Friday, December 7, 2012

లక్ష్మిగారు అభినందనలు

పి.యస్. యం లక్ష్మి గారు యాత్ర లక్ష్మి గా బ్లాగ్ లలో అందరికీ పరిచయమే . ఆవిడ హైదరాబాద్ లోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసు నుంచి సీనియర్ ఎకౌంటెంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు . అంతటి పదవిని నిర్వహిస్తూ , పిలల్లను , ఇంటినీ గృహిణిగా చూసుకుంటూ , తీరిక సమయాలలో  దేవాలయాలను దర్శించటం ఆవిడ హాబీ . అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై సెటిలైపోయారనుకోండి :) విచిత్రమేమిటంటే వారి శ్రీవారు శ్రీ.యం . వెంకటేశ్వర్లు గారి కి కూడా ఈ హాబీ వుండటం .భార్యాభర్తలిద్దరి కీ ఒకే హాబీలుండటం  , అవి పాటించటం చాలా అరుదు .నాకంతా మావారి సహకారమే . ఆయన సహకరించకపోతే నేను ఇన్ని వూళ్ళు తిరుగగలిగేదానిని కాదు అంటారు లక్ష్మిగారు .

మామూలుగా ప్రశిద్ది చెందిన దేవాలయాలనే కాదు , ఎక్కడెక్కడో వున్న చిన్న చిన్న దేవాలయాలనూ , పురాతన దేవాలయాలనూ దర్శించారు లక్ష్మిగారు . వూరికే చూడటమే కాదు , వాటిగురించి , అవి ఎక్కడవున్నాయి , ఎలా వెళ్ళాలి , అక్కడి సదుపాయాలేమిటి , వాటి చరిత్ర అన్నీ వివరం గా వారి బ్లాగ్ "యాత్ర" లో వ్రాశారు . చాలా వరకు వివిధ పత్రికలలో వ్యాసాలుగా కూడా ప్రచురించారు .అంతేకాదు  ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్తలాలను పుస్తక రూపంగా తీసుకురావాలనే ఆకాంక్షతో ఇప్పటిదాకా నల్గొండ , వరంగల్ జిల్లా  పుణ్యక్షేత్రాలు , 'యాత్రా దర్శిని -నల్గొండజిల్లా', 'యాత్రా దర్శిని -వరంగల్ జిల్లా ' లను ఈబుక్స్ రూపం లో కొనిగె. ఆర్గ్ వారు ప్రచురించారు . ఇవేకాక కొనెగె వారు ప్రచురించిన మరొక ఈపుస్తకం ' పంచారామాలు - పరిసర క్షేత్రాలు '. ఇంకా త్వరలో రాబోతున్న ఈ బుక్స్ ' కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లూ

' హైద్రాబాదు నుంచి ఒక రోజులో '

హైద్రాబాదు నుంచి రెండు రోజులలో '
ఈ బుక్స్ గానే కాక "యాత్రాదీపిక , వరంగల్ జిల్లా " , వరంగల్ జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రింటు చేయించారు . మామూలుగా వరంగల్ అనగానే గుర్తువచ్చేది వేయిస్తంబాల గుడి , వరంగల్ దగ్గరగా వున్న రామప్ప దేవాలయం . కానీ ఈ పుస్తకం లో వరంగల్ , హనుమకొండ , ఖాజీపేటలలో వున్న 12 దేవాలయాల గురించి ,వరంగల్ చుట్టుపక్కల వున్న 11 దేవాలయాల గురించి వివరించారు .

ఈ రోజు 7-12-2012 శుక్రవారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు రంజని - తెలుగు సాహితీ సమితి, ఏ.జీఆఫీస్ హైద్రాబాద్ వారి ఆధ్వర్యం లో , ఏ. జీ ఆఫీస్ రంగస్తలం లో ఆవిష్కరించారు . ప్రక్యాత రచయత , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు పుస్తకావిష్కరణ గావించారు .ఆచార్య అయినవోలు ఉషాదేవి , పిఠాధిపతి , భాషాబివృద్ధి పీఠం , పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం గారు వక్త గా వ్యవహరించారు . అనుకోకుండా ఇద్దరు గెస్ట్ లూ వరంగల్ వాస్తవులే అయ్యారు :)
కార్యక్రమము  ముందుగా శ్రీమతి శిష్టా లీలా వసంత లక్స్మి బృందము ఆలపించిన గానలహరితో ప్రారంభం ఐనది .తరువాత డాక్టర్ నవీన్ గారు పుస్త్కావిష్కరణ గావించారు . ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు , పుస్తకం లోని అంశాలను చూపుతూ ప్రసంగించారు . ఆపైన రంజని -తెలుగు సాహితీ సమితి వారు లక్ష్మిగారి ని శాలువతోనూ , పూలమాల తోనూ , జ్ఞాపిక తోనూ సత్కరించారు


వారే కాదు , లక్ష్మిగారి అక్క చెళ్ళెళ్ళు , వారి కాలనీ లోనివారి స్నేహితులూ శాలువాలతో , పూలమాలల తో , చీరల తో సత్కరించారు . అన్నట్లు  నేనూ ఓ పూల బుకే ఇచ్చానండోయ్ :)

కార్యక్రమము ఆసాంతమూ చాలా చక్కగా జరిగింది .
లక్ష్మిగారు , మీరు మరిన్ని వూళ్ళు తిరగాలని , ఆ విశేషాలన్నీ చక్కని పుస్తకాలుగా ప్రచురించాలనీ , ఇంకా ఇంకా సత్కారాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ  మీకు అభినందనలు తెలియజేస్తున్నాను .  .

