Sunday, December 28, 2008

పెళ్లిరోజు

పదకొండో తేది డిసెంబెర్ ఈ రోజు కి పేళ్లి అయి నలభయ్ సవత్సరాలు అయ్యింది.గుడి కి వెళ్లి అమ్మ దగ్గరకు వెళ్ళాము.సాయంకాలము సంజు సతీష్ విక్కి వచ్చారు. అదితి ఎగ్జామ్స్ మూలంగా రాలేక పోయింది. గ్రీటింగ్కార్డ్ స్వీట్స్ తెచ్చారు.మేఘ ఆ కార్డ్ లో తన పేరు గౌరవ్ పేరు కూడా రాసింది.అందరమూ నవ్వుకున్నాము.నేను బాల్కనీ లో కూర్చొని వుంటే సంజు కూడా వచ్చింది అమ్మ ఈ ఫార్టీ ఇయర్స్ లో నీకు ఆనదం కలిగిన సంగతులు పెళ్లి రోజు పిల్లలు పుట్టిన రోజు కాకుండా ఏమున్నాయి? అంది.పెళ్లి జీవితం లో అవి కాకుండా ఇంక ఏముంటాయి?అయ్నాఆ ప్రశ్న నన్నుఆలోచనలో పడేసింది.ఆరోజు నవంబెర్ ఫస్ట్ .అమ్మ ఇంటికి చుట్టాలు వస్త్తున్నారు అని కొత్త లంగా వోని వేసుకొని తాయారు అవమంది.చాలమంది వచ్చారు.ముగ్గురు పిల్లలు కూడా వున్నారు.వాళ్ళపేర్లు ఉష విజయ శ్రీదేవి అట.వాళ్ళలో పెద్దాయన రామారావు మమయ్యగారి ఫ్రెండ్ అట.ఆయన ఏవేవో ప్రశ్నలు చాల అడిగారు.చాలాసేపు కూర్చున్నారు.ఇల్లంతా చూసారు.వెళ్ళేటప్పుడు అందులో పెద్దావిడ నాకు బొట్టు పెట్టి చిట్టి చామంతి పూలు ఏవో పళ్ళు ఏవో గుర్తు లేదు ఇచ్చారు.నాకెందుకు ఇస్తున్నారా అనుకున్నాను.ఆతరువాత ఆ సంగతి మరచి పోయాను.పదిహేను రోజుల తరువాత మల్లి వస్తున్నారు అని ఈసారి చీర కట్టుకోమని చెప్పింది అమ్మ .పక్కనే వున్నా గిరిజ కి నాకు చీర కట్టమని చెప్పింది.ఈ సారి వాళ్ళతో పాటు వక అబ్బాయి కుడా వస్తాడు,అతను పెళ్లి కొడుకు అని చెప్పింది.

No comments: