Tuesday, February 14, 2012

ఇట్లు , మీ విధేయురాలు - మీ భార్య"చరణదాసి " రవీంద్రుని నవల "పడవ మునక " ఆధారం గా తీసినది అని తెలిసి సి.డి తెచ్చుకొని చూసాను . ఆ సినిమాలో చివర లో మూడు జంటల లో ని ముగ్గురు భార్యలూ వాళ్ళ వాళ్ళ భర్తల కాళ్ళకు దండం పెడుతుండగా శుభం కార్డ్ పడుతుంది . ఇహ శాంతినివాసం సినిమా లో సరేసరి దేవిక కు పతిపద సేవయే భాగ్యం . ఇంక అలాంటి పాత సినిమాలు చూడవద్దు అని నిర్ణయించుకున్నాను . అవును మరి మా ఆయన పొరపాటున ఆ సీనులు చూసారంటే చెడిపోరూ ! ఈ మద్య పెళ్ళిల్లలో ఓ కొత్త సాంప్రదాయం చూసాను . అదేమిటంటే , పెళ్ళి కొడుకు తాళి కట్టగానే , పెళ్ళికూతురుతో పెళ్ళి కొడుకు మెళ్ళో దండ వేయించి , కాళ్ళకు దండం పెట్టిస్తున్నాడు పురోహితుడు . అదేమిటో మా కాలం లో మేమెరుగమమ్మా ఈ పద్దతి :) ఏం మీరు మొగుడి కాళ్ళకు దండం పెట్టరా అంటే ఎందుకుపెట్టం ? పండగలప్పుడు , పూజలప్పుడూ కొత్త బట్టలు కట్టుకొని , ఇంట్లో పెద్దవాళ్ళందరికీ పెడుతూ ఆయనకూ పెట్టేదానిని . అంతే కాని పతిపద సేవయే భాగ్యముగా అన్నట్లు కాదు :) కార్యేసు దాసీ . . . . . వగైరా , , , వగైరా లతో భర్త తో భార్య ఎలావుండలో చెపుతూ మన పూర్వీకులు ఓ శ్లోకం చెప్పారట . అది చదవటమే కాని , దాని గురించి కాని , అలా వుండాలని కాని మా అమ్ముమ్మ కాని , అమ్మ కాని చివరకు మా అత్తగారు కాని నాకైతే చెప్పలేదు :) అసలు ఈ కాలం లో భార్యలను అలా చూడాలని ఎవరూ అనుకుంటునట్లుగా కూడా కనిపించటం లేదు .

కాలం తో వచ్చిన మార్పులు అంగీకరించినట్లే భార్యా భర్తలు కూడా స్నేహితులలాగానే వుంటున్నారు . ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం చూపించాలని ఎవరూ కోరుకోవటం లేదు . ఒకరికొకరు చేదోడు వాదోడు గా వుంటున్నరు . మామటుకు మేము పోట్లాడుకుంటూ , మాట్లాడుకుంటూ హాపీగానే వున్నాము :) మనమేమో ఇలా వున్నామా ? మలేసియా ముస్లింలేమో ఇంత మంచి శ్లోకాన్ని మీరెలా వదులుకున్నారు అంటున్నారట .

డాక్టర్ రుహాయా అనే ఆవిడ " ఒబీడియంట్ వైఫ్స్ క్లబ్ ", అంటే విధేయ భార్యల క్లబ్ అన్నమాట స్తాపించిందిట . ఆడవారి జన్మ భర్త విధేయతలోనే తరించాలన్నది ఆ క్లబ్ లోని మహిళల మాట అట . ఈ క్లబ్ లో మహిళల సమస్యలను చర్చిస్తారనుకుంటే పొరబాటే ! ఇక్కడ భర్తల పట్ల ఎలా విధేయతల తో తరించాలో చెపుతారన్నమాట . కొత్తగా వివాహం చేసుకున్న మహిళలకు భర్త తో ప్రవర్తించాల్సిన విషయాలను , భర్త పట్ల విధేయతతో రాటు తేలిన వృద్ధమహిళలు భోదిస్తారట.మంచి మహిళగా మారుస్తారన్నమాట .ఈ క్లబ్ వివరాలు వెల్లడించగానే అక్కడి మహిళలు తమ ఆమోదాన్ని తెలిపారట ! పైగా ఇందులోని మెంబర్స్ అంతా విద్యావంతులేనట!

