Sunday, May 9, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - నాలుగవ భాగం ( మాతృదినోత్షవ శుభాకాంక్షలు)





చిన్నగా పకోడీల ప్లేట్ తడిమాను . అబ్బే లేవే ! ఇన్ని బ్లాగులు చదివే లోపల అన్నీ వూదేసినట్లున్నాను . హుం . సరే కాఫీ తాగేస్తే ఓపనై పోతుంది కదా . నా తో పాటు చదువరులందరినీ తిప్పాను కదా . పాపం అలసి పోయి వుంటారు . మీరూ ఓ కాఫీ కప్ తెచ్చుకోండి .( చూడండి నాదెంత ఉదార స్వభావమో , నేనొక్క దానినే తాగకుండా మిమ్మలినీ తెచ్చు కోమన్నాను కదా ! )

ఆ ((( . . . ఎన్ని బ్లాగులు చదివాము ? డెబ్భై పైనే అనుకుంటా . నేను లెక్కపెట్టలేదు . ఎన్ని రకాల బ్లాగులు ! ఎన్నెన్ని ఊసులూ !! ఒక్కో బ్లాగ్ ఒక్కో రకం . ఒకదానికొకటి పోలికే లేదు . కమ్మటి కబుర్లు కొంత మంది చెపితే , కథలు కొంతమంది రాసారు . కవితలైతే అబ్బో ఎంత భావుకత తో వున్నాయో ! నేనూ ఎప్పటికైనా అలా ఓ మంచి కవిత చెప్పగలుగుతే నా !! చిన్ననాటి మరుపురాని మధుర సృతులు , ఉషారైన పోస్ట్ లు కొన్ని . ఆలోచనలను రేకెత్తించేవి కొన్ని . సమాజము లోని దుస్తితిని ఎత్తి చుపుతూ హం భీ కుచ్ కం నహీ అనేవి కొన్ని . పాటలవి కొన్ని , రకరకాల వంటలవి కొన్ని , అందమైన ఫొటోలతో కొన్ని , రకాల కళలను నేర్పేవి కొన్ని , పుస్తకాల గురించి వివరించేవి కొన్ని ,వకటి ఎక్కువ , ఇంకొకటి తక్కువ అనేలా లేవు . దేనికదే గొప్పగా వున్నాయి .

అందరూ రచయిత్రులు కారు . సాధారణ గృహిణి నుంచి , రచయిత్రులు , సంఘ సేవికులు , వివిధ వృతులలో వున్న వారూ కళాకారులు అందరూ తమదైన శైలి లో తమ తమ భావాలను అందరి తో పంచుకుంటున్నారు . ఒక టపా లో శిశిర అన్నారు , అందరూ ఫీల్ గుడ్ అన్నట్లు అన్ని పాజిటివ్ విషయాలే రాస్తారు అని . అవును కదా మన సంతోషాన్ని పది మంది కీ పంచాలి . ఇబ్బందిని మనలోనే దాచుకోవాలి అని పెద్దలు చెప్పారుకదా . అదే పెద్దలు , మన కష్టం ని ఇతరులకు చెప్పుకొని మనసు తేలిక పరుచుకోమని కూడా అన్నారు . కాని ఆ సమయము లో చెప్పుకున్నా , ఆ తరువాత మనం వారి దగ్గర చులకనై పోతా మేమో ననే భయం తో కూడా అందరికీ చెప్పలేము కదా ! ఏమైతేనేమి , మంచి , సరదా విషయాలను చెప్పుకొని , బాధలను మరచిపోయే పసందైన వేదిక బ్లాగ్ !

