Wednesday, May 5, 2010

బ్లాగ్ అంతర్ జాలం లో అతివలు - రెండవ భాగం





నా కోరికలూ , నా ప్రయణ సాధనాలు అని ఊసులు చెప్పే స్వాతి బ్లాగ్ ఇదే .

మీకు కవితల మీద ఇంటరెస్ట్ ఉంటే తెలుగుకళ , పద్మకళ గారి కవితలు చదవండి .

వెబ్సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ జాహ్నవి .

కబుర్లు చెప్పుకుందాం రండి అనీ, ఆప్యాయంగా పిలిచి , ఎప్పుడూ మంచి విషయాలే మాట్లాడండి , అని కబుర్లు చెపుతారు , సురుచి జ్ఞాన ప్రసూనగారు .

పియస్ లక్ష్మి గారి బ్లాగ్ చదివారా ? యాత్రలు చేసి వచ్చి , మనందరికీ ఎలా వెళ్ళాలో సులువుగా చెప్పే గైడ్ యాత్ర .

బ్రహ్మ కమలం గురించి , మినర్వా పక్కనున్న నాగమల్లి గురించి , రామాంతపూర్ లోని సంపెంగి తోట గురించీ , జూ లోని వెదురుపూల గురించీ చెప్పి నన్ను రోడ్ ఎక్కిస్తుంటారు మా గోదావరి , సత్యవతి గారు .నాకైతే సత్యవతి గారి బ్లాగ్ లో పూలపరిమళాలు కనిపిస్తాయి .కాని ఆ బ్లాగ్ లో ఎక్కువగా మహిళల అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సత్యవతి గారు మహిళల కోసం,స్త్రీల అంశాల కోసం తపన పడే కార్య కర్త .

మనసు పలికే ఆలోచనల రూపమే ప్రసీద బ్లాగ్ .

మామిడి పండు తినగానే , టెంకలో మొలక కనిపించే విచిత్రము తెలుసుకోవాలంటే స్వర్ణమల్లిక చదవాల్సిందే .

పాటలు బాగా వింటుందిట స్రవంతి . మరి పాడి కూడా వినిపించొచ్చు కదమ్మాయ్ ! స్రవంతి బ్లాగ్ చూడాలంటే రిజిస్టర్ చేసుకోవాలట మరి .హాయ్ స్రవంతి , మీ బ్లాగ్ లింక్ పట్టేసుకున్నాగా .

విజయభారతిలను హాయ్ సెనొరిటా అని పలకరించి , కోనసీమ అందాలను చూసి రండి .

ఎంచక్కా బజ్జొని , బుజ్జి కవితలల్లే సుజ్జి ని కూడా పలకరించటము మరచిపోకండే !

బి.టి వంకాయల గురించి పోరాడటమే కాదు బోలెడు కబుర్లు చెపుతారు చంద్రలత గారు , మడత పేజీ లో .

కథకాని కథ , వీడ్కోలు లాంటి , కబుర్లూ కాకరకాయలు చెపుతారు మంజు .

ఉల్లసంగా , ఉత్సాహంగా ఓ అమ్మాయి ని చూడొచ్చు , మంజూష , నా అందమైన ప్రపంచములో .

memoravఅంటే ఇంగ్లిష్ బ్లాగ్ కాదండీ బాబూ , పార్వతి రాసే అచ్చమైన తెలుగు కవితల బ్లాగ్ .

రెండు నిమిషాలలో నూడుల్స్ లా , రెండే నిమిషాల లో , ఏ విషయము మీదైనా కవితల ల్లే మరువం ను నేను పరిచయం చేయటము సాహసమే !

ఏ విషయము మీదనైనా రోజుకొక టపా అలవోకగా రాసేస్తారు తృష్ణ . ఎప్పటి నుండో వెతుకుతున్న పాత పాటల లీంక్ ను నాకిచ్చి ఎంతో సహాయం చేసారు .

