Thursday, February 2, 2012

గారెలు తాగరు తింటారుఅనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . . నెమ్మదస్తుడు . . . బరువు బాద్యతలు లేనివాడు . . . ఇంకా బోలెడు డు లు వున్నవాడైన , అచ్చతెలుగు అబ్బాయి సుబ్బారావు కు ఇచ్చి అంగరంగ వైభోగం గా పెళ్ళి చేసి , అమ్మాయి, అల్లుడితో కొత్తకాపురం పెట్టించి . . . ఊహ్ . . . ఊపిరి పీల్చుకున్నాడు .

కొత్తకాపురం * * * మొదటిరోజు * * * పెళ్ళిలో అమ్మలక్కలందరూ , మగవాడి హృదయానికి దారి కడుపునుంచేనే అమ్మాయి . చక్కగా వంటచేసి పెట్టి మొగుడిని కొంగున ముడేసుకో అని సుందరి చెవులు కోరికేసారు . అది గుర్తొచ్చి సుందరి , ఆ ప్రయత్నమేదో మొదటి రోజు నుంచే చేద్దామని నిశ్చయించుకొని , " సుబ్బూ . . . సుబ్బూ నీకోసం తినటానికి ఏమిచేసిపెట్టను ?" అని గారంగా అడిగింది . ముద్దుల భార్య , గారాల మోము చూసి ముద్దైపోయి , " సుందూ , నాకు గారెలంటే ఇష్టం . చేసిపెట్టరా " అని అని ముద్దు ముద్దుగా అడిగి ఆఫీసుకెళ్ళిపోయాడు . గారెలా అవేమిటి ఎలా వుంటాయో , ఎలా చేయాలో తెలీదే అని కాసేపు సోచాయింపులో పడి , పోనీ పక్కింటి పిన్నిగారిని అడుగుదాము అనుకొని ,గోడ దగ్గరికి వెళ్ళి పిన్నిగారు , పిన్నిగారూ అని పిలిచింది సుందరి .

ఏమిటమ్మాయ్ అంటూ వచ్చారు పిన్నిగారు .

" పిన్నిగారు , మావారు గారెలు తినాలని వుంది అన్నారు . గారెలా చేస్తారో చెప్పరూ ప్లీజ్ " అని అడిగింది సుందరి .

" ఓస్ గారెలే కదమ్మా . చేయటం చాలా సులభం . ముందుగా మినపప్పు తీసుకోవాలి ."

" మినపప్పు తీసుకోవాలా ? నాక్తెలుసు , నాక్తెలుసు " అంటూ ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .
వంటింట్లోకి వెళ్ళి చూస్తే మినపప్పు ఏదో తెలీలేదు . మళ్ళీ గోడ దగ్గరకు వచ్చి " పిన్నిగారూ . . . పిన్నిగారూ " అని కేకేసింది .ఏమిటమ్మాయ్ అంటూ పిన్నిగారు వచ్చారు .

" మినపప్పు ఎలా వుంటుంది పిన్నిగారు ."

ఇదో అమ్మా ఇలా వుంటుంది అని మినపప్పు తెచ్చి చూపించి , ఈ పప్పు గిన్నెలోకి తీసుకొని అని చెప్పబోతుండగా " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .

ఓ గ్లాసెడు మినపప్పు గిన్నెలోకి తీసుకుంది . ఆ తరువాత ఏం చేయాలి చెప్మా ! అనుకొని మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి , పిన్నిగారి ని పిలిచి , ఆ పప్పును ఏమిచేయాలండి ? అనీడిగింది . కడిగి నాన బోసి , , , అని చెపుతుండగానే "నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది .

సరె పప్పు నానబోసింది . ఆ తరువాత ????? మళ్ళీ పిన్నిగారూ . . . పిన్నిగారూ అని కేకేసింది . ఏమిటమ్మాయ్ అంటూ మళ్ళీ వచ్చారు పిన్నిగారు . నానబోసిన పప్పును ఏమిచేయాలండి అని అడిగింది . దానిని రుబ్బుకోవాలి . ఆ పైన , అబ్బే వినే దాకా ఎక్కడ " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి వెళ్ళిపోయింది . " బాగానే వుంది సంబడం " అనుకుంటూ పిన్నిగారూ లోపలికి వెళ్ళిపోయారు .

మినపప్పు రుబ్బటం ఐపోయింది . ఆ తరువాత ఏమి చేయాలి ? పిన్నిగారినే అడగాలి . . .

" పిన్నిగారూ . . . పిన్నిగారూ . . . "

" ఏమిటమ్మాయ్ ?"

" పప్పు రుబ్బేసానండి . ఇప్పుడేమి చేయాలి? "

" గ్లాస్ లో వేసుకొని నీళ్ళు కలుపుకొని , సుబ్బరంగా తాగెయ్యాలి ." విసిగిపోయిన పిన్నిగారి జవాబు .

" ఓస్ ఇంతేనా ! నాక్తెలుసు . . . నాక్తెలుసు."

సుబ్బారావు గారెలు తిందామని లొట్టలేసుకుంటూ వచ్చాడు . సుందరి అంతకన్నా ప్రేమగా గ్లాసెడు గారెలు ఇచ్చి , " సుబ్బూ . . . ఎంచక్కా గారెలు తాగేసేయ్ . నీకోసం పక్కింటి పిన్నిగారిని అడిగి చేసాను తెలుసా " అని వూరిస్తూ ఇచ్చింది .

" గారెలు తాగటమేమిటే సుందూ " అంటూ బిత్తరపోయాడు సుబ్బు .

" పక్కింటి పిన్నిగారు ఇలాగే చెప్పారు . నీకేమీ తెలీదు .తొందరగా తాగేయ్ సినిమా టైం ఐపోతోంది " అని తొందర చేసింది సుందు .

" గారెలు తాగరే * * * తింటారు " .ఏడుపు మొహం పెట్టాడు సుబ్బు :(((((
నీతి ; అతితెలివి అనర్ధదాయకం .

సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)

38 comments:

రాజి said...

"నీతి ; అతితెలివి అనర్ధదాయకం."
మంచి కధ చక్కటి నీతి చెప్పారండీ :)

జ్యోతిర్మయి said...

కథ మంచి రసపట్టులో ఉండగా అపేశారేంట౦డీ..పైన అందంగా గారెలు పెట్టారు. సుందరి తరువాత కాలంలో గారెలెలా చెయ్యాలో నేర్చేసుకు౦దన్నమాట. మీ కథలో నీతి బావుంది.

Anonymous said...

మీరు సరదాగా చెప్పినా నిజమదే, నేడు!!!

రసజ్ఞ said...

హహహ! కేవ్వవ్వ్వ్వ్ కేక మీ టపా!

Ruth said...

:) మాల గారూ..... ఈ కథ.... నాకు తెలుసు నాకు తెలుసు

ఆ.సౌమ్య said...

హహహ సరదాగా బావుంది :)

శ్యామలీయం said...

బాపుగారిదనుకుంటా ఒక పాత కార్టూన్ జోక్. ఒక అమ్మాయి పక్కింటి పిన్నిగారితో అన్నం వండటం గురించి అడగుతున్న సన్నివేశం:

"అన్నం వండే ముందు బియ్యం కడగాలని పుస్తకంలో రాసారండీ. సబ్బు పెట్టి కడగాలా సర్ఫ్ పెట్టి కడగాలా?"

శ్రీలలిత said...

ఏంకాదు.. సుందరి చేసిన గారెలు తాగుతారంతే...

కృష్ణప్రియ said...

హ్మ్మ్..మా నాయనమ్మ చెప్పేది ఈ కథ. సగం దాకా ఇలాగే విన్నాను.. కానీ తర్వాత కొద్ది తేడా తో.. ఇలాగ ప్రతి స్టెప్ తర్వాత, సుబ్బుకి గారెలు వివిధ రూపాల్లో పెడుతుంది. మొదటి రోజున మినప్పప్పు పెడుతుంది. రెండోరోజు నానపెట్టి, మూడో రోజు రుబ్బిన పప్పు..

సుబ్బు కి వొళ్లు మండి.. రేపు పక్కింటి బామ్మగారి దగ్గర కూర్చుని.. అంతా చూసి, ఆవిడ చేసినట్టే చేసి కానీ నా దగ్గర కి తేకు.. అంటాడు.

మర్నాడు గారెలు చేస్తుంది కానీ దానికి ముందు, బామ్మగారి లా గుండూ, తెల్ల చీరా.. కట్టుకుని మరీ చేస్తుంది..

PS: మీ కథ లో నీతి బాగుంది.

Jai Gottimukkala said...

