Wednesday, February 27, 2013

తెలుగు వెలుగు లో నేను




పొద్దున్నే మావారు 'మాలా , మాలా' అంటూ గావుకేకలు పెట్టారు . ఏమైందా అని భయపడుతూ పరిగెత్తాను .

'నువ్వు పత్రిక లోకి ఎక్కావు ' అన్నారు .

ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు .' నేనా . . . పత్రిక లోకి ఎక్కటమా ????' అని తెగ హాచర్యపోయి , ఆ పైన నేనేమి చేసానురా భగవంతుడా అని భయపడుతూ 'ఏ పత్రిక లోకండి ?'అని అడిగాను .

ఇదిగో అని "మాలా కుమార్ " అని వున్నది చూపించారు .

 ఇదేమిటా అనుకున్నాను . 'ఓహో జ్యొతి గారు బ్లాగుల గురించి 'తెలుగు వెలుగు 'లో రాశానన్నారు . పేపర్ అతనిని పుస్తకం తెచ్చిపెట్టమంటే ఇంకా మార్కెట్ లోకి రాలేదమ్మా , వచ్చాక తెచ్చిస్తానన్నాడు . వచ్చినట్లుంది . ఐతే నా గురించి కూడా రాశారన్నమాట 'అని స్వగతంగా అనుకుంటూ , మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను .ఎంతైనా మన గురించి వుంది అంటే కాస్త గొప్పే కదా :)

మార్చ్ నెల ' తెలుగు వెలుగు ' లో తెలుగు బ్లాగుల గురించి , కొంతమంది మహిళా బ్లాగర్స్ గురించి జ్యొతిగారు వ్రాశారు . అందులో నాకూనూ కొద్దిగా ప్లేస్ ఇచ్చారు . అదీ సంగతి . ఏమి వ్రాసారంటే ఆ . . . నేనెందుకు చెపుతాను . మీరే పుస్తకం కొనుక్కొని చదవండి . లేదంటారూ ఇక్కడ చదవండి . అక్కడ చూసి వచ్చి ఇక్కడ మీరేమనుకున్నది చెప్పండి :)

థాంక్ యూ జ్యోతిగారు .

10 comments:

శశి కళ said...

congratulations mala garu

Anonymous said...

బాగుంది.. మీకు కంగ్రాత్సండీ.
వ్యాసం మాత్రం ఇంకంప్లీట్ గా ఉందండీ.

ఇంకా బాగా రాయచ్చు. మంచి బ్లాగర్లని పరిచయం చేయచ్చు. మధురవాణి, కొత్తావకాయ, తృష్ణ, ఇద్దరు సౌమ్యలు,క్రిష్ణ ప్రియ,మానస,ఇందు,రసజ్న (సారీ నాకు ఈ అమ్మాయి పేరు టైప్ చేయడం రావట్లేదు) శ్రావ్య,జ్యోతిర్మయి,సూర్యలక్ష్మి గారు, మంజు,సునీత,ప్రవీణ ఇట్లా ఆక్టివ్ గా చాలా మంది వ్రాస్తున్నారు కదా.. వాల్ల గురించి ఒక్క మాట రాయలేదు. ఎప్పటికీ ప్రమదా వనం..అని పాత పాట.

రాజ్యలక్ష్మి.N said...

Congratulations Mala Kumar Gaaru..

Anonymous said...

మాలాకుమార్ గారికి , కంగ్రాట్స్.ఇకపోతే .పై అజ్ఞాత తో ఏకీభవిస్తూ ,,వ్యాసం అనేది ఎప్పుడు సమగ్రం గా వుండాలి.చాల మంది బ్లాగర్ల పేర్లు విస్మరించడం ఉద్దేశ పూర్వకం కాకపోవచ్చు .కానీ ప్రస్తుతం మనోభావాలు దెబ్బతినే ట్రెండ్ నడుస్తున్న నేపథ్యం లో జ్యోతి గారు ఈ విషయం లో జాగరూకత వహించాలి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

కంగ్రాట్స్ మాలా కుమార్ గారు. ఈ అంశం మీద వ్యాసం వ్రాసే ప్రయత్నం చేసినందుకు జ్యోతి గారికి ప్రశంశలు.

Having said that, I couldn't resist my self from thinking about the substandard stuff of our publishing world and other fields :(

Mauli said...

@మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను

:)

మాలా కుమార్ said...

శశికళ గారు , అనోనమస్ గారు , రాజి ,అనోనమస్ గారు ,వీకెండ్ పొలిటీషియన్ గారు ,మౌళిగారు అందరికీ థాంక్స్ అండి .

చెప్పాలంటే...... said...

కంగ్రాట్స్ మాలా గారు. :)

నవజీవన్ said...

అభినందనలు మాలాకుమార్ గారు

జలతారు వెన్నెల said...

విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్ష​లు మాలా కుమార్ గారు!