Wednesday, February 8, 2017

ఏడేళ్ళ బంధం ఇంతటితో సరి!


మనుషులు మమతలు అంటారు కాని, మనుషులతోటే కాదు, మొక్కలు, వస్తువులు, యిల్లు, ఊరు అన్నింటి తోనూ కొద్దికాలం కలిసి ఉంటే చాలు వాటి మీద బోలెడంత మమత పెరిగిపోతుంది.అవి ఏవి వదిలేయాలన్నా ఎంత ధుఖం వస్తుందో.:( కాని తప్పదు .
దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మా మనవడి మీద పంతం తో కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు, నాకు మా మనవడి కి, మనవరాలికి అందరికీ కలిపి షేరింగ్ ఆటోలా ఒకే లాప్ టాప్ ఉండేది.ఓ సంవత్సరం తరువాత, మా ఏమండీ ఎవరికోసమో లాప్ టాప్ తెస్తే , ఆ సత్తెకాలపు సత్తయ్య తీసుకోలేదు.అప్పటి కి మా అబ్బాయికి నేను కంప్యూటర్ వాడగలను అని నమ్మకం వచ్చి,నాకు బ్లాగ్ వ్రాసుకోవటము కోసం విడిగా లాప్ టాప్ అవసరం అనిపించి, ఈ లాప్ టాప్ , మా ఏమండీ నాకు ఇస్తుంటే తీసుకోమని పర్మిషన్ ఇచ్చాడు :) కాకపోతే నేను గ్రీటింగ్ కార్డ్స్ కోసం అన్నీ డౌన్లోడ్ చేసి లాప్ టాప్ పాడు చేస్తున్నానని కోపం పడుతూనే ఉన్నాడు.ఎట్లాగో ఎక్కువ రిపేర్ లు లేకుండా కొద్దిపాటి వాటి తో నెట్టుకొస్తున్నాను.రెండు నెలల నుంచి ఎంత వైధ్యం చేయించినా మొరాయిస్తోంది.ఆ మధ్య యు.యస్. వెళ్ళి నప్పుడు ఇంకెన్ని రోజులు అది వాడుతావు అని కొత్తది ఇచ్చాడు. అంతకు ముందూ రెండు తెచ్చి ఇచ్చాడు.ఒకటి మా ఏమండీ కి ఇచ్చేసాను. ఒకటి మా వలలి కూతురుకు ఇచ్చాను.మొన్న తెచ్చింది నేను వాడటం లేదని ఆఫీస్ లో ఇచ్చేసాడు.ఎన్ని వచ్చినా దీనిని వదలని అటాచ్మెంట్ దీని మీద. ఇక తప్పలేక, కొత్తది అంటే ఎన్ని ఇచ్చినా వాడలేదు ఇవ్వను పో అంటాడేమో నని కోడలి కి అర్జీ పెట్టుకున్నాను :) మావాడు వస్తూ కొత్తది తెచ్చాడు.నిన్న రాత్రి నాకు హాండోవర్ చేసాడు. కొత్తది ముద్దుగా ముచ్చటగా ఉంది కాని, దీని వదలాలంటే, ఇదే దీని మీద చివరిసారిగా వ్రాయటం అంటే చాలా దిగులుగా ఉంది :) ఏడుపొస్తోంది :(  ఇక బై చెప్పక తప్పదు :( ఏడు సంవత్సరాల బంధం మరి :(

ఇది నేను నా కంప్యూటర్ క్లాస్ మీద రాసుకున్న పోస్ట్ :)

9 comments:

sarma said...

ఆరేళ్ళ బ్లాగు బంధం కోసం మూడు కంప్యూటర్లకి...... భవబంధాలు గట్టివండి... :)

HIMAJA PRASAD said...

7ఏళ్ళ నుండీ అచ్చొచ్చినదాయె..పైగా బ్లాగుప్రాశన కూడా ఆ కంప్యూటరు మీదనేనాయె. మరి ఆ మాత్రం అనుబంధం ఉంటుందికదా!

Anonymous said...
హమ్మయ్య ! కంప్యూటరె అన్న మాట !

మీరూ బ్లాగ్లోకానికి బాయ్ అంటున్నా రేమో అనుకున్నా :), ఏడేళ్ళ బంధం సరి అంటే నూ :)

చీర్స్
జిలేబి

Lalitha TS said...

బాధే కానీ -
పాతది పోనీండి - కొత్తది రానీండి
ఏదేమైనా బ్లాగు మాత్రం కొనసాగనీయండి 💐


మాలా కుమార్ said...

శర్మగారు అవునండి.

మాలా కుమార్ said...

హిమజా ప్రసాద్ గారు థాంక్స్ అండి.

మాలా కుమార్ said...

జిలేబీ గారు,
బ్లాగ్ కు బై లేదండి :)

మాలా కుమార్ said...

లలిత గారు,
బ్లాగ్ కొనసాగించాలనే ఉందండి. అందుకే మళ్ళీ ఈ మధ్య అప్పుడప్పుడు పోస్ట్ లు వేస్తున్నాను.థాంక్స్ అండి.

Chandrika said...

నేను కూడా జిలేబి గారి లాగే టపా పేరు చేసి ఎవరో బ్లాగులు ఆపేస్తున్నారే అని అనుకుని బాధ పడుతూ టపా తెరిచాను :) . మీ బ్లాగు బావుందండీ.