Monday, February 20, 2012

బ్లాగు పుస్తకం
"బ్లాగు పుస్తకం" అవిష్కరణ గురించి బ్లాగులల్లో చదువుతూనే వున్నాను .ఇంటికి దగ్గరే కదా వెళుదామా అని మనసుపీకుతోంది .దానికంత ఆలోచనెందుకు వెళితేపోలే అనుకున్నా , వెళ్ళటం కాదుకదా ప్రాబ్లం . అసలు ప్రాబ్లం ఆ హాల్ ఐదో అంతస్తులో . ఒకటో రెండో అంతస్తులైతే మెట్లెక్కచ్చు కాని ఐదు ఎట్లా ఎక్కుతాను .నాకు తెలుసు లిఫ్ట్ వుంటుందని . అసలు ప్రాబ్లం అదే కదా :) హుం . . . ఇక ఆశ వదిలేసి తీరిగ్గా పనులు చేసుకుంటూ వుంటే సి. ఉమాదేవి గారు ఫోన్ చేసారు . ఉభయకుశలోపరి , ఆపైన తోట లో చెట్ల గురించి అయ్యాక , రెండునెలలనుచి రాకుండా మొహం చాటేస్తున్న తోటమాలి గురించీ మాట్లాడుకోవటం అయ్యాక , మీరు బ్లాగు పుస్తకావిష్కరణ కు వెళుతున్నారా అని అడిగారు . లేదండి అన్నాక , బుర్ర లో బల్బ్ వెలిగి మీరు వెళుతున్నారా అని అడిగాను . వెళుదామనుకున్నానండి కాని ఎవరూ తోడు దొరకటం లేదు అన్నారు . మీరు వెళుతుంటే నేనూ వస్తాను అని చటుక్కున అనేసాను . ఐతే 1 కల్లా రెడిగా వుండండి , నేను మిమ్మలిని పికప్ చేసుకుంటాను అన్నారు .అలా మాచ్ ఫిక్సైంది . కాని గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . . . లిఫ్ట్ ఎలా ఎక్కటమా ????? ఉమాదేవి గారు ఏమనుకుంటారో అని ఓ వైపు ఆలోచిస్తూనే వున్నాను . ఎక్కడా జాగా లేనట్లు వీళ్ళు ఐదో అంతస్తులో సెటిల్ కావటమేమిటి అని మనసులో విసుక్కుంటూ మధనపడుతున్నాను . . . ఇంతలో లక్ష్మి గారు కాల్ చేసి నేను మిమ్మలిని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటానండి , మీరు రెడీఏనా అన్నారు . హమ్మయ్య లక్ష్మి గారు వస్తున్నారు . లిఫ్ట్ సంగతి ఆవిడే చూసుకుంటారు . మనం హాపీసూ :))))))

లక్ష్మిగారి శ్రీవారు శ్రీ.వెంకటేశ్వర్లు గారి పుణ్యమా అని సభాస్తలికి చేరుకున్నాము . ఆయన దగ్గరుండి మరీ లిఫ్ట్ ఎక్కించి వెళ్ళారు . ఆ బిల్డింగ్ వాళ్ళ పుణ్యమా అని ఆ లిఫ్ట్ కూడా కటకటాల లిఫ్ట్ . హమ్మయ్య గండం గడిచింది . హాల్ లో సుజాత గారు ,వరూధిని గారు కనిపించారు . తెలిసిన వాళ్ళున్నారు అమ్మయ్య అనుకున్నాను .

