Tuesday, January 12, 2010
భారత్ మాతా కీ జై
ఈ. యం . ఈ స్లోగన్ " కరం హీ ధరం " .
ఈ.యం .ఈ ( ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) ఇండియన్ ఆర్మీ లో ఒక విభాగము . ఇది 1943 లో ఐ .ఈ.యం .ఈ గా ఏర్పడినది . తరువాత 1964 అక్టోబర్ 15 న ఈ. యం .ఈ గా మార్చారు . అప్పటినుండి ప్రతి సంవత్సరము అక్టోబర్ 15 న ఈ.యం .ఈ కోర్ డే గా జరుపుకుంటున్నారు . ప్రతి సంవత్సరము ఈ ఫంక్షన్ ను ఎవరి యూనిట్ లో వారు జరుపుకున్నాను , ప్రతి నాలుగు సంవత్సరములకు ఒకసారి , రీ యూనియన్ డే అని సికింద్రాబాద్ లో వున్న ఈ. యం. ఈ సెంటర్ మరియు యం .సి యం. ఇ ( మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) వారు సమ్యుక్తముగా ఇండియా మరియు విదేశములో వున్న ఈ.యం .ఈ ,రిటైర్డ్ అండ్ సర్వింగ్ ఆఫీసర్లను ఆహ్వానించి , కార్యక్రమములను నిర్వహిస్తారు . ఈ సంవత్సరము కొన్ని కారణాలవలన అక్టోబర్ 15 న కాకుండా , జనవరి 7 వ తారీకు నుండి 10 వరకు ఘనంగా జరుపుకున్నారు .
ఈ వేడుకలలో వివిధ బాద్యతలు నిర్వర్తిస్తున్న 8 వేలమంది అధికారుల తో పాటు , పదవీవిరమణ చేసినవారు కూడా పాల్గొన్నారు . సెరొమొనియల్ పెరేడ్ ,రీథ్ లేయింగ్ సెర్మొని , కార్నివాల్ , డిన్నర్ , బరాఖానా మొదలైన వివిధ కార్యక్రమాలను జరిగాయి . కార్నివాల్ లో సూర్య కిరణ్ సారంగ్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు , ప్యారాసైలింగ్ హాట్ ఎయిర్ బెలూన్ , శిక్షణ పొందిన డాగ్ షో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి . ఈ కార్యక్రమాలకు ,చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ చాంద్లే హాజరయ్యారు .
1 ఈ.యం .ఈ సెంటర్ లోని యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు .శత్రు సేనల తో పోరాడుతున్న వీరులను స్మరించుకున్నారు . దేశభద్రత కోసం ప్రాణాలర్పించిన వీరుల భార్యలను బహుమతులతో సత్కరించారు . రీథ్లేయింగ్ సెర్మొని లో ఈ కార్యక్రమము జరుగుతున్నంత సేపు , చెమ్మగిల్లని కనులు , భారమెక్కని గుండెలు లేవు అంటే అతిశయోక్తి కాదేమో ! ఎన్ని బహుమతులు ఇచ్చినా వారి ఋణమును తీర్చుకోగలమా ?
భారమెక్కిన హృదయాలను దలేర్ మెహంది తన ఆట , పాట తో బరాఖానా , ( ఆఫీసర్ లు , జేసిఓ లు , జవానులు , అందరూ కుటుంబాలతో కలిసి చేసిన విందుబోజనం ) లో తేలిక పరిచాడు . చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దలేర్ మెహంది తో అడుగులు కలిపి ఆనందించారు .
మరునాడు ఆఫీసర్స్ మెస్ లో జరిగిన డిన్నర్ లో ఈ. యం . ఈ జన్మదిన కేక్ కట్ చేసారు . 1943 లో ఈ.యం . ఈ లో చేరిన కల్నల్ . మదన్ సింగ్ ను , ఆయనకు 100 సంవత్సరాలు నిండిన సంధర్భము లో సత్కరించారు .
చివరగా రామోజీ ఫిలిం సిటీ లో పిక్నిక్ తో రీయునియన్ డే కార్యక్రమములు ఆనందముగా ముగిసాయి .
