Friday, February 10, 2017

ముచ్చటైన పేరు

ముచ్చటైన పేరు
ముచ్చటైన మూడక్షరాల పేరు "కమల " అని మా అమ్మ మురిపెంగా పెట్టుకుంది.నాకూ నా పేరు చాలా ఇష్టం.మానుకోట లో,నన్ను ఐదో తరగతి లో మా నాన్నగారు చేర్చినప్పుడు మా అమ్మాయి రాణీ లా ఉండాలి(అది ప్రతి నాన్నా కోరుకునేదేగాఅనుకున్నారో ఏమో "మాడపాటి.కమలా రాణిఅని రిజిస్టర్ లో వ్రాయించారు . తరువాత ఏడో తరగతి వరంగల్ లోనూఎనిమిది బూర్గుంపాడులోనూ పైన తొమ్మిది మళ్ళీ వరంగల్ లోనూ మాడపాటి.కమలారాణి"లాగే వెలిగిపోయాను.పది నాగార్జున సాగర్ లో చేరేటప్పుడు మరి  క్లర్ కు రాణి నచ్చలేదేమో "మాడపాటి.కమలాదేవి"చేసిపారేసాడు.యస్.యల్,సి సర్టిఫికేట్ వచ్చేవరకూ రాణి ని దేవి అయ్యాను అని గమనించనేలేదు!ఇక స్కూల్ లో మా లెక్కల మాస్టారు అభిమానం గా మాడపాటీ అని పిలేచేవారు.పదిపదకొండులో అలా మాడపాటి గా సెటిలై , యస్.యల్.సి లోనూపి.యు.సి లోనూ "మాడపాటి కమలాదేవి"తో బయట పడ్డాను.
బియే ఫస్ట్ ఇయర్ కు ఇంచక్కా పెళ్ళిచేసుకొనిపూనా వాడియా కాలేజ్ లో చేరాను.సెకండ్ ఇయర్ కు ఏమండీ కి సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ కాగాపూనా యూనివర్సిటీ వాళ్ళు " మాడపాటి కమలాదేవి పరచఅని  సర్టిఫికేట్ చేతిలో పెట్టారు!దేవుడా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి "మాడపాటికమలాదేవి పరచఅని బియే సర్టిఫికేట్ పుచ్చుకున్నాను.అమ్మయ్య  తరువాత కొన్ని సంవత్సరాలు ఊపిరిపీల్చుకొని , బరోడా హోంసైన్స్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యేట్ సి.డి డిప్లమాలో చేరాను. చదువు పూర్తై హైదరాబాద్ వచ్చాక "మాడపాటి.కమలాదేవి పరచ కుమార్ " అని మహరాజాయూనివర్సిటీ వాళ్ళు ధీర్ఘమైన సర్టిఫికేట్ ను పోస్ట్ లో పంపారు.
సరే పాస్పోర్ట్ లో ఏమండి "పరచ.కమలాదేవి "అని వ్రాయించారు.
నా పెళ్ళైన కొత్తల్లో మా ఏమండీ కమల అన్నపేరు ను ముద్దు పేరు గా ఎలా మార్చాలా అని మద్రాస్ మెరీనా బీచ్ లో ఆలోచించారు.ఏమండీ ఏది చెప్పినా నాకు నచ్చలేదుఎలానా అని ధీర్గంగా ఆలోచిస్తూ బీచ్ అంతా అచార్లూ పచార్లూ చేస్తుండగా అవునూ తెలుగు అక్షరాల నుంచే ఎందుకు ఇంగ్లీష్ అక్షరాల నుంచి కూడా మార్చొచ్చుగా అని కే  తీసేసి "మాలఅని నామకరణం చేసారు.అది నాకూ బ్రహ్మాండంగా నచ్చటం తో నేనూ వాకే అనేసాను.కాపురం మొదలుపెట్టాక , ఫ్రెండ్స్ అంతా మిసెస్.కుమార్ అనటం మొదలుపెట్టారు.పేరు తో పిలవటం మర్యాద కాదట!మా లేడీస్ క్లబ్ లో చాలా మంది మిసెస్.కుమార్ లు ఉండటం తో నన్ను మిసెస్.మాలాకుమార్ చేసేసారు.
 రకంగా చాలా ఏళ్ళు గడిచాకనేను కంప్యూటర్ నేర్చుకున్నప్పుడుమా సర్ నాకు మేయిల్ ఐడి చేసేందుకు కమల పేరు తో కొట్టగా చాలా మంది వచ్చారు.సరే నని మాలాకుమార్ బాగుంది మేడం అది రాద్దాం అన్నారు.వాకే.దీనిదుంపతెగ మాలా కుమార్ కూడా చాలా మంది ఉన్నరని గూగులమ్మ ఒప్పుకోదే!చివరికి మాలాపికుమార్ ఒప్పుకుంది!అలా బ్లాగ్ లల్లోకి మాలాపికుమార్మాలాకుమార్ గా వచ్చాను.మా కోడలు ఫేస్బుక్ ఎకౌంట్ ఓపెన్ చేస్తూ కమల అంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా కలవచ్చు ఆంటీ కమల అని రాయనా అంది సరే కాని కొద్దిసేపుమాడపాటి రాయాలా , పరచా రాయా అని అలోచించి పతివ్రతా సెంటిమెంటల్ గా "కమల పరచఅని కోడలితో నామకరణం చేయించుకున్నానుఫ్రెండ్స్ లల్లో "మాల", ఇంట్లో "కమల",బ్లాగ్ లో"మాలాకుమార్", ఫేస్బుక్ లో"కమల పరచగా సెటిలైపోయా అమ్మయ్య.

