కైలాసగిరి పై ఒకానొక రోజు , నందీశుని విన్యాసాలు తిలకిస్తూ , విశ్రాంతిగా వున్న శంకరునితో ,పార్వతీదేవి ఇట్లనియె ,
స్వామీ ,భూలోకమున ,మీ భక్తురాలు మాల చింతాక్రాంతురాలైయున్నది తిలకించితిరా ?
అవును దేవీ ,ఆమె ఈమద్య బ్లాగ్ లిఖించుట మొదలిడినది . అప్పటి నుండి తన బ్లాగునకు అథిదులు లేరే అని చింతించుచున్నది.
అటులైనను ఏదైనా తరుణోపాయమును సూచించి , మీ భక్తురాలి చింతను తీర్చవచ్చునుకదా ! అని పార్వతీదేవి నిష్టూరమాడెను .
దేవీ అంత నిష్టూరము వలదు , పదివేల క్లిక్ ల వ్రతమును భక్తి శ్రద్ధల తో ఆచరించిన ఆమె కోరిక తీరును అని అనియెను.
అంత ,పార్వతీదేవి ఆ వ్రత విధానమును తెలుపమనగా శంకరుడు పార్వవతీదేవికి తెలుపగా , అంత పార్వతీదేవి మాలకు స్వప్నమున అగుపించి ఆ వ్రత విధానమును వివరించెను.
సో , ఆవిధముగా నేను స్వప్నమునందు పార్వతీ దేవి వలన ఆ వ్రతవిధానమును తెలుసుకొని , ఆది దంపతుల కృపకు సంతసిచిందానినై , ఆ వ్రతమును ఆచరించాను !
ఆ వ్రతవిధానములో చెప్పినట్లుగా ముందుగా లో కూడలి చేరాను. ఆ తరువాత కొద్ది రోజులు నేను రాతలు ఆపి , అందరి రాతలు పరిశీలిస్తూ , వాఖ్యానిస్తూ వాఖ్యాతగా మారాను. ఆ విధముగా కొందరి దృష్టినైనా నావైపు తిప్పుకోగలిగాను. అమ్మయ్య కొద్దిమంది మిత్రులైనారు ! ఆటుపిమ్మట నా శైలిని కొద్ది కొద్దిగా మెరుగు పరుచుకుంటూ , రాతలు మొదలుపెట్టాను. నా మితృలైన వారిని మొహామాట పెట్టో , మీరు నా పోస్ట్ ను చూస్తేనే మీకు నేను కామెంటుతాను అని బ్లాక్ మేయిల్ చేసో , మీరు చాలా బాగారాస్తున్నారండీ ,నాకూ కొన్ని కిటుకులు చెప్పరూ అని వుబ్బేస్తూనో ( మరి పొగడ్తలకు లొంగని వారుంటారేమిటి ? ) , ఇంకొంచం దగ్గరైనాక మీరు నా కొత్త పోస్ట్ చూడలేదు అని కాస్త అలక చూపించో , కాస్త బతిమిలాడో , బామాలో , బుజ్జగించో నానాతిప్పలు పడి నా బ్లాగ్ కు రప్పించుకొని మొత్తానికి నా పదివేల క్లిక్ ల వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను .
నా రాతలు నచ్చి కొందరు , నచ్చక పోయినా కొందరు , నచ్చీ నచ్చక కొందరు అలా ఇలా అలవోకగా కొందరు , అటూ ఇటూ వెళుతూ కొందరు ఏమైతేనేం అందరూ నా పదివేల క్లిక్ ల వ్రతమును దిగ్విజయముగా పూర్తి చేయటానికి సహకరించారు . అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ వ్రతమును కొత్తగా బ్లాగ్ ను వ్రాయటము మొదలు పెట్టిన వారెవరైనను చేయవచ్చు. విధానము పైన నేను చేసినట్లుగా చెప్పినదే ! కాక పోతే చిన్న సలహా , వ్రాసేవిధానమును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ , తప్పులులేకుండా రాస్తూ , నొప్పించక ,తానొవ్వక అనేట్లుగా మన పోస్ట్ లు వుంటే బాగుంటుందని నా అభిప్రాయము.
ఉద్యాపన :
పదివేల క్లిక్ లు పూర్తి కావచ్చే ముందు చెల్లెలిని మన బ్లాగ్ ముందు కూర్చోపెట్టి , పదివేల సంఖ్య పూర్తికాగానే మనకు తెలిపే ఏర్పాటు చేసుకోవాలి ! ఆ వెంటనే , ముందు గానే మనము తయారుగా వుంచుకున్న టపాను ప్రచురించి , మన బ్లాగ్ కు వచ్చే అథిదులకు వాయనమివ్వాలి . ఎంతమందికైనా , స్త్రీ పురుషులు ఎవరికైనా ఇవ్వవచ్చు .
అందుకే ఈ టపా .
ఇస్తినమ్మ వాయనం
పుచ్చుకుంటినమ్మ వాయనం
నా వాయనం అందుకున్నదెవరు ?
పురుషులైతే నేనే శంకరుని అనండి
స్త్రీ లైతే నేనే గౌరీ దేవిని అనండి .
అథిది దేవా నమో నమహః !
కామెంట్ దాతా సుఖీభవ !
27 comments:
పుచ్చుకుంటినమ్మ వాయనం..
శతశతమానంభవతి... :)
హ హ మాల గారు.. అక్క చెల్లెళ్ళిద్దరూ ఏం రాస్తున్నారండీ బాబు పోస్ట్లు..నాకు తెగ నచ్చేస్తున్నాయి..ఏంటో నాకీ మద్య బ్లాగరులందరూ మా ఇంట్లో వాళ్ళలాగానో, మాంచి జిగిరీ దోస్తులగానొ అనిపించేస్తున్నారు.. అన్నట్టు మీరు మీ వ్రతం ద్విగ్విజయంగా బాగానే పూర్తి చేసారు ..మరి నేను మా ఆయ్యన్ని తిట్టుకోకుండా ఏ రోజూ వ్రతం మొదలు పెట్టకపోవడం వల్లనేమో శివునికి నచ్చలేదనుకుంటా (మగ బుద్ది) నా హిట్ కౌంటర్ 5 వేలు అయ్యేసరికి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది.. ఈ మద్య పొరపాటున 8000 కి వచ్చేసింది..శివుడు ఇంకా చూసినట్లు లేడు :)
మాలగారు,
మీ నోము కి ఫల౦ తెలియదు కాని మాకు మాత్ర౦ మ౦చి రుచిరకమైనా బోజన౦ దొరికి౦ది.
మీరు ఇక పైనా లక్ష హిట్స్ నోము పట్టి మాకు రకరకాలు వ౦డి పెట్టాలని నేను ఆశిస్తూన్నాను.
నేను పార్వతిదేవిని పుచ్చుకు౦టినమ్మ వాయిన౦..........వ్రత౦ ఐడియా బాగు౦ది.
ప్రేమ తో,
మీ,
సుభద్ర
పుచ్చుకుంటినమ్మ వాయనం :)
నాకూ అందిదిగా వాయనం!:)
నేనూ వచ్చానోచ్ వాయనంకోసం. కొత్త నోము బలే కనిపెట్టేశారే. చాలా బాగుంది.
psmlakshmi
4psmlakshmi.blogspot.com
మరి నాకో...
:-)
Jeans pant prrptirasthu ani evarannaa aasheervadisthe baavuNNU kadaa
బావుందండీ మీ నోము :)
మీ చెల్లెలు గారు ఎవరు? ఆవిడ బ్లాగ్ ఎక్కడుందొ చెప్తే అక్కడికి కూడా వెళ్ళి వాయనం అందుకుంటా.