శ్యామలీయం గారి కామెంటు చూస్తె నాకూ ఒక జోకు గుర్తుకొచ్చింది. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి బెంగుళూరులో కాపురానికి వెళ్ళింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన భర్త కన్నడంలో "అన్న మాడు, కరీ మాడు, సాంబారు మాడు" అన్నాడు (మాడు= do, prepare, make etc. based on context).

ఘంట ప్రయత్నించి విసిగి భార్య "అన్నం మాడింది, కూరా మాడింది కానీ సాంబారు మాత్రం మాడడం లేదు, ఏం చేయాలి?" అని అడిగింది. అవాక్కయిన భర్త ఇక మీద ఆమెతో తెలుగులో మాత్రమె మాట్లాడాలని తీర్మానం చేసుకున్నాడు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> " నాక్తెలుసు . . . నాక్తెలుసు "

మీరిలాంటి నీతి ఏదో చెబుతారని....... దహా.

@కృష్ణప్రియ గారు
మీరు చెప్పిన కధలో నీతి ఏమిటంటే అలాంటి బామ్మగారిని అసలేమీ అడగ కూడదు అని...దహా.

kri said...

మాలగారూ,
టపా ఎంత బాగుందో! ఈ కథ నేనింతకు ముందు వినలేదు కానీ మీరు రాసిన విధానం మాత్రం ఎంత నచ్చిందో!

పూర్ణప్రజ్ఞాభారతి said...

సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)
కథ కొసమెరుపు కన్నా ఈ సామెతే మహా కొసమెరుపు.

పూర్ణప్రజ్ఞాభారతి said...

సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)

కథలో కొలమెరుపు ఎలా ఉన్నా ఈ సామెత మెరుపు మాత్రం అత్యద్భుతం

సిరి శ్రీనివాస్ said...

హస్యంతో నీతిని మేళవించి భలే రాసారు. పక్కింటి పిన్నిగారు అంటే ఠక్కున గుర్తువచ్చేది బాపు కార్టూనే, BRU కాఫీ ప్రకటన.

ప్రసీద said...

భలే ఉంది మాలాగారు. ఇంకోసారి నాక్తెలుసు అనేముందు ఒకసారి ఆలొచించాలి అన్నమాట.. :)

C.ఉమాదేవి said...

కథ రాయమనగానే మొదలెట్టేసారన్నమాట. నాక్తెలుసు,నాక్తెలుసు మీరు రాసెయ్యగలరని!

అన్వేషి said...

నాక్తెల్సు, నాక్తెల్సు ~ కాని ఏం తెలుసో మర్చిపోయా, మీ కధ చదివాక నవ్వి, నవ్వి ఇంకేమీ గుర్తు రావడం లేదు. ఇప్పుడు నాపేరేమిటో ఎవర్నైనా అడగాలి. ఎవర్నడగాలబ్బా, పక్కింటి పిన్నిగారు కూడా ఊరికెళ్ళారే!

ఉష said...

హమ్మయ్యా! కథ ముగింపు, కథలోని నీతి ముందే నాక్తెలుసు. మీ "సుందూ" వయసుకి నేను బానే బెటర్. :) పెద్ద మావయ్య మొట్టికాయ వేసేవరకు "చింతపండు పులుసు" లో ఉప్పు, కారం, బెల్లం కూడా పడాలని తెలియలేదనుకోండి. ఎందుకంటే పక్కింటి పిన్ని లేరు మాకు, పైగా పెద్ద తలకాయని నేను, నా అసిస్టెంట్స్ మా మావయ్య గారి పిల్లలు. మీ కథతో నా ఊసు ముసుగు తీసుకుని లేచి వచ్చింది.

మధురవాణి said...

హహ్హహ్హా.. బాగుంది సుందరి కథ.. :)))

ఇంకా నయం.. అమ్మలక్కలందరూ మొగుడిని కొంగున ముడేసుకోమని చెప్పీ చెప్పగానే.. "నాక్తెలుసు నాక్తెలుసు.." అనుకుంటూ పరిగెత్తుకు వెళ్లి వాళ్ళాయన మెడకి చీర కొంగేసి బిగించలేదు.. :P

వేణూ శ్రీకాంత్ said...

హహహ మీ కథబాగుంది కథలో నీతి బాగుంది :-) కామెంట్లలో జోకులూ బాగున్నాయండీ :-)

మాలా కుమార్ said...

రాజి ,

కథలో నీతి నచ్చిందా :) థాంక్ యు .

* జ్యోతిర్మయి గారు ,

చూసారా నేను సింబాలిక్ గా పెట్టిన గారె తో తరువాతి కథ మీరు చెప్పేసారు . ఎవరైనా నా హింట్ కనుక్కుంటారాలేదా చూద్దామనుకున్నాను . మీరు పట్టేసారు గుడ్ :)

* కష్టేఫలే గారు ,

నేడు , నిన్న , రేపు ఎప్పుడైనా ఆడపిల్లలు పెళ్ళైయ్యే దాక అమ్మ కొంగు చాటు కూనలే . పెళ్ళైన కొత్తలో ఇలాంటి తికమకలు తప్పవు :)

మాలా కుమార్ said...

అబ్బ రసజ్ఞ గారు ,

ఎంత కేకపెట్టేసారండి . మీ కేకకు థాంకూలు .

*రుథ్ గారు ,

మీ అమ్మమ్మగారు మీకీ కథ చెప్పారని నాక్తెలుసు . . . నాక్తెలుసు . నాకూ మా అమ్మమ్మే చెప్పిందిగా :)

*సౌమ్యా ,
హహహ థాంకూ

మాలా కుమార్ said...

శ్యామలీయం గారు ,

మీరు చెప్పిన బాపూ జోక్ చాలా బాగుందండి హహహ . ఇంత మంచి జోక్ గుర్తు తెచ్చుకున్నందుకు ధన్యవాదాలండి :)

*శ్రీలలిత గారు ,
అవునండి మన సుందరి చేసిన గారెలు చేయించిన పాపానికి , సుబ్బు తో పాటు మనం తాగాల్సిందే :)

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
అవునండి అసలు కథ మీరు చెప్పినదే . మొన్న మా మనవడు స్కూల్ తెలుగు ప్రాజెక్ట్ కోసం " దురాశ ధుఖమున కు చేటు " సామెత మీద కథ చెప్పమన్నాడు . వాడికి కథ చెపుతుంటే ఎందుకో నాకీ కథ గుర్తొచ్చింది . ఏమీ తోచక ఖాళీగా వుండి , ఈ కథ పోస్ట్ రాద్దామనుకొని , గుర్తొచ్చినంతవరకూ , కాస్త నా పైత్యమూ కలిపి రాసానన్నమాట . అదీ ఈ పోస్ట్ వెనుక వున్న కథ :)

*జై గొట్టిముక్కల గారు ,

హహహ భలె నవ్వించే జోక్ చెప్పారండి . మా మనవడి కి కూడా ఈ జోక్ చెప్పాను . గుర్తొచ్చినప్పుడల్లా ఇద్దరమూ తెగ నవ్వేసుకుంటున్నాము , మా అమ్మాయి , అల్లుడు చూడకుండా . ఎందుకంటే మా అల్లుడు కన్నడిగ :)

మాలా కుమార్ said...

బులుసు సుబ్రమన్యం గారు ,

మీకు తెలుసని నాక్తెలుసు . . . నాక్తెలుసు :)

*కృష్ణవేణి గారు ,
ఈ కథ చాలా పాతది అండి . ఇక్కడి అమ్మమ్మలు/ నాయనమ్మలు చెప్పే కథలలో ఇదీ ఒకటి . మీకు నేను చెప్పిన విధానం నచ్చినందుకు థాంక్స్ అండి :)

*పూర్ణప్రజ్ఞాభారతి గారు ,

నా సామెతను భలె పట్టేసారే :) థాంక్యూ .

మాలా కుమార్ said...

సిరిశ్రీనివాస్ గారు ,

అవునండి పక్కింటి పిన్నిగారు బాపు గారి మార్కే :)

మీ కామెంటుకు థాంక్స్ అండి .

*ప్రసీద గారు ,

అవునండి , నాక్తెలుసు అనే ముందు తొందరపాటు పనికి రాదట :) మీకు నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండి .

* ఉమాదేవి గారు ,

మరి మీరు ఇన్నిసార్లు చెప్పేక , మీ మాట వినాలి కదండి . ఐనా ఇది నా సొంత కథ కాదు కదండి . కాళిదాసు కవిత్వము కొంత , నా పైత్యము కొంత :)

మాలా కుమార్ said...

