Sunday, December 28, 2008

కల్యాణం కమనీయమ్

అమ్మ కొత్త చీర క్రీం కలర్ ది కట్టుకున్నాను.రెండు సవరల తో గిరిజ జడ వేసింది.పెళ్ళికొడుకు ఆర్మీ లో కెప్టెన్ అట.గిరిజ లోపలికి వచ్చి పెళ్ళికొడుకు బాగున్నాడు ఆతను కూడా క్రీం కలర్ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పింది.చూసి వెళ్ళిపోయారు.పదిహేను రోజుల తరువాత నవంబర్ 30 న మళ్ళివచ్చారు.ఈసారి వాళ్లతో పాటు ఇంకో అతను కూడా వచ్చాడు. అతనూ ఆర్మీ లో కెప్టెన్ అట .అందరమూ కలిసి డ్యాం దగ్గరికి వెళ్ళాము.అక్కడ శివాలయము వుంది.గుళ్ళోకి వెళ్దామా అని అడిగారు.అదె మొదటి మాట. గుడి లోకి వెళ్ళాము .అప్పుడే అమ్మ నాన్నగారు వాళ్లతో పాటే వెళ్లారు.
.తరువాతంత హడావిడి.అందరమూ హైదరాబాద్ వెళ్ళాము.డిసెంబర్ పదకొండు న పెళ్లి. చెల్లాయి పిన్ని ఇంట్లో ఒక పోర్షన్ రెంట్ కి తీసుకున్నాము.పక్కనే సినిమా హాల్ .బసంట్టకీస్ అందులో సినిమా ఏమిటో గుర్తు లేదు కానీ దాంట్లో ని పాట జీవితాన మరువలేము ఒకే రోజు అదె పెళ్లిరోజు అనే పాట పదేపదే వేస్తున్నాడు.సందర్భానికి తగ్గ పాట కదా అని పార్వతి అంది. అసలే తనకి భావుకత ఎక్కువ. వెంటనే పట్టేసింది.ఇద్దరమూ ఆ పాట ని ఎంజాయ్ చేసాము.
మీ అత్తగారు వస్తుందట. నిన్ను షాపింగ్ కి తిసుకేల్తారట.వాళ్లు ఏది కొంటే అదే తీసుకో అని అమ్మ చెప్పింది.షాప్ లొ వదినగారు నీకే కలర్ ఇస్తం అంటే పింక్ అని చెప్పాను .మళ్ళీ అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది.మీ ఇష్టం అన్నాను. కాని క్రీం కలర్ కి పర్పుల్ బార్డర్ చీర చాలా నచ్చింది .దాన్ని వదల లేక పోయాను . కావాలని చెప్పలేక పోయాను . మొత్తనికి ఆ చీరైతే తీసుకున్నాము .
పెళ్లిరోజు పొద్దున్నే ఇడెన్ బాగ్ మారేజ్ హాల్ కి వెళ్ళాము .నన్ను చూడతానికి ఆయన ఫ్రెండ్స్ దామోదర్ , నగెష్ వచ్చారు.కూర్చొమని పార్వతి చాప వేసింది.వద్దని నిలబడే మట్లాడి వెళ్లి పోయారు. తరువాత ఆయన జెంట్స్ కి చాప వేస్తారా అని అన్నారు.మీ ఫ్రెండ్స్ కదా మర్యాద చెద్దమనుకున్నము .ఇంకెమి చెయలొ మకు తెలిదు. అప్పుడు మెమిద్దరమె వున్నము.అని చెప్పాను . కానీ ఎప్పుడు గుర్తుకు వచ్చినా నవ్వు వస్తుంది.

పెళ్లి చాలా బాగా అయ్యింది అని అందరు అన్నారు.నా తో పిన్ని బాబాయి గిరిజ పార్వతి మూడు నిద్రలకి వచ్చారు.బాబాయి గారు అత్తగారింట్లో ఎలా వుండాలి హితబొధ చేసారు .అయన చెపుతునంతసేపూ గిరిజ, పిన్ని ఒకటే జొకెస్.సత్యనారాయణవ్రతం కి మా అత్తగారి చీర ఏడు గజాలది కాస పోసి కట్టారు.ఎవరు కట్టారో గుర్తు లేదు.పెళ్లి తరువాత అమ్మ పిన్ని నన్ను తీసు కొచ్చి అత్తగారింట్లో వదిలారు. వాళ్ళు వెళ్లి పొతోంటే చాలా భయ్యం అయోమయం ఏం చేయలో తెలీలేదు . వచ్చేటప్పుడు జయ బిక్కమొహం వేసింది.అప్పటి వరకు అక్క పెళ్లి హడావిడి లో వుండి అక్కవెల్లి పొతుంది అనుకొలెదు.
ఆ రొజె తిరుపతి వెళ్ళాము.అమ్మావాల్లు తిరిగి చలకుర్థి వెల్లుతున్నారు. మమ్మలిని పంపటానికి స్టేషన్ కి వస్థా మన్నారు. రాలేదు ఎందుకొ అను కున్నాను. తరువాత తెలిసింది.వాళ్ళు బయిలు దెరుతుంటే చిన్న చెల్లెలు ఉష కింద పడిందట .అత్తయ్యగారు మామయ్యగారు మేమిద్దరం తిరుపతి వెళ్ళాము.అటినుంచి మేము మద్రాస్ వెళ్ళాము.దాష్ ప్రకాష్ హొటేల్ లో వున్నాము .బీచ్ లో తిరగటము , ఫస్ట్ హింది మూవి బ్రహ్మచారి చూడటం , హైదరాబాద్ వచ్చాక ఫ్రెండ్స్ గండిపేట పిక్నిక్ వెల్లటము రోజులు ఫాస్ట్ గా అయిపోయాయి. టాంక్ బండ్ మీద ఇద్దరమె చలిలొ ఐస్ క్రీం తింటూ వాకింగ్ చేయటము మరుపురానిది. అప్పుడే పాపం కోరరాని కోరిక కోరారు .బలవంతం చేసారు .తప్పుతుందా జీవితమే సఫలమో రాగసుధా భరితమో అని పడాను .ఆతరువత మల్లి ఇంత వరకు నన్ను పాట పాడ మని అడుగుతే వట్టు .నేను ముందే చెప్పను పాడలేనని వింటేగా .కాని నా పాట సందర్భాని కి తగినట్లు వుండి. నకు నచ్చింది. పదిహేను రోజులు ఎలా గడిచాయో తెలీదు .జనవరి సెకండ్ న లీవె ఐ పోయింది. ఏప్రిల్ లో వచ్చి తీసు కెల్తాను ఈలోపల అమ్మ దగ్గర వంట నేర్చుకో అని, ఇంగ్లిష్ నేర్చుకో అని ఆంటీ స్కూల్ లో జాయిన్ చేసి పటియలా వెళ్ళిపోయారు.

No comments: