Monday, May 10, 2010

వాలుకొబ్బరి చెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు

' వాలు కొబ్బరిచెట్టు ' పేరు చూడగానే , ఇదెవరో కోనసీమ వాళ్ళే రాసివుంటారు అనుకుంటూ చూసాను . వాహ్వా నా గెస్ కరెక్టే . అలా మొదటిచూపులోనే దోస్త్ ఐపోయింది , వాలుకొబ్బరిచెట్టు . అందులో వచ్చే కోనసీమ తోటల కబుర్లకు మహా కుళ్ళుకొని , అంతలా వూరించక పోతే మమ్మలిని పిలవొచ్చుగా మీ తోటకు అని పోట్లాటేసుకున్నాను . అలా సుభద్ర తో కూడా దోస్తీ కుదిరి పోయింది . వాలుకొబ్బరి చెట్టూకింద కూర్చొని , కొబ్బరి నీళ్ళు తాగుతూ ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో లెక్కే లేదు .

చిన్ని కశుగాడిని నవ్వరా బాబూ ఎంత బతిమిలాడుకున్నా అబ్బో ఎంత ఏడిపించాడో , విజయభాస్కరవర్మ గారి పేరు , సుభద్ర పేరు తో ఎంత హిస్టరీకల్గా మాచ్ అయ్యిందో . పెళ్ళికాని ప్రసాదుల కోసం కేరళ కుట్టీల ( బంగారం ) అందాలూ , రాజాధిరాజంట అంటూ అంట అట అని విన్న న్యూస్లూ , మరుజన్మలో జేజి గా పుట్టాలి అని , జేజిని తలుచుకునే కబుర్లూ , ఇలా ఒకటేమిటి బోలెడు కబురులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వుండ గా వుండగా ఏడాది గడిచి పోయింది . ఎంత తొందరగా గడిచి పోయిందో కదా !

ఇంకా బోలెడు సంవత్సరాలు ఇలాగే ఇంకా ఇంకా బోలెడు కబుర్లు , చెప్పాలని కోరుకుంటూ ,

వాలుకొబ్బరిచెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు .

9 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మేము కూడా చెబుతున్నాం వాలుకొబ్బరిచెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు .

SRRao said...

మాలాకుమార్ గారూ !
మీ ద్వారా మన వాలుకొబ్బరిచెట్టుకి శుభాకాంక్షలు

జయ said...

సుభద్ర గారికి నా శుభాకాంక్షలు కూడా....

amma odi said...

సుభద్ర గారికి నా శుభాకాంక్షలు కూడా!

sunita said...

Ditto.

శ్రీలలిత said...

సుభద్రగారూ,
అందుకోండి జన్మదిన శుభాకాంక్షలు...

సుభద్ర said...

మాలగారు,
ఏమి రాసిన తక్కువే అనిపిస్తు౦ది...మీరు అలుగుతారు ఇప్పుడు కాని చెప్పాలపిస్తు౦ది థ్యా౦క్స్ ఇ౦త గుర్తుగా విష్ చేసిన౦దుకు...చిన్న క౦గారు లో ఉ౦డి నిన్న మీ విషేష్ అ౦దుకోలేకపొయా కాని మీ స్నేహ౦లా మీ గులాబిలు నేను వచ్చేవరకు వాడకు౦డా ఇ౦కా నాకో అ౦ద౦గా తలలు ఊపుతున్నాయి.. మీరు నాకు ఎన్నో నేర్పి౦చారు ఈ స౦వత్సర౦ లో,ముఖ్య౦గా స్లైడ్ సో..ఇక ము౦దు అన్ని స౦వత్సరాలు ఇలానే మీరు నాతో నేను మీతో ముచ్చట్లు తో పాటుగా బ్లాగుప్రయణ౦ లో నాకు తోడుగా ఉ౦డాలని కోరుతూ...
మీ ,
సుభద్ర..

చిలమకూరు విజయమోహన్ గారు,
రావుగారు,
అమ్మఒడిగారు,
సునీతగారు,
శ్రీలలితగారు,
చాలా ధ్యా౦క్స్ అ౦డి...

జయగారు,
చాలా థ్యా౦క్స్..మీ అభిన౦దలు నిన్న అ౦దుకున్నా కాని మీకు థ్యా౦క్స్ మిస్సాయ్యాను..
చాలా థ్యా౦క్స్..