Tuesday, September 15, 2009

బాల్యమిత్రులునిన్ను శ్యాం వాళ్ళింట్లో దింపి నా పనిచూసుకొని, వస్తాను. అందరము పంచరతన్ కి లంచ్ కి వెళుదాం .శాంతి లో మూవీ చూద్దాం .

ఏమిటీ మాట్లాడవు .నీకేమైనా పనులున్నాయా ?

నా మొహం నాకేం పనులు ? కాకపోతే మాట్లాడుతున్నది మావారేనా ? ,వింటున్నది నేనేనా ? ఇది మా ఇల్లేనా ? ఏమిషో ...... అంతా మాయా .నా స్వగతం లో నేనుండగా ? మళ్ళీ వినిపించింది , ఇది మాయ ,కల కాదు అంటూ మావారి గొంతు, ఏమిటీ సరేనా ?

ఆ సరే సరే ! మళ్ళీ మనసు మార్చుకునే లోపల ఘట్టిగా చెప్పాలిగా !

మావారి ప్రోగ్రాం వినగానే అటునుంచి లీల నమ్మలేక , ఫోన్ నా కిమ్మంది.

ఏమిటి మాలా ప్రభాత్ చెపుతోంది నిజమేనా ?

ఇద్దరమూ ఆ షాక్ లో వుండగానే ఇంకో షాక్ ఫొటో కూడా తీయించుకుందాం !

ఇంతకీ ఈ హడావిడి ,ఈ షాక్ లు ఎందుకంటే సెప్టెంబర్ 13 మావారి బర్థ్ డే , 14 మావారి జిగిరి దోస్త్ శ్యాం బర్త్ డే . ఓ అల్లనప్పుడు 13 రాత్రి 12 గంటలకు ఇద్దరితో కేక్ కట్ చేయించి పిల్ల పెద్ద అందరమూ తెగ అల్లరి చేసేవాళ్ళమన్నమాట !

మేము ఆరునెలలు అమెరికా ,ఆరునెలలు ఇండియా ప్రదక్షణలు పూర్తికాగానే ,శ్యాం లీలా ఓ ఆరు నెలలు సింగపూర్ , ఓ ఆరు నెలలు బెంగుళూర్ ప్రదక్షణ మొదలు పెట్టారు. మా ఈ భూప్రదక్షణలలో మా ప్రోగ్రాములు మా తో పాటు తిరగలేక ఆగిపోయాయి ! మా ప్రదక్షణలాగాయి కాని వాళ్ళవి ఇంకా ఆగలేదు !

మరి మీరు మీ దూడలని మీ పెరట్లో కట్టేసుకున్నారు .మా దూడలింకా దేశాల మీదే వున్నాయి అని లీల ఉవాచ ! ఇదో అనుకోకుండా ఇలా కాలం కలిసిరావటము ,మావారికి బర్త్ డే కి ప్రొగ్రాం వేసుకుందా మనిపించటము జరిగింది.

కార్ లో మావారిని అడిగాను మీకు, శ్యాం కి ఎప్పటినుంచి ఫ్రెండ్షిప్ అని . బహుషా 61 నుంచి అనుకుంటా , ఇద్దరము ట్యూషన్ లో కలిసాము . అంతే ఆ తరువాత సెల్ లో మునిగి పోయారు.

శ్యాం ని విష్ చేసి మావారు మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాక , శ్యాం మిమ్మలిని ఇంటర్వ్యు చేద్దామనుకుంటున్నాను అన్నాను.

ఓ కే అడుగు ఏమడుగుతావో

మీరు ,ప్రభాత్ ఎలా ,ఎప్పటినుండి ఫ్రెండ్స్ ?

1960 లో నరసిం హ రావు సార్ దగ్గర మాథ్స్ ట్యూషన్ లో కలిసాము ,అప్పుడు అంటూ ఉత్షాహం గా మొదలు పెట్టగానే ,లీల లోపలి నుండి వచ్చి ఏంచెప్తున్నారు ? అంది.

