Wednesday, March 28, 2012

శ్రీలలితగారికి అభినందనలు

'శ్రీలలిత' బ్లాగర్ శ్రీలలిత గా పరిచయమైన జి. యస్. లక్ష్మి గారు మంచి రచయిత్రి , కవియిత్రి . ఆవిడ కథలు , నవలలు అడపాదడపా వివిధ పత్రికల లో కనిపిస్తూనే వుంటాయి.ఈ మద్యే విడుదలైన నెట్ మాగజీన్ మాలిక లో జి. యస్ లక్ష్మి గారి కథ "అమ్మగారి కీ దండం పెట్టు" ప్రచురించారు . ఏ టాపిక్ ఇచ్చినా కొద్దిసేపట్లోనే చక్కని కవిత అల్లగలరు .ఆవిడ రచయిత్రే కాదు , బాగా ఎంబ్రాయిడరీ చేస్తారు . మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ చేస్తారు .చక్కగా మట్లాడుతారు .అసలు కోపమన్నదే తెలియదు . ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణం లోనే చూస్తారు . ఇన్ని రోజుల నుండి ఆవిడతో స్నేహితమున్నా ఈ మంచి గుణాలను నేను మటుకు నేర్చుకోలేదు .కాకపోతే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు , ఇదే శ్రీలలితగారైతే ఏమి చేస్తారు అనుకొని కొంచం కంట్రోల్ మటుకు చేసుకుంటున్నాను :)

ముపై సంవత్సరాల క్రితం అప్ప్డప్పుడే ఆడపిల్లలు చదువుకొని , వుద్యోగాలలో ప్రవేశిస్తూ , సొంత వ్యక్తిత్వం ను పెంచుకునే ప్రయత్నం చేసే రోజులు . కాకపోతే వొకరకంగా అటు వ్యక్తిత్వను కాపాడుకోవటానికి , లొంగిపోవటానికి మద్యలో వుండే సంధికాలం అది అనుకోవచ్చు .అదో ఆ కాలం లోనే అతనికి ఆమె కు వివాహమైంది .తనను భద్రం గా చూసుకుంటాడనే నమ్మకం తో అతని చిటికిన వేలు పట్టుకొని అతని జీవితంలోకి వచ్చింది ఆమె . అతను భద్రం గానే చూసుకున్నాడు కాని ఆమె తన మాటవిన్నప్పుడే ! ఆమె అభిప్రాయలకు , ఆశలకు విలువ ఇవ్వలేదు . చివరకు కూతురి కి నామకరణం కూడా అతని ఇష్టప్రకారమే జరిగింది . అప్పుడే ఆమె మనసు చితికిపోయింది . నిర్లిప్తంగా వుండటం అలవాటు చేసుకుంది .వారిద్దరూ ఇలా ప్రతికూల భావనలతో వుండగానే తల్లీ తండ్రి చనిపోయారు . అక్కలు వాళ్ళ వాళ్ళ కుటుంబాల తో బిజీ ఐపోయారు . తమ పిల్లలిద్దరూ పెద్ద చదువులకొచ్చారు . వాటితో తమ తమ ఇష్టాలన్నీ అడుగున పడిపోయాయి .ఈ గడిచిన కాలం లో పిల్లల దృష్ఠి లో తండ్రి దుర్మార్గుడిగా తల్లి పట్ల సానుభూతి ఏర్పడ్డాయి.కొడుకు గోపాలం ఉద్యోగం లో చేరి అమ్మకు కల్పతరువైనాడు .అమ్మ కోరికలన్నీ తీర్చసాగాడు . ఆమెకు కొడుకే సర్వస్వం అయ్యాడు .ఇప్పుడు భార్య ను ఎంత మంచి చేసుకుందా మనుకున్నా , ఆమెను ఎంతబాగా చూసుకున్నా ఆమె లో ఉదాసీనత చోటుచేసుకుంది . ఆ పరిస్తితులలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది .తనను అపురూపంగా చూసుకుంటూ సేవలు చేసిన భర్త గురించి ఆమెలో ఆలోచన మొదలైంది . తను భర్తను చేసిన నిర్లక్యం గుర్తుకు వచ్చి పశ్చాతాపం కలిగింది . పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు
పిల్లలు వారి వారి కుటుంబాలు వారికి వుంటాయి . కడదాకా వుండేది తామిద్దరేకదా ! మళ్ళీ ఒక్కసారి ఈ జీవితం వెనకకి వెడితే ఎంత బాగుండును . అలా జరిగితే ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను కదా అని భాధ పడుతుంది ఆమె. చివరకు ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు .
ఈ కథ ఈ రోజు వచ్చిన "నవ్య" వార పత్రిక లో జి.యస్. లక్ష్మి గారు వ్రాసిన "అతను...ఆమె...కాలం" అనే కథ నవ్య వీక్లీ ఉగాది కథల పోటీలో విశేష బహుమతి పొందిన కథ గా ప్రచురితమైంది .
భార్యా భర్తలన్నాకా పొరపొచ్చాలు రాకుండా వుండవు . ఎన్నో అభిప్రాయ బేధాలుంటాయి . అంత మాత్రాన పది మందిలో ఒకరి నొకరు అవమానపరుచుకోకూడదు. ఇరువురి మద్య అవగాహన వుండాలి అని చక్కగా చెప్పారు రచయిత్రి . వీరిద్దరి మద్య వున్న అభిప్రాయ బేధాలు , సంఘర్షణ , చివరికి పశ్చతాపం బాగా వివరించారు .కథ మొత్తం ఇద్దరి స్వగతం లోనే సాగుతుంది . వారి వారి భావాలు , అందుకు గల కారణాలు చదువుతుంటే నిజమే కదా ఈ పరిస్తితులలో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు అన్నంత సహజం గా రాసారు రచయిత్రి . ఇదులో నాకు చాలా నచ్చింది . ఆమెకు ఆమె పెళ్ళిలో అమ్మమ్మ చెప్పిన ;

"పిల్లా...చూడు...ఇప్పుడుమీరిద్దరూ అంటుగట్టిన మొక్కల్లా ఒకటయ్యేరు . రేపొద్దున తల్లి చెట్టు నుంచి ఈ అంటుని వేరు చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు . మీ చెట్టు మూడు పువ్వులూ ఆరు కాయలవుతుంది . మీ చెట్టు కొమ్మే ఇంకో చెట్టుకు అంటవుతుంది . వాళ్ళ వేళ్ళు కత్తిరించుకొని వాళ్ళూ విడిగా పెరుగుతారు .

పైతరం వెళ్ళిపోయినా , తరువాతి తరం విడిపోయినా మీ బంధం మాత్రం మీ జీవిత కాలం వుంటుంది . మీరిద్దరూ ఒకరికొకరు . అంతే. మంచైనా , చెడైనా , కష్టమైనా సుఖమైనా మీరిద్దరూ కలిసి అనుభవించాలి . అదే కాపురమంటే ."

ఈ మాటలు అక్షరాల సత్యం . దంపతులు ఎవరైనా తెలుసుకోవలసినవి .
ఈ కథ వెనుక కథ కూడా ఆసక్తికరం గా వుంది . ఓసారి లక్ష్మిగారు ఎవరింటికో ఫంక్షన్ కు వెళ్ళారట . అక్కడ భార్యాభర్తలకి బట్టలు పెట్టాలి అంటే ఇద్దరూ చెరోచోట వున్నారట. ఆయనను పిలవమంటే ఆయనరాడు అని ఆవిడ పెడసరం గా అన్నదిట.ఎందుకు ఆవిడ అలా మాట్లాడింది అనుకొని లక్ష్మిగారు చాలా అలోచించారుట. అప్పుడు ఇలా ఐవుండవచ్చు అన్న ఐడియా వచ్చి వెంటనే ఈ కథ రాసేసారుట . ఎంతైనా చేయితిరిగిన రచయిత్రికదా!అందుకే పెద్దలన్నారు " రవి కాంచని చోటు కవి కాంచును " అని .

శ్రీలలితగారూ ( జి.యస్ . లక్ష్మిగారూ ) మీరిలాగే చాలా గమనించి , మాకు మంచి మంచి కథలు అందివ్వాలని , ఇంకా ఇంకా బహుమతులు అందుకొని మాకు పార్టీలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి . అన్నట్లు లక్ష్మి గారికి ఓసారి ఓ 100 గజాల ప్లాటూ , ఇంకోసారి ఓ బంగారం గొలుసూ బహుమతులుగా వచ్చాయండోయ్ !

23 comments:

జ్యోతి said...

