Sunday, June 21, 2015

అహో లక్ష్మణా!

ఈ వారం గోతెలుగు.కాం లో వచ్చిన నా కథ "అహో లక్ష్మణా!"
http://www.gotelugu.com/issue115/3024/telugu-stories/aho-lakshmana/


అహో లక్ష్మణా!!!
మాలాకుమార్

"వదినగారూ మీకు పిండి రుబ్బటం వచ్చా?" అడిగాడు ఆనంద్.
గులాబ్ జామూన్ నోట్లో పెట్టుకోబోతున్న సుమతి స్పూన్ అలాగే పట్టుకొని ," వచ్చండిఎందుకు అడుగుతున్నారు ?" ప్రశ్నించింది సుమతి.
"మరేమీ లేదు . నా పర్స్ లో డబ్బులు పెట్టుకోవటం   మర్చిపోయినట్లున్నాను ." ఖాళీ పర్స్ చూపిస్తూ బిడియంగా  అన్నాడు ఆనంద్ .
"అయ్యో ఇప్పుడెలా?" కంగారు పడింది  సుమతి.
ఏముంది హోటల్ వాడికి చెప్పి పప్పురుబ్బటమేనాకైతే రుబ్బటం రాదుమీరు రుబ్బుతుంటే కావాలంటే పక్కనుంచి తోయగలను.ముందే చూసుకోవాల్సిందివుందనుకున్నానుసారీ " దీనంగా అన్నాడు ఆనంద్ .
"వుండండి నా దగ్గర వున్నాయేమో చూస్తాను.అని తన పుస్తకాల బాగ్ లో నుంచి పుస్తకాలన్నీ తిరగేసింది . అక్కడక్కడ చిల్లరతో ఐదురూపాయలు దొరికాయి. " అమ్మయ్య ఐదురూపాయిలు దొరికాయిబిల్ పే చేసేయండి." నిట్టూరుస్తూ  డబ్బు ఆనంద్ కు ఇచ్చింది సుమతి.
ఇద్దరూ హోటల్ బయటకు వచ్చి బస్టాండ్ వైపు నడిచారు.
"సారీ సారీ వదినగారు . మీరు చాలా నీరసంగా వుంటే భోజనం చేద్దామని పిలిచాను. తొందరలో పర్స్ లో డబ్బులు వున్నాయో లేవో  చూసుకోలేదుఇప్పుడు బస్ లో ఏం వెళుతారు రండి నా స్కూటర్ మీద దింపేస్తాను."
"వద్దు లెండిమధ్య లో పెట్రొల్ ఐపోతే స్కూటర్ నాతో తోయిస్తారు."నవ్వుతూ అంది సుమతి.
"అయ్యో లేదండిపోనీలెండి బస్ టికెట్ కు డబ్బులు వున్నాయా ?"అడిగాడ  ఆనంద్.
వున్నవన్నీ వూడ్చి హోటల్ లో ఇచ్చేసిందిఏం చెప్పాలో తెలీలేదు సుమతి.
వక్క నినిమషం అని పక్కకు వెళ్ళి అక్కడున్న స్నేహితుని అడిగి వక్క రూపాయి తెచ్చి ఇచ్చాడు .ఆనంద్
అమ్మయ్య అనుకొని ఆనంద్ కు బై చెప్పి అప్పుడే వచ్చిన బస్ ఎక్కింది సుమతి.
లోపలికి వచ్చిన సుమతి  తో "సుమా అన్నం తిందువుగాని రాపిలిచింది సరస్వతి.
"వద్దమ్మా , నేను మా లక్ష్మణస్వామి తో తిన్నాను." జవాబిచ్చింది సుమతి.
"లక్ష్మణస్వామా ? అతనెవరు ?" కొంత గాభరగా అడిగింది .
"అబ్బ అంత కంగారెందుకమ్మానా కాబోయే మరిదిగారు ఆనంద్ ."
"అతనెక్కడ కలిసాడు ?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి.
"వాళ్ళ కాలేజీ మా కాలేజీ పక్కనే కదా , అప్పుడప్పుడు బస్టాప్ లో కలుస్తుంటాడు. రోజు లాబ్ లో కాస్త పనెక్కువై , బాగా ఆకలేసి నీరసం వచ్చిందినీరసం గా బస్టాప్ లో బస్ కోసం వేట్ చేస్తూ వుంటే వచ్చాడునాకు నీరసం గా వుందని పక్కన వున్న హోటల్ కు తీసుకెళ్ళాడు.ఇద్దరం లంచ్ చేసాము.చాలా ఇంకా వివరంగా చెప్పాలా?" విసుగ్గా అంది సుమతి.
 బాగానే వుంది కాని  అబ్బాయి తో నైనా పెళ్ళికి ముందు అంతగా కలవకు బాగుండదు అంటూ ఇంకా ఏమో  చెప్పబోయింది సరస్వతి
అబ్బా సోది ఆపమ్మా అంటూ సుమతి వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది.
నలభై సంవత్సరాల తర్వాత హోటల్లో డిన్నర్ తింటూ గులాబ్ జామూన్ నోట్లో పెట్టుకోబోతున్న సుమతికి తన పెళ్ళి కాకముందు మరిది తనని జోక్ చేసిన విషయం గుర్తొచ్చి నవ్వుకుంది
"ఏటక్కా మీలో మీరే నవ్వుకుంటున్నారు?"

