Thursday, December 27, 2012

హాపీ బర్త్ డే సాహితి


సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదేసమయాని కి నేను ఓ సోఫాలో పడుకొని ఆంధ్రభూమి వీక్లీ చదువుతున్నాను . మా అబ్బాయి పక్క సోఫాలో లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటున్నాడు . పొద్దటి నుంచి ఆలోచిస్తున్న విషయం మా వాడి ని అడగటాని కి ఇదే సమయం అనుకొని , " వరే బాబా " అని ముద్దుగా పిలిచాను . "ఏమిటి మాతే " అని అంతకన్నా గారంగా అన్నాడు మావాడు ." పొద్దున రవి బావ తెలుగు లో కూడా బ్లాగ్ వ్రాయవచ్చని చెప్పాడు కదరా ఎలా వ్రాయాలి " అని అడిగాను .జవాబు లేదు . కాసేపు వాడి వైపు చూసాను . చాలా సీరియస్ గా లాప్ టాప్ లో తలదూర్చి వున్నాడు . హుం కుయ్ అనడు , కయ్ అనడు . కాసేపు పైకి , కాసేపు లోపల విసుక్కొని , ఎవరిమీదైనా ఆధారపడితేలే అనుకొని నిరాశ తో బుక్ లోకి తల దూర్చేసాను


. కొద్ది నిమిషాలు నిశబ్ధం గా గడిచిపోయాయి . నేనూ చాలా సీరియస్ గా సీరియల్ చదువు కుంటున్నాను . " మాతే నీ బ్లాగ్ కు ఏమి పేరు పెడుదామనుకుంటున్నావు ?" అని వినిపించింది . నాకు వాడేమన్నాడో ఓ క్షణం అర్ధం కాలేదు . ఏమిటిరా అని అడిగాను . మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు . అప్పుడు నేను చదువుతున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి . ఆ పేరు నచ్చి వెంటనే " సాహితి " అన్నాను .

 మళ్ళీ నిశబ్ధం . నేను మళ్ళీ నా సీరియల్ లోకి ." మాం ఇదిగో నీ సాహితి " అని అరిచాడు . నేను ఒక్క ఉదుటున లేచి కూర్చొని ఏమిటీ అన్నాను . లాప్ టాప్ నా ముందు పెట్టి " సాహితి - మాల " అన్నది నీ బ్లాగ్ పేరు టెంప్లెట్ ఏమిపెట్టాలి అని అడిగాడు . ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి ఐపోయాను . సింపుల్ టెంప్లెట్ అని చెప్పాను . నా ఆనందమో , ఆరాటమో ఏదో తెలీని స్తితిలో నేనుండగా ఇదిగో నీ బ్లాగ్ తయారైపోయింది . అని చూపించాడు . ఓ గంట సేపు దాని తో కుస్తీ పడి ఎలా వ్రాయాలి , ఎలా పోస్ట్ చేయాలి అన్నీ చూపించాడు . నా నోట్స్ లో గబ గబా రాసేసుకున్నాను . "ఇప్పుడేదైనా అందులో వ్రాయి " అన్నాడు . అమ్మో ఏమి వ్రాయాలి ? ఆలోచించుకొని రేపు వ్రాస్తాలేరా అన్నా .కాదు వ్రాయాల్సిందే అన్నాడు .

తడబడుతూ , సంతోషం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీక అబ్బ అప్పటి ఉద్వేగం చెప్పలేను . ఇదో ఇలా నేనూ , నా సాహితీ బ్లాగ్ లోకం లోకి వచ్చేసాము :) 

హాపీ బర్త్ డే సాహితి  :)

20 comments:

శ్రీనివాస్ పప్పు said...

సాహితీ మాలాతోరణానికి జన్మదిన శుభాకాంక్షలు

జీడిపప్పు said...

బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు!!

Maitri said...

సాహితీ బ్లోగుకి జన్మదిన శుభాకాంక్షలు.
క్రిష్ణ వేణి

రాజ్ కుమార్ said...

సాహితికి పుట్టినరోజు మేల్తలపులు ;)
happy blogging andee

చిలమకూరు విజయమోహన్ said...

బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వనజ తాతినేని said...

మాలా గారు.. చాలా సంతోషం. నాలుగు సంవత్సరాలు ఎలా గడచి పోయాయో కదా! ఇలాగే వ్రాస్తూ ఉండండి.

సాహితీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

గీతిక బి said...

మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాలా గారూ.

Hima bindu said...

Happy birthday"sahithi blog" garu:)

తృష్ణ said...

మీ సాహితీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తృష్ణ said...

మీ 'సాహితి'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said...

సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

సాహితికి జన్మదిన శుభాకాంక్షలు.

జయ said...

యాపీ యాపీ బర్త్ డే సాహితి.అప్పుడే నాలుగేళ్ళా..నిన్న మొన్నటి లాగే ఉంది. సాహితికి ఇంకా చాలా వయసు రావాలని నా కోరిక.

శ్రీలలిత said...


సరస సల్లాపముల సాహితి
సిరిని కూడిన హరి హృదయమల్లె
పండగా నిండు నాల్గు వత్సరములు
సంతసమయ్యె మది..అభినందన మందు మాలా...

చెప్పాలంటే...... said...

హాపీ బర్త్ డే సాహితి -:)

జ్యోతి said...

అఫ్పుడే నాలుగేళ్లయిందా?? అభినందనలు. ఈ మద్య మీ బ్లాగింగ్ స్పీడ్ తగ్గినట్టుంది..

రాజ్యలక్ష్మి.N said...

"సాహితి"కి జన్మదిన శుభాకాంక్షలు..
Many Happy Returns Of The Day :)

psm.lakshmi said...

జన్నదిన శుభాకాంక్షలు సాహితీ, రాబోయే సంవత్సరాలలో ఇంకా కళకళలాడుతూ, గలగలా సాగాలని కోరుతూ
psmlakshmi

మాలా కుమార్ said...

శ్రీనివాస్ పప్పు గారు ,
&జీడిపప్పు గారు ,
&కృష్ణవేణి గారు ,
&రాజ్ కుమార్,
&చిలమకూరు విజయమోహన్ గారు ,
&చిన్నిగారు ,
& తృష్ణ గారు ,
మీ విషెస్ కి థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

వనజ వనమాలి గారు , అవునండి చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి:),
&గీతిక గారు ,
&జ్యోతిర్మయి గారు ,
బులుసు సుబ్రమణ్యం గారు ,
&జయ ,
&శ్రీలలిత గారు మీ కవిత చాలా బాగుందండి .
&చెప్పాలంటే గారు ,
&జ్యోతిగారు , అవునండి నాలుగేళ్ళైపోయింది . స్పీడ్ కొంచం తగ్గింది నిజమే :),
&రాజి ,
& లక్ష్మి గారు ,
మీ అందరి విషెస్ కు చాలా చాలా థాంక్స్ అండి .