Monday, September 21, 2009

పుట్టినరోజు జేజేలు




పెద్దోడు విక్కీ కి చిన్నోడు గౌరవ్ వీరాభిమాని. ఎప్పుడూ విక్కీ లా మారి పోతూ వుంటాడు. కాక పోతే నాకొచ్చిన తిప్పలేమిటంటే వీడెప్పుడు విక్కీ అయిపోతాడో తెలీదు ! గౌరవ్ , గౌరవ్ అని ఓ రెండు సార్లు పిలిచి పలకక పోతే ఓహో విక్కీ ఐపోయాడన్నమాట అని అర్ధం చేసుకొని విక్కీ అనిపిలుస్తే పలుకుతాడు. అంతటి తో ఐపోదు , నేనూ అమ్మమ్మగా పరకాయ ప్రవేశం చేయాలి . నాకైతే అలవాటైపోయింది కాని పాపం తాత బోల్తా పడిపోతారు. తాతా ఈ రోజు విక్కి వచ్చాడు అనగానే గాభరా పడిపోయి ఏమైంది ? వాడెందుకొచ్చాడు ? సంజేమీ చెప్పలేదే ? వాడికి జ్వరం రాలేదుగా ? ( ఎందుకంటే జ్వరం వంక పెట్టి స్కూల్ డుమ్మా కొట్టీ , అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయటం వాడి సరదా ) అంటూ బోలెడు ప్రశ్నలు వేయగానే హే తాత ఫూల్ అయ్యారు అని వీడు డాన్స్ ! అప్పుడు చూడాలి తాత ఫేస్ !

ఒక విక్కి ఐతే ఎలాగో సర్దుకోవచ్చు. కాదే ఎప్పుడే రూపం ఎత్తుతాడో తెలీదు.దాని కి తగ్గట్టు నేనూ మారకా తప్పదు ! అంతేనా రాత్రి కాగానే మా పక్క నిండా బెన్ 10 లు , సుపర్ మాన్ , బాట్ మాన్ అబ్బో చెప్పనవసరం లేదు అందరు సూపర్ హీరోస్ వచ్చి చేరుతారు . మేమెటో ఓ మూలకి సర్దుకోవాలి ! ఇక తాత కి నీరసమొచ్చి , నొబడీ కెన్ స్లీప్ ఆన్ మై పిల్లో అనేస్తారు. అమ్మో అదీ మరీ డేంజర్ . అందుకే వెంటనే , నో తాతా ఇట్స్ మి గౌరు అని మా గౌరు వచ్చేస్తాడన్న మాట . ఇట్స్ మి గౌరు అన్నది తారక మంత్రం .గౌరవ్ ఐతే అన్నిటికీ ఓకే ! పిల్లో మీదా పడుకోవచ్చు. తాత బొజ్జ మీదా పడుకోవచ్చు !
సరే ఇదీ రోజూ తాతా మనవడికి వుండే పోట్లాటే ! ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రోజు వాడి బర్త్ డే . మరి నేనెవరికి శుభాకాంక్షలు చెప్పాలి ?
జెర్రీ కా ?
బుడుగుకా ?
సూపర్ మాన్ కా ?
బాట్ మాన్ కా ?
పవర్ రేంజర్ కా ?
నేను గౌరవ్ ని బామ్మా నాకే చెప్పలి .
మరే నాకు ఇంగిలిపీసు రాదు కదా అందుకే తెలుగులో చెప్పాడన్న మాట.
అబ్బా బామ్మా నీకెన్ని సార్లు చెప్పాలి ? ఇంగిలిపీసుకాదు ,ఇంగ్లిష్ .
ఏమోరా బుడుగ్గా , నేనైతే తెలుగులోనే జన్మదిన శుభాకాంక్షలు అంటాను .ఇదో నీ ఫ్రెండ్ ఇంగ్లిష్ లో చెప్తుతాడు . ఎంజాయ్ !
హాపీ బర్త్ డే టు యు , హాపీ బర్త్ డే టు యు.
హాపీ బర్త్ డే డియర్ గౌరవ్ , హాపీ బర్త్ డే టు యు.





నువ్వు అడిగావని ఈ గ్రీటింగ్ కూడా పెట్టాను కదా ! ఇప్పుడు సంతోషమేనా ?
ఐ లైక్ యు సో మచ్ బామ్మా ,యు ఆర్ మై బెస్ట్ ఎస్ట్ బామ్మ .
ఈవెన్ ఐ టూ లైక్ యు సో మచ్ గౌరవ్ .
రాత్రి నేను చేసిన పొస్ట్ వాడికి పొద్దున్నే నేను చూపించగానే మా ఇద్దరి స్పందన్ ఇది . వాడి కోరిక మీద ఇంకో గ్రీటింగ్ పెట్టాను.సాయంకాలం లోపు ఇంకెన్ని ఆడ్ అవుతాయో !

24 comments:

మరువం ఉష said...

I feel so jealous :) very nice of you mala garu. He must so thrilled. I hope he has scintillating celebration and bless himwith many more to come like this one.

సిరిసిరిమువ్వ said...

మీ ముద్దుల మనవడికి జన్మదిన శుభాకాంక్షలు.

జయ said...

ఎప్పుడెన్ని అవతారలెత్తినా, ఈ రోజు మాత్రం గౌరు గాడే. Happy Birth Day my dear Gauru.

భావన said...

