Sunday, January 31, 2010

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ శోభారాజ్ గారికి అభినందన
" జో అచ్యుతానంద జో జో " పాట చిన్నప్పటి నుండి వింటున్నా , పిల్లలకు పాడినా అది అన్నమయ్య రచన అని నాకు తెలీదు . అలాగే " ముద్దు గారే యశోదా ముంగిట ముత్యము వీడు " అని మురిపెంగా పాడుకున్న పాట కూడా అన్నమయ కీరన అని , నాలాంటి సామాన్యుల కు తెలిసింది శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారి అన్నమయ్య కీర్తనల కాసెట్ల ద్వారానే . అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించటము లో శోభా రాజ్ గారి కృషి వెలలేనిది . వారి కృషిని " పద్మశ్రీ " బిరుదు తో ప్రభుత్వము సత్కరించటము సముచితము

శోభా రాజ్ గారికి " పద్మశ్రీ " లభించిన సంధర్భములో " అన్నమయ్య పురం " లో వారి విద్యార్ధులు నిన్న 30 - 1 2010 న సన్మానము జరిపారు . నా కంప్యూటర్ టీచర్ , అనిత , ఆవిడ విధ్యార్ధిని . నాకు శోభా రాజ్ గారిని కలిసి అభినందించాలన్న అభిలాష వుండటము వలన అనిత తో పాటు నేనూ ఆ సన్మాన సభ లో పాలుగొన్నాను .

అన్నమయ్యపురం లోనికి ప్రవేశించగానే ఇది అన్నమయ్య పురమా లేక ఆద్యాత్మిక పురమా అనిపించింది . అంతటా వెంకటేశుడే అగుపించాడు . పద్మశ్రీ . శోభా రాజ్ గారిని నేను , పుష్ప గుచ్చము తో అభినందించిన క్షణం , నాకు చాలా అపురూపం గా అనిపించింది . అనిత నన్ను పరిచయము చేయగానే , ఆప్యాయం గా నా చేయి అందుకున్నారు . చాలా సంతోషం వేసింది .

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారికి విద్యార్ధు లందరూ దండలు వేసి , పుష్ప గుచ్చాలిచ్చి , శాలువా తో సత్కరించారు .అన్నమయ్య కీర్తనలు ఆలపించారు . చిన్న పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .కుండల మీద నిలబడి , చేతుల లో కాండిల్స్ వెలింగించి పట్టుకొని , చిన్న పిల్లలు చేసిన భరత నాట్యం అద్భుతం . వేడుకుందా పాటకు ఆహుతుల లోనుండి కూడా కొంతమంది లేచి నర్తించారు . అందరిలో నెలొకొన్న భక్తి భావం పరమాద్బుతం ! వినాయకుడు , శ్రీదేవి , భూదేవీ సహిత వెంకటేశ్వరస్వామి , అన్నమయ్య , షిరిడీ సాయి , పకీరు వేషధారణల లో పిల్లలు చాలా ముద్దుగా అనిపించారు . అంతటా భక్తిరసం తో పులకించి పోయింది .

శోభా రాజ్ గారు , మీకు మరిన్ని పురష్కారాలు జరగాలని మనసారా కోరుకుంటూ , అభినందనలు .ఇంకా కొన్ని అన్నమయ్య సంకీర్తనలు ఇక్కడ వినవచ్చు.

6 comments:

నేస్తం said...

మా ఇంట్లో శోభారాజ్ గారి అన్నమయ్య కీర్తనల కేసెట్ ఉండేది.. నాకెప్పుడూ ఆమె పాటలు వింటే స్వామివారిని ఎంత చక్కగా తలుచుకుని సేవిస్తున్నారు.. ఎంత అదృష్టం అనిపించేది ..మంచి గాత్రం

తెలుగు అభిమాని said...

శోభారాజు గారిని పద్మశ్రీ చే సత్కరించటం చాలా మంచి విషయం. ఆమె గాత్రంలో ఒక విలక్షణత ఉన్నది. ఎంతో శ్రుతిబద్ధంగా ఉంటుంది. అన్నమయ్యగీతానికి వెంకటేశ్వరునికి ఆమె చేసిన సేవకు తగిన గుర్తింపు లభించినందుకు చాలా ఆనందంగా ఉన్నది.

భావన said...

ఈ పోస్ట్ మిస్ అయ్యనండోయ్.. అవునా నైస్. ఆమె బాగా పాడ తారు. ఇక్కడకు కూడా చాలా సార్లు వచ్చారు. అన్నమయ్య పురమా? ఎక్కడ? ఏమి జరుగుతుంటాయి అక్కడ.. వివరాలు ప్లీజ్..

మధురవాణి said...

తన జీవితమంతా తన గాత్ర మాధుర్యాన్ని ఏడుకొండలవాడికే అంకితం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప కళాకారిణికి పద్మశ్రీ ఇవ్వడం సముచితం.ఆవిడ ఇంటర్వ్యూ చదివాను ఈ మధ్య ఈనాడులో అనుకుంటా.

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
తెలుగు అభిమాని గారు ,
మధుర వాణి గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

భావనా ,
హైదరాబాద్ లో , హైటెక్ సిటీ దాటాక , శిల్పారామం నుంచి కొద్ది దూరములో ఈ అన్నమయ్యపురం వుంది . శ్రీమతి . శోభారాజ్ గారు దీనిని స్తాపించారు . వివరాలకు ఇక్కడ చూడండి .

http://annamayya.org/home.htm