Thursday, February 9, 2017

బ్లాగ్ మితృల తో ఓ చల్లని సాయంకాలం






చాలా రోజుల తరువాత ఈ మధ్య బ్లాగ్ ఓపెన్ చేసాను.ఓకటి రెండు పోస్ట్ లు వేసాను.వాటికి ఇంకో ఒకటి రెండు కామెంట్స్ మేయిల్ లో వస్తే , వాటిని పబ్లిష్ చేసినప్పుడు  ఎంత హాపీగా అనిపించిందో! తీర్థం లో తప్పిపోయి , మళ్ళీ ఇల్లు చేరుకున్న ఫీలింగ్ వచ్చింది :)
2008 డిసెంబర్ లో బ్లాగ్ స్టార్ట్ చేసాను.అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ , ఆదివారం అనుబంధం లో అరుణ పప్పు బ్లాగ్ ల గురించి వ్రాశిన ఆర్టికల్ వచ్చింది.అది మా చెల్లెలు నాకు చెపితే చదివాను.అందులో బ్లాగర్స్ గ్రూప్ గురించి వ్రాసింది.వెంటనే నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను.ఫిబ్రవరీ ఫస్ట్ వీక్ లో అనుకుంటా కృష్ణకాంత్ పార్క్ లో బ్లాగర్స్ మీటింగ్ జరిగింది.దానికి నేను మా హెల్పర్ శారదను తోడుతీసుకొని వెళ్ళాను.పార్క్ గేట్ దగ్గరే బ్లాగర్స్ మీటింగ్ బానర్ కనిపించింది.అమ్మయ్య అనుకున్నాను.ఎక్కడ వెతకాలా అని టెన్షన్ పడుతుంటే ( అసలు రావటమే ధైర్యం చేసి, మా అబ్బాయి బలవంతం తో వచ్చాను ) ఎదురుగా ఒక అబ్బాయి బ్లాగర్ టీ షర్ట్ వేసుకొని కనిపించాడు.నాకు మాట్లాడే ధైర్యం లేక అడగమని శారదను పంపాను.అతను పాపం మర్యాదగా మాట్లాడి నన్ను తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు.ఆ తరువాత అతను అతని భార్య నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు .మా ఇంటికి కూడా వచ్చారు చక్రవర్తి, స్వాతి వాళ్ళ పేర్లు.ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు , ఏమేమి మాట్లాడారు గుర్తులేదు :)
ఇదే బ్లాగర్స్ తో నా ఫస్ట్ మీటింగ్ ఫొటో :)ఇది నా కొత్త లాప్ టాప్ తో మొదటి పోస్ట్ :)

1 comment:

Lalitha said...

ఇలాంటి పోస్టులు మీరింకెన్నో రాయాలని కోరుకుంటూ - కొత్త లాప్టాప్ లో ప్రథమపోస్టు శుభాభినందనలు!