ఏంటి వందగజాల ఫ్లాటు, బంగారు గొలుసు బహుమతిగా వచ్చిందా?? ఎప్పుడు ఎక్కడ ఎలా?? ఐతే లలితగారు పార్టీ ఇవ్వాల్సిందే.. ఎండలు ముదరకముందే డిసైడ్ చేయండి వచ్చేస్తాం.

SRRao said...

శ్రీలలిత గారికి మీ ద్వారా శుభాభినందనలు మాల గారూ !

జ్యోతిర్మయి said...

లలితగారికి అభినందనలండీ..మాలాకుమార్ గారూ మీరు పరిచయం చేసిన విధానం బావుంది.

సుజాత వేల్పూరి said...

శ్రీలలిత గారి భావ వ్యక్తీకరణ చాలా లోతుగా ఉంటుంది. ఈ కథ నేను చదివాను కానీ మన శ్రీలలిత గారిదని తెలీదు. మంచి కథ!

శ్రీలలిత గారూ, మీరు మరెన్నో మంచి కథలు రాసి మాకు అందించడమే మాకు ఇచ్చే పార్టీ! అభినందనలు

సి.ఉమాదేవి said...

ఇంత చక్కటి కథను అందించిన లక్ష్మిగారికి శుభాభినందనలు.మాలకుమార్ గారు మీ సత్వర స్పందన అమోఘం.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

మాలగారికి,

ఆవిడ ముఖతః తెలియదు గానీ మీ మూలాన ఆవిడ,మీరు కూడా ఆత్మీయులు . కధ,కధనం కూడా చాల బావున్నయి

సిరిసిరిమువ్వ said...

లలిత గారికి శుభాభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni said...

శ్రీ లలితా గారు.. అభినందనలు. కథ చాలా బాగుంది.

మాలా కుమార్ గారు.. మీ పరిచయం బావుందండీ! ధన్యవాదములు.

తృష్ణ said...

శ్రీలలిత గారికి అభినందనలు.మాల గారూ ,ఇంత మంచి పరిచయానికి గానూ మీక్కూడా అభినందనలు.

రసజ్ఞ said...

ఈ కథని నేను చదివాను, మాలికలో వచ్చిన కథ కూడా కాని అది వ్రాసినది మన శ్రీలలితగారని తెలియదు. ఆవిడ గురించి ఎన్నో విషయాలు తెలియచేసారు. మీకు ధన్యవాదాలు ఆవిడకి హృదయపూర్వక అభినందనలు!

Lakshmi Raghava said...

శ్రీలలిత గరి కథ ఎంత బాగుందో మీస్పందన అంతకంటే బాగుంది మరీ ఈసారి మాల గారు కూడా ప్రైజ్ తెచ్చుకునే సత్తా వున్నా రచయితే అని మాకు అర్థం అవుతోంది.అందుకోండి మా అభినందనలు ఇప్పుడే ..లలితా గారూ కథ చాలా బాగుంది ..అభినందనలు

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

ఓహ్! శ్రీలలిత గారే లక్ష్మి గారన్న మాట. ఆవిడ కధలు చాలా బాగుంటాయి. రాసిన లలిత గారికి పరిచయం చేసిన మీకు ఆభినందనలు.

శ్రీలలిత said...

ఇంత అందంగా నా కథను రసఙ్ఞుల దృష్టికి తెచ్చిన నా ప్రియనేస్తం మాలకు హృదయపూర్వక కృతఙ్ఞతలు..
కథ చదివి అభినందించిన అందరికీ ధన్యవాదాలు..

బులుసు సుబ్రహ్మణ్యం said...

శ్రీలలిత గారికి శుభాభినందనలు. మంచి కద.

జ్యోతిర్మయి said...

కథ నవ్య ఆన్లైన్ మాగజైన్ లో కనిపించడం లేదండీ..ఈ కథ లింక్ తెలిస్తే చెప్పరూ..

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
మీరెప్పుడంటే అప్పుడు పార్టీ తప్పకుండా ఇస్తారండి . శ్రీలలితగారి తరుఫున నాదీ హామీ :)

&రావుగారు ,

జ్యోతిర్మయి గారు ,

సుజాత గారు ,

ఉమాదేవి గారు ,

పూర్వ పల్గుణి గారు ,

సిరిసిరి మువ్వ గారు ,

వనజావనమాలి గారు ,

తృష్ణ గారు ,

రసజ్ఞ గారు ,

థాంక్స్ అండి .