ఇంట్లో పని , ఆఫీస్ లో ఉద్యోగం చేసుకుంటూ తీరిక సమయములోనే రాస్తున్నారు . అమ్మాయిలు చేసే అష్టావధానం లో ఈ బ్లాగింగ్ కూడా చేరింది ! అలసిన మనసులను , అమ్మ కాని అమ్మ గూగులమ్మ వొడి లో సేద తీర్చుకుంటున్నారు . భావాలను పంచుకోవటమే కాదు , కొత్తగా కంప్యూటర్ నేర్చుకున్న నాలాంటి వారు టెక్నికల్ విషయాలు కూడా తెలుసు కోగలుగుతున్నారు . అంతేనా , ఈ అతివలందరూ ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమున్నాము అంటూ ముందుకు వచ్చి వొకరికొకరు సహాయము చేసుకుంటున్నారు . వారిలో వారికే కాదు సహాయము అవసరమైన వారికి , వృద్ధులు , అనాధలు , వరదబాధితులు మొదలైన వారికి మీకు మేమున్నాము అండగా అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు . మేము అచ్చమ్మ , బుచ్చమ్మ కబుర్లు చెప్పుకోమండి , సరదాగా వుంటూనే మాకు చాతనైన సహాయం చేస్తాం అంటున్నారు ఈ అతివలు . అమ్మాయైనా , అమ్మైనా , అలసట ఎరుగని అతివ మనసు ఎప్పుడూ అమ్మతనముతో నిండి వుంటుంది . అందుకే సృష్ఠి లో అమ్మకు లేదు మారు రూపం . అమ్మ అమ్మే .


నాకెవ్వరూ తెలీదు అన్నారు కృష్ణ వేణి . సరేనండి అని కొంత మందిని పరిచయము చేసాను . మీకు మీరే కాకుండా బ్లాగ్ ముఖం గా మా కందరికీ పరిచయం చేయొచ్చుగా అన్నారు లలిత డి . కానీయండి అని ప్రొత్సహించారు జ్యొతి . ఊ ఊ కానీయ్ , నీకు నిండా మా సహాయ సహకారులుంటాయ్ అన్నారు ( అందించారు ) సుభద్ర , జయ . ఇక చేసేదేముంది ? కళ్ళు మూసుకొని రాసేసాను . నన్ను ఈ బరి లోకి దింపిన వీరికి బోలెడు థాంకూలు . ' నా బ్లగ్ అంతర్ జాలం లో అతివలు ' , మొదటి , రెండవ , మూడవ భాగాలు చదివి పెట్టిన , స్పందిచిన మీకూ బోలెడు బోలెడు థాంకూలు . ఇల్లాలి ముచ్చట్లు , మనమీదేన్ రోయ్ పేరు , శైలి అమ్మాయి బ్లాగ్ లా అనిపించింది . కాని ఎవరు రాశారో తెలీలేదు . శారద , నన్ను మర్చి పోయారో అని అలిగారు కాని ప్రొఫైల్ ఏది ? ఊం హూ నాకు దొరకలేదే ! వాకే వాకే నీలాంబరి గారు దొరికి పోయారు బ్లాగ్ సోదరి ఈ రోజు బ్లాగ్ మగ మహారాజుల గురించి రాసి తెలిసిపోయారు గా . ఇదిగిదిగో ఇంకో కథల బ్లాగ్ జాజిమల్లి కుడా ఇప్పుడే దొరికింది . అలాగే అమ్మాయిలూ , మీ ఎవరిదైనా బ్లాగ్ పరిచయం ఇందులో లేకపోతే నాకు కామెంట్ బాక్స్ లోనైనా , మేయిల్ ద్వారా నైనా తెలపండి . చేర్చేస్తాను . అలాగే నేను మీ బ్లాగ్ గురించి చేసిన పరిచయము ఎవరికైనా నచ్చక పోతే చెప్పండి తొలిగించేస్తాను . అంతేగాని నన్ను అపార్ధం చేసుకొని మూతి ముడుచు కోకండి .బంగారు తల్లులు కదూ !.

నేను ముందుగా అరవై మాత్ర మే వున్నాయనుకొని , ఇరవై చొప్పున మూడు భాగాలు చేసాను . కాని తవ్వినా కొద్ది బంగారం బయటకు వస్తోంది . ఇప్పుడే మధురవాణి ఈ బ్లాగుల లింక్ లు పంపారు . మరి వాటినీ ఓసారి ఇక్కడ చూద్దామా !!! మధురవాణి ,శ్రమ అనుకోకుండా ఈ లింక్స్ ఈచ్చి సహాయ పడి నందుకు నీకూ థాంకూలు .