చిన్ని గారి బంగారానికి ఇంకా పేరు పెట్టలేదుట ! ఎవరా బంగారం ఎమా కథ అని నన్నడుగుతే ఏం లాభం ? ఇక్కడ చూడండి .

మనస్వి జయ , నేను ఎలుకలు తినే దానిలా కనిపించానా , హత్మోషి , అని వాపోతోంది . ఎక్కడ ? ఎందుకు ?

" మహేష్ బయట ఏమిటి గొడవ ?" "
ఎవరో నేస్తం జాజిపూలు అభిమాన సంఘం పిల్లకాయలట మేడం . లొల్లి పెడుతుండ్రు , సావిత్రమ్మ , చేసిన వేడి వేడి , ఖారం ఖారం పకోడిలు పెట్టనా మేడం ? "
" వద్దులే , పాపం చిన్న పిల్లలు వదిలేయ్ .'

సాఫ్ట్ వేర్ మొగుడ్స్ అని రాసి , ఆతరువత పాపం ఎక్కువగా అగుపడలేదు . నా మొదటి పోస్ట్ కు కామెంట్ ఇచ్చిన గుడ్ గర్ల్ . కదా హర్షోల్లాసం !

బోలెడన్ని మంచి మంచి కొసరు కథలు రమ్య గారి మనసు కలలు - కొసరు కథలు . నివేదన కూడా రమ్య దే .

సౌమ్య , పూర్ణిమ లు చాలా శ్రమ తో ఎంతమంచి పుస్తకాలను పరిచయము చేస్తున్నారో కదా .

తెలుగు ప్రపంచం ను చూపించే మంచి ప్రయత్న చేస్తున్నారు , కుసుమకుమారి .

మైత్రేయి గారు చాలా ఓపికగా ఎన్ని బ్లాగ్స్ రాస్తున్నారో చూడండి .

ఆంద్ర జ్యోతి లో అరుణ పప్పు గారి , బ్లాగ్స్ గురించిన ఆర్టికల్ చూసాకనే , నాకు , తెలుగు బ్లాగులు చాలా వున్నాయని , కూడలి గురించి తెలిసింది . అప్పుడే కూడలి లో నా బ్లాగ్ కలిపాను , మీకందరికీ నేను ,నాకు మీరు పరిచయం అయ్యాము . థాంక్ యు అరుణ .

నేనేమో మరి బుజబుజ రేకుల పిల్లని,బుజ్జా రేకుల పిల్లని బ్లాగేబ్లాగే పిల్లని,ఒప్పులకుప్పని,వయ్యారి భామని,తలుకులగుట్టని,మెరుపుల తట్టని...ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే,సరే మరి చెప్తాను మీరు వింటారా..? ఏదండీ ? మీనాక్షి గారు , మీరు చెప్తేగా మేము వినేది .

అబ్బో నా గురించి చెప్పాలంటే చాలా వుంది అంటున్నారు క్రాంతి అప్పుడేమి జరిగిందంటే లో . మరి చెప్పండి చదువుతాము .

బ్లాగువనమది అందరిది.... ఈ పోస్టులు అందరి కోసములే... కదా మరి .

కలలో . . . కన్నిటి అలలో . . . మాటే మంత్రమా ? ఎక్కడ ? ? ?

కమ్మటి సువాసనల తలపులు మీ మనసులో నింపే విరజాజిని. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచుని. . .

ఆకాశం లో సగం అని , మంచి కవితలు చెప్పారు నిర్మల కొండెపూడి .

నిత్య వసంతాలు , వర్షపుజల్లులు , ఆపాతమధురాలూ , అవి ఇవీ అన్ని మొహనరాగాలాలపిస్తున్నారు , పద్మ .