మరో తమాషా విషయమేమిటంటే ఆమె మామగారే పురుషుల కోసం బహుభారాయత్వం క్లబ్ స్తాపించినవాడవటం . మొత్తం ఆ కుటుంబం ఆలోచనలోనే ఏదైనా తేడా వుందనుకోవాలా అనేది చాలా మంది అభిప్రాయం అట :)

ఈ క్లబ్ ల వివరాలు , పుట్టుపూరొత్వాలూ తెలుసుకోవాలి అని ఎవరికైనా కుతూహులం వుంటే 6-1-2012 స్వాతి వారపత్రిక చదవండి . అందులో చదివే నేనూ ఈ క్లబ్ గురించి తెలుసుకున్నాను సుమండీ ! ఐనా మన ఇండియన్ అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు . ఈ క్లబులూ గట్రా మనకెందుకు లెద్దురూ :))))))

భార్యావిధేయులకు , భర్తావిధేయులకు , విధేయులు కాని వారికి , హోల్ మొత్తం ప్రేమికులకు , ప్రేమికుల రోజు శుభాకాంక్షలు .

25 comments:

రాజి said...

"మొత్తం ఆ కుటుంబం ఆలోచనలోనే ఏదైనా తేడా వుందనుకోవాలా అనేది చాలా మంది అభిప్రాయం అట :)"

నిజమేనండీ ఇదేదో ఆలోచించాల్సిన విషయమే..
ఏది ఏమైనా మీకు కూడా "ప్రేమికులరోజు శుభాకాంక్షలు"

మధురవాణి said...

<<< పెళ్ళి కొడుకు తాళి కట్టగానే , పెళ్ళికూతురుతో పెళ్ళి కొడుకు మెళ్ళో దండ వేయించి , కాళ్ళకు దండం పెట్టిస్తున్నాడు పురోహితుడు . అదేమిటో మా కాలం లో మేమెరుగమమ్మా ఈ పద్దతి :)

మాకు ఎప్పటినుంచో ఈ పధ్ధతి ఉంది మాలా గారూ.. నేను చిన్నప్పటి నుంచీ ప్రతీ పెళ్ళిలో చూస్తున్నాను. నా పెళ్ళిలో కూడా అలాగే జరిగింది. :)

ముందు తాళి కట్టాక ఒకసారి అబ్బాయి కాళ్ళకి నమస్కారం చేయిస్తారు. తర్వాత దండలు మార్పించేప్పుడు పెళ్ళికొడుకు కూర్చునే ఉండి అమ్మాయి మెడలో దండ వేస్తే, పెళ్లి కూతురు మాత్రం లేచి నిలబడి వంగి అబ్బాయి మెడలో దండ వేసి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు కూర్చోవాలి. :)

జ్యోతిర్మయి said...

>>భార్యావిధేయులకు , భర్తావిధేయులకు >>

భార్యా భర్తల మధ్య ఈ విధేయత ఎందుకు చోటు చేసుకుంటుందో! దంపతుల తొలి బిడ్డయైన ప్రేమ కదా వారిరువురి మధ్య ఒదిగేది..వారిని కలకాలం సంతోషంగా ఉంచేదీనూ.

ఏమైనా మాలాగారూ మీకు ప్రేమికులరోజు సుభాకా౦క్షలండీ..

C.ఉమాదేవి said...

ఆచారం సంప్రదాయం.ఆచరణ మన సంస్కృతి, సంస్కారంపై ఆధారపడివుంది.భార్యాభర్తల నడుమ తప్పు,ఒప్పుల పట్టిక ఉండకూడదు.ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడమే పరస్పర విధేయత.

వనజవనమాలి said...

చాలా బాగా చెప్పారండీ! భర్త కి పాద నమస్కారం చేస్తేనే భార్య విదేయురాలా అన్నది నిరూపితం ఏమో.. అనుకునేటట్టు ఉంది. అయినా.. నీ చరణ దాసీ అని.. అంకితభావాన్ని,విదేయతని చూపించడం మన రక్తంలో..ఇంకా ఇంకా జీర్ణించుకునే ఉంది. నేను భర్త కాళ్ళకి నమస్కారం పెట్టాను అనే అమ్మాయిని చూసేమేమో కానీ.. భార్య నమస్కారం పెట్టక పోయినా పరవాలేదులే..అనే భర్తని..చూసామా..చెప్పండి? అలా అనే వాళ్ళే ఉంటె.. పతి దేవుడు అవదండీ..జీవిత ఆలా స్నేహితుడు..అవుతాడు కదా!

kri said...