అవునండి వనజావనమాలి గారు మీ ఇంటి కి అలా తాళాలు బిగిస్తే ఎలా అండి ? మేము రావద్దా మీ ఇంటికి :)

మాలా కుమార్ said...

లక్ష్మీ రాఘవ గారు ,
అబ్బో అబ్బో నన్ను అలా మునగ చెట్టెక్కిస్తే ఎలా అండి ? ఢమాల్న పడిపోయి కాళ్ళిర్గొట్టుకుంటాను :)మీ అభిమానానికి ధన్యవాదాలండి .

&భమిడపాటి సూర్యలక్ష్మి గారు ,

అవునండి ఆవిడే ఈవిడ :) మీ స్పందనకు థాంక్స్ అండి .

&శ్రీ లలిత గారు ,
నాకీ అవకాశ మిచ్చిన మీకూ థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

బులుసు సుబ్రమణ్యం గారు .

థాంక్స్ అండి .

& జ్యోతిర్మయి గారు ,

నేను మాగ్జీన్ తెప్పించుకొని చదివానండి . జ్యోతి గారికి కాని శ్రీలలిత గారికి కాని తెలుసేమో అడిగి చెపుతానండి .

మాలా కుమార్ said...

జ్యోతిర్మయి గారు ,

ఈ వారం సంచిక ఇంకా ఆన్ లైన్ పెట్టలేదుట . బహుషా నెక్స్ట్ వీక్ పెడతారేమో . ఆన్ లైన్ రాగానే లింక్ ఇస్తానండి .

జలతారు వెన్నెల said...

చాలా మంచి కథ రాసారు లలితగారు.
ఈ విషయం తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు మాల గారు.
చాలా జీవితాలలో ఉండే practical problem ని బాగా touch చేసారు.నేను కూడా తప్పకుండా చదువుతాను ఆ కథ.

psm.lakshmi said...

3 రోజుల తర్వాత ఇప్పుడే మైల్ చూస్తూ ముందు మీ పోస్టే చదివాను మాలాగారూ. మీ పరిచయం మీ గ్రీటింగులతో పోటీపడుతోంది. అంటే అంత బాగుంది. శ్రీ లలితగారూ, మాలాగారి ద్వారా ప్రస్తుతం మీకు అభినందనలు. కధ చదివాక స్పందనలు.
psmlakshmi

మాలా కుమార్ said...

జలతారు వెన్నెల గారు ,

లక్ష్మిగారు ,

మీ స్పందనకు థాంక్స్ అండి .

శ్రీలలిత said...

నా ప్రియనేస్తం మాల పరిచయం చేసిన నా కథకు పాఠకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
అసలు కథ పత్రికలో వచ్చిందని ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పి, మళ్ళీ వెంటనే కథ చదివేసి బాగుందంటూ మెసేజ్ ఇచ్చిన జ్యోతికి ముందు కృతఙ్ఞతలు.
పత్రిక ఇంకా నేను చూడకుండానే ఆ కథ చదివేసి బొమ్మతో సహా దాని గురించి ఎంతో పరిణతితో వ్యాఖ్యానించిన మాలకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే. అది చదివి రసఙ్ఞులు చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి.
రచయిత్రులు ఉమాదేవి, లక్ష్మిరాఘవ వంటివారు ఫోన్ కూడా చేసి కథలో వారికి నచ్చిన అంశాలను ఎంతో ఆనందంగా పంచుకున్నారు.
బ్లాగుల ద్వారా మాత్రమే పరిచయమున్న ఫణిబాబుగారు, వారి శ్రీమతి సూర్యలక్ష్మిగారు కథ చదివి అభినందిస్తూ పూనా నుంచి ఫోన్ చేసేరు. మొదటిసారి మాట్లాడుకున్నా కూడా ఎంతో దగ్గరివారిలా మాట్లాడారు.
జ్యోతిర్మయి, ఇంకా కొందరు ఆన్ లైన్ లో వస్తే చదువుదామనే ఉద్దేశ్యంతో వున్నారు. ఇవాళే ఆ పత్రిక ఆన్ లైన్ లో పెట్టేరు. క్రింద లింక్ ఇస్తున్నాను. ఆసక్తి వున్నవారు చదివి, వారి వారి స్పందనలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

http://www.navyaweekly.com/2012/apr/4/page64.asp