Monday, August 9, 2021

Face Book Kathalu EP:04 నొప్పింపక తానొవ్వక Telugu Audio Book podcast ...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఇప్పుడు నేను ఫేస్ బుక్ కథలు చెపుతున్నాను కదా. ఈ రోజు నేను చెప్పబోయే కథ "నొప్పింపక తానొవ్వక" ఫేస్ బుక్ కథల గ్రూప్ లో రాసింది. ఈ కథ కొంత వరకూ ఎడ్మిన్స్ ఇచ్చారు. ఆ కథకు కొనసాగింపు మనం రాయాలన్నమాట. అదీ 400 పదాలల్లో. ఈ టాస్క్ పేరు కథ మాది- ముగింపు మీది. సరే వారిచ్చిన కథకు సరిపోయేట్టుగా రాయాలంటే కాస్త ఆలోచించాలిగా. పైగా నాకు నేను పెట్టుకున్న నియమం ప్రకారము నేను విషాదము కానీ, నెగిటివ్ మెసేజ్ వచ్చేట్లుగా కానీ, కాంట్రవర్సియల్ గా కానీ రాయకూడదు. ఈ కథలో ఒకే ఒక్క పాయింట్ చుట్టూ నా ఆలోచనలు తిరిగాయి. అదేమిటంటే భర్త చనిపోతే, శారద పిల్లలను చక్కగా పెంచి, ప్రయోజకులని చేస్తుంది. వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు. కానీ తను రిటైర్ అయ్యాక గోల్డేజ్ హోం లో ఉంటుంది. ఇక ఇంకో వాక్యము జానకి తో మాట్లాడేటప్పుడు, "అదేంటీ!? నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా!?" పట్టలేని ఆశ్చర్యంతో శారదవైపు చూస్తూ అంది జానకి. "అవును!? ఏం!? అయినా...! అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వూ ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను!?" చప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కు తీసుకుంది శారద." శారద ఓల్డేజ్ హోం లో ఎందుకుంది? చేయి ఎందుకు వెనకకి తీసుకుంది? ఈ రెండూ పాయిట్స్ ను హైలైట్ చేస్తూ నెగిటివ్ ఆలోచన రాకుండా పాజిటివ్ గా చూపించాలి. చాలా ఆలోచించాను. ఒకానొక సారి శారద గురించి ఎందుకు, జానకి గురించి రాయొచ్చుగా అని కూడా అనుకున్నాను. కానీ మనసొప్పలేదు. ఇక అమెరికాలో ఉన్నట్లుగా ఎందుకు రాయాలి? ఇండియాలో ఉన్నట్లుగానే రాయవచ్చుగా అంటే, ఇండియాలో ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ అమెరికాలో పిల్లలు ఉన్న పేరెంట్స్, అమెరికా వెళితే పిల్లలతోనే సద్దుకొని ఉండాల్సివస్తోంది ఇప్పటి వరకు. అలా కాకుండా అమెరికాలోనే సిటిజన్ సెంటర్ లో ఉన్నట్లు రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ కథకు రూపం. అదో చాలెంజ్ గా తీసుకొని రాసాను. మరి మీరూ విని ఎలా రాసానో చెపుతారుగా. ఇక కథ వినండి. నా కథ, నా ఛానల్ మీకు నచ్చుతే సబ్స్క్రైబ్ చేయటమూ, షేర్ చేయటమూ మర్చిపోకండీ. సబ్స్క్రైబ్ చేసి ఉంటే ధన్యవాదాలు :) నొప్పింపక తానొవ్వక