అరుణ ప్రశ్న తో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకొని  ,"నలభై ఏళ్ళ క్రితం మీ ఆయన చేసిన నిర్వాకం గుర్తొచ్చినవ్వింది సుమతి.
"ఏమిచేసారు ?"ఆసక్తి గా ప్రశ్నించింది అరుణ.
 రోజు సంగతి చెప్పి "అమ్మో అమ్మో నా దగ్గర ఎలాగో డబ్బులు వుండబట్టి కానిలేకపోతే నా నాతో పప్పు రుబ్బించేవాడు. "అంది సుమతి.
"మీరు మరీనూ వదినగారుమీరు రుబ్బుతుంటే నేను పక్క నుంచి తోస్తానని చెప్పాను కదాఅమాయకం గా అన్నాడు ఆనంద్,
"నీ మొహం వాడి దగ్గర డబ్బులు లేకపోవటమేమిటినాదగ్గర , నాన్న దగ్గర ఒక్ళకొకళ్ళకి తెలీకుండా  పడుతుండేవాడు. బస్ కోసం ఇచ్చినవి కూడా వాడివే ఐవుంటాయి.  ఏరా ఆనంద్ నిజం చెప్పు  రోజు నీ దగ్గర డబ్బులు లేవా ?" దబాయించాడు అర్జున్.
"అన్నయ్యా ఏదో కాబోయే వదినగారుకదా అని కాస్త జోక్ చేసాను అంతే."నవ్వాడు ఆనంద్.
"హమ్మోఎంత ఖతర్నాక్మీ పుట్టినరోజని పార్టీ ఇస్తానని  ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకొచ్చారు. రోజైనా మీరు బిల్ కడతారా?నాతో కట్టిస్తారా ?"ఉక్రోషంగా అడిగింది సుమతి.

"ఇన్నేళ్ళైనా వదినగారి కి ఉక్రోషం తగ్గలేదు ." నవ్వుతూ వేయిటర్ తెచ్చిన బిల్ తీసుకుంటూ వదినగారిని ఉడికించాడు ఆనంద్.


"పదమ్మా అరుణా మనం పోదాం .  వదినా మరిదీ బిల్ కడతారో పప్పు రుబ్బుతారో !."లేచాడు అర్జున్..
1 comment:

Anonymous said...

I can always check Facebook when I'm back home.

My weblog: villa setiabudi lembang ()