మావారు రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ 'క్లాస్ లో జాయిన్ అయ్యారు .అక్కడ ఆయనకు యోగా టీచర్ 'వెంకటేశ్'. ఓరోజు వాళ్ళ ప్రోగ్రాం వుందంటే నేనూ వెళ్ళాను . మాతోపాటు వెంకటేశ్ కూడా వచ్చారు . ఏదో మాటల్లో రేపు మా పిక్చర్ 'మిధునం'ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో వుంది మీరు రావాలి సార్ అన్నాడు . మీరు కూడా రండి మేడం అని నాతో అన్నాడు . ఒక్క నిమిషం నేను సరిగ్గా విన్నానా లేదా అనుకొని ఏది శ్రీరమణ రాసిన కథ , తణికెళ్ళ భరణి తీసిందేనా అన్నాను అనుమానంగా . అవును మేడం నేను దాని కి అసిస్టెంట్ డైరక్టర్ ని అని చెప్పాడు . అంతే ఎంత ఎక్సైట్ ఐపోయానో ! మావారి కంటే ముందే తప్పకుండా వస్తాము అనిచెప్పేసాను :) పొద్దున 8 గంటల కు అని చెప్పారు . రాత్రంతా నిద్ర పట్టలేదు , ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆరాటమే . బహుషా నేను ఏ పిక్చర్ కోసమూ అంత ఎదురుచూడలేదనుకుంటాను :)
ప్రముఖ రచయత శ్రీరమణ రచించిన కథ "మిధునం " ను అదే పేరు తో తెరమీద అద్బుతంగా చిత్రీకరించారు తణికెళ్ళభరణి . టైటిల్ పాటలో చెప్పినట్లుగా ఆదిదంపతులు అభిమానించే చిత్రమే మిధునం .చిన్నపటి నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచిన పిల్లలు పెద్దవాళ్ళై వారి బాధ్యతలలో వారు మునిగిపోయినప్పుడు , వంటరిగా మిగిలిపోయిన అమ్మానాన్నల కథే మిధునం .పిల్లలంతా విదేశాలకు వెళ్ళిపోయాక , వాళ్ళను తలుచుకుంటూ బాధ పడుతున్న భార్యతో , బాధ పడవద్దని , ఇంతకు ముందు సంసారబాధ్యతలో పడి తీర్చుకోలేని కోరికలను తీర్చుకునేందుకు చక్కని అవకాశమని , జీవితాన్నీ ఎంజాయ్ చేయవలసిన తరుణమిది అని భార్యను ఓదార్చి చాలా తమాషాగా చూపిస్తాడు భర్త. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు చెప్పుకుంటూ తన పెరటిలోని చెట్లకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు .అప్పదాసు , బుచ్చిలక్ష్మి ఓజంట . అరవై ఏళ్ళతరువాత వంటరిగా మిగిలిపోయి పోట్లాడుకుంటూ , కలుసుకుంటూ , మాటలాడుకుంటూ , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మొత్తమీద చిన్నపిల్లలైపోతారు :)
సినిమా అంతా చాలా తమాషాగా వుంటుంది . మొత్తం రెండు పాత్రల తోనే ఈ సినిమా అంతా నడుస్తుంది . కాని ఎక్కడా బోర్ కొట్టదు .అప్పదాసుగా యస్.పి బాలసుబ్రమణ్యం , బుచ్చిలక్షి గా లక్ష్మి చాలా బాగా నటించారు . పెద్దవాళ్ళంతా వంటరితనం మరిచిపోయి ఇలా హాయిగా బతకవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది .భార్యా భర్తల సంబంధానికి మంచి నిర్వచనం మిధునం . సినిమా అంతా సరదా సరదా గా తీసి , చివరిలో మటుకు కంట తడి పెట్టిస్తారు . ముగింపులో బుచ్చి స్వగతం విని కంటతడి పెట్టనివారు ఎవరూ వుండరంటే అతిశయోక్తి కాదేమో ! పాటలు కూడా చాలా బాగున్నాయి . తప్పక చూడవలసిన సినిమా . పాటలు ఇక్కడ వినండి .
