Friday, May 7, 2010

బ్లాగ్ అంతర్ జాలం లో అతివలు - మూడవ భాగం






మానసవీణ ను మీటే అద్భుతమైన కవితలు , చిన్న కథలు ఇక్కడ .

తూర్పు - పడమర , రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిద్వనులు , అంటున్నారు , కల్పనా రెంటాల .

స్వేచ్చగా , సరదాగా , సూటిగా మనసులో మాట చెపుతున్నారు సుజాత .

మాయా శశిరేఖ , బాలా కుమారినంట , చాలా సుకుమారినంట అంటున్నారు సౌమ్య .

నీలి నీలి మబ్బుల్లో తేలిస్తారు సత్యప్రియ లో రాధిక .

కబుర్లు , కబుర్లు ! , వట్టి కబుర్లే కాదు , తాజ్ మహల్ అందాలను వివిధ కోణాలలో చూసి ఆనందించండి , సుజాత గారి గడ్డిపూలు లో .

మధుర భావాలతో చక్కటి సుమ మాలలు అల్లుతారు రమణి .

తెలుగు సాహిత్యానికి వేదిక మాలతి గారి తెలుగు తూలిక .

ఆనందించే మనసుంటే , ఆలరించే ప్రయత్నం నేనౌతా అంటున్నారు , ప్రేరణ .

నా భావాలు, అనుభవాలు, ఆలోచనలు, స్పందనలు, జ్ఞాపకాల సవ్వడి అంటున్నారు ఎదసడి లో శిశిర .


రకరకాల కబుర్ల తో శరవేగం గా బ్లాగ్ లోకం లోకి దూసుకు పోతున్నారు , నిఖిత చంద్రసేన .


ప్రకృతి వడి లో , సముద్రపు అలలను కప్పుకొని , హాయిగా నిదురిస్తూ , కలలప్రపంచం లోకి మనలను కూడా తీసుకెళుతారు స్వప్న .


పల్లెల్లో, గూడేలలో, అడవిలో, సముద్రపు ఇసుకల్లో.. ప్రజల జీవితాలని దగ్గరగా చూసిన అనుభవాలు,అరుదైన దారుల్లో ఎదురైన అనుభూతులు, నా మనసును హత్తుకొన్నవి, నాకు స్పూర్తినిచ్చినవి ఇవి ...దిరిసెన పుష్పాలలా అరుదైనవి,సున్నితమైనవి.వీటిని మీ అందరితో పంచుకోవలని ....అంటున్నారు శిరీష దిరిసెన పుష్పాలు లో .


అందమైన కవితలమయం పద్మార్పితం ,


చిట్కాలూ , వంటలు ఒకటేమీటి బోలెడు విషయాలు చెపుతారు భవాని మల్లాది .


కవితల తో కొత్తగా బ్లాగ్ మొదలుపెట్టారు , జ్యోత్స్న . ఏమవుతుందో దాని భవిత అని బెంగపడుతున్నట్లున్నారు . ఏమీ కాదని , వేల కవితల తో వర్ధిల్లుతుందని బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా !!


సరదా పరదాలు , నచ్చిన పుస్తకాలూ , సినిమాలు ఇలా అన్నిటినీ తట్టుతారు , స్నిగ్ధకౌమిది లో ప్రణీత స్వాతి . ఈ మద్య ఆక్సిడెంట్ అయ్యి లేవలేక ఎక్కువగా రాయలేక పోతున్నాను అన్నారు ఒక పోస్ట్ లో . త్వరగా కోలుకొని మరిన్ని రచనలను అందించాలని కోరుకుంటున్నాను .


మరు జన్మ లో కూడా ఆడపిల్ల గానే పుట్టాలనుకుంటున్నారట , శ్రావ్య వరాళి .


నా చిన్ని ప్రపంచానికి నేనే మహారాణి ని అంటున్నారు రాజి .


పిట్ట కొంచం కూత ఘనం , ఈ చిన్ని పాప బ్లాగ్ లహరి .


మరో చక్కటి కవితల బ్లాగ్ మానస చామర్తి గారి మధుమాసం .


అనుకోకుండా తెలుగు బ్లాగ్ లను చూసి , పాటే నా ప్రాణం అని తనూ బ్లాగ్ మొదలుపెట్టారట అపర్ణ . బెస్ట్ ఆఫ్ లక్ అపర్ణ .


పచ్చడి మెతుకుల దగ్గర నుండి ,( లాప్ ) టా భూషణం వరకూ సరదాగా చదవొచ్చు కృష్ణప్రియ డైరీ లో .


ఎనెన్నో మంచి రచనలను సేకరించి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ ద్వారా అందిస్తోంది , చైతన్య కళ్యాణి .


నేను సాదా సీదా తెలుగు అమ్మాయిని అంటున్నారు శ్రావ్య వట్టికుటి రవీయం లో .


నేనేమైనా చిన్న దాన్నా ? చికదాన్నా ? బోల్డు కుంచం పెద్ద దానిని ఆహా ఓహో అంటోంది గీతా ప్రియదర్షిని .


ఆలోచింప చేసే టపాలు నాలో ' నేను ' .


రెండు కథలు రాసానోచ్ , నేను కాదు రాసింది , సౌమ్య .


నాకు అమెరికా వద్దు , అమ్మ కావాలి అంటున్నారు , ఇదీ సంగతి లో జాహ్నవి .


ప్రియదర్షనీయం కళ్ళాత్మకం.


నిద్ర కోసం , నిద్రే నా ప్రాణం , నిద్రలేక నేను లేను . నేను కాదండి బాబూ . ఆ కబుర్లు చెప్పేది శివరంజని .


అందమైన కవితలు , ఆలోచనలు రేకెత్తించే తెలుగు వ్యాసాలు , ఇంగ్లిష్ , వ్యాసాలూ , కవితలూ వున్నాయి స్వాతి గారి కల్హార లో


ఒక పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది అంటున్నారు రుత్ , ముద్దమందారం లో .


అమూల్య గారి బ్లాగ్ రామాయణం చదవండి అమూల్య లో .


వెన్నల్లో ఆడపిల్ల కవితనుండి , రకరకాల విషయాలను కిరణ్ గారి , వెన్నెల లో చదవచ్చు .


పెళ్ళి మంత్రాలకి వివరంగా అర్ధం ,+ వాఖ్య +చిటికెడు హాస్యం తో కలిసి , పెళ్ళిముచ్చట్లు చదవండి శ్రీవైష్ణవి గారి బ్లాగ్ లో .


అబ్బ ఫొటోస్ ఎంత బాగున్నాయో !


ఆదివారం వెరైటీ లంచ్ కోసం ఏంచేయాలా అని తల బద్దలు కొట్టు కోవటం ఎందుకు ? సూర్య లక్ష్మి గారిని అడిగేస్తే ఓ పనై పోతుంది కదా !


నీలాకాశం లో ఓ చిన్న మబ్బు తునకనుండి జాలువారిన చిరు జల్లులా హృదయ నివేదిత ఈ వనితా వేదిక అంటున్నారు వేద .


ఇప్పుడే నా కంట బడ్డ బ్లాగ్ నారాతలు .


బ్లాగ్ కాకపోయినా , కాంతి పాతూరి గారి కౌముది మాస పత్రిక ఎంత బాగుంటుందో !!

అందులోని సుభద్ర వేదుల అగ్రహారం కథలు తప్పక చదవవలసినవి .

నాకు తెలుగు రాదు అంటూ , తెలుగు మీద అభిమానం తో , ఇంట్లోనే తెలుగు నేర్చుకొని , ఫామిలీ రేడియో కు ఈ అనువాద రచన చేసిన కృష్ణవేణి పట్టుదల మెచ్చుకో దగినది .

ఏమిటీ నేనేమైనా పరమానందయ్య శిష్యురాలి ననుకుంటున్నారా ? ఇంతమంది లెక్క పెట్టి నన్ను లెక్క పెట్టు కోకపోవటాని కి . ఇది నా సాహితి . చదువుతూ వుండండి . . . చదువుతూనే వుండండి సాహితిని . అంతే కాదండోయ్ మీ అమూల్య మైన అభిప్రాయాలనూ తెలపండి . మీ అభిప్రాయాలే మాకు మహాద్భాగ్యం .

ఇంకా వుంది * * * * *

21 comments:

ఆ.సౌమ్య said...

హమ్మ నా బ్లాగు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. మొత్తానికి వచ్చేసింది.
మీ శ్రమకి జోహార్లు. ఇలా అందరిని ఏరి కూర్చి ఓ గాటిన కట్టారు....మీ కష్టానికి వందనాలు.

ప్రియ said...

Excellent!

For some extraordinary poems, (both translations, and same poem with different flavor) you could have given sRujanagItaM

Ramani Rao said...

మాలగారు, అతివల బ్లాగు సుమకుసుమాలను అతి జాగ్రత్తగా మాల కట్టారు. ఏ సుమాన్ని విడిచిపెట్టకుండా.... కంగ్రాట్స్.

మధుర భావాల సుమమాల మాలగారి మనసులోన మెరిసెనీవేళా...థాంక్స్ :-)

Jagadeesh Reddy said...

అందమయిన విడి విడి పువులని ఒక చోత మాల కట్టి అందించారు.. మీ శ్రమకి అభివందనం... అభినందనం...

గీతాచార్య said...

