Monday, May 3, 2010
బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - మొదటి భాగం
మిట్ట మద్యాహ్నం , ఎండ మండి పోతోంది .చెమటలు ధారాపాతం గా కారి పోతున్నాయి . ఫాన్ గాలి ఏమూలకూ సరి పోవటములేదు . ఏ .సీ పని చేయటము లేదు . ఉష్ , అష్ అనుకుంటూ ఆపసోపాలు పడుతుండగా , మా సావిత్రి ( మా వంటావిడ ) వచ్చి , వేడి , వేడిగా పకోడీలు చేసేనాండీ అని అడిగింది . ఒక్క నిమిషం బిత్తర పోయి చూసి , ఇప్పుడు పకోడీలా ? వద్దు అనబోయి , వద్దు అంటే ఆ తరువాతి పరిణామాలను తట్టుకునే శక్తి లేక సరే చేయండి అనేసాను . ఆమెకు తినాలి అనిపించి , చేస్తాను అన్నప్పుడు , నేనూ తినాల్సిందే తప్పదు మరి ! వాన పడుతున్నప్పుడో , చలికాలం చిరు ఎండలో నో కూర్చొని , పకోడీలు తింటూ , ఏ యద్దనపూడి నవలో చదువుతూ పకోడీలు తినటము ఎవరైనా చెస్తారు . మండే ఎండలో , చెమటలు కక్కుతూ , వేడి వేడి పకోడీలు తినటము మా ప్రత్యేకత ! ఎంతైనా మా స్టైలే వేరు . యద్దనపూడి వ్రాయటము మానేసినంత మాత్రాన ఏమైంది ? హాయిగా కూడలిలో విహరిస్తూ , కూల్ కూల్ గా , చల్ల చల్లగా అమ్మాయిల బ్లాగులు చదువుదాము అని డిసైడై పోయి , కూడలి తీసాను .
మీరు ఉత్తరాలు రాయగలరా ? నాకైతే రాసే ఓపిక లేక , చివాట్లు చాలా తినేదానిని . రాసేఓపిక లేదు కాని ,చిట్టీ ఆయేగీ అనుకుంటూ ఎదురుచూసి చదివి ఆనందించే ఓపిక చాలా వుంది . అందుకే భావన అందుకే కృష్ణ గీతం ను తరుచూ చూస్తూ వుంటాను .
సరదాగ చిన్న చిట్కాలే కాదు చక్కని కవితలూ అల్లుతారు శ్రీ లలిత . శ్రీలలిత గారి కవితల తో అప్పుడప్పుడూ నా సాహితి కూడా తరించి పోతూవుంటుంది .
ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఐందా ? ఐతే ఈ లలిత స్పందన చూస్తేసరి . కాకపోతే మన పొట్టలు జాగ్రత్తగా చూసుకోవాలి , చెక్కలైపోతే కష్టం కదా !!
అమ్మ కడుపు చల్లగా అందరూ బాగుండాలి అని దీవించే ఆదిలక్ష్మి గారి బ్లాగ్ ఇది .ప్రస్తుత దేశ రాజకీయ విషయాల దగ్గర్నుండి , చిన్ని చిన్ని కథలు కూడా చెప్పే అమ్మవొడి ఇది .
మధుర మధురం గా కబుర్లు , పాటలు విని పిస్తారు మధురవాణి . నాకు బ్లాగ్ లో పాటలు పెట్టాలి అనే కోరిక మధురవాణి బ్లాగ్ చూసాకే కలిగింది .
యమునాతీరానికి వెళితే ధీరసమీరే యమునా తీరే అని సృజనగీతం పాడుతూ ఓ అందమైన అమ్మాయి , కృష్ణుని వెతుకూ కనిపిస్తుంది , తనే సృజనా రామానుజం .
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష.
నేను ఆర్డినరీ వుమెన్ ని అంటూనే , పెళ్ళి పెటాకులూ , ఇది ఇంతే అని బోలెడు కబుర్లు చెబుతారు సునీత , తన -నేనూనా బ్లాగ్ లో .
ఏ పుస్తకము గురించి వివరము కావాలన్నా సిరిసిరిమువ్వను అడుగుతే చాలు .
మూసిన కను రెప్పల మాటున ఎన్ని స్మృతుల సవ్వడులో
నేను రౌడీని , బాడ్ గర్ల్ ను అంటూనే బోలెడు కబుర్లు చెపుతుంది ప్రియ , తన ప్రియరాగాలు లో . ఏ రోజునైనా నా పోస్ట్ లో కామెంటక పోతుందా అని ఎదురుచూస్తున్నాను .
వాలు కొబ్బరి చెట్టుకింద నిలబడి కబుర్లు చెపుతున్నట్లే చెబుతూనే , నేతిగిన్న తో , గురూజీ ఎప్పుడు నన్ను మొట్టుతారా అని ఎదురుచూస్తూ , తనూ మొట్టికాయలు తింటూ వుంటుంది ఈ సుభద్రమ్మ . కొన్ని సార్లు మొట్టికాయలు తప్పించుకోవటానికి ఒకరికొరం సాయం కూడా చేసుకుంటూ వుంటాము , ఇది రహస్యం .
.శ్రీదేవి , కాని శ్రీదేవి అనకండి , శ్రీ అనండి చాలు . మహా భయస్తురాలు .చాలా బాగా పాడివినిపిస్తుంది మకరందం లో .
ఏదైనా బ్లాగ్ ప్రాబ్లమా ? దిగులు పడుతున్నారా ? ఐనా అండగా బ్లాగ్ గురువుండ గా దిగులెందుకు దండగా !! నాలాంటి వారందరికీ అండ , బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ జ్యోతి .
రమ్యం గా కుటీరాన రంగవల్లు లు వేస్తారు నీహారిక .
రాధిక గారు అల్లుకున్న పొదరిల్లు ఈ అందాల పిల్లన గ్రోవి .
నాస్నేహం నువ్వే , నా ప్రియ సత్ర్వు వు నువ్వే , అమ్మా హమ్మామ్మా అంటున్నారు శ్రీ .
శ్రీనిఖ భావనలు తెలుసుకోవాలంటే నా భావనలు చదవాల్సిందే .
టి .శ్రీవల్లీ రాధిక గారి కథలూ , కవితలు , మహార్ణవం లో చదవచ్చు .
నా గురించి చెప్పటం సులువు కాదు , అర్ధం చేసుకోవటం కష్టం కాదు అంటున్నారు మోహన .
ఎవరి లైఫ్ వాళ్ళది కాదా అని అడుగుతున్నారు చైతన్య .
అమ్మో సెల్ల్ ఫోన్ సెగలోస్తున్నాయి జిగీష నుండి .
" మా ఇంటి దాదా " , ఎవరు ? ఏమో ? గోదావరిని అడగాల్సిందే !
తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని. కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు , అంటూనే మంచి మంచి కవిత లను అందించారు రాధిక నా స్నేహమా లో .
ఇంకా వున్నారు . . . . .
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
మా నేస్తం ఎక్కడ :-((.. ఇలా అయితే మా నేస్తం అభిమాన సంఘం ఒప్పుకొదంతే :-)
హౌను....................... ఒప్పుకోవట్లేదంతే...................... (మంచు గారికి మద్దతుగా.....)
బావుందండి. మంచుపల్లకి గారు అలా అలిగేస్తే ఎలా జాజి పూలు విచ్చుతున్నాయండి. ఇంకా వున్నాయ్ అని చివరలో మాల గారు disclaimer పెట్టేరు.. నేస్తం లేక పోతే నవ్వులెలా పూస్తాయి బ్లాగ్లోకం లో.. :-))
బ్లాగు పూలతో మీరల్లిన కదంబ మాల మనోహరంగా ఉందండి.
nice post ...gave me a chance to see some other good blogs as well..
thank you :)
సావిత్రిని రేపు Ice Cream చేసిపెట్టమనండి.
Thankyou Mala gaaru.
Thank you Mala gaaru.
అదే చేత్తో మంచి ఫ్రూట్ సలాడ్ కూడా చేసిపెట్టమనండి సావిత్రిని.
సావిత్రి!!!!!! అన్ని కేన్సిల్ కేన్సిల్ నేను ఒప్పుకోనంతే :P
అందరూ తెలుసు గాని మకరందం శ్రీదేవి గారు ఇప్పుడే తెలిసారు :) థేంక్యూ.. నెక్స్ట్ టైం మరి కొంతమంది క్రొత్తవారు తెలుస్తారేమో చూడాలి :)
మాలగారు,
నేను ఎదురుచూస్తున్నా పోస్ట్ ఇది...చాలా చాలా బాగు౦ది..
తరువాత పోస్ట్ కోస౦ ఎదురుస్తూ....
మ౦చుపల్లకిగారు,
క౦గారు పడక౦డి...అ౦దరు వస్తారు..మాలగారు చాలా రీసెర్చి చేసి అ౦దర్ని పట్టుకున్నారు..
కొ౦చ౦ ఓపిక పట్ట౦డి..
సునీత,
నీహరిక ,
మీరు వెళ్ళ౦డి, మాలగారు సుపర్ పార్టీ ఇస్తారు..మీరు వెళ్ళుతూ మన నేస్తాన్ని కూడా తీసుకెళ్ళ౦డి అసలే పాప౦ అలకమీద ఉన్నారు..
మంచు పల్లకీ గారు ,
3g గారు ,
మరీ అలా దాడి కోచ్చేస్తే ఎలా అండీ ?
*భావన , సుభద్ర ,
అభిమాన సంఘం నుండి నన్ను కాపాడినందుకు థాంక్ యు .
అమ్మ ఒడి గారు ,
మీకు మెచ్చుకున్నందుకు సంతోషం గా వుందండి . థాంక్ యు .
*మానస చామర్తి గారు ,
థాంక్ యు .
నీహారికా ,
సునితా ,
ఎమిటండీ , ఐస్ క్రీమానండీ ??
ఫూట్ సలాడా అండీ ? అవి మాకు రావండి . అలాటి వన్ని గుంటలు చేస్తారు కదండీ . మీరు చేసి పెడి తే మేము తింటామండి .
* నేస్తం గారూ ,
అన్ని కాన్సిలేనండి . ఎందుకంటే అవేవీ మా సావిత్రి కిరావు . పకోడీలు , చెగోడీలు మాత్రం బ్రహ్మాండం గా చేస్తుంది .
చాలా ఓపికండీ. మంచి జాబితాయే తయారు చేసారు. అభినందనలు.
మాల గారు మీకు నా శతకోటి నమస్సులు :)
నా బ్లాగ్ ను ఇందులో "మధురవాణి" గారు చేర్చారు, తన కు నా ధన్యవాదాలు :-)
మాలతి గారు ,
ధన్యవాదాలండి .
* రాధిక గారు ,
సరేనండి , మీ ధన్యవాదాలు మధురవాణి కి హాండోవర్ చేస్తానండి . మరి మీశతకోటి నమస్సులు నేను తీసు కోవచ్చాండి ?
Post a Comment