Monday, December 29, 2008
అత్తవారిల్లు
చిన్న ఛిన్నగా ఇక్కడ అలవాటు పడుతున్నాను. కుంపటి అంటించటము వచ్చింది.కొన్నిటికి కుంపటి బాగుంటుందని అనిపిస్తుంది ..వదిన,అత్తయ్య పిలుపులకు అలవాటు పడ్డాను.మొదట్లో ఎవరినో అనుకునే దాన్ని.ఉమా ,శ్రీదేవి ముందు పెళ్ళికూతురు అత్తయ్య అన్నారు.తరువాత కొత్తతయ్య,అత్తయ్య,ఇప్పుడు పెద్ద అత్తయ్య.వదినగారు పిల్లలకి ఎగ్జిబిషన్ చూపించాలని తీసుకొని వచ్చారు.శ్రీదేవి ఉమా వెంటవెంట తిరిగారు కాని రమ దూరంగానే వుంది.ఇంకా చిన్నది కదా !ఉమా ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా మా వెంటే తిరిగింది.మాతో పాటు రిక్షా లో వచ్చేది.తన పెళ్లి అయనప్పుడు నువ్వు మాతో వచ్చావు కదా ఇప్పుడు నీతో బిపు ను పంపన అంటుంటే వాడు ముందే నేను వెళ్లను అనేసాడు.పిల్లలంతా సరదాగా వున్నారు.విజయ క్లోజ్ అయ్యింది.వెంకట్ ఫ్రెండ్స్ బాబి, మీనా,రాజగోపాల్ అందరు నన్ను కూడా వాళ్లవెంట పబ్లిక్ గార్డెన్ కి సినిమా కి తీసుకెళ్ళేవారు.పాపం అందరు నాకు అన్ని నేరిపించే పని వాళ్లభుజాల మీద వేసుకున్నారు.మొత్తానికి మూడు నెలలు గడచి పోయాయి.కాని చపాతీ లు చేయటము పూర్తిగా రాలేదు.నేను చేసిన ప్రతి చపాతి కిఒక పేరు పెట్టేవారు మా మరిదిగారు వెంకట్. ఇది వరల్డ్ మాప్న ఇందులో అమెరికా ఏది ఇండియా ఏది అని ఏడిపించే వారు.ఏప్రిల్ లో ఆయన వచ్చారు. రెండు నెలలు బిజీ గా అయిపోయాయి.ఆయన ఫ్రెండ్స్ మూడు జంటలు ప్రేమికులు వున్నారు.అందులో ఒకరు శ్యాం లీల. వాళ్ల పెళ్లి మార్చ్ ఆరున అయ్యినిది. దానికి నేను అత్తయ్యగారు వెళ్ళాము.ఆర్య సమాజ్ పద్దతి లో అయ్యింది.అందరిని ఎదిరించి చేసుకున్నారు సినిమా లో ల. ఒకసారి అందరమూ బయటి కి వెళ్ళాము. అప్పుడు ఆ మూడు జంటల లోని ఒక అమ్మాయి ని తీసుకు రావటానికి ఆమె హాస్టల్ కి నేను లీల వెళ్ళాము.వేల్లూ ప్రేమికులేనా అని లీల ని అడిగాను. తరువాత ఆయన నన్ను కోపం చేసారు .ఎదైనా అడగాలంటే నన్ను అడుగు అన్నారు.. ఏమిటో గోల .జూన్ లో తిరిగి పటియాఅల వెళ్ళాలని టికెట్స్ బుక్ చేసారు.వెళ్లేందుకు కావలసిన సామానులు కొన్నాము. అమ్మ ఏవో ఇత్తడి సామానులు ఇచ్చింది.స్టీల్ ఇవ్వకూదదట.భాటియా షాప్ లో స్టీల్ సామానులు కొన్నాము.ఆ కంచాలు గ్లస్స్లూ స్పూన్స్ ఇప్పటికి వున్నాయి.అవి గౌరవ కి ఇస్త్తారట.నగేష్ పెళ్లి లో కుక్కర్ ఇచ్చాడు.అమ్మ కొన్ని చీర లు ఇచ్చింది.అందులో నేను పెళ్లి చూపుల కు కట్టుకున్న క్రీం కలర్ చీర కూడా వుండి.అయన ఫేవరేట్ కలర్ క్రీం కలర్ .అన్ని సామానులు ఒక చేక్కపెట్ట లో వచ్చాయి.చీరలు ఒక సూట్ కేస్ లో సరి పోయాయి.ప్రయాణానికి సిద్దం.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
This is great attayya. I told you, you can do it. I'd like to read more of this from you. I've read all the postings and am excited. I'm sure you can write on many more topics. Good luck
Post a Comment