Excellent effort Mala garu

నేస్తం said...

అబ్బా ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారో.. నాకు చాలా బ్లాగ్స్ ఇందులో తెలియదు..ఈ పోస్ట్ కాపీ చేసుకుంటున్నా.. ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు కదా... అబ్బాయిల బ్లాగులను కూడా ఎవరన్నా ఇలా పరిచయం చేస్తే బాగుండు.. అన్ని కాపీ చేసుకోవచ్చు .. మంచి ప్రయత్నం ...

జయ said...

చాలా బాగుంది. దాదాపు వంద బ్లాగ్ లను శోధించి, సాధించి చేసిన ఈ ప్రయత్నం నిజంగా హర్షనీయం. తప్పని సారిగా అందరూ అనందించే ఉంటారు. ముఖ్యంగా పరిచయం లేని ఎన్నో బ్లాగ్ లను ఇప్పుడు తెలుసుకున్నాను. సాహితి ఒక పెద్ద పరిచయ వేదిక. ఈ తీవ్రమైన కృషికి అభినందనలు...ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ said...

మీ కృషికి అభినందనలు..చాలా తెలియని బ్లాగుల గురించి చెప్పారు.

Manasa Chamarthi said...

haaaa......naa peru kud aundi indulo...
nenu manchi blogs anni chaduvukuntoo vstunte, naa peru kuda kanipinchindi :D:D
aaha...naa blog gurinchi telisina vallu kuda unnaraa...:):):)

శ్రీలలిత said...

మాలాగారు,
ఎంత గొప్ప పని చేసారం డి.. మిమ్మల్ని ఏ విధంగా మెచ్చుకో వాలో తెలీటం లేదు. అందర్నీ ఒకదగ్గర చేర్చి ఎంత బాగా పరిచయం చేసారో..మీ శ్రమకి ఫలితం అందరం అనుభ విస్తున్నాం ధన్యవాదాలు.

భావన said...

మాల, మీరు సూపరండి బాబు. మొత్తానికి అన్ని కూర్చి పేర్చి ఒక చోట చేర్చి పెట్టేసేరు.. వెరీ నైస్. చాలా కష్ట పడి వుంటారు. ధన్యవాదాలు.

Sharada said...

ఇంత దూరం ఆస్ట్రేలియాలో వుండటం వల్ల కాబోలు, నన్నెప్పుడూ అందరూ మర్చి పోతారు :(( ఖండిస్తున్నాం అధ్యక్షా! :))

Jokes apart,
చాలా informativeగా వుంది మాల గారూ.
శారద

Sravya V said...

ఏడేడు పద్నాలుగు లోకాలలోని బ్లాగ్లులని వెతికి తీసి మరీ మాల గా కట్టిన మీ కృషి కి నా అభినందనలు !

మధురవాణి said...

Superb work Mala garu!
Claps! :-)

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

అందరిని ఒక దారంతో దగ్గరచేర్చి తెలుగు అంతర్జాలానికి తోరణం కట్టేసారు. ఎంతయినా మాల గారుకదా!

కొత్త పాళీ said...

good effort

మాలా కుమార్ said...

sowmya ,

priya ,

ramni gaaru ,

sp jagadeesh gaaru ,

geetacharya garu ,

naestam gaaru ,

jaya ,

sirisiri muvva gaaru ,

manasa chamarti gaaru ,

sri lalita garu ,

bhavana gaaru ,

Sarada gaaru ,

sravya vattikuti gaaru ,

madhuravani ,

bhamidapati suryalakshmi garu ,

kotta paali gaaru ,

అందరికీ ధన్య వాదాలండి . ఎలాగు ఇంత దూరం వచ్చారు . శ్రమ అనుకోకుండా ఇంకా కొంచం ముదుకు వెళ్ళి ఐస్ క్రీం తిని వెళ్ళండేం . థాంక్ యు వెరీ మచ్ .

Unknown said...

Mala garu..modati sari nenu mee blog ki jyothi gari blog nundi vachnau monna....andulo..meeru parichayam chestunna links anni chusanu....andulo naadi undadam chusi entha aascharyapoyanoo meeku teliayadu.....chala chala thanks andi.. :)

divya vani said...

ధన్యవాదాలు మాలా కుమార్ గారు ,నేను బ్లాగు మొదలు పెట్టిన కొత్తలోనె మీరు నా బ్లాగు గురించి రాసినందుకు థాంక్స్ అండి

Unknown said...

మాలా కుమార్ గారు ఈ ఆర్టికల్ ఇప్పుడే చూసానండి.
ఇన్ని బ్లాగ్స్ ఉన్నాయా?
మంచి పోస్ట్.Extraordinary work.

మాలా కుమార్ said...

saila baala garu,

thanks andi .