ఇది మటుకు ఇక్కడ కూడా చూడండి :)
16 comments:
అమ్మయ్యా, మీరు సర్టిఫై చేసారు కాబట్టి నేను కూడా చూస్తాను. ఇటువంటి పాత్రల్లో లక్ష్మిని, బాలుని ఊహించుకొని కొంచెం భయపడ్డాను. ఇప్పుడు ధైర్యం వచ్చింది చూడడానికి.....దహా.
అదృష్టవంతులు.... చల్లని కబురు చెప్పారండీ...
తప్పకుండా చూస్తాను ;)
మరి నేనెలా చూడగలనూ అని ;(
క్రిష్ణవేణి
మీతో పాటు మేము కూడా ప్రివ్యూ చూసి నట్లైంది
తప్పకుండ theatre కి వెళ్ళే చూస్తాము
మీతో పాటు మేము కూడా ప్రివ్యూ చూసి నట్లైంది
తప్పకుండ theatre కి వెళ్ళే చూస్తాము
మీరు అదృష్టవంతులు!
బెంగళూరు ఎప్పుడు వస్తుందో?
miru munde chusesaaru memu enkaa chudaledu aiyinaa chusinatlu gaa chakkagaa rassaru review baavundi maala garu
మిధునం గురించి మీరు రాసిన రెవ్యూ చదివి చూసి కానీ కమెంట్ పెట్ట్ కూడదనుకున్నా.... కానీ ఆగలేక:-)
నమసతె
మీ రెవిఎవ్ చూసి చినెమ
hallo sir,
na telugu inka pc lo alavatupadledu.
mithnam mee review chusaka tappakunda chustanu.
ramana a.v.
చూసేసారా?నేను ఆడియో ఫంక్షన్ మాత్రమె చూసాను:(
వెంకట రమణ గారు, మాలా గారు మదామేనండీ..సారు వాడు కాదు...పె హా (పెను హాసం)
నేను కొన్ని ఏళ్ళ క్రితం చదివిన కథ దృశ్య రూపం లో ఎప్పుడు చూస్తానా అని ఉంది...
ఆ కథ చదివినప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎంత మందికి ఫోటో కాపీస్ తీసి పంపానో లెక్క లేదు...
మీ రివ్యూ చూసాక ఇంకా ఆత్రుతగా ఉంది...సినిమా త్వరగా చూడాలని...@శ్రీ
బులుసు సుబ్రమణ్యం గారు ,
మరి నాకు , మావారికైతే నచ్చిందండి :)
&రాజ్ కుమార్ ,
మీ వయసువాళ్ళు కూడా చూడతగ్గ సినిమా ఇది . తప్పక చూడు .
&కృష్ణవేణి గారు ,
మీ వూరి కి తెలుగు సినిమాలు రావా ? ఐతే సి.డి వచ్చేవరకూ మీరు వేట్ చేయాల్సిందే :)
మణి గారు ,
తప్పక చూడండి .
&బోనగిరి గారు,
నిరాశ పడకండి ,మీ బెంగుళూరు కూడా త్వరలోనే వస్తుంది లెండి :)
&చెప్పాలంటే గారు ,
మీకు నా రెవ్యూ నచ్చినందుకు థాంక్స్ అండి .
పద్మార్పిత గారు ,
థాంక్ యు .
&రమణ గారు ,
థాంక్స్ అండి .
&శశికళ గారు ,
మీరు ఆడియో ఫంక్షన్ చూసారా. మరి ఇంకా సినిమా చూసారా లేదా :)
ఎన్నల గారు ,
పాపం రమణగారి పొరపాటేమీ లేదండి , నా పేరు లో కుమార్ చూడగానే చాలా మంది నన్ను సారువాడనే అనుకుంటారు :)
&శ్రీ గారు ,
కథను ఎక్కువగా మార్చకుండానే సినిమాను తీసారండి . ఏవో కొద్ది కొద్ది మార్పులు చేసారు అంతే . తప్పక చూడండి .
Post a Comment