Saturday, March 31, 2012

సీతారాములు మా ఇంటికి వచ్చిన శుభవేళమా కాలనీ లో ఈ రొజే సీతారామ కళ్యాణం చేసుకున్నాము . ఉదయం 10 .30 కు మా సీతారాములు , లక్ష్మణ , ఆంజనేయ సమేతంగా మా కాలనీ లో ఊరేగింపు గా బయలు దేరారు . మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని , పాదప్రక్షాళణ కోసం నీరు , సుందరమైన మా సీతారాములకు ధృష్ఠి తీసేందుకు కొబ్బరికాయ , పూజించేందుకు పసుపు , కుంకుమ పూలు తీసుకొని ఎదురుచూస్తూ నిలబడ్డాను .


ఎదురు చూస్తుండగా సీతారామ ,లక్ష్మణ ఆంజనేయులను మా వారు తీసుకొని రానే వచ్చారు .నేను సీతారామ,లక్ష్మణ , ఆంజనేయుల పాదాలను కడిగి , కొబ్బరికాయ తోదృష్ఠి తీసి ఇవ్వగా , మావారు కొబ్బరికాయను కొట్టారు . ఆ తరువాత నేను , మా వదినగారు హారతి ఇచ్చాము .

మా కాలనీ అంతా ఊరేగించిన తరువాత , మా పార్క్ లో వేసిన వేదిక మీద సీతారామలక్ష్మణ ఆంజనేయులను స్థాపించాము .ఆ పైన కన్నుల పండుగ గా సీతారాముల కళ్యాణం జరిపించాము . మావదినగారు , అన్నయ్యగారు కన్యాదాతలుగా ,గొట్టిముక్కల నరసిమ్హారావుగారు వారి పత్ని వరుని తల్లి తండ్రులుగా వ్యవహరించారు . కళ్యాణము లోని కొన్ని ముఖ్యఘట్టాలు .

కన్యాదానం ;మంగళసూత్రం ;మాంగల్యధారణ ;ముత్యాల తలంబ్రాలు ;పెళ్ళికావలసిన అమ్మాయిలు కొంగుబట్టి తలంబ్రాలు పట్టుకున్నారు .ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలములిచ్చారు .

రంగ రంగ వైభోగం గా కళ్యాణం జరిగాకా , పానకం వడపప్పు , లడ్డూ ప్రాసదం తీసుకొన్నాము .

సీతా కళ్యాణ వైభోగమే , రామా కళ్యాణ వైభోగమే .

శ్రీరామనవమి శుభాకాంక్షలు .

13 comments:

Lasya Ramakrishna said...

చాలా బాగుందండి మీ కాలనీ వాళ్ళ సీతారామ కళ్యాణ వేడుక. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

రాజి said...

మీ కాలనీలో సీతారామ కళ్యాణం విశేషాలు బాగున్నాయండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

More Entertainment said...

hii.. Nice Post Great job.

Thanks for sharing.

Best Regarding.

More Entertainment

C.ఉమాదేవి said...

చాలా బాగుంది మాలాకుమార్ గారు.

శ్రీలలిత said...

శ్రీ సీతారాముల కళ్యాణ శుభవేళ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..

మాలా కుమార్ said...

లాస్య గారు .

రాజి గారు ,

మోర్ ఎంటర్టేన్మెంట్ గారు ,

ఉమాదేవి గారు ,

శ్రీలలిత గారు ,

మీ స్పందనకు ధన్యవాదాలు .

లత said...

చాలా బావుంది మాలగారూ

జ్యోతిర్మయి said...

మీరు శ్రీరామనవమి జరుపుకున్న విధానం చాలా బావుందండీ...శ్రీరామనవమి శుభాకాంక్షలు(కాస్త ఆలస్యంగా)

సిరిసిరిమువ్వ said...

కనులపండగగా శ్రీరామ కళ్యాణం జరుపుకున్నారన్నమాట!

పోయిన సంవత్సరం మీరు రామయ్య తల్లిదండ్రులనుకుంటా కదూ!

మాలా కుమార్ said...

లత గారు ,

జ్యోతిర్మయి గారు ,

థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

సిరిసిరిమువ్వ గారు ,

మీకు బాగానే గుర్తుందే :) థాంక్ యు .

చింతా రామ కృష్ణా రావు. said...

మీరు మాకళ్ళముందు సీతారాముల కల్యాణాన్ని కట్టించారమ్మా.
చాలా చాలా ఆనందంగా ఉందమ్మా.
మిమ్ములను, మీ కాలనీ వాసులను ఆ సీతారాములు చల్లగా కాపాడాలి.
నమస్తే.

మాలా కుమార్ said...

చింతా రామకృష్ణా రావు గారు ,

ధన్యవాదాలండి .
నమస్తే .