నీకై నా నిరీక్షణ . . . నీదే నా ఆలోచన అంటున్నారు అభిసారిక మన:స్పందన లో

పెద్దలు నేర్పిన రుచికరమైన , ఉల్లి లేని వంటలు నేర్చుకోవచ్చు ( ఉల్లి తినని నాలాటి వారికివి ఎంత ఉపయోగమో ) శైలజ గారి బ్లాగ్ లో .

పు . . పు . . పులి మీసాలు ,ఎక్కడ బాబోయ్ . నేను -అనామిక లో నండీ బాబూ !

స్వాతి శ్రీపాద గారు మనలను మబ్బుల్లో తేలించే చక్కటి కవితలు నాఊహలు .

పుస్తకం నెట్ బాగస్వామిని పూర్ణిమదే ఇంకో బ్లాగ్ ఊహలన్నీ ఊసులై .

కొంచం తపన, కాస్త ఆసక్తి, కొన్ని కలలు, కాసిన్ని ఊహలు కలిపేస్తే నేను అంటున్నారు ఓ అమ్మాయి ..


ఈ "గృహమే కదా స్వర్గసీమ" ద్వారా వంటలే కాదు ఇంటిని ఎలా అందంగా ఆకర్షణీయంగా ఉంచగలమో తెలుసుకొగలరు.. నేను శాఖాహారిని, కావున కేవలము శాఖాహరము మాత్రమే వండగలను అంటున్నారు లక్ష్మి స్రవంతి ఉడాలి .


అనుభూతుల నిధి , శృతి గారి మన స్నేహం .


వీణ వేణువైన సరిగమ విన్నారా ? వినలేదా ! ఐతే వినండి లక్ష్మి గారి నా బ్లాగ్ లో .


ప్రశాంతి , తన ఎక్స్ పిరి ఎన్సెస్ చెపుతున్నారు , బ్లాగ్ లో చూడండి మరి .


నా కొసమెరుపు పోస్ట్ కోసం చిత్రాలు వెతుకుతుంటే అనుకోకుండా నా కంట పడింది , ఈ బ్లాగ్ స్వీయరచనలు .


రండి రండి పిల్లలూ ! అమ్మా నాన్నాను పిలవండి ! తేట తెలుగు వీనండి ! మళ్ళీ మళ్ళీ వస్తుండండేం ! అంటున్నారు ,జి లలిత తెలుగు పిల్లల కోసం రాస్తున్న బ్లాగ్ లో .


వావ్ ఈ పాటల పల్లకి ఎక్కారా ? దేర్ కిస్ బాత్ కీ !! శిరీష పాటల పల్లకి ను ఎక్కేయండి .



నేను గోదావరి తీరంలో పుట్టిపెరిగినందువల్ల, ఆ నదీమతల్లిపై వున్న మమతానురాగాలతో నా ఆలోచనా తరంగాలకి 'గోదావరి తరంగాలు ' అని పెట్టుకున్నాను , అంటున్నారు జయశ్రీ తటవర్తి .


ప్రవల్లిక , తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాష ల లో చక్కటి కవితలను అందిస్తున్నారు పోయెట్రీ లో .


ఈ టీవి లో బ్లాగ్ పాఠాలు నేర్పిన లక్ష్మి బ్లాగ్ కోసం వెతికాను , దొరకలే . ఇందులో నా తప్పేమి లేదని మనవి చేసుకుంటున్నాను .


తెలుగింటి వీరనారీమణి , ఊరించే మెంతిబద్దలు . స్ స్ స్ నోట్లో నీరూరు తోందా !


ఓసారి సమీర లోకాన్ని చుట్టి వద్దామా ?


ఈ మధ్య దొరికిన ఇంకో బ్లాగ్ స్వాతి మాధవ్ గారిది .


తన పేరు తో ఎన్ని తంటాలు పడ్డారో అనురాధ గారు , ఊహలు - ఊసులు లో చెపుతున్నారు . వినండి మరి .


ఇంకా వున్నారు . . . వస్తున్నారు . . . . .

14 comments:

మరువం ఉష said...

