సీతాలక్ష్మి గారి , కాల్ చేసి థాంక్స్ చెప్పాలని వారం నుండి ప్రయత్నిస్తున్నాను . ఏమనుకుంటారో , ఎలా మాట్లాడుతారో అని సంకోచం ! చివరికి ధైర్యం చేసి , భయపడుతూనే ( ఆవిడ తో మాట్లాడేందుకు , భయము , సంకోచము , ధైర్యం ఎందుకు అంటారా ? అది టాప్ సీక్రెట్ ) ఫోన్ చేసాను . ముందు , ఇద్దరమూ కాస్త మొహమాటం గా మాటలు మొదలుపెట్టాము . ఎలా జరిగిందో కాని , ఆ క్షణం లోనే ఇద్దరికీ దోస్తీ కుదిరిపోయి , బోలెడు , బోలెడు , కబుర్లు చెప్పేసుకున్నాము . వాళ్ళ పాపాయి గురించి ఆవిడ , మా పిల్లల గురించి నేను కాసేపు చెప్పుకున్నాక , పుస్తకాలమీదికి టాపిక్ మళ్ళింది . యద్దనపూడి , సెక్రటరీ ఈ మద్యే కొన్నాను అని ఆవిడంటే , అరే నేనూ ఈ మద్యే కొన్నాను అన్నాను .కాసేపు ' జీవనతరంగాలు ' గురించి , అలా అలా , ఇద్దరికీ నచ్చిన ,పుస్తకాలు , పాటలు గురించి , మద్య మద్య చాలా సేపటి నుండి మాట్లాడుతున్నాము అని ఒకరితో ఒకరం అనుకుంటూనే చాలా ముచ్చట్లు చెప్పుకొని , వీలైతే , యద్దనపూడి ని నేను సీతాలక్ష్మి గారికి , రావు బాలసరస్వతి ని ఆవిడ నాకు చూపించే ఒప్పందం చేసుకొని , ఆ రోజుకు కబుర్లు ఆపేసాము .
హుర్రే . . . . . ప్రమదావనం లో , సినిమాలు గా వచ్చిన నవల ల గురించి , చర్చజరుగుతోంది . ' చరణదాసి ' గురించి రాద్దామని , రెండు రోజులుగా , ఆ సి. డీ కోసం ఇల్లంతా గాలిస్తున్నాను . దొరకని దాని గురించి ఎందుకు ? ' సెక్రటరీ ' , ' జీవనతరంగాలు ' గురించి వ్రాయచ్చుగా అనుకొని , నా ఎలుకమ్మ ను చేతిలోకి తీసుకున్నాను . నేను , పూణే లో బి. యే ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు , ఓ రోజు ఇంటికి వస్తుండగా , కిరికీ లో ' ఆంధ్ర జ్యోతి ' వీక్లీ చూసాను . ఇంటి కెళ్ళాక బోర్ గా వుంటుంది , ఓ తెలుగు పుస్తకం కనిపించింది , కొనుక్కుందాం అనుకొని , బస్ లోనుండి దిగి , ఆ పుస్తకము కొన్నాను . యాదృచికం గా ఆ సంచిక లోనే యద్దనపూడి వ్రాసిన ' జీవనతరంగాలు ' సీరియల్ మొదలైంది . అలా నా తెలుగు నవలా సాహిత్య పఠనం మొదలైంది . ఆ సినిమా కూడా నచ్చేసింది . ఎంతో ఇష్టం గా చదివిన సెక్రటరీ , సినిమా మటుకు నచ్చలేదు . అదెందుకు నచ్చింది , ఇదెందుకు నచ్చలేదు అంటే , ' చిత్రమాలిక ' లో నేను వ్రాసిన వ్యాసం చదివి తెలుసుకోండి .
మా పిల్లలు , చిన్నప్పుడు , నచ్చని కూర తినకుండా తప్పించుకోవటాని కి , నచ్చిన కూర తినేసి , ఇక కడుపులో ఖాళీ లేదు , ఇక తినము అని మారాము చేసేవారు ! అప్పుడు మావారు , నచ్చని కూర ముందు తిని , నచ్చిన కూర తరువాత తినమని , అలానే తినిపించేవారు ! అదే పద్దతి అలవాటై , పుస్తకం గా నచ్చి , సినిమా గా నచ్చని సెక్రటరీ గురించి ముందు , పుస్తకం గా , సినిమా గా నచ్చిన జీవనతరంగాలు గురించి తరువాత రాసాను . మరి ఎలా రాసానో మీరూ చదివి చెప్పండి .
చిత్రమాలిక టీం వారికి ధన్యవాదాలు .
Thursday, November 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
వాళ్ళ "పాపాయి" పెద్ద రౌడీ అని ఆవిడ చెప్పారా లేదా?
మాల గారూ,
మీరు పేరున్న బ్లాగరు, మంచి రచయిత్రి కూడాను! సలహా అనుకోకపోతే చెప్తాను మరి!