మాలగారూ పెళ్ళికొడుకు కాళ్ళకి పెళ్ళికూతురు పెళ్ళిలోనే దండం పెట్టడం అన్నది నేనెప్పుడూ వినలేదండీ. వినను కూడా. అనవసరంగా చెడిపోతాను ఇలాంటివి చదివితే. ఏదో ఇప్పటివరకూ సరిగ్గానే ఉన్నాను.

రసజ్ఞ said...

అమ్మో! ఇదేదో పెద్దవాళ్ళ విషయంలా ఉంది! నాకెందుకు బాబూ!!!

Anonymous said...

intersting

శ్రీలలిత said...

మా కజిన్ ఒకతను పండగ ఎప్పుడు వస్తుందా అని చూసేవాడు. ఎందుకంటే ఆ ఒక్కరోజే అతని భార్య కొత్తబట్టలు కట్టుకుని కాళ్లకి దండం పెడుతుందిట. మహా గర్వంగా చెప్పుకుంటాడు. మరో కజిన్ పండగ వచ్చిందంటే భయపడతాడు. అలా దండం పెడుతూ కాళ్ళు పట్టుకుని ఎక్కడ లాగేస్తుందోనని.
ఎవరి గోల వారిదీ. మలేషియా వాళ్ల గోల వాళ్ళదీ. మన గోల మనదీ.
ప్రేమికులరోజు శుభాకాంక్షలు...

వనజవనమాలి said...

నేను పైన పెట్టిన కామెంట్ లో అచ్చు తప్పు వచ్చింది. జీవిత కాల స్నేహితుడు అని చదువు కోవలసినదిగా మనవి. పెళ్ళిలో పెళ్లి కొడుకు కి దండ వేయించి దణ్ణం పెట్టించే ఆచారం .. మా వైపు ఉంది.
అయినా ఆమె అందరు చూస్తూ ఉండగా.. పతి పాదములకు మ్రోక్కెన్, ఆతడు ఏకాంతమున ఆమె పద సేవములన్ చేయుట పరి పాటి కదా! విచారం ఎందులకు!?

Anonymous said...

OUR MARRIAGE PROCEDURE CAME FROM LONG LONG TIME AGO. IN OLDEN DAYS GIRLS USUALLY GET MARRIED @ 8YRS. BOYS AROUND 14/15 YRS. GIRLS @8 YRS.WILL BE VERY SHORT, WHEN COMPARED TO THE BOY.THAT'S WHY GIRL WILL GET UP AND PUT GARLAND TO BOY.SINCE HE IS OLDER THAN THE GIRL HE WILL GET NAMASKARAM ..IDI NAA ABHIPRAYAM..TITTUKOKANDE???

Anonymous said...

పెళ్ళికూతురి తండ్రి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే రివాజు వుంది కదా, తండ్రే కాళ్ళు పట్టగా ఇక పెళ్ళికూతురు పడితే ఆశ్చర్యమేమిటి? సంసారాన్ని స్వంతంగా కాళ్ళపై నిలబెట్టుకోగలడో లేదో అని వెరిఫై చేసుకునే నెపం అయివుంటుంది. :))
వసుదేవుడంతటోడికే తప్పలేదు.

మాలా కుమార్ said...

రాజి ,

పాపం ఆ కుటుంబం :)

మీ విషెస్ కు థాంక్స్ అండి .

&మధూ ,

నేను ఈ మద్యే చూసాను ఈ పద్దతి . ఐనా అందులో తప్పేముంది ? ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి . నేను జస్ట్ జోక్ గా రాసాను అంతే :)

&జ్యోతిర్మయి గారు ,

విధేయత అంటే అధికారం మూలంగా సరెండర్ కావటమే కాదండి , ప్రేమ తో కూడా సరెండరైపోవచ్చుగా :)

మీ విషెస్ కు థాంక్స్ అండి .

శ్రీలలిత said...

