Friday, April 23, 2010
కొత్త ఇల్లూ . . . కొత్త కారూ . . . కొత్త సామానూ . . . .
ఈ సామానంతా కొని ఎన్ని సంవత్సరాలైందో . ఓ అల్లనప్పుడు , పెళ్ళైన కొత్తలో దపోడీ ( పూణే ) , యం .సి .యం లో కొత్త కాపురం పెట్టినప్పుడు , కిర్కీ మార్కెట్ లో నేను , మా వారూ , ప్రభ , జాగిర్దార్ , నలుగురము వెళ్ళి కొన్నప్పటివి .అదే పెనం , అదే ఫిల్టర్ , అవే గిన్నెలూ చూసీ , చూసీ విసుగొస్తోంది . పారేయటానికి మనసు ఒప్పదు . ఈ మధ్య పనివాళ్ళ పుణ్యమా అని కొన్ని ఎత్తుకెళ్ళారు , కొన్ని పోయాయి . ముందు బాధేసినా అమ్మయ్య కాగలసిన కార్యం గంధర్వులే తీర్చారులే అనుకొని సంతోషించాను . ఇల్లు మారేటప్పుడు , మా అబ్బాయి సామాను సద్దుతుంటే ఇవన్నీ అనూ కొన్నవీ , వాళ్ళ అమ్మాగారిచ్చినవీ , నేను ఏవో కొన్ని తీసుకుంటాను మిగితావి ఇక్కడే వుండనీయి అన్నాను . అదేమిటమ్మా అలా అంటావు ఇవన్ని నాచిన్నపటి నుండీ చూస్తున్నవే కదా అన్నాడు . స్టీల్ సామాన్లన్నీ అలాగే వుంటాయి లేరా అని పైకి , నీ చిన్నపటినుండి ఏమిటి , నా చిన్నపటినుండీ చూస్తున్నాను అని స్వగతం గా అనుకున్నాను .
పనిలో పని , పాత చీరలు కొన్ని పని మనిషికిచ్చేసాను . మిగిలిన కొద్దో గొప్పో సామానులు ట్రక్ లో వేసుకొని కొత్త ఇంటికి వచ్చాము . మా అబ్బాయి సామానులన్నీ , అన్ని రూములలో సద్దేసాడు . మేము వచ్చేసరికే మా అమ్మాయి కూడా వచ్చేసింది . పాలు పొంగించటానికి కొత్త గిన్నె , నా కొత్త కాపురానికి మరి కొన్ని కొత్త గిన్నెలు తెచ్చి , పాలు పొంగించి పాయసము చేసి , వంటిల్లంతా సద్ది పెట్టింది . రేపు నా వాగ్నార్ పంపుతాను , నీదగ్గరే వుంచుకో అన్నది . ఎందుకమ్మా , నేనెక్కడి కెళుతాను అంటే , సెలవల్లో పిల్లలని నీ దగ్గర వుంచుకుందామను కుంటున్నావు , ఆర్ యసై కి వెళ్ళా లన్నా , స్విమ్మింగ్ పూల్ కెళ్ళాలన్నా ఎలా తీసుకెళుతావు ? నువ్వైనా ఇంకా ఆటో లో ఏం వెళుతావు ? బయటకు వెళ్ళాలన్నప్పుడు డ్రైవర్ ను పిలుస్తే రోజుకింత అని తీసుకొని వస్తాడు ఐనా కార్ ఉంటే నీకేం కష్టం అంది . అవునుకదా నాకేం కష్టం ? ఉంటే గింటే , డ్రైవర్ కూ , పెట్రోల్ కూ కట్టేందుకు వాళ్ళ డాడీ కుండాలి కాని ఎంజాయ్ . అక్కా , తమ్ముడు ఇంకా కొత్త సామానులు కూడా కొన్నుక్కొస్తామని బయిలుదేరారు , కాని నేనే తెచ్చుకుంటాను అని ఆపేసాను . ఏం పిల్లలో అర్ధం చేసుకోరూ . కల్నల్ జాగిర్దార్ , ప్రభ వచ్చి , ఇల్లు చూసి . మేమింకా మీరు బూజులు దులుపుకుంటూ , సద్దుకుంటూ వుంటారనుకున్నాము . ఇల్లంతా నీట్ గా సద్దేసుకున్నారు ఎప్పటి నుండో ఇక్కడే వున్నట్లుగా సెటిల్ ఐపోయారే అని బోలెడు హచర్య పోయారు . మా పిల్లలంటే ఏమనుకున్నారు ? వాళ్ళే సద్ది వెళ్ళారు అన్నాను . ఓహో హో అందరూ పేరెంట్స్ పిల్లలతో కాపురం పెట్టిస్తే , మీ పిల్లలు అమ్మానాన్నల తో కొత్తకాపురం పెట్టించారన్నమాట అన్నారు . పని మనిషిని పంపాను వచ్చిందా అని అడిగింది ప్రభ . ఆ , మేము కార్ దిగగానే వచ్చేసేనింది . మాట్లాడు కున్నాను . ఏంతైనా పనిమనిషి ముఖ్యము కదా చాలా చాలా థాంక్స్ అన్నాను .
మరునాడు సంజు కార్ పంపింది . షాపింగ్ చేయాలంటే డ్రైవర్ ని తీసుకుపో అని పర్మిషన్ ఇచ్చింది .నాకే సొంతం గా కొత్తకార్ వచ్చిందని గొప్ప చూపించుకుందామని ప్రభను షాపింగ్ కి రమ్మన్నాను . ఎంతైనా ఓ అల్లనప్పుడు కూడా ఇద్దరమూ కలసి పూనా లో కొత్తకాపురం కోసం షాపింగ్ చేసాము కదా ! అప్పుడు , మావారు , ప్రభ చెప్పినట్లు కొన్నాను . ఇప్పుడు నా ఇష్టం లల్లా లా అనుకున్నాను . అక్కడి కెళ్ళాక కాని తెలీలేదు పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళానని . అరే మాలా జో కిరికీ మే ఖరీదానా ఓ సామాన్ నైహైక్యా ? తేరా ఐసే కైసే ఖరాబ్ హోగాయా ? మేరా తో అబ్ తక్ పడే హై . మైతో బచ్చోకో భీ దియా అని మొదలు పెట్టింది . హుస్ రామా ఏదీ కొన నీయదే . ఏది కొన బోయినా యే కాంటీన్ మే మిల్తానా వుదర్సే లేలేంగే అంటుంది . ప్లాస్టిక్ సామాన్ల షాప్ లో భయ్యా హం ఆర్మీ కే లోగ హై .హమారా పాస్ ఇత్నా పైసా నహీ రహ్తా తొడా కం కరోనా అని తెగ బేరాలాడి మొత్తానికి కాసిని డబ్బాలు కొననిచ్చిందమ్మా !షాప్ వాడు ఎక్కడ కొడతాడో నని భయపడి పోయాను . అదికాదు ప్రభా , నాదగ్గర లైటర్ లేదు , అదైనా కొందాం . అరెయార్ జల్దీ క్యా హై , కాంటీన్ సె లేలేంగే . అన్ని ఒకేసారి కొనాలని తొందరెందుకు ? చిన్నగా కొను అని సలహాలూ ! కనీసం కాస్త నిమ్మకాయ పచ్చడైనా కొననీయి తల్లీ . నేను పచ్చడులు కూడా తెచ్చుకోలేదు , రేపు ఉప్మా చేద్దామనుకుంటున్నాను , నిమ్మకాయ పచ్చడి లేకుండా ఎలా ?? అంటే ఠా ఠ్ అంది . ఇంకేం చేస్తాను ? చెవులు ఝాడించుకుంటూ వచ్చేసాను హూం .
మీఇద్దరూ రేపు మాజాంగ్ ఆడటానికి వస్తారా ? అని ఇంటికి వస్తుండగా అరుణ ఫోన్ వచ్చింది . మా ఇంట్లో ఆడుదాము , న్యూ హౌస్ వార్మింగ్ పార్టీ , ఈ వారమంతా మా ఇంట్లో నే అన్నాను . వాకే డన్ అంది . మరునాడు , వెజ్ స్ప్రింగ్ రోల్స్ , మైసుర్ పాక్ చేసాను . కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు టైపులో , స్ప్రింగ్ రోల్స్ లోకి కచెప్ లేదు , అచార్ లేదు ఎలాగో తినేసేయండి . తిన్నాక తుడుచుకోను నాప్కిన్స్ లేవు , మీ చున్నిల తో తుడిచేసుకోండి . కావాలంటే నా చున్ని కూడా అరువిస్తాను అన్నాను .. ప్రభ కాంటీన్ తీసుకెళ్ళి కొనిచ్చేదాక ఇంతే అన్నాను ( ఇంకా నయం , అనూ ఆ సెట్ ఇష్టపడి కొనుక్కుందిరా అన్నా వినకుండా , నీకు మాజాంగ్ పార్టీ లుంటాయి కావాలికదా అని ప్లేట్స్ సెట్ పెట్టాడు మా వాడు . లేకపోత చేతులలో వడ్డించాల్సి వచ్చేది ) . ఏమిటీ ప్రభ ను షాపింగ్ కు తీసుకెళ్ళావా ? హ హా అనేసారు అంతా .. నిన్న అరుణ వస్తూ , నీ న్యూ హౌస్ వార్మింగ్ కి గిఫ్ట్ అంటూ గిఫ్ట్ పాకెట్ ఇచ్చింది . లేసులు కుట్టిన ముద్దొచ్చే తెల్లటి హాండ్ నాప్కిన్స్ , కాఫీ కప్స్ సెట్ వున్నాయి . ఆ అన్నట్లు ప్రభ అప్పుడే ఇంటి నుండి నిమ్మకాయా , మామిడికాయ పచ్చడులు తెచ్చి ఇచ్చింది . ప్రేమ ఓ చక్కటి టేబుల్ క్లాక్ తెచ్చింది , కిచన్ లో పెట్టూ అంటూ . మా పిల్లలు ఆడపడుచులూ హాపీ న్యూ హౌస్ అంటూ వస్తూ పండ్లూ , వాళ్ళు వస్తున్నారని నేను ఐస్క్రీమూ తెచ్చాను . ఆ రోజు మా ఫ్రెండ్స్ కు కూడా అన్ని పండ్ల ముక్కలూ , అన్ని ఐస్క్రీంలూ కలిపి ఫ్రూట్ పంచ్ చేసి పెట్టాను . ఒక రోజు అనూ బర్థ్డే కి చేసిన పాయసం పెట్టాను . ఇంకా ఏమైనా కొనాలా , కావాలా అన్నారు అందరూ . మరి బెడ్ షీట్స్ కొనాలి అని నసిగాను .కర్టెన్సూ లేవు చూడాలి ,రేపు నేనేమి చేసిపెట్టాలో , మా ఫ్రెండ్స్ ఇంకా ఏం గిఫ్ట్స్ తెస్తారో !!!
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
అదిరిందండీ మాలా గారూ :-) :-)
i friend :D
మాజాంగ్ అంటే ఏమిటండీ?
వెజ్ స్ప్రింగ్ రోల్స్ నేర్పరూ!!!
అబ్బ.. మీ హౌస్ వార్మింగ్ పార్టీ ఎంత బాగుందో.. మరి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నారు?
miku okavela time unnatayithe miku cheppalani ishtamayithe veg spring rolls ela chestaro cheppandi.i mean oka post rayandi miku ishtamayithene. memu kuda nerchukuntamu :)
naku enduko konni patha samanulu antene ishtamu.
చాలా బాగుందండి మాలాకుమార్ గారు,ఇదంతా మీరు పక్కనుండి చెప్తుంటే వింటూ ఊ కొడ్తున్నట్టుంది.
(ఇది ఒక టపాగా రాద్దామనుకున్నా ,కానీ నాబద్దకం మన బ్లాగర్లలో చాలామందికి తెలిసిందే కాబట్టి ఇక్కడే..)
మొన్నీమధ్య మాక్కాస్త తెలిసినవాళ్ళు షాపింగ్ చేస్తూ నాకో చోట తగిలారు.ఆయన తన తల్లితండ్రులకు ఇలాగే చాలా సామాను కొనిపెడుతూ,ఆయాసపడుతూ,మధ్యలో దమ్ముకొట్టేందుకు వచ్చి కలిసాడు.యేంటండి చాలా షాపింగ్ చేస్తున్నారు అంటే,అవునండీ అమ్మానాన్నలను...లో జాయిన్ చేస్తున్నాను,పొద్దుట్నుంచీ ఇదే పని అన్నాడు.ఆ చుక్కల్లోది ఫలానా వృద్దాశ్రమం.
మొన్నామధ్య మీ బ్లాగులో వైజాగ్ రైల్వేస్టేషన్ లో కందిపొడి గురించి రాసారు.అదీ1974?అన్నారు మీరు.ఇవ్వాళంతా బొగ్గుపొడండి,మా యిళ్ళూ వాకిళ్ళూ,నీళ్ళూ నిప్పులూ అన్నీ బొగ్గుమయం.హా! నా సుందరవిశాఖా !!!
naakkudda mi intiki vachcheyalani undi :)
:D Njoy chestunnaru ga...
మురళి గారూ ,
థాంక్స్ అండి .
# నీహారిక గారు ,
మాజాంగ్ అంటే కార్డ్స్ లా వక చైనీస్ గేం . నలుగురు ఆడతారు . కార్డ్స్ లాగా ప్లాస్టిక్ టైల్స్ వుంటాయి .
ఇక స్ప్రింగ్ రోల్స్ తప్పకుండా నేర్పుతానండి . చాలా సులభం , రత్న దీప్ సూపర్ మార్కెట్ లో ఫ్రోజన్ వి దొరుకుతాయి తెచ్చుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే !
# స్వప్న గారూ ,
మీరూ నేర్చేసుకున్నారు కదా ?
నాకూ పాత సామానులంటే ఇష్టమే నండి . కాని ఈ స్టీల్ గిన్నెలున్నాయి చూసారు నలభై ఏళ్ళనుండి అవే వాడీ వాడీ బోర్ కొట్టేసిందండి . అందులోనూ పూనా స్టీల్ మహా గట్టి .
మంచి ఫర్నీచర్ వగైరా ఐతే ఆంటిక్ లా బాగుంటాయి .
thank you srujana .
# శ్రీలలిత గారు ,
పార్టీ కేం భాగ్యమండి . మీరు మంచి గిఫ్ట్ తీసుకొని ఎప్పుడొస్తే అప్పుడే పార్టీ ఇస్తాను .
# రాజేంద్ర కుమార్ గారు ,
అయ్యో మీరు పొరపడ్డారండి . మేము వచ్చింది వృద్దాశ్రమానికి కాదు , ఆర్మీ ఆఫీసర్స్ క్వాటర్స్ కి . కొన్ని రోజులు ఫ్రీ గా వుందామని , ఎంజాయ్ చేద్దామని మా పిల్లలని ఒప్పించి ఒక సంవత్సరము సెలవ తీసుకొని వచ్చామండి బాబూ . పాపం ఎప్పుడో కట్టినవి కదా అందుకని మా ఇల్లు పాత ఇల్లులా కనిపించి వుంటుంది లెండి .
వైజాగ్ అంతా బొగ్గు మయమై పోయిందా చొ చ్చో .
నేస్తం గారు ,
నవ్వటము కాదు , ఈ సారి మీరు ఇండియా కి వచ్చినప్పుడు , మా ఇంటికి తప్పకుండా రండి .
#సుజ్జి ,
నేను ఎంజాయ్ చేస్తున్నానని కుళ్ళు కోవటము కాదు , మా ఇంటికి రా నువ్వూ ఎంజాయ్ చేద్దువు కాని .
కొత్తకాపుర౦ ఎన్ని సార్లు అయినా బాగు౦టు౦ది....
కాని ఏమి లేవు అనుకు౦టేనే లాగి౦చేస్తాము....అన్ని అమిరాక ఏమి లేకపోయినా నడవదు..
ఎ౦జాయ్ మీరు మీ ప్రె౦డ్స్...నాకు తెలుసు మీ ప్రె౦డ్స్ తో ఆడేఆటలు..నాకు మీరు ఆడుతున్నాప్పుడు చెప్ప౦డి..గురుజీకి ఉప్పు అ౦ది౦చేస్తా..ఖుబ్ సారే తినోచ్చు ఠక్క్కు ఠక్కు లు...నేను వచ్చునప్పుడు మీ ఇ౦టికి వచ్చి నేను ఓ హ్య౦డ్ వేస్తాను.. బాగు౦ది కొత్త ఇల్లు ముచ్చట్లు..
॒లలితగారు మీరు తప్పక వెళ్ళి కొత్తకాపుర౦ కదా వీలుసాలు నేర్పిర౦డి మన మాలగార్కి...
సరె సరె అలాగే రండి . మీకోసమే వేటింగూ .
Post a Comment