ప్రఖ్యాతరచయత కొమ్మూరి వేణుగోపాలరావు గారి అబ్బాయి , కొమ్మూరి రవికిరణ్ రచించినదీ ఈ నవల " సౌందర్యం ". రచయత పేరు చూడగానే కొమ్మూరి వేణుగోపాలరావు గారి సంబందీకులదా అని తీసుకొని చూసాను . వారి అబ్బాయే అని తెలియగానే , ఎలా రాసారో చదువుదామనిపించి కొనేసాను .కొన్నందుకు , చదవగానే మంచి నవల అన్న సంతృప్తి కలిగింది . ఈ మధ్య తరుచుగా వినిపించేపదం "డిప్రెషన్" . అది ఎందుకొస్తోంది ? ఆ సమస్యమీద రాసినదే ఈ నవల . అలా అని ఏవేవో పెద్ద పెద్ద పదాలతోనో , నోరుతిరగని సమస్యల గురించో లేదు . ఐనా నేను చెప్పేదాని కన్నా , ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బరెడ్డి గారు ఈ నవల గురించి ఏమన్నారో చెపితే బాగా తెలుస్తుందేమో !
"సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది .కొందరి జీవితాలనైనా తీర్చిదిద్దగలుగుతుందని రచయత తనవంతు బాద్యత గా సమాజానికి తెలియజెప్పిన నవల 'సౌందర్యం' . నవల అనేది జీవితాని కి అద్దం లాంటిది . ఈనవలలోని ఇతివృత్తం చాలా విస్తృతమైనది .కథకు అవసరమైన జీవితము లోని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఏరుకొని వాటిని అవసరం మేరకు వివరించరించటము లో రచయతగా కొమ్మూరి రవికిరణ్ సఫలుడయ్యాడని చెప్పవచ్చు .ఈ నవల చదువుతున్నంతసేపు ఈ కథ ఎక్కడో జరగలేదు , మన మధ్యే మన ముందే జరుగుతున్నట్టుగా ఈ పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది .
మానవసమాజం లో ప్రస్తుతం వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్త దూరమై , మానవ సంబందాలకంటే , ఆర్ధిక సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రక్త సంబందీకుల మధ్యే సంబంధాలు తెగిపోయి ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులను ,వానికనువైన రీతిలో పరిష్కరించేందుకు ఉన్నత వ్యక్తిత్వం వున్న వక వ్యక్తిని కథానాయకుడుగా నిలబెట్టి స్నేహపు విలవలకూ , రక్తసంబంధాలకూ ఎంత విలువ ఇవ్వాలి , వాటిని ఎలా కాపాడుకోవాలో ఈ నవలలో ఎంతో చక్కగా చెప్పాడీ రచయత ."
ఈ నవల గురించిన ముందుమాటలో డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు ఇంకా చెప్పారు . అది చదివాక నేను నవల గురించి రాస్తే ఆ ముందుమాటల ప్రభావం తప్పకుండా వుంటుంది అందుకని ఆయన మాటలు నామాటలు గాచెప్పటం ఎందుకు ఆయన చెప్పినవే కొద్దిగా రాస్తే అందరికీ నవల గురించి కొంత అవగాహన కలుగుతుంది అనిపించింది :)
నాకు ఈ నవలలోని మురళి పాత్ర చాలా నచ్చింది . ఎక్కడా టెన్షన్ పడడు. తొణకడు , బెణకడు . అందిరి నీ చాలా స్మూత్ గా డీల్ చేస్తాడు . రామ్మోహన్ , సునంద , సావిత్రి లలో మార్పు తెచ్చేందుకు ఎంతో సహనం చూపిస్తాడు .సంక్షోబాలను , సంఘర్షణలనూ సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలని , మానసిక బలహీనతలనూ , స్వార్ధాన్నీ జయించాలని తెలియజేసాడు .ఎవరికి వారు నా అనే స్వార్ధం తో బతుకుతున్న ఈ కాలం లో కుటుంబం అంటే భార్యా , పిల్లలు మాత్రమే కాదు బంధువులు స్నేహితులు కూడా నావాళ్ళే అని తెలియజేసాడు . మురళి పాత్ర ను చాలా ఉన్నతం గా తీర్చి దిద్దారు .
రచయత శైలి కూడా చాలా సులభంగా వుంది . ఒకసారి చదవటం మొదలు పెడితే పూర్తి అయ్యేవరకూ ఆపలేకపోయాను . నాకు ఈ నవల చాలా నచ్చింది .
8 comments:
ఈ కధ నేను సీరియల్ గా చదివి పుస్తకం కూడా కొన్నాను. నా బ్లాగులో కూడా రాసాను. చాలా బావుంటుంది. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు..ఊరికే టైమ్ పాస్ కి చదవడానికి కాకుండా ఎన్నో విషయాలు మనకు అన్వయించుకుని, ఆలోచింపజేసేవి ఉన్నాయి..
మాలా గారు.. నవలా పరిచయం చాలా బాగుంది. తప్పకుండా కొని చదువుతాను. ధన్యవాదములు
మంచి నవలను పరిచయం చేశారు మాలా గారు. థాంక్స్.
nice
chakkati navala parichayam chesaru mala garu
నేను ఈ పుస్తకం చదవలేదండీ. మీరు రాసినది చూసాక తప్పక చదవాలనిపిస్తోంది. చదువుతాను..
నవలా పరిచయం బాగుందండి. ఈ మధ్య విరివిగా వినపడే డిప్రషన్ టాపిక్ మీద నవల అంటే ఆసక్తి గా ఉంది.
బాగున్నట్లుంది. నేనూ చదువుతా, ఆ బుక్ నాకిస్తే.
Post a Comment