అందరికీ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .

మహిళా బ్లాగర్ల గురించి వ్యాసాలు ఇలా ముక్కలుగా ఉంటే అస్సలు బాలేదు. అన్నీ ఒక్కదగ్గర పెట్టి పిడిఎప్ చేసిపెట్టమని గురూజి సూచించారు . అసలే ఎండలు మండిపోతున్నాయి. అవకాయ పనులున్నాయి. ఈ లింకులన్నీ వెతికేసరికే బుర్ర వాచిపోయింది. నావల్ల కాదంటే సరే అని ఇలా ముచ్చటైన పుస్తకంలా చేసిచ్చారు.
జై గురూజి.. మీరు క్లిక్కేసి చదువుకోండి..


28 comments:

Sudha Rani Pantula said...

నా బ్లాగుపేరు ఎందుకు రాలేదా...అని చూస్తున్నాను...మొత్తానికి నన్ను కూడా పట్టేసారు.బోల్డు థాంకులు. నేను మీలాగా అమ్మాయిని కాదు...అక్కనేమో తెలీదు. కానీ ఆంటీ అన్నా అభ్యంతరం చెప్పలేని వయసులో ఉన్నదాన్ని...నా బ్లాగుపేరు చేర్చినందుకు, చాలా చాలా కష్టపడి ఇన్ని బ్లాగులు చదివి ఒక చోట చేర్చినందుకు అభినందన మందారమాల వేస్తున్నా...అందుకోండి.

మధురవాణి said...

అదిరిందమ్మా సాహితీ.. (ఊరికే సరాదాకి అలా అంటున్నా.. హీ హీ.. హీ) ;-)
సూపర్ మాలా గారూ.. దాదాపు అతివల బ్లాగులన్నీటిని ఓ చోటకి చేర్చారు. చాలా కష్టపడ్డారు ఎండల్లో..ఒక పెద్ద పని విజయవంతంగా పూర్తి చేశారు. ఇంక తీరిగ్గా మీరు ఆవకాయ పెట్టేసుకోండి :-)
బంగారంలాంటి మనసున్న మాలాగారికి... మాతృదినోత్సవ శుభాకాంక్షలు. :-)
మీరిచ్చిన pdf లింక్ పని చెయ్యట్లేదు. ఓసారి సరి చూడండి.

రాధిక said...

కొన్నాళ్ళ క్రితం సిరిసిరి మువ్వగారు ఇలాంటి జాబితా తయారు చేసారు.అప్పటికీ.ఇప్పటికీ చాలా బ్లాగులు పెరిగాయి.మహిళలు ఉత్సాహం గా రాయడం ఆనందంగా వుంది.
కెవ్వ్వ్వ్......వా.......నా పేరు లేదు :)

జ్యోతి said...

Bravo మాలగారు, ఎంతో ఓపిగ్గా బ్లాగులు వివరాలు సేకరించి అన్నీ ఒక్కచోట చేర్చి మాలగా అందించారు. చాలా కష్టపడ్డారు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకోండి.

రాధిక నువ్వు ఈ మధ్య రాయడంలేదు కనుక నీ బ్లాగు కూడా ఎక్కడా కనపట్టంలేదు మరి. అందుకే మాలగారికి అసలు నువ్వు ఒక బ్లాగర్ వి అని తెలీదేమో. ఇప్పటికైనా కొత్త టపా పెట్టమ్మా...

Hima bindu said...

:-):-)thanxandee

సిరిసిరిమువ్వ said...

అబ్బో ఎన్ని మహిళా బ్లాగులో! రాధిక గారూ నిజమే అప్పటికి ఇప్పటికి చాలా పెరిగిపోయాయి.

ఇంత శ్రమపడిన మాలా గారికి పది వీరతాళ్లు.

జయహో మహిళా బ్లాగులు!

శిశిర said...

ఈ టపాల సిరీస్ మొత్తం పూర్తయ్యాక కామెంట్ రాద్దామని ఆగానండి. చాలా మంచి ప్రయత్నం. చాలా కష్టపడి ఉంటారు ఈ సమాచారమంతా సేకరించడానికి. అభినందనలు మీకూ, మీకు సహకరించిన మిత్రులకు.

సిరిసిరిమువ్వ said...

మాలా గారు మరికొన్ని బ్లాగులు చూడండి. ఇందులో కొందరు ఇప్పుడు వ్రాయటం లేదులెండి కానీ మీరు ఎలాగూ పుస్తకంగా తెచ్చారు కాబట్టి ఇవి కూడా కలపండి.

రమ్య
మనసు కలలు-కొసరు కథలు http://manasukalalu.blogspot.com/
నివేదన http://ramya-ramyam.blogspot.com/

కుసుమ కుమారి http://konamanini.blogspot.com/

అరుణ పప్పు http://arunapappu.wordpress.com/

మీనాక్షి..http://meenakshir.blogspot.com/

శ్రీవిద్య http://srividyab4u.blogspot.com/

క్రాంతి గాయం http://kranthigayam.blogspot.com/

కల http://kala-lo.blogspot.com/

విరజాజి http://virajaaji.blogspot.com/

నిర్మల కొండేపూడి http://nirmalak.blogspot.com/

పద్మ http://padma-theinvincible.blogspot.com/

ఇందు http://indudasika.blogspot.com/

మోహన http://venugaanam.blogspot.com/

అభిసారిక http://abhisaarika.blogspot.com/

అంగర శైలజ http://ullileanivamtalu.blogspot.com/

ఝాన్సి http://jhansipapudesi.blogspot.com/

వేద http://vedakiran.blogspot.com/

స్వాతి శ్రీపాద http://ramachandramouli.blogspot.com/

http://purnimablogs.blogspot.com/..ఇది పూర్ణిమ గారిది..ఇందులో రెండే తెలుగు టపాలు ఉన్నాయి

మురళి said...

బాగుందండీ సంకలనం..

జయ said...

హ్యాపీ మదర్స్ డే. కంగ్రాట్స్ ఫర్ దిస్ గ్రేట్ వెంచర్. నేను ఇవాళ కూడా కొన్ని కొత్త బ్లాగ్ లు చూశాను. ఇంక ఎప్పటికీ ఈ సీక్వెల్ కంటిన్యూ చేస్తూ ఉండాల్సిందే:)

రాధిక said...

అయ్యో నేను చెప్పడమే మర్చిపోయా.మాల గారూ గ్రేట్ జాబ్ అండి.ఇవన్నీ సేకరించడానికి చాలా ఓపిక అవసరం.బోలెడు సమయాన్ని కేటాయించాలి.ఎంత శ్రమో.ఇంత కష్టపడి జాబితా తయారు చేసినందుకు ధన్యవాదాలు.అభినందనలు.

మాలా కుమార్ said...

అయ్యో రాధిక గారూ ,
ఊరుకోండి , ఊరుకోండి . మరీ అంతలా వా . . . అనకండి . మీ బ్లాగ్ ఇక్కడ లో చేర్చాను .

* సుధ గారు ,
మీ ఇల్లాలి ముచ్చట్ల కు లింక్ ఇచ్చాను .

* సిరిసిరి మువ్వగారు ,
మీరు శ్రమ పడి , ఇన్ని లింక్స్ ఇచ్చారు . చాలా చాలా థాంక్స్ అండి . మంచుపల్లకి గారు కూడా వక లింక్ ఇచ్చారు . రెండు రోజులు చూస్తాను , ఎవరైనా ఇంకా ఏవైనా లింక్స్ ఇస్తారేమో . అప్పుడు అన్ని కలిపేస్తాను . బుక్ లో కూడా అన్ని వొకేసారి కలుపుతాను . వన్స్ అగేన్ థాంక్ యు వెరీ మచ్ .

మైత్రేయి said...

నేనూ అమ్మాయినే నండి (మా ఆఫీస్ లో అలా అంటే ఒప్పుకోరు. ఆమ్మాయి అమ్మవని చెప్పుకో మంటారు). నేను రెగ్యులర్ గా రాయకపోయినా ఏదో రాస్తుంటాను.

Ruth said...

చాలా థాంక్స్ మాల గారు. అస్సలు జల్లెడ లో "రచయిత:Ruth" అని చూసినప్పుడు ఎంతపొంగిపోయానో, మీ లిస్ట్ లో నా పేరు చూసికూడా అంత పొంగిపోయాను :) :) :)
కాని ఇప్పుడో చిక్కు తెచ్చిపెట్టారు, ఇలా అందరి కంట్లో పడ్డాక మరి రెగ్యులర్ గా రాస్తుండాలేమో !!! హ్మ్మ్....

చెప్పాలంటే...... said...

chalaa chalaa kastamandi elaa anni oka chota raayadam chalaa santosham gaa vundi thank you very much mala garu.......great effort...

మాలా కుమార్ said...

మైత్రేయిగారు ,
సిరిస్రి మువ్వగారు ,
మీ లింక్స్ ఇక్కడ కలిపానండి .

http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_05.html

thaank you .

సుభద్ర said...

మాలగారు,
మాటలు లేవ౦డి....ఇ౦తమ౦ది ఉన్నామా???ము౦దు మన౦ అనుకున్న నె౦బర్ కి జస్ట్ డబుల్. ఈ రోజు నేను రాధిక గార్ని గుర్తు చెయ్యలి అనుకున్నా..తనే చెప్పెశారు..తన బ్లాగ్ లో కవిత సుపర్ గా ఉ౦టాయి..చిన్నమాటలో భావ౦ అ౦ద౦గా ఆకట్టుకునేలా..వారి ఊరి మొదటిలో ఆగాను నేను ఇ౦కా ఊళ్ళొకి ఎప్ప్పుడు తీసుకెళ్ళాతారో అని చూస్తున్నా!!!
ఇక సిరిసిరిమువ్వగారు ఏన్ని బ్లాగుల లి౦క్ ఇచ్చారో ...నేను అసలు ఇ౦దులో కొన్ని బ్లాగ్స్ చూడలేదు..మాలగారు అన్ని బ్లాగులు చదివేయ్యాలి నేను అర్జ౦టుగా...
మాలగారికి హెల్ప్ చేసి గురుజీకి,జయగార్కి,మధురవాణిగార్కి,ఈ మహత్తరకార్యనికి కారణ౦ అయిన కృష్ణవేణిగార్కి,ఆలోచన ఇచ్చిన లలితక్కకి చివరిగా బాస్ ఆఫ్ ది ఎపిసోడ్ మాలగార్కి నా థ్యా౦క్స్..ఇ౦త మ౦చి పని చేశారు ...నాకు నెలకి సరిపడ కాలక్షేప౦ మరి..
లేడిబ్లాగర్స్ నేను వస్తూన్నా మీ బ్లాగ్స్ కి సాహిత్యవి౦దుకి...
సుధగారు,
మన౦ ఎప్పటికి అమ్మాయిలమే!!!అ౦దర౦ చిన్నప్పడు బడిలో ఉన్నప్పటిలా మిత్రులమే!!!మీ పోటో అదిరి౦ది..మీరు ఆ౦టీ ఏ౦టీ...
మైత్రేయి,మీ బ్లాగ్ నేను చూశానోచ్చ్!!

సిరిసిరిమువ్వ said...

మాల గారూ మరో రెండు బ్లాగులు

మంజు http://nenu-naa-prapancham.blogspot.com/

శ్రుతి http://sruti-minestam.blogspot.com

సిరిసిరిమువ్వ said...