అందరినీ అక్కడ వున్న బోర్డ్ మీద పేరు రాయమన్నారు . టీ బిస్కెట్స్ ఇచ్చారు . వక్తలందరూ బ్లాగు పుస్తకం గురించి , బ్లాగుల గురించి చక్కగా మాట్లాడుతున్నారు . చాలా ఇంట్రెస్టింగా వుండింది . ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెపుతుంటే చాలా సరదాగా వుంది .అంతా బాగానే వుంది కాని నన్నూ మాట్లాడమన్నారు :) అంతే గుండెల్లో ఢాం * * * బాబోయ్ * * * నేనా మాట్లాడటమా ??? చిన్నగా తప్పించుకున్నాను . చావా కిరణ్ వచ్చి లక్ష్మిగారి కి , ఉమాదేవి గారికి బ్లాగు పుస్తకాలిచ్చారు . నా వైపు చూసి మాట్లాడిన వాళ్ళకే పుస్తకాలు అన్నాడు . హి హి హి అని నవ్వి వూరుకున్నాను :) అందరూ మట్లాడారు . మీరొక్కరే మాట్లాడలేదు మాట్లాడండి అని లక్ష్మిగారు , ఉమాదేవి గారు అన్నారు . వాళ్ళన్నారనే కాదు , ఈ సంగతి తెలుస్తే , మావారు ఇచ్చే క్లాస్ ను భరించటం చాలా కష్టం అని , మొత్తాని కి ఏదో మమ అనిపించాను . ఏమి మాట్లాడాను అంటే ఏమో , విన్నవాళ్ళ అదృష్టం హి హి హి . మొత్తానికి నాకూ ఓ పుస్తకం దొరికింది :)))))

సరే పుస్తకం దొరికింది . దానితో పాటు చావా కిరణ్ ,నాగార్జునాచారి , బంతి , చాణక్య , అపర్ణ ,కశ్యప్ , కట్టావిజయ్, జీవితం లో కొత్తకోణం శ్రీనివాస్ గార్ల ల పరిచయం కలిగింది . అందరూ చాలా అభిమానం గా మాట్లాడారు . అందరినీ పరిచయం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది .

"బ్లాగు పుస్తకం " ముఖచిత్రం ముచ్చటగా వుంది . చూడగానే చదవాలి అనిపించింది ."ఈ పుస్తకం కేవలం మీకు దారి చూపించి , ఆ దారి గురించి చెబుతుంది . మీ ప్రయాణం మీరే చేయాలి సుమా !" అని మన బాధ్యతను గుర్తు చేస్తూ మొదలవటం నాకు చాలా నచ్చింది .మన మన్సులో వున్న భావాలను బ్లాగుల్లో ఎలా పంచుకోవాలో ఒక పద్దతిగా వివరించారు .ఏ విషయాలను పంచుకోవచ్చో ,ఏవి తెలియజేయకూడదో చక్కగా వివరించారు .కొత్తగా బ్లాగు మొదలు పెట్టేవారి కి ఈ పుస్తకం సరైన మార్గదర్శి . బ్లాగు రాస్తున్నవారికి కూడా ఎన్నో సాంకేతికా విషయాలను , చిత్రాల తో సహా వివరించారు . అంతే కాకుండా వేరే వాళ్ళ బ్లాగులను ఎలా చదవాలో కూడా తెలియజేసారు .మన వాఖ్యలను ఎలా రాయాలి , వాఖ్యలకు ఎలా స్పందించాలో కూడా తెలియజేసారు .ముఖ్యం గా ఈ బ్లాగుల వల్ల ఏర్పడే పరిచయాలను , ఎన్నో అనుభవాలను తెలియజేసారు .

ఇంతెందుకు అదీ , ఇదీ అని కాదు బ్లాగుల గురించి సమస్తమూ తెలుసుకోవచ్చు . నిజంగా ఇది బ్లాగర్లకు చాలా వుపయోగపడే పుస్తకం . దీని రూపకర్తలు , చావా కిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు చాలా కష్టపడ్డారు .వారికి అభినందనలు .

అన్నట్లు ఇందులో నా పేరు కూడా వుందండోయ్ చూడటం మర్చిపోకండి . థాంక్ యు , చావాకిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు . నాకు బ్లాగులో ఏదైనా డౌట్ వస్తే తనను అడగమని రెహ్మాన్ గారు వారి ఐ డి ఇచ్చారు . థాంక్స్ అండి .