Hai Gaurav,
Many Many happy returns of the day. Happy Happy Birthday. What did you get for Birthday? let us know how you celebrated...

జ్యోతి said...

Happy Birthday Gourav

మీకు కూడా అభినందనలు. మావాడికోసం చాలా కష్టపడ్డారు.

Srujana Ramanujan said...

Heyyyyyyyyyyyyyyyyyyyyyy Gaurav,

Many Many happy returns of the day. U know me? We said Hi to each other many times.

Enjoy the day Gaurav/Spidey/Super man/Power ranger/Jerry/Ben 10 ;-)

sunita said...

Happy Birthday to Gourav.

శ్రీలలిత said...

మా మనవడి కోసమే నేనూ కంప్యూటర్ నేర్చుకున్నాను. అసలు కంటే వడ్డీ ముద్దని వాళ్ళతో ఆడుకోడంలో ఎంత ఆనందమో కదా.. కాని మా మనవడు నా దగ్గర లేడే. మిమ్మల్ని చూస్తుంటే అసూయ పుడుతోంది. ఏమనుకోకండేం.. చిన్ని గౌరవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

HAPPY BIRTHDAY, GAURAV...

సుభద్ర said...

dear gourav(budugu gaa),
neeku telidaa maa amdariki nuvvu budugu gaane telusu,mee naannamma ni adugu maaku alaane cheepparu mari!!!!
happy birthday to you.
naannamma ki inka bOlEdu aanamdaalu ivvali..

మాలా కుమార్ said...

@ఉష గారు,
@సిరిసిరి మువ్వ గారు ,
@జయ ,
ధన్యవాదాలండి.

మాలా కుమార్ said...

భావన గారు ,
మూడు రోజుల పుట్టినరోజండీ బాబూ వాడిది. స్కూల్ బర్త్ డయ్, వీకెండ్ పార్టీ , రియల్ బర్త్ డే .
థాంక్యు .

మాలా కుమార్ said...

జ్యోతిగారు,
థాంక్స్ అండి.
ఎవరి కోసం కష్టపడుతుంది బామ్మ మనవడా ? మజాకా ?

మాలా కుమార్ said...

రాం గారు ,
చాలా థాంక్స్ అండి .
మీ ఇంటరెస్ట్ కి మెచ్చుకోవాలి . తప్పక ఇన్స్టాల్ చేసుకుంటాను.

మాలా కుమార్ said...

సృజన ,
మిమ్మలిని వాడు మరిచిపోవటమా ?
నీ ఫ్రెండ్ తో నేను చాట్ చేయనా ? అంటూ ఎప్పుడూ అడుగుతుంటాడు !
థాంక్ యు ఫర్ ఎ బిగ్ విష్ .

మాలా కుమార్ said...

సునీత గారు,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు ,
నేనూ మా మనవడి కోసమే కంప్యూటర్ నేర్చుకున్నానండి.
మా పిల్లలు యు యస్ లో వున్నంత కాలమూ వాళ్ళ వయసు వారినేవరిని చూసినా చాలా ఎమోషనల్ అయిపోయేదానిని. కళ్ళు నిండి పోయేవి, గొంతు పూడుకు పోయేది , ఇప్పుడేమో ఒక్క నిమిషం వదలను. నా కమ్మటికల, జీవనతరంగాలు సీరియల్ లో చెప్పినట్లు మావారి తో రోజూ చివాట్లు తింటున్నాను. అందుకని మీ ఫీలింగ్స్ నేను అర్ధము చేసుకోగలనండి . ఏమీ అనుకోను.
మా వాడిని దీవించినందుకు ధన్యవాదాలండి.

మాలా కుమార్ said...

సుభద్ర గారు,
ఇది చాలా అన్యాం సుమండీ ! వాడి పుట్టిన రోజున మాఇద్దరికి గొడవపెట్టేసారు .
ఏరోజు ఎలా పిలిచినా పరవాలేదు ,కాని బర్త్ డే రోజు మాత్రం గౌరవ్ నే !
అందుకే ఈ రోజు చెప్పా నిన్ను బుడుగు అన్నారురా అని ,ముసిముసిగ నవ్వేసుకుంటున్నాడు.
మా బుడుగ్గ్గాడు మీకు థాంక్స్ అంటున్నాడండి .

psm.lakshmi said...

మాలా,
చాలా అదృష్టవంతులండీ మీరు. చాలా సంతోషం.
బుడుగూ, హమ్మయ్య నేను చూడటం ఆలీసెమయ్యిందిగనుక బుడుగూ అనెయ్యగలిగాను. పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకుని వుంటావు. ఇలా చాలా బోల్డు, పుట్టినరోజు పండుగలు మీ ఇంట్లో, బయట అందరితో సంతోషంగా గడుపుకోవాలని ఆశీర్వదిస్తున్నా.
psmlakshmi

ushamanyam said...

To Dear GAURAV, you are.....

Golden Affectionate Ultimate Ravishing Attractive Vibrant boy.

HAPPY BIRTHDAY to you!

love
YAMINI

మురళి said...

Many more happy returns of the day Master Gaurav..

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
మీరు ఆశ్వీరదించినందుకు చాలా సంతోషమండి .

మాలా కుమార్ said...

yaamini akka,
thank you

మాలా కుమార్ said...

murali garu ,

thanks andi .

sreenika said...

అయ్యో..
I am sorry Gouru, I could'nt attend ur b'day. But I found here many. Enjoyed a lot na. Any how belated wishes..Happy b'day.