ఇదేదో బాగుందండీ.. అన్నట్టు నేను మురళిని :):)
అహా ఏమి నాభాగ్యము ! అనుకోని అతిధి వచ్చి , ప్రధమ తాంబూలమందుకున్నారు .
గురూజీ , ధన్యవాదములు .
నేస్తం గారు ,
ముందుగా మీ కాంప్లిమెంట్ కి థాంక్స్ అండి .
నాకూ అంతేనండి , బ్లాగర్ లందరూ నా ఆత్మబంధువులనిపిస్తారు. ఎవరైనా కూడలి లో ,నా బ్లాగ్లో కొద్ది రోజులు కనిపించక పోతే దిగులేస్తుంది !
మీరసలే సింగపూర్ లో వుంటానంటున్నారు .ఎవరైనా ఇంటర్నేషనల్ స్మగ్లర్ మీ హిట్ కౌంటర్ ఎత్తుకుపోయాడేమో చూడండి . ఎప్పుడూ మీవారిని కుళ్ళిస్తానంటారు , ఆయనే మీ గర్వభంగం చేయటానికి ఏ స్మగ్లర్నో హైర్ చేసారేమోనని నా అనుమానం సుమండీ !
సుభద్ర గారు ,
మీరు రావటమే నా నోము ఫలమండి . థాంక్ యు .
శేఖర్ పెదగోపుగారు ,
మీ బుడుగు బాగా నవ్వాడండి . థాంక్ యు .
పరిమళం గారు ,
సృజన గారు ,
నా వాయినము అందుకునందుకు ధన్యవాదములండి .
లక్ష్మి గారు ,
నా వాయనమందుకున్నందుకు థాంక్స్ అండి .
మరి నోములన్నీ ఇలాగే మొదలవుతాయట !
జయా ,
మరి నీకివ్వక పోతే ఎలా ? నువ్వూ అందుకో వాయనము .
అయితే నేను త్వరలో ఇరవైవేల నోము చేసుకుంటాను...నా బ్లాగుకి వచ్చి వాయినం తీసుకుని వెళ్లడం మరువకండేం...
రాణి గారు ,
నా విజిటర్స్ కౌంటర్లో పదివేలూ పూర్తికాగానే చెప్పు అని నేను నిద్రపోతే , రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి , నీకూ ,మీ అక్క కీ పనీపాట లేదు అని వాళ్ళబావగారి తో చివాట్లుతిన్న అమాయకురాలండి ,మా చెల్లెలు . ఇదో ఇదే తన బ్లాగ్
http://manasvi-jaya.blogspot.com/2009/10/blog-post_14.html
మురళి గారు ,
చాలా థాంక్స్ అండి .
సృజన ,
నోముకున్నప్పుడు , అలా అడగ కూడదు , కళ్ళు పోతాయ్ !
తృష్ణ గారు ,
పేరంటానికి పది ఆమడలైనా వెళ్ళాలిట !
మీ నోము తీర్చుకున్న రోజు చెప్పండి , వాయనము అందుకోవటానికి తప్పక వస్తాను .
ఇకనేం లక్ష క్లిక్కుల నోమో వ్రతమో అదీ కానిచ్చేయండిక. :) నాకు వ్రతాలు, నోములు చేయటం రాదు, చేయను కనుక నా వాయనం మీరే వుంచేసుకోండి.
Congrats and good luck for many more posts from your blog[s]
ఇకనుండీ మీరు వ్రాసే వ్యాఖల్లో నిజాయితీ పాళ్ళు వెదకాలన్నమాట! ;)
మాల గారు,
నేను మా పెద్దమ్మ చేటల వాయనం అందుకుని వచ్చేసరికి net connection పోయింది.రాగానే mail లో మీ పోస్ట్ చూసి వచ్చాను.ఆలస్యం అయినా అందుకున్నాను వాయనం.
All the best.
హత్మోషి ! ఎంతమాట అనేసారు ఉషా !
niharika garu ,
thank you .
Post a Comment