Friday, October 29, 2010

అమెరికా ప్రయాణము లో నా ఎడ్వెంచర్ * * * * *

మొదటిసారిగా అమెరికా వెళ్ళటము * * * ఎప్పుడో ఓ సారి విమానమెక్కి హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళానే గాని , ఇన్ని సంవత్సరాల తరువాత , ఒక్క దానినే , గ్లోబ్ కు అవతలి వైపున వున్న అమెరికాకి , విమాన మెక్కి అన్ని గంటలు ప్రయాణము చేయటమే !!! తలుచుకుంటే గుండె గుభిల్లు మంటోంది . కాని అమ్మమ్మా అంటూ వచ్చే చిట్టి తల్లి కోసం వెళ్ళక తప్పదు . . . అందరూ అమెరికా వెళుతున్నావు అని గొప్పగా అంటున్నారే కాని గుండె గుబ గుబ * * * * * వీసా కష్టం మీద దొరికింది ! వెళ్ళను అన్లేను . . . ఇక్కడైతే లేబర్ రూం లో లక్ష్మి వుంటుంది , పెద్ద దిక్కు అత్తయ్యగారున్నారు . . . హాస్పిటల్ లో డ్యూటీ చేసేందుకు ఎందరో వున్నారు . . . ముఖ్యం గా భారం ఆయనగారి మీద వేసేసి నిశ్చింత గా వుండొచ్చు . . . . అక్కడ అంతా కొత్త . . . ప్రదేశము , దేశము , వాతావరణము , అల్లుడూ . . . అన్ని ఎలా సంభాళించుకుంటానో ఏమో ????? మేకపోతు ఘాంభీర్యము తో విమానమెక్కాను . . . ఎక్కేముందు , మావారు వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అని , నేను వెళ్ళే విమానము లో నే న్యూయార్క్ వరకూ వస్తాడనీ , పరిచయము చేశారు . అమ్మయ్య గుడ్డిలో మెల్ల . . . ఆ అబ్బాయిదీ నా పక్క సీటే . నాకు కిటికీ పక్క సీట్ వచ్చింది . . . రామచంద్రా . . . కిటికీ పక్కన ఎలా కూర్చునేది ????? గాలికి తలుపు తెరుచుకొని , ఇంత ఎత్తు నుంచి కిందపడిపోతే . . . దేవుడా . . . రాముడా . . . ఎన్ని కష్టాలు పెట్టావురా తండ్రీ . . అని దిక్కులు చూస్తూ నిలబడ్డాను . ఇంతలో ఓ అమ్మాయి ఎక్స్ క్యూజ్ మీ . . . మీ సీట్ లోకి వెళుతారా ఇది నా సీట్ అన్నది . చిన్నగా . . . మొహమాటం గా ప్లీజ్ మీరు కిటికీ పక్కన కూర్చుంటారా ??? నేను ఇటు కూర్చుంటాను అన్నాను . ఆ అమ్మాయి తల్ల కిందులై పోయి . . . బోలెడు హాచర్య పోయి . . . వై నాట్ అంటూ ఆనందం గా కూర్చుంది . హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది ( ప్రమాదము కిటికీ లో నుండి పడిపోవటము కాదు . నవ్వకండి నాకా మాత్రం తెలుసు . కాక పోతే మావారు నాకున్న కిటికీ పిచ్చి తెలిసిన వారు కాబట్టి , మొదటిసారి నేను కిటికీ పక్కన కూర్చుంటే అంత ఎత్తు నుండి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో , ఆయన పక్కన లేక పోతే , మరింత భయపడతానని , కిటికీ పక్కన కూర్చోవద్దని చెప్పారు . ఆయన గారి మాట వినాలి కదా ! ఇప్పుడైతే ఎవరు అరిచి ఘీ పెట్టినా కిటికీ పక్క సీట్ ఏమాత్రం త్యాగం చేయను . కిటికీ లో నుండి , తేలిపోయే మబ్బులను , అప్పుడప్పుడు , మాప్ లోలా కింద కనిపించే భూమిని చూస్తూ ఊహల మబ్బుల్లో తేలిపోయే అవకాశాన్ని ఎంతమాత్రం త్యాగం చేయను గాక చేయను ) అని నిట్టూర్చి , ఆ అమ్మాయి కి బోలెడు థాంకూలు చెప్పి , కిటికీ వైపు , ఆ అమ్మాయి , రెండో వైపు మా వారి ఫ్రెండ్ కొడుకు రెడ్డీ కూర్చోగా సేఫ్ గా మద్య సీట్లో బైటాయించాను . ఇంతలో ఏర్ హోస్టమ్మ కూల్ డ్రింక్ తెచ్చింది , ఊం హూ వద్దు అని తల అడ్డంగా తిప్పేసాను . ఏర్ హోస్టమ్మ విచిత్రం గా చూస్తుండగా , రెడ్డి , తాగండాంటీ కొంచం కూల్ గా వుంటుంది అన్నాడు . పాపం పిల్లాడు చెపుతున్నాడు కదా అని కూల్ డ్రింక్ తీసుకున్నాను . న్యూయార్క్ లో దిగేవరకూ ఇద్దరూ బోలెడు కబుర్లు చెప్పారు . న్యూయార్క్ లో విమానం ఆగింది , అంతే అప్పటి వరకూ ముచ్చట్లాడిన పిల్ల నన్ను నెట్టుకుంటూ గబ గబా దిగేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది . రెడ్డి మటుకు నేను ఎలా బయటకు వెళ్ళాలో చెప్పి , నేను మారాలిసిన విమానము ఎక్కేందు కు , ఇంకో టర్మినల్ కు ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళి పోయాడు . ఆ అబ్బాయి విమానము వేరే చోట అట . చేసేదేముంది , చిన్నగా ముందుకు నడిచాను .

ఎలాగో నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను . చెకౌట్ చేసే చోట ఓ నల్ల ఆఫీసర్ చూస్తేనే చాలా భయం వేసింది , ఎనీ గోల్డ్ అని అడిగాడు . ముందు అతనేమంటున్నాడో అర్ధం కాలేదు . ఇద్దరమూ తిప్పలు పడ్డాక , అర్ధమై , నా చేతికున్న గాజులు తప్ప ఇంకేమీ లేవని ఎలాగో చెప్పి బయట పడ్డాను . ఆ న్యూయార్క్ , విమానాశ్రయం , లాంజ్ లో నిల బడితే కొద్ది క్షణాలు ఏమవుతోందో తెలీలేదు . ఎటు వెళ్ళాలో తోచలేదు . . . తిరణాల లో తప్పిపోయిన పిల్ల పరిస్తితి ఐంది . కనెక్టింగ్ ఫ్లైట్ కు ఎక్కువ సమయము లేదు . పీచు . . . పీచు మంటున్న గుండె తో బయటకు వచ్చాను .ఎటెళ్ళాలని , ఎవరినో అడుగుతే హడావిడి గా ఎదురుగా కనిపిస్తున్న రోడ్ క్రాస్ చేసి , లోపలికి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు . అటూ . . . ఇటూ . . . ఏ వెహికిల్సూ రావటము లేదని నిర్ధారించుకొని , , , చూసి రోడ్ కు అవతలి వైపు పరిగెత్తబోయాను . ఇంతలో ఆంటీ ఆగండి , ఇక్కడ అలా రోడ్ దాటకూడదు అని వినిపించింది . వెనకకి తిరిగి చూస్తే రెడ్డి . ఏమిటీ నువెళ్ళలేదా అని అడిగాను . నా ఫ్లైట్ కు ఇంకా టైముందట . మిమ్మలిని ఫ్లైట్ ఎక్కించి వెళుదామని వచ్చాను అన్నాడు . చెక్ ఇన్ చేయించి అట్లాంటా ఫ్లైట్ కు ఎటెళ్ళాలో చూపించి వెళ్ళాడు . అలా మొదటిసారి అమెరికా కు చేరిన నేను ఇంకెన్ని అడ్వెంచర్స్ చేసానో తెలుసా ?? ఇందులో అడ్వెంచర్ ఏముంది అని పెదవి విరవకండి . . . ఆ క్షణము లో రెడ్డి రాకపోతే పరుగెత్తుకుంటూ రోడ్ దాటుతున్న నన్ను పోలీసులు పట్టుకునే వారని రెడ్డి చెప్పాడు . అప్పుడు నా పరిస్తితి , పడమటిసంద్యారాగం లో విజయశాంతి లా , అదేదో సినిమా లో భానుప్రియ లా అయ్యేది . ఏం చేయాలో , అసలు నన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్నారో తెలీని దిక్కుక్కుతోచని , అయోమయ . . . అయ్య బాబోయ్ ఇక నేను చెప్పలేను . అంతే కాదండోయ్ , ఆ తరువాత ప్రయాణాలల్లో మావారు కూడా కొన్ని ఎడ్వెంచర్స్ చేసారు . ఆశ , , దోశ . . అప్పడం . . . అన్ని ఇప్పుడే చెప్పేస్తానేమిటి ??

అరె ఆగండాగండి , అన్నీ , ఇప్పుడే ఇక్కడే చెప్పను అన్నాను కాని అసలు చెప్పను అనలేదు గా !!! ఇదిగో ఇంకో విశేషం బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో రాశాను . అదీ చదివండి మరి . ఇంకొన్ని విశేషాలు మరోసారి .

బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో నా అమెరికా ముచ్చట్లు ప్రచురించిన సృజనకు చాలా చాలా థాంకూలు .

16 comments:

Malakpet Rowdy said...

అంతే అప్పటి వరకూ ముచ్చట్లాడిన పిల్ల నన్ను నెట్టుకుంటూ గబ గబా దిగేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది .
__________________________________

అంత భయపెట్టారా?

మంచు said...

అంతే అప్పటి వరకూ ముచ్చట్లాడిన పిల్ల నన్ను నెట్టుకుంటూ గబ గబా దిగేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది .
__________________________________

పాపం .. ఆ అమ్మాయి :D

మనసు పలికే said...

హ్మ్.. మొత్తానికి మొదటి సారి అమెరికా ప్రయాణం అలా ఎంజాయ్ చేశారన్న మాట..:) చాలా బాగుందండీ మీ టపా.:)

మధురవాణి said...

బావున్నాయండీ మీ విమాన ప్రయాణం కబుర్లు. :)

శిశిర said...

ఈ టపా చదివి B&G లో మిగిలినది చదువుదామని వెళ్ళానండి. చాలా బాధగా అనిపించింది అలా జరగడం.

sunita said...

బాగుందండీ టపా!

కొత్త పాళీ said...

ఈ టపా ఇంకా చదవలేదు. B&Gలో టపా వ్యాఖ్యకి పొడిగింపు ఇది - చాలా అద్భుతంగా రాశారు. కొన్ని వారాలక్రితం మీ మొట్టమొదటి టపాలు కొన్న్ని చదివాను. మీ రచన శైలి చాలా పదునెక్కిందని మీ ఇటీవలి టపాలు కొన్ని చదివినప్పుడు బలంగా అనిపించింది. తెలుగు బ్లాగులు ఏమి చేసినాయి తెలుగుకి గానీ, తెలుగు సాహిత్యానికి గానీ అని ఎవరైనా అడిగితే నేను సగర్వంగా చూపించే బ్లాగుల్లో మీదీ ఒకటి.
Just one request - Don't stop writing!

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది :-)

అశోక్ పాపాయి said...

భలే సరదగా అనిపించింది మీ విమన ప్రయణం.

ప్రియ said...

Excellent

సి.ఉమాదేవి said...

మీ అమెరికా ప్రయాణం చదివి మా అనుభవాలు గుర్తుకు తెచ్చుకున్నాము.మేము ఫ్లారిడాలో వుండగా డిస్నీల్యాండ్ సైట్ సీయింగ్ లో ట్విన్ టవర్స్ పడిపోవడం,ఇండియాలో వున్న వారికి మాకేం ఫరవాలేదు అని చెప్పడానికి కలవని ఫొన్లు...ఆ క్షణాలు కలిగించిన గగుర్పాటు మరువలేం.జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అన్నమాటలు మీ వారి విషయంలో అక్షర సత్యాలు.

మాలా కుమార్ said...

రౌడీ గారు ,
భయపడ్డదంటారా ? ఎందుకలా పరిగెత్తింది అనుకున్నానే కాని , ఇన్నేళ్ళూ ఈ ఆలోచనరాలేదండి :)

*శరత్ కాలం గారు ,
థాంక్ యు .

* మంచుగారు ,
పాపం ఆ అమ్మాయా ?????

మాలా కుమార్ said...

మనసుపలికే ,
అవునండి అలా చేరాను :)

*మధురవాణి ,
థాంక్ యు .

*శిశిర ,
అవునండి అది బాధాకరమైన సంఘటనే .

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
మీ వాఖ్య చూసాక , చాలా చాలా సంతోషం కలిగిందండి . నిజం గా నోటమాట రావటములేదు .
అసలు మీరు లేఖిని ని , నాకు పరిచయము చేయకపోతే , నా బ్లాగ్ ప్రయాణం మొదట్లోనే ఆగిపోయేది . మీకు , లేఖిని రూపకర్త వీవెన్ గారి కి , సదా కృతజ్ఞురాలిని .
ఎప్పుడూ మీరు ఇచ్చే ప్రొత్సాహానికి ధన్యవాదాలు .

మాలా కుమార్ said...

సునీత గారు ,
* వేణూ శ్రీకాంత్ ,
* అశోక్ ,
*ప్రియ
అందరికీ ధన్యవాదాలు .

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
మీరు ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు యు. యస్ లో నే వున్నారా ! మా అబ్బాయి వాళ్ళు ఇక్కడికొస్తూ ఫ్లైట్ లో వున్నారు . మేము వాళ్ళను కలవటాని కి చెన్నై వెళుతూ ట్రేన్ లో వున్నాము . రెండు పార్టీల వాళ్ళమూ చెన్నై చేరుకున్నాకే ఆ సంఘటన గురించి తెలుసుకున్నాము :)