చాలు మాలాకుమార్ గారు. కొమ్ములు మొలుస్తున్నాయని కొమ్మలు కత్తిరిస్తుంటే మీరేమో "సాహసం" అంటూ నాకు బిడియం తెప్పిస్తున్నారు. :) అతి సాధారణ స్థాయి నాది. ఎదగాల్సిన అవసరాన్ని మీవంటివారు గుర్తు చేస్తుంటారు. ధన్యవాదాలు.

మంచు said...

మా స్టార్ నే కాకుండా .. అభిమాన సంఘాలని కూడా గుర్తించినందుకు .. ధన్యవాదాలు తెలుపుతూ.. అందొళన విరమించుకుంటున్నా...
పనిలొ పని.. ఆ ఖారం ఖారం వేడి వేడి పకొడీలు మాత్రం పంపించండి... నొరూరుపొతుంది :-))

మధురవాణి said...

మాల గారూ,
సూపర్!! నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ... :-)

psm.lakshmi said...

ఎంత కష్ట పడ్డారు మాలా గారూ. మంచి పోస్టు.
psmlakshmi

సుభద్ర said...

సుపర్ గా ఉ౦ది..ఏమి రీసెర్చి మాలగారు..
రాయట౦ కూడా భలే ఉ౦ది..పైగా అన్ని అభిమాన స౦ఘలని కూడా స౦తోషపరుస్తూ....
నేను మీకో అభిమానస౦ఘ౦ పెడుతున్నా,అభిమానులు వచ్చి చేర౦డి..
హ్యాట్స్ ఆఫ్..

Srujana Ramanujan said...

:D

But u forgot my సృజనగీతం

సుజ్జి said...

నేను ఉన్నానే.. ఐతే ఓకే !! :D

మాలా కుమార్ said...

ఉషా ,
నిండు విస్తరి ఎపుడూ ఒదిగే వుంటుంది అని రుజువు చేసారు .
చాలా రోజులకు వచ్చారు . థాంక్ యు .

* మంచు - పల్లకి గారు ,
ఆందోళన విరమించుకున్నరు కదా , బతికించారు .
ఐనా మీకు పకోడీలు కట్ .

* thank you maduravani .

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
ధన్యవాదాలండి .

*సుభద్రా ,
అభిమాన సంఘం అంటూ నన్ను మొహమాట పెట్టకండి . థాంక్ యు .

*ఓకే సృజనా , ధీరసమీరే లోనే సృజనగీతం కలిపాను చూడండి .

* సుజ్జి ,
నిన్ను లేకుండా చేస్తే నా !! అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది !

తెలుగుకళ said...

గ్రేట్ జాబ్...
కొత్తవారికి స్ఫూర్తినిచ్చి వాళ్లనీ బ్లాగర్లుగా తీర్చిదిద్దే క్రమంలో ఇది తొలి అడుగు.


ఇందులో నా బ్లాగునీ పెట్టారు.ధన్యవాదాలు.. బ్లాగరిణులందరికీ శుభాకాంక్షలు..

sphurita mylavarapu said...

Wow...నా బ్లాగు ను ఇక్కడ చేర్చినందుకు బోలెడన్ని ధన్యవాదాలు. మీ ప్రయత్నం ఎంతో ప్రశంశనీయం

sphurita mylavarapu said...

నన్ను రెండవ భాగం లోనూ, మూడవ భాగం లోనూ కూడా చేర్చేసారండీ. ఒక దాంట్లోంచి తీసెయ్యండి. :)

Anonymous said...

AttayYa, Chaala bavundi..
-Ravi Komarraju

మాలా కుమార్ said...

తెలుగు కళ గారు ,
థాంక్ అండి .

*స్పురిత గారు ,
రెండు చోట్లా చేర్చేసానా ? పరవాలేదు లెండి . ఐనా అన్ని సార్లు చూసానన్నమాట మీ బ్లాగ్ !
థాంక్ యు .

రవి , thank you .