మాల గారూ మరో రెండు బ్లాగులు

మంజు http://nenu-naa-prapancham.blogspot.com/

శ్రుతి http://sruti-minestam.blogspot.com

సిరిసిరిమువ్వ said...

http://lakshmi-n.blogspot.com/

http://prasanthi.wordpress.com/

maa godavari said...

మాలా గారూ
అదిరిందండోయ్.
మహిళా బ్లాగర్లందరూ బీ రెడి.
భూమిక జూన్ సంచిక లో మనం ధూం ధాం చెయ్యబోతున్నాం.
ఫోటోలుంటే మరింత బావుంటుంది.
కొందరివైనా దొరుకుతాయేమో !!!!!

Anonymous said...

మాల గారూ,
నేను సోమవారమే దీనికి కామెంటానండీ! ఎందుకో బ్లాగులో రాలేదు :(
నన్నూ చేర్చినందుకి బోల్డు ధన్యవాదాలండీ.
శారద

తృష్ణ said...

మీ ఓపికకు నా జోహార్లు...నిజ్జమ్గా చాలా ఓపిక కావాలండీ...న్యూ ఇయర్కి నేను "సింహావలోకనం" టపా లో ఓ పాతిక దాకా బ్లాగుల గురించి రాసాను కాబట్టి ఇప్పుడు అరవై బ్లాగుల గురించి రాయటం అంటే ఎంత కష్టపడి ఉంటారో ఊహించగలను...హాట్స్ ఆఫ్ టు యూ..!!

మాలా కుమార్ said...

మధురవాణి ,
అదిరిందమ్మా నీ కామెంటు , థాంకు .

*జ్యోతి గారు ,
రెస్ట్ తీసుకోమని కామెంటీ , ఇప్పటి దాకా వీర బాదుడు బాదారు కదా మీరూ , వరూధినీ హుం , చూసుకుంటా నాకూ ఎప్పుడో దొరక్క పోరు .
థాంకు .

* చిన్ని గారూ ,
ఇంతకీ మీ బంగారానికి పేరు ఏంపెట్టారండి ?
థాంక్ యు .

మాలా కుమార్ said...

శిశిర గారు ,
థాంక్స్ అండి . మొత్తాని కి , మీ జడివాన , ఎదసడి రెండూ నా తో బోలెడు సార్లు చదివించారు , జయ , సుభద్ర .
థాంక్ యు .

* మురళి గారు ,
థాంక్ యు అండి .

*రుథ్ గారు ,
మిమ్మలిని పట్టుకోవటానికి నా పాత పోస్ట్ లన్ని చూసి , కష్ట పడాల్సి వచ్చిందండి . అందుకే , మీరు రెగులర్గా రాసి, మాకీ కష్టం తగ్గించండి మరి .thaank yu .

మాలా కుమార్ said...

మంజు గారు ,
చాలా థాంక్స్ అండి . మీ అందరి ప్రోత్సాహమే కదా ఇది .

*సుభద్ర ,
మనమనుకున్న దానికి డబులా , డబులున్నర .
మీ హెల్ప్ కూ , మీ కామెంట్ కూ థాంకు .

మాలా కుమార్ said...

జయా ,
నువ్వన్నట్లు తప్పదు , ఎప్పటికీ కంటిన్యూ చేయాల్సిందే . ఓపిక వుంటే ప్రతి ఆరు నెలలకు అప్ టు డేట్ చేద్దామనే వుంది .నీ హెల్ప్ కు థాంకు .

*రాధిక గారు ,
ముగ్గురు రాధికలున్నారండి. అందుకే కాస్త తికమక పడ్డానడి . అమ్మయ్య కోపం పోయింది కదా థాంకు .

* మైత్రేయి గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

సత్యవతి గారు ,
మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపు కోవాలో తెలీటము లేదండి .
థాంక్ యు వెరీ మచ్ .

* శారద గారు ,
మీ కామెంట్ రాగేనే పబ్లిష్ చేసానండి .
థాంక్ యు .

*తృష్ణ గారు ,
ఓపిక చేసుకొని నా పోస్ట్ చదివారు . కామెంటారు . థాంక్స్ అండి .