Sunday, August 1, 2021

Face book kathalu EP: 03 High School Sweet Heart podcast by Mala Kumar

ఇప్పటి వరకూ నా ప్రభాతకమలం లో "ఏమండి కథలు," "కమలీ(నీ)యం" నా చిన్ననాటి కథలు, వివిధ అంశాల మీద నేను రాసిన "నీ జతగా నేనుండాలి లొని కథామాల" కథలు విన్నారు. లాస్ట్ ఎపిసోడ్ నుంచి నా ఫేస్ బుక్ కథలు వినిపిస్తున్నాను. అవేమిటంటే... నేను సంవత్సరం క్రితము ఫేస్ బుక్ లోని వివిధ కథల గ్రూప్ లల్లో చేరాను. ఆ గ్రూప్ లల్లో వివిధ అంశాల మీద కథ రాయమంటారు. అంటే ఒక చిత్రమో, ఒక పదమో, ఒక వాక్యమో, లేదా కొద్ది కథనో ఇచ్చి, దానికి సరిపోను కథ రాయమంటారు. అదీ వారు చెప్పినన్ని పదాలల్లోనే మొత్తం కథను, భావము, కంటిన్యుటీ చెడకుండా రాయాలి. వర్ణలూ, ఉపోద్ఘాతాలూ, వివరణలూ వగైరా వగైరా లేకుండా మినీ కథలల్లోనే మొత్తం చెప్పేయాలన్నమాట. సో ఇదేదో బాగానే ఉందని నేనూ రాస్తున్నాను. అలా రాసినవే నా ఈ ఫేస్ బుక్ కథలు. ఈరోజు నేను వినిపించబోయే కథ 'వివాహబంధం' గురించి "పొన్నాడవారి పున్నాగవనం" గ్రూప్ లో, శ్రీమతి. వెలగపూడి భారతిగారు నిర్వహిస్తున్న "చిన్నారి పొన్నారి చిట్టి మందారాలూ - చిన్న కథలూ" లో నేను రాసిన "హై స్కూల్ స్వీట్ హార్ట్స్" కథ, ఇంకా దానిమీద భారతి గారు చేసిన సమీక్ష. మరి కథ విని మీ అభిప్రాయం కూడా చెపుతారు కదూ ఈ వీడియోకు ఇంకో విశేషము కూడా ఉంది. అదేమిటంటే దీని మీకు తెలుసుగా రచన, వాయిస్ నావేనని, ఇంకా కవర్ పేజ్, ఆడియో ఎడిటింగ్, వీడియో మిక్సింగ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి, పోడ్ కాస్ట్ చేయటమూ అన్నీ నేనే చేసాను. దాదాపు నెలరోజులుగా ఇవన్నీ చేయటము నేర్చుకుంటున్నాను. నా వీడియో ఫ్రెండ్ Ramya Vuddanti మీరు నేర్చుకుంటారు, మీరు చేయగలరు అని నన్ను ప్రోత్సహించి, స్కైప్ లో బేసిక్ నేర్పించి, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ వీడియోల లింక్స్ ఇచ్చింది. రమ్య స్కైప్ క్లాస్, నోట్స్, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ క్లాస్ ల వీడియోలూ చూస్తూ ప్రాక్టీస్ చేసి, పోయినసారి వీడియో రమ్య సహాయముతో, ఈ సారి వీడియో పూర్తిగా స్వయంకృషితో పోడ్ కాస్ట్ చేసాను. ఇంకా ఆడియో ఎడిటింగ్ పూర్తిగా రాలేదు. మా పిల్లలు పరవాలేదు బాగుంది అని భరోసా ఇచ్చారు. ఇక ఇప్పుడు మీరు విని ఎలా చేసానో చెప్పండీ :) చిన్నారి టీచరమ్మ రమ్యకు ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=btkrKItYTv0

Tuesday, July 27, 2021

Facebook Kathalu Podcast by Mala Kumar | E0 2 Mount Rushmora lo Radhamad...

మౌంట్ రష్మోరా లో రాధామాధవులు నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం లాంగ్ వీకెండ్ అమ్మాయి, పిల్లలతో కలిసి మౌంట్ రష్మోరా వెళ్ళినప్పుడు, ఆ కొండలూ, ఆ అడివీ, ఆ ప్రకృతి చూసినప్పుడు నా మనసులో రాధామాధవులు మెదిలారు. వారి ప్రేమ అమరం. ఎన్ని యుగాలు గడిచినా మరువలేనిది, మధురమైనది. రాధామాధవులు ఎక్కడుంటే అదే బృందావనం. నా ఆభావననే ఈ కథగా రూపుదిద్దుకుంది. ఆ కథే మౌంట్ రష్మోరాలో రాధామాధవులు. ఇక కథ చెపుతాను వినండి మరి. విని మీ అభిప్రాయం తెలుపుతారు కదూ :) మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను.