Friday, April 10, 2009

పాటల సందడి - అడుగడుగున గుడి ఉంది

పాట వింటూ చదవండి..

అడుగడుగున గుడి ఉంది
అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది
అదియే దైవం.....

అడుగడుగున

ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ
ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన
మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి
తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున

తల్లీ తండ్రీ గురువు పెద్దలు
పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు
తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం
ప్రతి పులుగు ఎగిరే దైవం...

అడుగడుగున

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా.
గానం : పి.సుశీల
రచన :దేవులపల్లి కృష్ణశాస్తి


ఈ రోజుల్లో పిల్లలకు మంచి మాటలు చెప్పడం కరువైపోయింది. అసలు పిల్లలకు వినే ఓపిక, సమయం కూడా ఉండడం లేదు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పోకడలు.. అలాగే మన సమాజంలో కూడా విలువలు మారిపోతున్నాయి. పొద్దున్నే లేవడము, స్నానం చేసి దైవప్రార్ధన చేసి బొట్టు పెట్టుకోవడము, పొందికా వగైరా ఏవీ పట్టింపు లేకుండా పోతుంది. పెద్దవాళ్లు చెప్పినా అది చాదస్తం కింద కొట్టేస్తున్నారు. గుడి ,చర్చి, మసీదు, కులాలు, కుమ్ములాటలు అని విబేధాలు మరోవైపు.. అందుకే పిల్లలకు చిన్నప్పటినుండే సరైన పద్ధతులు నేర్పించాలి. దేవుడు ఒక్కడే! ప్రతి మనిషిలో గుడి ఉంది. అతను ఒక నడిచే దైవం. ప్రతి పులుగు ( పక్షి ) కూడా ఎగిరే దైవం, ఇల్లూ వాకిలి, శరీరం అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. మనస్సులో చెడు ఆలోచనలు లేకుండా కడిగిన మంచులా, స్వచ్చమైన మల్లెపూవులా ఉండాలి, పెద్దలను, తల్లి తండ్రులను, పిల్లలను కూడా పూజించాలి.. గౌరవించాలి అని నేర్పించాలి. ఈ మాటలు అలనాడు దేవులపల్లిగారు అందమైన పాటలో చెప్పారు... మహానుభావులు.

ఇక నా పాటల ప్రయాణంలో మరో మజిలీ ... కమ్మటి కలలు.. పదండి వెళదాం...

12 comments:

జ్యోతి said...

మాలగారు, నిజంగా కృష్ణశాస్త్రిగారు మంచి మాటల పాట మనకందించారు. ఇవి పిల్లలకు నేర్పడం మన బాధ్యత..

మధురవాణి said...

సాహితీ గారూ..
నాకు తెలియని ఒక మంచి పాటని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
కృష్ణ శాస్త్రి గారి సాహిత్యాన్ని మెచ్చుకోకుండా ఉండగలమా.?

పరిమళం said...

మాలగారు,కృష్ణ శాస్త్రి గారి పాటని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

మరువం ఉష said...

మాల గారు, మంచి పాట, మునుపు విన్నదే అయినా సాహిత్యమంతా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నడిపే తెలుగు బడి పిల్లలకి నేర్పుతాను.

మాలా కుమార్ said...

జ్యొతి గారూ,
థాంక్ యు..

మాలా కుమార్ said...

మధురవాణి గారూ,
నిజంగా మీకు తెలియని పాటా .వావ్
మీ బ్లాగ్ లొ పాటలు చూసే నేనూ కమ్మటి కల అని పాటల బ్లాగ్ చేసుకున్నాను.థాంక్ యు.

మాలా కుమార్ said...

పరిమళం గారూ,
మీకూ ధన్యవాదములు

మాలా కుమార్ said...

ఉష గారూ,
థాంక్స్ అండి.
మీరు తెలుగు బడి నడుపుతారా?చాలా మంచి పని.అభినందనలు

Srujana Ramanujan said...

A very meaningful song. That's all I can say.

మాలా కుమార్ said...

thank you srujanaa

Uyyaala said...

మీ బతుకమ్మ టపాని చదివిన తర్వాత ఈ పాత మధురాలను ఆస్వాదిద్దామని వచ్చాను. పాట వింటూ చదవమన్నారు. కానీ వింటుంటే చదవడానికి వీలు కాలేదు. చదువుతుంటే వినడానికి వీలు కాలేదు. ఆతరువాత ఎలాగో అయిడియా వచ్చి రెండు టాబ్ లు ఓపెన్ చేసి వింటూ చదివాను. చాలా ఆహ్లాదంగా అనిపించింది. అయితే "ప్రతి పురుగూ ఎగిరే దైవం " అన్న వాక్యంలో పురుగు అన్న పదం కాస్త డిస్టర్బ్ చేసింది. మళ్ళీ వింటే అది పురుగు కాదు పులుగు అని స్పష్టమయింది. పులుగు అంటే పక్షి అని అర్ధం ! అట్లాగే మరికొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లు : బ్రాకేట్లోవి ఒప్పు . వాకిలు (వాకిలి), గురువూ (గురువు), తెరలు (తెరలూ). చాలా మంచి పాటను గుర్తు చేసారు. ....మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి .... ఎంత అద్భుతమైన వర్ణనో కదా.!

మాలా కుమార్ said...

ప్రభాకర్ మందార గారు ,
శ్రమ తీసుకొని వివరించారు. చాలా థాంక్స్ అండి .
ఇప్పుడు ఆ తప్పులు దిద్దానండి .