చిత్రమాలికలో మీ వ్యాసం చదివాను. కొత్త టాపిక్!
ఒకే టపాలో అన్నేసి సినిమాల గురించి కాక, ఒక్కో సారి ఒక్కో సినిమా తీసుకుని, దాన్ని పూర్తిగా విశ్లేషిస్తూ, నవలకు సినిమాకు కథలో ఏ మార్పులు జరిగాయి,రచయిత్రుల/రచయితల ప్రమేయం సినిమాలో ఎంత వరకూ ఉంది, ఇలాంటి కోణాల్ని కూడా స్పృశిస్తూ రాస్తే ఆర్టికిల్ సమగ్రంగా ఉంటుంది.(ఇప్పుడు లేదని కాదు, ఇంకా బాగుంటుందని)
మీనా ఉందనుకోండి! విజయనిర్మల కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకోదగ్గ హిట్ కదా! దాని గురించి మీకు పాత పుస్తకాల్లోనైనా మరెక్కడైనా వివరాలు దొరకొచ్చు! ఆ సినిమా కథని పూర్తిగా విశ్లేషిస్తూ ,నవలకూ సినిమాకూ గల తేడాల్ని పరిశీలిస్తూ రాస్తే ఎలా వుంటుందో ఆలోచించండి!
నవల చదివేటపుడు పాఠకులౌ విజువలైజ్ చేసుకున్నట్లుగా సినిమా ఉందా లేదా అనే కోణం కూడా పరిశీలించదగ్గదే!
సినిమాలుగా వచ్చిన నవలలు--ఇది ఎంత రాసినా తరగని సబ్జెక్టు! మీరు రాసినంత!మీ ఓపిక!
ఆలోచిస్తారుగా! లేక పిల్లకాకి (కృష్ణ కాదు) అనుకుని కొట్టి పడేస్తారా?
వాళ్ళ "పాపాయి" పెద్ద రౌడీ అని ఆవిడ చెప్పారా లేదా?
Waaaaaaaaaaaaaa :((((((
Nannu mari ilaa kelakadam baaledu
పర్లేదు నేను చెప్పేసా వాళ్ల పాపాయి ఎన్ని రౌడీ వేషాలు వేస్తాడో,అందరిని ఎలా సతాయిస్తాడో. ఇప్పటికే ఆ పాపాయి మీద ఆవిడ ఒక అవగాహనకు వచ్చి ఉండాలి.:))
:(((((((((((((((((((((((((((((((((((((((((((
ika blaagullo janaalu nannu football aadukuntarraa baaboooi :(((((
పాపాయి నవ్వాలి. పండగే రావాలి (రావాలి ఏంటి? వచ్చేసిందిగా!)..
:)))))
సుజాత గారు ,
ఆవిడ ఏమిచెప్పారో కాని , మిమ్మలిని నా బ్లాగ్ కు మాత్రం రప్పించారు . థాంక్ యు , సీతాలక్ష్మిగారు ))
సుజాత గారు ,
లేఖిని ని పరిచయము చేసి అప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ , కొత్తపాళి గారు నా బ్లాగ్ కు నడకలు నేర్పారు . మీరు వ్రాయగలరు వ్రాయండీ , , , , వ్రాయండీ అని జ్యోతి గారు , ఊపిరి తీసుకోనీయకుండా , నాలుగు రోజులు మాట్లాడకుండా వుంటే ఊరుకోనీయకుండా పరుగులు పెట్టిస్తున్నారు . ఇప్పుడు మీరు నన్ను క్రిటికల్ గా వ్రాయమంటూ , సునామీ సృష్టిస్తున్నారు . ఎందుకండీ మీకందరికీ నామీద ఇంత కోపం :))))) కానీయండి మరి , ఇక నేనేం చేయగలను ? ప్రయత్నం చేస్తాను .
అవునూ . . . నేను పేరున్న బ్లాగర్ . . . మంచి రచయిత్రి . . . మీరు పిల్ల కాకి . . . స్చప్ ****** ((((( : ))))) &&&&
మీ సలహాకు థాంక్ యు , థాంక్ యు వెరీ మచ్ .
రౌడీ గారు ,
అదేమిటండీ ????? పాపాయంటే మీరా ? ఆవిడ చెప్పినదాని బట్టి ఎవరో అమాయకపు చిన్ని పాప అనుకున్నానే :)
జ్యోతి గారు ,
' బంగారు పాపాయి బహుమతులు పొందాలి ' అట అండి :))
' బంగారు పాపాయి బహుమతులు పొందాలి
:o :o :o :o
OMG!!!!!! She told you this too?
WAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలండి! :)
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు ..
మాల గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.:)
మాల గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.:)
అమ్మఒడి గారు ,
& రాజి ,
& మనసుపలికే ,
& శివరంజని ,
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలండి .
థాంక్ యు .
Post a Comment