27 comments:

Anonymous said...

మంచి ఆవిష్కరణ విశేషం చెప్పెరు. బాగుంది.

శ్రీలలిత said...

మొత్తానికి "మమ.." అనేసి పుస్తకం దొరికించుకున్నారు..హహ
పుస్తకం కొనుక్కుని చదివేలా సభా విశేషాలన్నీ బాగా చెప్పేరు.
అంత మంచి పుస్తకం అందించినందుకు చావా కిరణ్, సుజాత, రెహ్మాన్ గార్లకు అభినందనలు.

రాజి said...

"మాలా కుమార్" గారూ..
"బ్లాగు పుస్తకం" ఆవిష్కరణ గురించి మంచి విషయాలు తెలియచేశారండీ..

నాకొక సమస్య --
మన బ్లాగ్ పేరు ఎవరైనా వాళ్ళ బ్లాగ్ కి పెట్టుకుంటే మనం ఏమి చేయాలి??
ప్లీజ్ నాకు ఈ సందేహం తీర్చగలరా??
మన బ్లాగ్ పుస్తకం ద్వారా..

psmlakshmiblogspotcom said...

మీ పేరు నేను చూసేశానోచ్.. బాగా రాశారు.
psmlakshmi

C.ఉమాదేవి said...

పుస్తకం చదివించడమేకాదు నలుగురు ఒకదగ్గర కలుసుకునే కూడలవుతుంది.
చర్చకు వేదిక అవుతుంది.అనుభవాల అనుభూతులకు అద్దమవుతుంది.ప్రశ్నకు జవాబవుతుంది.బ్లాగు పోస్ట్ గా
ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.

Anonymous said...

మొత్తానికి పుస్తకం దొరకబుచ్చుకున్నారు . నాకింకా చేరలేదులెండి.

సుజాత said...

రాజి గారూ,
ఈ సమస్య నాకే వచ్చింది ఇంతకు ముందు. భావన అనే బ్లాగర్ ఉన్నారు. తను చక్కని కవితలు రాస్తారు. "మనసులో మాట" అనే బ్లాగు నాకు ఉన్నదని తెలీక తను కూడా అదే పేరుతో బ్లాగ్ మొదలుపెట్టారు. అప్పటికే నా పేరు దాదాపుగా "మనసులోమాట సుజాత" గా స్థిరపడి పోయింది. అప్పుడు నేనే భావనను రిక్వెస్ట్ చేశాను.."మనసులో మాట" నా బ్లాగుగా అందరికీ తెలుసు. కాబట్టి అన్యధా భావించకపోతే మీ బ్లాగు పేరు మార్చుకుంటారా?" అని! తను సహృదయంతో "అయ్యో, అలాగా? నాకు తెలీదు ఈ సంగతి" అని తన బ్లాగుకి "కృష్ణ గీతం" అని పేరు మార్చారు.

అయితే మనసులో మాట పేరుతో మరో బ్లాగు ఎవరో నడుపుతున్నారు గానీ దాంట్లో అరుదుగా మాత్రమే పోస్టులు వస్తుంటాయి కనుక నాకు సమస్య కాలేదు.

కాబట్టి మన బ్లాగ్ పేరు వేరే వాళ్ళు పెట్టేసుకుంటే,(మన బ్లాగే ముందు మొదలెట్టి ఉన్న సందర్భంలో)వాళ్ళని రిక్వెస్ట్ చేయడమే!

జయ said...

Dear Raji, go to 'Mayookha' from my blog 'Manasvi' and read the first post then decide yourself.

రాజి said...

@సుజాత గారూ..

@ జయ గారూ..