మాలాగారూ,
హెంత పొరపాటు చేసేరండీ.
మీరు మీ టపాకి శీర్షిక "ఇట్లు, మీ చరణదాసి.." అనికాని, "ఇట్లు మీ పాదదాసి.." అనికాని పెట్టవల్సింది. సరిగ్గా సరిపోతుంది.

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,

మీరు చెప్పింది నిజమేనండి .

& వనజా వనమాలి గారు ,

మీరు చెప్పినట్లే భర్త అంటే జీవితకాలం స్నేహితుడే . ఈ కాలం లో చాలా మంది అలాగే వుంటున్నారు కదా !

భర్త ఏకాంతమున అభార్య పాదసేవ చేస్తాడంటారు వాకే :) ఐనా అందుకు వుదాహరణ శ్రీకృష్ణ పరమాత్ముడే వున్నాడుగా :)

&అయ్యో కృష్ణవేణి గారు , ఇంతలోనే చెడిపోతే ఎలాగండి మీరు మరీనూ :)

Zilebi said...

మాలా కుమార్ గారు,

ఈ 'పెళ్ళి కొడుకు తాళి కట్టగానే , పెళ్ళికూతురుతో పెళ్ళి కొడుకు మెళ్ళో దండ వేయించి , కాళ్ళకు దండం పెట్టిస్తున్నాడు పురోహితుడు' విషయం గురించి -

కాళ్ళకు దండం, మెళ్ళో దండ రైమింగా ఉదండోయ్

దండ వేసి దండం పెట్టి ధం ధం డం డం అని దండాధి పతులు అవుతారు ఆడ వారు !

దీనికి సారూప్యం దండ వేసిన మేక బలి పీటం మీద ఎక్కడం !!!

చీర్స్
జిలేబి.

మాలా కుమార్ said...

రసజ్ఞా,

అలా పారిపోతే ఎలా అమ్మడూ ? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ :)

& కష్టేఫలే గారు ,

థాంక్ యు .


&శ్రీలలిత గారు ,

అంతేలెండి ఎవరి గోల వాళ్ళది . మనం మలేషియాలో పుట్టనందుకు అదృష్టవంతులం :)

మాలా కుమార్ said...

అనోనమస్ గారు ,

అవునండి మన పెళ్ళి పద్దతులన్ని చాలా పురాతనమైనవి . ఇప్పటి వరకూ మారిన కాల పరిస్తితులను బట్టి అందరం ఆ పద్దతులను కొద్దొ గొప్పో గౌరవిస్తున్నాము కదా ! ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి . ఇందులో తిట్టుకునేదేముంది ?

మీ వివరణకు ధన్యవాదాలండి .

&అనానమస్ గారు ,

పెళ్ళికూతురి తండ్రి అనే కాదని , ఎవరైనా దానం చేసేటప్పుడు , దాత , దానం పుచ్చుకునేవారి కాళ్ళు కడిగి గౌరవించి , దానం ఇవ్వటం ఆచారం . ఇక్కడ కాబోయే అల్లుడిని సాక్షాత్తు లక్ష్మీనారాయణుడి స్వరూపం గా ఎంచి , కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు తండ్రి . అందువల్ల తప్పులేదు .

మాలా కుమార్ said...

జిలేబి గారు ,
మీ వాఖ్య మూలన దాక్కుండిపోయింది :)

ఈ రోజే చూసాను . ఆలశ్యం గా పబ్లిష్ చేసినందుకు క్షమించండి .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
నిజమేనండి . పొరపాటు జరిగిపోయింది :)

శ్యామలీయం said...

కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ

Zilebi said...

శ్రీ శ్యామలీయం మాష్టారు,

ఆ జిలేబీయానికి నెనర్లు !

దండం దశ గుణం భవేత్ !

చీర్స్
జిలేబి.

మాలా కుమార్ said...

శ్యామలీయం గారు ,

జిలేబీ గారు ,

మీ చమత్కారాలు బాగున్నాయండి :)

A Homemaker's Utopia said...

ఇంత మంచి మంచి పోస్టులు చదవడానికి చాలా బాగున్నాయండీ....ఈ బ్లాగుల పుణ్యమా అని ఆంధ్ర దేశం లోనే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతోంది..:-)

Itlu,
మీ సాహితి క్రొత్త reader.

మాలా కుమార్ said...

A Homemaker's Utopia gaaru ,
నా సాహితి కి స్వాగతమండి .

మీ వాఖ్య కు ధన్యవాదాలు .