శుభంఇక నా పేరు గురించి చింతలేదు అనుకొంటే జ్యోతమ్మా ఇదేమిటమ్మా  "డిఎక్కడి నుంచి తగిలించావు తల్లీ!.నా మొహం డి.కమల పరచ ఏమిటిపోనీ తగిలించేదానివి , డి పక్కన ఆర్ తగిలించినాఏదో ఇన్నేళ్ళుగా మాలిక , చిత్రమాలిక లో ఆర్టికల్స్కథలూ రాస్తున్నానని కరుణించి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారని ఘనంగా చెప్పుకునేదానిని.ఇదేమి న్యాయం ?  జ్యొతి హనీ మూన్ నుంచి ఎప్పుడు తిరిగి రావాలిమాలిక లో నా ఆర్టికల్ పక్క నుంచి  "డిని ఎప్పుడు తొలిగించాలి?

4 comments:

Latha Reddy said...

కమల,మాడపాటి కమలారాణి,మాడపాటి కమలాదేవి,మాడపాటి కమలాదేవి పరచ,మాడపాటి కమలాదేవి పరచ కుమార్,పరచ కమలాదేవి,మాల,మిసెస్.కుమార్,మిసెస్.మాలాకుమార్,కమల పరచ,డి కమల పరచ......మీ పేర్లు (బహు)బాగు.మీ పేర్లే మీకు మాలలు అని నేనంటే మీరేమంటారు మాలగారు?మీ టపాలు నేను అన్ని చదువుతాను,ఫస్ట్ టైం కామెంటడం,మీ టపాలు చాల చాల నచ్చుతాయి.

Lalitha TS said...

కొత్తగా చేరిన 'డీ' కూడా బావుందండి - పలు పేరుల మాల కలిగిన మాలాకుమార్ గారు! - మీ ఏమండీ కి ప్రాసగా 👌

మాలా కుమార్ said...

లలితా రెడ్డీగారు,
నా పేర్లన్నీ ఎంత ఓపికగా మాల అల్లారండి :) మీ కామెంట్ కు థాంక్స్ అండి. మీరు మళ్ళీ మళ్ళీ నా బ్లాగ్ కు రావాలండి :) థాంక్ యు.

మాలా కుమార్ said...

లలిత గారు,
అలా వచ్చారా :) వాకే థాంక్ యూ.