Wednesday, April 28, 2010

నేనూ వెదురుపూలను చూసానుగా :-) :-) :-)
వెదురు చెట్లు నలభై సంవత్సరాల కొక సారి పూస్తాయి . ప్రస్తుతము జూ పార్క్ లో వెదురు చెట్లన్నీ పూసి , కనువిందు చేస్తున్నాయి అని పేపర్ లో చదివినప్పటి నుండి , చూడాలని మహా ఆరాట పడ్డాను . కాని సికింద్రాబాద్ నుండి , హైదరాబాద్ కు అటు చివరనున్న జూ కు , ఈ మండే ఎండల లో ఎలా వెళ్ళాలా అని దిగులేసింది . పైగా సత్యవతి గారి బ్లాగ్ లో , ఆవిడ చూసొచ్చానని , పూలు రాలి పోతున్నాయని , ఆలసించిన ఆశాభంగం అని మరీ మరీ చెప్పారు . ఎలాగా . . . ఎలా వెళ్ళటము చెప్మా ???

ఎలా ఎలా ఎలా అనుకుంటుండగానే అవకాశము రానే వచ్చింది ,ఇలా , కార్ తీసుకెళ్ళకుండా మావారు వరంగల్ వెళుతూ , ఎటైనా వెళ్ళా లి అంటే వెళ్ళిరా అని పర్మిషన్ ఇచ్చిన రూపము లో !!! ఒక్క దానిని ఎలావెళ్ళాలి ? అదో ప్రాబ్లం హుం . జయకు ఫోన్ చేసాను , అబ్బే లిఫ్ట్ చేయదే ! ప్రయత్నించగా , ప్రయత్నించగా మా మరిదిగారు లిఫ్ట్ చేసి , సెల్ ఇంట్లోనే మర్చిపోయి కాలేజ్ కెళ్ళి నట్లున్నదండీ అని చిన్నగా చెప్పారు . కింకర్తవ్యం ? మంచి తరుణం మించిన దొరకదు . పట్టువదలని విక్రమార్కిణి లా కాలేజ్ కెళ్ళాను . జయమ్మ మీటింగ్ లో వున్నారమ్మా అని ఆయా చెప్పింది . ఏం చేస్తాను ? ఎదురుచూస్తూ కూర్చున్నాను . జయ ఫ్రెండ్ కళ్యాణి చూసి , జయను పిలుచుకొచ్చింది . అమ్మయ్య ఇక టైం లేదు పద పద , జూ కెళుదాము అని తొందర చేసాను . ఆకలేస్తోందక్కా , ఇంటికెళ్ళి అన్నం తిని పోదాం అని దీనంగా మొహం పెట్టింది . సరే పద అన్నాను . అనక చేసేదేముంది .

ఎక్కడికి మేడం జూకా ? రేపెళుదాం , మా తమ్ముడు కూడా వస్తాడు అని మా డ్రైవర్ ,మహేష్ నసగటం మొదలు పెట్టాడు . ఇహ చాల్లే నడు , ఇప్పటికే బోలెడు టెన్షన్ పడ్డాను అని తొందర చేసాను . తీరా అక్కడికెళ్ళాక , అక్కడి వాళ్ళను వెదురు చెట్లు ఎక్కడున్నాయి అని అడుగుతే వెదురు చెట్లా ఎక్కడున్నాయి , జూ లో లేవు అంటారే ! ఓ పనామె ఐతే ఈ టి. వి ల్లోళ్ళు , పేపరోళ్ళు ఇంతుంటే అంత చేస్తారు ఆ బొంగు చెట్లన్ని ఎప్పుడో గింజలు రాల్చేసాయి , వాటిని కొట్టేసారు అని చావు కబురు చల్లగా చెప్పింది . అయ్యో . పోనీ లే ఇంతదూరం వచ్చాము , కనీసం ఏవో జంతువులు కనిపించక పోతాయా చూసి పోదాములే అని , జయ ఐస్ క్రీం కొనిచ్చి వోదార్చింది ! అలా తెల్ల పులిని , చిరుతను , పక్షులను చూస్కుంటూ , సుభద్ర రాజాధి రాజునంటా పోస్ట్ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ , సిమ్హాని చూసుకుంటూ , చూసుకుంటూ వెళుతూ . . . వెళుతూ . . . వుండగా , మహేష్ మేడం అని గావుకేక పెట్టాడు . అసలే ఫొటోలు తీస్తూ తెగ తంటాలు పడుతున్నాడు , ఏమైందా ఏ జంతువో కరిచిందా ఏంపాడు అని దడుచుకొని చూద్దును కదా , ఇక్కడ బొంగు చెట్టుంది మేడం అని మరో పోలి కేక పెట్టాడు . వహవా అనుకుంటూ వెళ్ళాము . కొన్ని వెదురు చెట్ల్లు , ఎండిపోయిన పూల గుత్తులతో దర్షనం ఇచ్చాయి . బహుషా పూలు ఎండిపోయినట్లున్నాయి అనుకొని వాటిని చూసే సంతోష పడిపోయాము . వాటినే కొన్ని ఫొటోలు తీసుకున్నాము . అక్కడక్కడా కాల్చేసిన వెదురు చెట్లు కనిపించాయి .

హుర్రే . . . ఇక్కడ ఒకానొక చెట్టు , ఏక్ అకేలా లా , మా కోసమే , మాకోసమే చెట్టునిండా పూల తో వయ్యారలొలక పోస్తూ ఎంత బాగుంది . అమ్మయ్యా మొత్తానికి వెదురుచెట్టు పూల తో సహా చూడగలిగాము . ఓహో ఐతే వెదురుపూల రంగే బ్రౌనన్నమాట . ఎండి పోవటము కాదు . మొత్తానికి చూసేసామోచ్ !

12 comments:

AMMA ODI said...

శ్రీశైలం అడవుల్లో చాలా కన్పిస్తాయండి. రోడ్డు వెంబడే కన్పిస్తాయి. మొత్తానికి వెదురు పూల ప్రయాస బాగుంది. వెదురు పూలంతా బాగుంది.

కొత్త పాళీ said...

cool. good for you

శేఖర్ పెద్దగోపు said...

మాలా గారూ..మీ ఆనందం పోస్ట్లో కొట్టొచ్చినట్టు కనపడుతుందండీ...ఇంతకూ జూ లోని టాయ్ ట్రైయిన్ ఎక్కారా లేదా? నాకైతే దానిలో ప్రయాణం భలే ఇష్టం ఇప్పటికీ...మొత్తానికి జయగారిని తోడుతీసుకుని మీ కోరిక నెరవేర్చుకున్నారన్నమాట...

Satyavati said...

మొత్తానికి వెదురు పూలు చూసారు.అభినందనలు.

భావన said...

Very nice Mala.. వెదురు పూల ను చూసేరు ఐతే. అవును అక్కడెక్కడీకో వెళ్ళి కొత్త కాపురం పెట్టేరు కదా మళ్ళొచ్చి ఈ వెదురు పూలను ఎప్పుడూ చూసేరు?

Srujana Ramanujan said...

:D

Good good.

మాలా కుమార్ said...

అమ్మఒడి గారు ,
శ్రీశైలం చాలా సార్లే వెళ్ళాను కాని ఎప్పుడూ చూడలేదండి . ఈసారి వెళ్ళినప్పుడు గమనిస్తాను . థాంక్సండి .

@కొత్తపాళీ గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

శేఖర్ గారు ,
జయ , టాయ్ ట్రేన్ ఎక్కుదామంది కాని , అప్పటికే చాలా ఆలశ్యం అయ్యిందని ఎక్కలేదండి ,

@ సత్యవతి గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

ఎక్కడికెళ్ళాను భావనా , సికింద్రాబాదే గా . ఎలాగూ హైదరాబాద్ కు తిరుగుళ్ళు తప్పవు కదా .

@srujana ,
thanku , thanku .

మాలా కుమార్ said...

ఎక్కడికెళ్ళాను భావనా , సికింద్రాబాదే గా . ఎలాగూ హైదరాబాద్ కు తిరుగుళ్ళు తప్పవు కదా .

@srujana ,
thanku , thanku .

సుభద్ర said...

బాగు౦ది......మొత్తానికి చుశారు...నేను ఎప్పుడు చూస్తానో అనిపిస్తు౦ది చదివాక!!!మా పొల౦లో ఉ౦డాలి నేను మా ఊరు వెళ్ళినప్పుడు చూస్తా>>>>జయగార్ని కలిశారా!!జయగారు మరినాకు హిమక్రీములు...రాజాదిరాజు మీకు గుర్తు వచ్చి౦దా.......పాప౦ కదా మగాళ్ళు అనిపిస్తు౦ది నాకు ఆ పోటో చుస్తే.......

మాలా కుమార్ said...

హిమ క్రీములు మీరీసారి వచ్చినప్పుడు ఇస్తాము లెండి . రాజాధి రాజు గారిని దూరం నుండి కుటో కూడా తీసాము . బాగా వచ్చింది కదా !