11 comments:

శ్రీలలిత said...


కళ్ళకు కట్టినట్టు రాసారు. నేనూ వచ్చేదానినే..కాని ఓ పెళ్ళిసందడిలో చిక్కుకుపోయాను.

పుణ్యవతి లక్ష్మి ఆ పుణ్యమందరకు నందజేయ
తిరిగె పుణ్యక్షేత్రాలు ముదము మీర...
పుస్తకముగా తెచ్చె నందరి కందజేయ
అందుకొనుడిదె మన పుణ్యంబు పెంపుగానూ...

హృదయపూర్వక అభినందనలండీ...లక్ష్మిగారూ...

మధురవాణి said...

లక్ష్మి గారికి అభినందనలు.. మీకు ధన్యవాదాలు.. :)

Ennela said...

లక్ష్మి గారోయ్, మీరు సూపరంటే సూపరు. మాలా గారు మీకు కృతజ్ఞతలండీ, మీరు చెప్పకపోతే మాకు తెలిసుండేది కాదు. మా లక్ష్మి గారి పుస్తకం పబ్లిష్ అయిందని నేను బోల్డు హాప్పీ.ఆనందాన్ని సెలెబ్రేట్ చెయ్యడానికి యేం చెయ్యాలా అని ఆలోచిస్తే, సూపర్ ఐడియా వచ్చింది. వర్క్ కి తీసుకెళ్ళడానికి నేను రవ్వలడ్డు చేస్త్తున్నానోచ్!!

Ennela said...

లక్ష్మి గారోయ్, మీరు సూపరంటే సూపరు. మాలా గారు మీకు కృతజ్ఞతలండీ, మీరు చెప్పకపోతే మాకు తెలిసుండేది కాదు. మా లక్ష్మి గారి పుస్తకం పబ్లిష్ అయిందని నేను బోల్డు హాప్పీ.ఆనందాన్ని సెలెబ్రేట్ చెయ్యడానికి యేం చెయ్యాలా అని ఆలోచిస్తే, సూపర్ ఐడియా వచ్చింది. వర్క్ కి తీసుకెళ్ళడానికి నేను రవ్వలడ్డు చేస్త్తున్నానోచ్!!

బులుసు సుబ్రహ్మణ్యం said...

లక్ష్మి గారికి అభినందనలు.

తీరిక చేసుకుని కార్యక్రమానికి వెళ్ళి విశేషాలు ఫొటోలతో సహా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

Lakshmi Raghava said...

mala garu ,
మీరు ఇంట చక్కగా ఫొటోలతో కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి మేము చూసి తరించాము.
లక్ష్మి గారికి అభినందనలు..మీకు ప్రత్యెక అభినందన
లక్ష్మి రాఘవ

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

లక్ష్మి గారికి అభివందనలు. మీకు ధన్యవాదాలు.

చెప్పాలంటే...... said...లక్ష్మి గారికి అభివందనలు. మీకు ధన్యవాదాలు.

శశి కళ said...

చాలా చక్కగా జరిగింది వ్రాసారు.ఆవిడ కాని చదివితే సంతోషంగా ఫీల్ అవుతారు.మీరు ఇచ్చే పూలు మీ అభిమానం చక్కగా తెలియచేస్తాయి..మీ మంచి మనసు లాగా

psm.lakshmi said...

మాలాగారూ
మీకు ధన్యవాదాలు ఎలా తెలుపను నా కార్యక్రమం గురించి నేనుకూడా రాసుకోలేనంతి బిజీగా వున్నాను. మీరుమాత్రం మీ పనులు పక్కకి నెట్టి నాగురించి అందరికీ తెలియజేశారు. చాలా సంతోషం. మీరిచ్చిన పువ్వులు 4 రోజులు చక్కగా వున్నాయి. గులాబీలు అన్ని రోజులు వుండటం చాలా సంతోషం వేసింది.

మాలాగారిద్వారా నన్ను అభినందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

psmlakshmi

psm.lakshmi said...

మాలాగారూ
మీకు ధన్యవాదాలు ఎలా తెలుపను నా కార్యక్రమం గురించి నేనుకూడా రాసుకోలేనంతి బిజీగా వున్నాను. మీరుమాత్రం మీ పనులు పక్కకి నెట్టి నాగురించి అందరికీ తెలియజేశారు. చాలా సంతోషం. మీరిచ్చిన పువ్వులు 4 రోజులు చక్కగా వున్నాయి. గులాబీలు అన్ని రోజులు వుండటం చాలా సంతోషం వేసింది.

మాలాగారిద్వారా నన్ను అభినందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

psmlakshmi