఓనెల నుండి టపాలు టపటపా రాలిపోతున్నాయి గా !

& మధురవాణి ,
థాంక్ యు .

&శ్రీలలిత గారూ ,
వావ్ ((( . . . మీరు . . . మీరు , , , అభినందనలు తెలిపారా ? ఎంత ఊహించని సర్ప్రైజ్ అండీ :)

మాలా కుమార్ said...

వేణూ శ్రీకాంత్ ,
ధన్యవాదములు :)

& 3g గారు ,
అవును కదా సర్ప్రైజ్ అవ్వాలి కదా ! నా గెస్ నిజమైన సంతోషము లో , హేమిషో తోచనేలేదు .
ఏమిటీ ? ఫ్రీగా వెళ్ళొచ్చారా ? మేమూరుకోమబ్బాయ్ , మా ఫీజ్ ఇవాల్సిందే :)

మాలా కుమార్ said...

సునీత గారు ,
థాంక్స్ అండి .

& సౌమ్యా ,
ఇంకా సొరకాయ వంటలు రాయాలనే వుంది , కాని ఇకపై సొరకాయ వంటలు రాయొద్దని బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయి ! మీ అభిమానానికి ఆనంద భాస్పాలు రాల్చటము తప్ప ఏమి చేయలేని అశక్తురాలనాయ్యాను , సౌమ్యా , అశక్తురాలనయ్యా ను * * *