అయ్యో అన్వేషి గారు అలా మరిచిపోతే ఎలాగండి . ప్రస్తుతం పక్కింటి పిన్నిగారి కోసం , మీ పేరు కోసం అన్వేషిస్తున్నారన్నమాట :)

*అమ్మయ్య , మరువం ముసుగు తొలగించుకొని సువాసనలు వెదజల్లింది:) ఉష గారు , మీ సువాసనలు పరిమళిస్తున్నాయండి . థాంక్యు .

మాలా కుమార్ said...

మదురవాణీ ,

ఇంకా నయం , సుందరికి ఆ ఆలోచన రాలేదు . బతికి పోయాడు సుబ్బు :)

సుందరి కథ నచ్చినందుకు థాంకూ :)

* వేణూ ,

నా కథ నచ్చినందుకు థాంక్ యు .

అవునండి , కామెంట్లలోని జోకులు మరీ బాగున్నాయి . మా పిల్లలకు కూడా ఈ జోకులు చెప్పాను . మరీ వాళ్ళ ఇంట్లో "మాడ " అన్నప్పుడల్లా ఒకటే నవ్వుతున్నారట :)

భావన said...

కధ బాగుంది మాల గారు. :-)ఆఖరున సామెత కూడా బాగుంది. ఐనా మీ ఊరు లో కంది పప్పు శనగ పప్పు తేడా తెలీకుండా పెరిగితే ముద్దు గా పెరిగింది అంటారా? అజ్నానం గా పెరిగింది అనరా. ఐనా అంత ముద్దు గా పెరిగిన భామ కు అమ్మ గారెలెప్పుడూ పెట్టలేదూ???? ఏమిటా వెధవ ప్రశ్న లు నోరుమూసుకుని కధ వినలేవూ అని తిడతారా. :-)
మధురవాణి సూపర్ ఐడియా.. ;-)

Zilebi said...

మాలా కుమార్ గారి గారెల పాకం బాగుందండోయ్!


చీర్స్
జిలేబి.

Jai Gottimukkala said...

@మాలా కుమార్:

జోకు నచ్చినందుకు సంతోషం. అయితే ఒక విషయం చెప్పుకోవాలి. "మాడు" ఏక వచనం (చెయ్యి), "మాడీ" బహువచనం (చేయండి). ఈ తేడా తెలియకపోతే అవతలి వారు నొచ్చుకునే అవకాశం ఉంది.

Lasya Ramakrishna said...

బాగుందండి....:-)

మాలా కుమార్ said...

భావనా ,

మీ ప్రశ్నలకు సమాధానం తరువాత చెపుతాను , ముందు మీరిది చెప్పండి , మీరు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికెళ్ళారు ? మిమ్మలిని ఎంత మిస్సింగో మీకు తెలుసా ?

సుందుకు వాళ్ళ అమ్మ ఎప్పుడూ గారె పెట్టలేదా అని ఎవరూ అడగలేదే అనుకున్నాను :) మీరడిగేసారు . వాళ్ళ ఇంట్లో వడ అంటారన్నమాట . అందుకని గారె అంటే తెలీదు . మేము పిల్లలను అజ్ఞానులు అనం . వినటాని కి బాగుంటుందని అమాయకులు , ముద్దుగా పెరిగారు అంటాం :)

* జిలేబీ గారి కి గారెలలో కూడా పాకమే కనిపిస్తున్నట్లుందే ! ఐతే ఎంచక్కా గ్లాసులోని పోసుకొని తాగేయొచ్చు కదండి :)

మాలా కుమార్ said...

జై గొట్టిముక్కల గారు ,

మీ సూచనను గుర్తుంచుకుంటామండి . థాంక్ యు .

*లాస్యా రామకృష్ణ గారు ,

థాంక్స్ అండి .

శ్యామలీయం said...

జిలేబీగారూ
కథ మధ్యలో ప్రశ్నలు వేసేస్తుంటే అది కాస్తా ఒక ఇంటర్వూ అయిపోదా. గారెలు తినలేదా అనకండి - ఈ రోజుల్లో పిల్లలు ఇంటిలో చిరుతిళ్ళు తింటారా - పిజ్జాల కొట్టు వాడు హోమ్ డెలివరీ ఇస్తుంటే!

శ్యామలీయం said...

కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ

Anonymous said...

నిజమేనండి పక్కింటి మటలు ఇలానే ఉంటాయి