వీళ్ళిద్దరి స్నేహితం ఎప్పుడు మొదలయిందా అని అడుగుతున్నాను.

అవునుకదూ ఇన్ని సంవత్సరాలయినా నేనెప్పుడూ అడగలేదు. నేను మటుకు ప్రభాత్ ని 61 లో క్వాలిటీ హోటల్ లో కలిసాను . అప్పుడు టీ తాగాము కదా శ్యాం , ఆ హోటల్ ఆబిడ్స్ మేన్ రోడ్ మీద వుండేది ,ఇప్పుడు అక్కడంతా మారి పోయింది అంటూ ఇంకా ఏమో చెప్ప బోతూ శ్యాం ను చూసేసరికి ఆయన మొహానికి అడ్డం గా పేపర్ ! ఇదేమిటి ?

నన్ను మాల అడుగుతుంటే నువ్వే చెప్పేస్తున్నావు నేనెందుకు మాట్లాడాలి ? నువ్వే చెప్పు . నేను చెప్పను .

అంతే బర్త్ డే బాయ్ అలక తో నా ఇంటర్వ్యూ కి బ్రేక్ !

నా బిక్క మొహం చూసి లీల , వంక లేనమ్మ డొంక వెతికిందిట ! పొద్దటి నుండి మా ఆయన గారు పేపర్ చదవలే అదీ బడాయ్ ! అంది.

హన్నా ! నన్నే ఇంత మోసం చేస్తారా ? చూడండి ఏం చేస్తానో ! వచ్చే సంవత్సరం ఇదేరోజున మీ ఫ్రెండ్షిప్ గొల్డెన్ జూబ్లీ డే సెలబ్రేట్ చేసి మిమ్మలిని సెల్ నుంచి, పెపర్ నుంచి బయటపడేసి , మీతోటే మీ బాల్యమిత్రుల కథ చెప్పించక పోతే ఏం చేద్దాం ఏదో వొకటి ఇదే నా ప్రతిజ్ఞ !

మిత్రులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .

15 comments:

సుభద్ర said...

బాల్యమిత్రులకి పుట్టినరోజు శుభ కా౦క్షలు...
సూపర్ గా రాసారు...ఇ౦క అ౦ద౦గా ముగి౦చారు.

జయ said...

Many happy returns to both of them. Have a nice Day & enjoy your self.

Srujana Ramanujan said...

bhale rasahru. thamashaagaa undi.

Happy Bday to both.

శ్రీలలిత said...

మిత్రులిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Anonymous said...

Fantastic...

"Yeh Dosti Hum nahi chodenge" annttu this is very good.

Many happy returns to both of you

-Ravi Komarraju

నేస్తం said...

చాలా బాగా రాసారు మనసెంటో చాలా హాయిగా అనిపించింది ఈ పోస్ట్ చదవగానే

Anonymous said...

Very cute mom - Mithrulu iddaru murisi pottunaaru with the bouquet ! Sanju.

మురళి said...

మరీ యేడాది ఆగమంటారా 'డబుల్ ధమాకా' కోసం??

మాలా కుమార్ said...

సుభద్ర గారు ,
ఏమిటో మీ అభిమానం నేనేమి రాసినా సూపర్ అంటారు .
థాంక్సండి.

మాలా కుమార్ said...

@jaya,

@srujana ,

@srilalita gaaru ,

thank you.

మాలా కుమార్ said...

thank you ravi

మాలా కుమార్ said...

నేస్తం గారు,
మీరు మెచ్చుకుంటే నాకు చాలా సంతోషంగా వుంటుందండి.
థాంక్ యు.

మాలా కుమార్ said...

డబుల్ ధమాఖా ! టైటిల్ భలే వుందే !
మురళి గారు, ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

సంజు,
ఫొటో భంగిమలు లేకుండా బాగా తీసాను కదూ !

ఉష said...

స్నేహితుల గురించి ఏమి విన్నా చాలా హాయిగా వుంటుంది. చక్కని వారి స్నేహం మరిన్ని పుట్టినరోజుల్ని కలిపి జరుపుకోవాలని ఆశిస్తూ..