Thursday, May 13, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - కొసమెరుపు

బహుషా మూడు నెలల కిందట అనుకుంటా , ప్రమదావనం లో కొత్తగా చేరిన కృష్ణ వేణి నాకిక్కడ ఎవ్వరూ తెలీదు అంటే సరదాగా , సరే సద్దుకొని కూర్చొని , వినండి పరిచయం చేస్తాను అని కొంత మంది ప్రమదావనం బ్లాగర్ ల ను పరిచయము చేసాను . ఇలాగే అందరినీ మీ బ్లాగ్ లో పరిచయం చేయొచ్చుగా అన్నారు లలిత . అయ్య బాబోయ్ నా వల్ల కాదు , నాకంత ఓపిక లేదు , సుభద్రకు ఆ పని ఒప్పచెబుదాము , తనకి చాలా ఓపిక , బాగా రాస్తుంది కూడా అన్నాను .అలాకాదు , మీరు మొదలు పెట్టారు కదా మీరే రాయండి , మీకు కావలసినంత టైం తీసుకోండి అన్నారు జ్యోతి . అవునవును మీరే రాయండి , కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అంది సుభద్ర . జయ తో అంటే చాలా భయ పెట్టింది , వద్దక్కా , ఎవరినైనా మరిచి పోతే , ఏవరిగురించైనా రాసింది వాళ్ళకు నచ్చక పోతే బాగుండదు అని . మళ్ళీ రెండో రోజు రాయిలే , కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అంది .అదో అలా మొదలైంది ఈ యజ్ఞం

అప్పుడే ఎందుకో మదర్స్ డే రోజుకు వచ్చేట్లుగా రాస్తే బాగుంటుందేమో అనే ఆలోచన రూపు దిద్ద్దుకుంది . ఇహ కసరత్తు మొదలు పెట్టాను . ముందుగా నాకు కామెంట్ పెట్టిన వారి లింక్స్ తీసుకున్నాను . ఆపైన , ప్రతిరోజూ కూడలిని చూడటము , అందులోని మహిళా బ్లాగర్ ల లింక్ తీసుకోవటము అలా చాలానే కలెక్ట్ చేసాను . మద్య మద్య లో జయ తో , సుభద్రను తో చర్చించేదానిని . అదేమిటో ఇద్దరిమీద శిశిర ఏమాయ చేసిందో , నేను అడిగిన ప్రతిసారీ , శిశిర లింక్ తీసుకున్నావా అని మొదటి ప్రశ్న అడిగే వారు . ఓసారి చెప్పేసాను , ఎన్ని సార్లు చెపుతారు ? ఇంకోసారి శిశిర అన్నారో మీ గురించి కూడా రాయను అని . అలా పాపం ఇద్దరూ చాలానే సాయం చేసారు .( స్వగతం ; ఈ సోదంతా ఎందుకు )


. కొన్ని సార్లు విమానం కోసం ఎదురుచూస్తూ , లాంజ్ లో కూర్చొని లింక్స్ వెతికేదానిని .( స్వగతం ; ఈ మద్యకాలం లో విమానం లో ఎప్పుడు ప్రయాణించావు ? ) ఏ . సీ ట్రేన్ కోసం ఎదురు చూస్తూ ప్లాట్ ఫాం మీద కూర్చొని లింక్స్ వెతికాను .( స్వగతం ; ఏ. సీ ట్రేన్ నా ? కొయ్ . . . కొయ్ ) కార్ లో వెళుతూ కూడా లింక్స్ వెతికేదానిని ( స్వగతం ; ఏమిటీ కార్ లో కూడా లాప్ టాప్ తీసుకెళ్ళావా ?మరీ అంత ఒద్దమ్మా !! ) ఏయ్ స్వగతం కొంచం నోరు మూస్తావా ? ఎంత బిజీ గా వుండి , ఎంత కష్టపడి రాసానో బిల్డ్ అప్ ఇవ్వాలా వద్దా ? అయినా నీకేం తెలుసు పెద్ద పెద్ద రైటర్స్ అలాగే చెప్పాలి . అలా అలా ముచ్చట గా మూడు నెలలు లింక్స్ తీసుకొని మొదలు పెట్టానా . . . మూడుభాగాలూ అయ్యాయనుకున్నానా . . . అమ్మయ్యా అనుకున్నానా . . .