అన్ని కార్యక్రమములు ఒకెత్తైతే , 8 వ తారీకున , 1 ఈ . యం . ఈ సెంటర్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సెరెమొనియల్ పెరేడ్ ప్రత్యేకమైనది . ప్రతి సంవత్సరమూ , మేము ఏ ప్రోగ్రాం కి వెళ్ళినా , మానినా , ఈ ప్రోగ్రాం కు మటుకు తప్పక వెళుతాము . ( మావారు ఈ.యం .ఈ నుండి మేజర్ గా వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ) ఉదయము 7.45 కు పెరేడ్ మొదలయింది . ఆహుతులందరూ వచ్చే సరికే సైనికులు పెరేడ్ గ్రౌండ్ లో వరుసలో పొజిషన్ తీసుకొనివున్నారు . కలర్స్ - ఏదైనా బ్రాంచ్ కొత్తగా మొదలు పెట్టి , అది సక్రమముగా పనిచేస్తూ నిలదొక్కుకున్నప్పుడు , మెచ్చుకోలుగా ఇచ్చే ఝండాను కలర్స్ అంటారు . ఆ బ్రాంచ్ కు కలర్స్ రావటమును ఘనంగా భావిస్త్తారు . ముగ్గురు సైనికులు కలిసి కలర్స్ ను తీసుకొని వస్తున్నప్పుడు , ఆహుతులందరూ గౌరవ సూచకముగా నిలబడి సెల్యూట్ చేసారు . పెరేడ్ జరిగేటప్పుడు , తిరిగి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా నిలబడుతారు . " కదం కదం సే మిలాకె " అంటూ , ఈ. యం . ఈ అడాప్ట్ చేసుకున్న " సారే జహాసె అచ్చా హిందూ సితా హమారా " అనే పాటను బాండ్ వాయిస్తుండగా , సైనికులు లయ బద్ధముగా మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే చూసేందుకూ రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది . పెరేడ్ గ్రౌండ్ సైనికుల కవాతు తో పులకించి పోయింది . " భారత్ మాతాకీ జై " , " ఈ. యం. ఈ కోర్ కీ జై " అని మూడుసారులు నినాదించటము తో పెరేడ్ ముగిసింది .పెరేడ్ ముగిసినంతనే , ఆహుతులందరూ నిలబడి చప్పట్ల తో తమ అభినందనలను తెలిపారు .
పెరేడ్ ప్రాంగణమంతా దేశ భక్తి గేయాల తో మారు మ్రోగింది . అందులో కొన్ని పాటలను ఇక్కడ వినండి .
పైన ఫొటో లో వున్నది ఈ. యం. ఈ కలర్స్ .
భారత్ మాతాకీ జై .
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
చాలా మంచి పోస్ట్. వీర జవానుల, త్యాగనిరతి సామాన్య మైనది కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు కోవాల్సిన అంశాలు. ఒక సైనికుని యొక్క వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే, అతని త్యాగం ఎంత గొప్పదో పూర్తిగా అర్ధం అవుతుంది. ఎన్ని అవార్డులిచ్చినా, అవి సరి రావు. దేశానికి అంకితమైన ఆ మహోన్నత సైనికుల ఋణం తీర్చలేనిది. వారికి నా సాల్యూట్.
మీ టపా, అందులోని విషయాలు, పాటలు అద్భుతంగా ఉన్నాయండి. చాలా సంతోషం కలిగించాయి. చాలా చాలా కృతజ్ఞతలు.
మాలాగారూ,
ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన టపా అనిపిస్తోంది నాకు. మనం ఇంత స్వేచ్చగా, ఆనందంగా పిల్లా పాపలతో పండుగలు, పబ్బాలు జరుపుకుంటున్నామంటే అది ఎంతమంది వీర జవానుల త్యాగ ఫలితమో కదా అనిపిస్తుంది. అందులోనూ మీరు అందులోని వ్యక్తిగత జీవితం లోకి తొంగి చూసిన వారు. చాలా బాగా వివరించారు. కార్గిల్ వార్ జరిగినప్పుడు ఒక చిన్న పాట పిల్లల చేత స్కూల్ లో పాడించాము. అది కాస్త గుర్తు వచ్చింది.
కన్నతల్లి సిగలో పూరేకును కదల్చె నొక కౄరుడు..
కదలిరా కొదమ సింగమై... కార్గిల్ వారుకు సిధ్ధమై...//
థాంక్ యు జయ ,
మరణం ఎప్పటికీ తప్పదు , వీర మరణం వెలకట్టలేనిది .
అమ్మఒడిగారు ,
మీకు నా టపా నచ్చినందుకు ధన్యవాదాలండి .
శ్రీ లలిత గారు ,
ఈ పోస్ట్ కోసం మిమ్మలిని మంచి కవిత రాసి ఇవ్వమని అడుగుదామనుకున్నాను , కాని సమ్యము కుదరలేదు . మీ పాటకు థాంక్స్ అండి .
చక్కటి పోస్టు రాసారు మాలా గారూ.. జై జవాన్..! భారత్ మాతా కీ జై!!
మీకు కూడా మనః పూర్వక శుభాకాంక్షలు
చాలా బాగుంది మాల గారు పోస్ట్. నిజమే కదా మనం అనుభవించే ఈ స్వేచ్చ స్వాతంత్రం ఎందరి ధర్మమో.. కాసేపు చూసినట్లనిపించింది. చాలా బాగుంది.
madhuravani garu ,
kannajie garu ,
bhavana garu ,
thank you .
mala garu
very good post which everyone should read. many persons like us who do not know about the army can have very good information. very useful post.
psmlakshmi
మాలాకుమార్ గారూ !
మంచి సమాచారమిచ్చారు. మనందరికోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మీ శ్రీవారు, ఆయన జీవిత భాగస్వామిగా మీరు అందులో భాగం కావడం మాకు గర్వంగా ఉంది. మీ దంపతులిద్దరికీ అభినందనలు.
Post a Comment