నేను అడిగిన వెంటనే స్పందించినందుకు థాంక్సండీ..
నా బ్లాగ్ పేరు పెట్టుకున్న వ్యక్తి నా బ్లాగ్ మొదలైన 2 సంవత్సరాల తర్వాత తన బ్లాగ్ కి ఆ పేరు పెట్టుకున్నాడు..
అతని బ్లాగ్ మొదలయ్యి సుమారు 1Year ఐన తర్వాత ఇప్పుడు నా బ్లాగ్ పేరే అతను పెట్టుకున్నాడంటే అది కచ్చితంగా ఆ వ్యక్తి కావాలని చేసిన పనే..
@ సుజాత గారూ.. మీరన్నట్లు ఒకవేళ నేను రిక్వెస్ట్ చేస్తే సహృదయంతో స్పందించే వ్యక్తే ఐతే కావాలని ఈ పని చెయ్యరు.

@జయ గారూ మీ మయూఖ బ్లాగ్ చూశానండీ..
నేను కూడా ఆలోచిస్తాను ఏమి చేయాలో.

ThankYou..

మాలా కుమార్ said...

కష్టేఫలె గారు ,

ధన్యవాదాలండి .

*శ్రీలలిత గారు ,

అవునండి . ఎలాగో కష్టపడి పుస్తకం దక్కించుకున్నాను :)

థాంక్యు .

మాలా కుమార్ said...

రాజీ గారు ,

వెంటనే జవాబివ్వలేకపోయినందుకు సారీ అండి . ఈ మధ్య నాకు రోజు విడిచి రోజు అపోలో వెళ్ళాల్సిన పనిపడుతోంది . దానితో వెంట వెంట నే రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను .

మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా , అలోచించుకోండి . ఐనా నాకు తెలిసి నంతవరకు గూగుల్ లో ఒక పేరు రిజిస్టర్ అయ్యాక ఇంకొకరికి పర్మిషన్ ఇవ్వదుకదా ? మయూఖ చదివారు కదా , అంతకు ముందే రెండు మయూఖలున్నాయి . జయ కు తెలీక ఆ పేరు పెట్టింది . ఆ తరువాత మార్చేసింది . ఎక్కడో పొరపాటు జరిగి వుంటుంది . నేను ముందు చూడగానే ఆశ్చర్యపోయి , మీకు చెప్పేదాకా తోచలేదు :)

మాలా కుమార్ said...

లక్ష్మిగారు ,
ఐతే నా పేరు చూసారన్నమాట :) థాంక్ యు .

*ఉమాదేవిగారు ,

పుస్తకం గురించి మచిమాటలు చెప్పారండి , థాంక్ యు .

*లలిత గారు ,

మీరు చాలా మంచివారు కదా , కాస్త ఆలశ్యమైనా పర్వాలేదు ఏమనరులే అనుకోని వుంటుందండి బ్లాగు పుస్తకం .

మాలా కుమార్ said...

సుజాత గారు ,
రాజి ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు థాంక్స్ అండి .

* జయ ,

థాంక్ యు .

రాజి said...

మాలా కుమార్ గారూ.. ఈ విషయం మీకు తెలియగానే నాకు చెప్పినందుకు చాలా థాంక్సండీ..

మీ అందరి సలహాతో నేను బ్లాగర్ సాయి గారిని
బ్లాగ్ పేరు గురించి అడిగాను ..
ఆ బ్లాగర్ వెంటనే బ్లాగ్ పేరు మార్చారు..

నా సమస్యకు స్పందించిన మీకు,నేను అడగగానే పేరు మార్చిన బ్లాగర్ సాయి గారికి చాలా థాంక్సండీ..

మాలా కుమార్ గారూ మీ బ్లాగ్ ద్వారా నాకు హెల్ప్ చేసినందుకు మీకు మరీ మరీ థాంక్సండీ..

రాజి said...

సారీ అండీ బ్లాగ్ పేరు మార్చారని నేను ఈ రోజే చూసి ఆ విషయం మీతొ చెప్పాలన్న తొందర్లో ఒక విషయం అడగటం మర్చిపోయానండీ..

"ఈ మధ్య నాకు రోజు విడిచి రోజు అపోలో వెళ్ళాల్సిన పనిపడుతోంది"
అన్నారు కదా ఏదైనా సమస్యా??
ఇప్పుడెలా ఉన్నారు?

మాలా కుమార్ said...

రాజీ గారు ,

ఐతే అంతా శుభమే జరిగిందన్నమాట . గుడ్ .

నవంబర్ లో మా వారికి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందండి . అప్పటి నుంచి డాక్టర్స్ అబ్జర్వెషన్ లో వున్నారు . నిన్న నే డాక్టర్ , మీకు ఇంకో ఆంజియో అవసరం లేదు . యు ఆర్ ఫర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పారు .

ఓ రెండు నెలలనుంచి మా అమ్మకు నడుం నొప్పి . ఆస్టియోపోరెసిస్ అన్నారు . ఆమెనూ ఆ డాక్టర్ , డాక్టర్ తిప్పాము . మొన్నటి నుంచి హోమియోపతి ,బెడ్ రెస్ట్ లో వుంచాము .కొంచం బెటర్ గా వుంది .

ఈ రోజు ఉదయం నుంచి అమ్మయ్య అని ఊపిరి తీసుకోవచ్చు అనుకుంటున్నాను . సో అదీ సంగతి :) మా సోది విన్నందుకు థాంక్స్ అండి :)

రాజి said...

మాలా కుమార్ గారూ.. అవునండీ అంతా శుభమే జరిగింది..
మీకు కూడా అన్ని సమస్యలు తొలగిపోయి
మీవారు,అమ్మగారు అందరి ఆరోగ్యాలు బాగున్నందుకు చాలా సంతోషమండీ..

అలాగే మీరు చెప్పింది సోది కాదండీ మీ సమస్యని నాతో చెప్పటం ద్వారా మీరు నన్ను ఒక ఆత్మీయురాలిగా భావించారని అనుకుంటున్నాను.

మిమ్మల్ని,మీవారిని,అమ్మగారిని భగవంతుడు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో కాపాడాలని ప్రార్ధిస్తున్నాను.

Anonymous said...

hi dee hi sahiti-mala.blogspot.com owner discovered your blog via Google but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have discovered website which offer to dramatically increase traffic to your site http://xrumerservice.org they claim they managed to get close to 1000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my blog. Hope this helps :) They offer most cost effective backlinks Take care. Jason

రాజి said...

Happy Women's Day..

http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

మాలా కుమార్ said...

థాంక్ యు రాజి . కార్డ్ చాలా బాగుంది . మీకు కూడా హాపీ వుమెన్స్ డే .

పరిమళం said...

మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
థాంక్స్ అండి . మీకు కూడా ఉగాది శుభాకాంక్షలండి .

Anonymous said...

Its just like you read my thoughts! You look as if know so much concerning this, really like you wrote the book in it or something. I do believe that you can do with some pics to drive your message home slightly, but besides that, it is good blog.. AL Satsuma Payday Loans

Anonymous said...

Hi, i’m a senior at high school, and I am looking at colleges and majors. I would like to work at a cartoon station, like nick, cartoon network, boomerang, etc, but I don’t know what I would do. I really would like to work with computers as I have no artistic talent.. Payday Loan

Anonymous said...

good day! This is kind of off topic but I need some advice from an established blog. Is it tough to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast. I’m thinking about setting up my own but i’m not sure where to start. Do you have any ideas or suggestions? Appreciate it Payday Loans

Anonymous said...

Keep up the fantastic piece of work, I read few articles on this internet site and I believe that your site is rattling interesting and contains circles of good information. TX Canton Payday Loans

Anonymous said...

Very great post. I simply stumbled upon your weblog and wanted to mention that I have truly loved browsing your blog posts. In any case i’ll be subscribing for your feed and I hope you write again soon! http://lovemypayday.com/Payday-Loans/IN/Monticello/