టక్. . . టక్ . . . మాలాగారూ ,

ఇదిగోండి ఇంకొన్ని లింక్స్ .

ఓ థాంక్ యు మధురవాణి .

అరే ఈ లింక్స్ ఇంతకు ముందు నేను చూసానే ! ఎందుకు రాయలేదు చెప్మా ?? ఓ మధ్య లో నా ఇతిహాస్ ( టెస్ట్ బ్లాగ్ . స్పెల్లింగ్ ఇంగ్లిష్ లో రాసుకొని తిప్పి చదవండి ) ట్రబుల్ ఇచ్చినప్పుడు వర్డ్ లో వున్నాయి కదా అని ఆ బ్లాగ్ ను డిలీట్ చేసినప్పుడు ఎగిరి పోయినట్లున్నాయి . ఓకే కలిపేస్తే పోలా .

టక్ . . . టక్ . . .

ఎవరదీ , ఓ వరూధిని గారా రండి రండి ఏమిటి సంగతి ?

ఇదోండి ఇంకొన్ని లింక్స్ . వీళ్ళ లో కొంత మంది రాయటము మానేసారనుకోండి . ఎలాగూ మీరు బుక్ చేస్తున్నారు కదా కలిపేయండి .

మంచిదండి , మీరు శ్రమ తీసుకొని ఇచ్చారు . థాంక్ యు .

మాలా గారూ అన్ని ఆడ్ చేసాక చెప్పండి ఒకేసారి పిడియఫ్ చేస్తాను .


జ్యోతి గారూ సరేనండి . మళ్ళి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది కదా .

కలిపేసా . . . టక్. . . టక్ . . మాలా గారూ ఇదిగోండి ఇంకో రెండు లింక్స్ దొరికాయండి . కలిపేయండి . లేక పోతే వాళ్ళు నొచ్చుకుంటారు .

మంచిదండి .

జ్యోతి గారూ ఐపో. . .

టక్. . . టక్ . . . మాలా గారు ఇదిగోండి ఇంకో రెండు దొరికాయ్ !

బాబోయ్ వరూధిని గారూ ఇహ నన్ను వడిలేయండి . నేను హైదరాబాద్ నుండి పారి పోతున్నాను .

మీరెక్కడి కెళ్ళినా మిమ్మలిని వదలను గా .

వా ( ( ( . . . . .

టిక్ . . . టిక్ . . . టిక్ . . .

అయ్య బాబోయ్ ఏదీ దారి ?

హుర్రే . . . యాహూ . . ఊ


అమ్మమ్మా . . . యాహూ పాత పాట అమ్ముమ్మా ధూం మచావో ధూం , యా బామ్మా ధూం మచావో . అంతే మా హాలిడే హోం ( మా ఇంటికి నా మనవరాళ్ళు , మనవళ్ళు పెట్టుకున్న పేరు ) మా ఐదుగురి డాన్స్ తో , కేకలతో హోరెత్తి పోయింది .

బామ్మా నా దో డౌట్ అడగనా ?

నీకు ఇంకా డౌట్ లు రాలేదేమా అనుకుంటున్నాను . అడగరా గౌరవ్ .

మనమిప్పుడు డాన్స్ ఎందుకు చేసాము ?

ఏముంది . అమ్మమ్మ బ్లాగ్ బాగుందని అందరూ కామెంట్స్ పెట్టివుంటారు అని విక్రం జవాబు .

థ్రీ డేస్ నుండి వస్తున్నాయి కదా బామ్మా , ఇప్పుడు ఏదో స్పెషల్ ఐవుంటుంది . కదా బామ్మా మేఘ ప్రశ్న .

అవునురా బంగారూ , మా ఫ్రెండ్ ఈ ఆర్టికల్ భూమిక మాగ్జిన్ లో పెడుతారుట , నా కిస్తావా అని పర్మిషన్ అడుగుతున్నారు .
ఎలా రాస్తారుట ? అడిగావా ? అమ్మమ్మా ? అదితి ప్రశ్న .

ఎలా రాసినా నేను రాసింది అడిగారు కదా అదే గొప్ప . మీరందరూ , నాకు లాప్ టాప్ త్యాగం చేసేసి , నేను రాసుకునేటప్పుడు గొడవ చేయకుండా వుండి చాలా కోపరేట్ చేసారు . చెప్పండి , మీకేం కావాలి ?

ఐస్ క్రీం కోరస్ గా చెప్పేసారు .

ఓకే సాంక్షన్ !

సో అలా సహకరించిన అందరికీ వేల వేల ధన్యవాదాలు . వరూధిని గారు నిజం గా ఇందులో సగం క్రెడిట్ మీదే . మీకు చాలా చాలా థాంక్స్ . మధురవాణి గారు ఇచ్చినవీ , వరూధిని గారు ఇచ్చినవీ , మంచుపల్లకి గారు ఇచ్చినది , ఇంకా కొన్ని లింక్స్ జ్యోతి గారు చివర లో ఇచ్చినవి , ఈ మధ్య యాదృచ్చికంగా నా కెమెరా కంటికి చిక్కినవీ , అవీ , ఇవీ అన్నీ మొదటి , రెండవ భాగాల లో కలిపి జ్యోతి గారికి హాండోవర్ చేసాను . జ్యోతిగారేమో పిడియఫ్ చేసి సత్యవతిగారికి ఇస్తారన్నమాట . సత్యవతి గారేమో అందరితో జూన్ భూమిక లో ధూం ధాం చేయిస్తారుట ! మహిళా బ్లాగరిణులూ మీ ఫొటో కూడా వేస్తారుట . నేనైతే ఓపది ఫొటో లిచ్చాను . మరి మీ ఇష్టం .


చదివి స్పందించిన పాఠకులూ పేరు పేరు నా మీకందరికీ ఇవే నా ధన్య వాదములు . ఆగండాగండి మీ పిల్లల కేమో ఐస్ క్రీం లూ మాకేమో దండాలా అని అలా గుర్రుగా చూడకండి . ఇదిగో మీకూ ఐస్ క్రీంలూ .






నా కష్టాన్ని చూసి మనసు కరిగి నీరై (ఎండలు అలా ఉన్నాయి మరి) , అడక్కుండానే మార్పులతో మళ్లీ e పుస్తకం చేసిచ్చారు... థాంక్ యు జ్యొతి గారు .

14 comments:

శ్రీలలిత said...

మాలాగారూ,
అబ్బ .. ఐస్ క్రీమ్ ఎంత చల్లగా, తియ్యగా వుందో... మీ కష్టమంతా మరిచిపోయి సంతోషపడేలా.
మీకు నా హృదయపూర్వక అభినందనలు. మనలో ఒక నానుడి వుంది. ఆడవారిని (మహిళలని) హేళన చేయాలనుకున్నప్పుడు చాలామంది వాడేది.. అదేమిటంటే.." మూడు కొప్పులు ఒకచోట యిమడవు.." అని. కాని మీరు మహిళా బ్లాగర్ల గురించి యింత గొప్పగా పరిచయం చేసి ఆ నానుడిని అబధ్ధం చేసి మన గౌరవాన్నినిలబెట్టారు. మీకూ, మీకు అన్నివిధాలా సహకరించిన సుభద్రగారికీ, వరూధినిగారికీ, ఇంకా మీకు లింక్ లు అందించిన అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు. భూమిక లో ఈ బ్లాగుల గురించి ఆర్టికిల్ వేసుకుంటున్నందుకు భూమిక ఎడిటర్ సత్యవతిగారికి ధన్యవాదములు మీ బ్లాగ్ ద్వారా తెలుపుకుంటున్నాను..

మైత్రేయి said...

Mala garu, Congratulations !

Srujana Ramanujan said...

:-) Blog Mala andinchaaru. Very nice

ఆ.సౌమ్య said...

అమ్మా, మీ ఓపికకి నిజంగా జోహార్లు. మీ శ్రమ కి వెలకట్టలేను కానీ వెయ్యి దణ్ణాలు. అలాగే మీకు సహకరించిన వరూధినిగారికి మిగిలినవారికి కూడా జోహార్లు.
మీరిచ్చిన ఐస్ క్రీం బావుందండీ !

నిషిగంధ said...

మాలగారు, లేటుగా చూస్తున్నా.. ఎంత చక్కగా అతివల బ్లాగుల్ని గుర్తు చేశారండీ!! మీకు బోల్డన్ని కృతజ్ఞతలు..

మరువం ఉష said...

సమిష్టి కృషి... అభినందనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న అందరికీను.

Anonymous said...

AttayYa... C O N G R A T U L A T I O N S. Naaku tHelusu intha pani chesthavani... I am really happy
-Ravi Komarraju

భావన said...

మాల గారు, చాలా బాగా అందరిని కవర్ చేసేరండీ. మీకు మేమే ఒక హిమ క్రీమ్ కొని పెట్టాలి. I scream you scream we scream for icecream. Laa laa laa వుషారు ఎక్కువై పాటలు పాడుతున్నా. నేల మీద గాలి లోను ఎక్కడూన్నా సర్వకాల సర్వా వస్తల యందు అతి జాగురుకతతో మహిళ ల అంతర్జాల విహార యాత్ర స్తలాలను చేర్చి ఒకచోట కూర్చి మమ్ము ఎంతో ఆనందింప చేసిన మాల వరూధిని, సుభద్ర, జయ, లలిత, జ్యోతి ఇంక ఇంకా అందరికి వేసుకోండహో ఒక దండం.

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,

మీకు , నేను చేసిన ప్రయత్నమూ , నేనిచ్చిన ఐస్ క్రీం నచ్చినందుకు చాలా థాంక్స్ అండి .

* మైత్రేయి గారూ ,
హపీనా అండి . మీ ఆఫీస్ వాళ్ళకు చెప్పండి , అమ్మాయిలు అమృతం తాగి పుడతారు , అందుకే వారి వయసెప్పుడూ పదహారే అని .
థాంక్ యు వెరీ మచ్ .

* సృజనా ,
నేనందింక్చిన బ్లాగ్ మాల నచ్చిందన్నమాట . థాంకు .

మాలా కుమార్ said...

సౌమ్యా ,
నా శ్రమను గుర్తించినందుకు , ఐస్క్రీం నచ్చినందుకు థాంక్యు .

*నిషిగంధ గారు ,
మీ రాక తో నా సాహితి గుభాళించి పోతోందండి . థాంక్ యు .

* థాంక్ యు ఉష .

మాలా కుమార్ said...

థాంక్ యు రవి ,
నువ్వు ఓరెండు ఐస్ క్రీం లు ఎక్కువ తీసుకో . ఎంతైనా నా బ్లాగ్ గురువు గారివి కదా !

* వావ్ హా భావనా ,
భలే బాగా చెప్పారు కదా , నాకూ పాటలు వచ్చేస్తున్నాయోచ్ !
థాంక్ యు థాంక్ యు వెరీ మచ్ .

మానస said...

నేను మీ మహిళల టపా ని ఫేవరెట్స్ లో add చేసుకున్నా,రెఫరెన్స్ కి వీజీ అని.ధన్యవాదాలు మంచి పోస్టు అందించినందుకు

పరిమళం said...

అమ్మయ్యో ......మాలాగారూ ! ఎంతకష్టపడ్డారు ? మీకు అంతర్జాల అతివలందరి తరుఫున బోల్డన్ని థాంకులు!

రాజ్యలక్ష్మి.N said...

మాలాకుమార్ గారూ మీరు మీ "బ్లాగ్ అంతర్జాలంలో అతివలు" టాపిక్ లో నా బ్లాగ్ గురించి ప్రస్తావించిన విషయం నాకు ఈ రోజే తెలిసింది.
నాకు చాలా సంతోషంగా వుంది.
నా బ్లాగ్ మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చిన మొదటి గుర్తింపు ఇది.
చాలా చాలా థాంక్స్ అండీ.