Thursday, May 10, 2012

బుజ్జిగాడు పాస్ అయ్యాడా :)))))



నిన్న వీడి ని " నా ప్రపంచం " లో చూసి నప్పటి నుంచి వాడి కి బేద్ద ఫాన్ ను ఫాన్ కాదు . . . కాదు . . . ఏ.సి ని అయ్యాను . యస్ జే గారు ఈ బుజ్జిగాడి మీద ప్రేమ తో మాటి మాటి కీ మీ ఇంట్లోకి తొంగిచూస్తూ వుంటే బాగోదనుకొని , వాడిని మా ఇంటి కి తెచ్చేసు కున్నాను .మిమ్మలిని అడగలేదని ఏమనుకోకండి ప్లీజ్ :)

వాడిని మా ఇంటికే కాదు , మా ప్రమదావనం కు కూడా తీసుకెళ్ళాను . ఫేస్ బుక్ లో కూడా పెట్టాను :) అందరూ వాడిని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు .

ఇంకా ఈ బుజ్జిగాడు ఎక్కడైనా వున్నాడా అని గూగులమ్మని అడిగితే ఇదో ఇక్కడ కూడా వున్నాడు అంటూ ఈ చోటు చూపించింది .

నిద్ర లో , మెలుకువలో నన్ను తెగ వేటాడేస్తున్నాడు . ఎప్పుడూ వాడిని చూడటమే :)అసలు ఆ బుడుగ్గాడి కళ్ళల్లో టెన్షన్ చూడండి . నోట్లో వేళ్ళేసుకొని , ఆ వేళ్ళను ను అదిమి పెట్టి కళ్ళు పెద్దవిగా చేసి ఎంత ముద్దుగా పేపర్ లోకి చూస్తున్నాడో . ఆ ముక్కెంత ఉబ్బించాడో పిడుగ్గాడు:) అలా చూస్తూ వుంటే అమాంతం ఎత్తుకొని , ఆబూరె బుగ్గల మీదా , కళ్ళ మీదా , ముక్కు మీదా ముద్దుల వర్షం కురిపించేయాలనిపిస్తోంది నాకైతే :) చిన్ని వెధవ ఎంత ముద్దొచ్చేస్తున్నాడో !

వేలడంత లేడు పొట్టెగాడు , రిజల్ట్ అంటే మరీ అంత టెన్షనా :) ఐనా ఆటెన్షన్ ఎందుకంటారు ? వాడు పాసైనాడా లేదా అనా ? లేక వాడి గర్ల్ ఫ్రెండ్ పాసైందా లేదా అనా ? ఇంతకీ ఈ మురిపాల బుడుగ్గాడు పాసయ్యాడా :)

20 comments:

రాజ్యలక్ష్మి.N said...

మాలా కుమార్ గారూ..
నేను కూడా ఈ బుజ్జిగాడిని నా ప్రపంచం బ్లాగ్ లో చూశానండీ .. నిజంగా చాలా ముద్దుగా టెన్షన్ పడుతున్నాడు..

వాడిని చూస్తే సాధారణంగా అమ్మా,నాన్నా పిల్లల్ని అనే మాట కూడా గుర్తొచ్చింది..
"ఇప్పుడు పడే టెన్షన్ ఏదొ చదివేటప్పుడు కూడా వుంటే బాగుండేది కదా అని :):)

సి.ఉమాదేవి said...

ఎందరో బుజ్జిగాళ్ల,బుజ్జమ్మల మనసులకు అద్దం పట్టిన చిత్రం.పరీక్షల మీద పరీక్షలు రాస్తున్న చిన్నారుల మానసిక స్థితి ఇదే!కాకపోతే ఇప్పుడు కంప్యూటర్ ముందు ఆన్ లైన్ లో! చక్కటి పోస్టు మాలాగారు.

పరిమళం said...

:) :)

psm.lakshmi said...

ఆ ఆ ఎత్తుకుని ముద్దులూ పెడతారు..రిజల్ట్స్ వస్తున్నాయంటే వాళ్ళకన్నా ఎక్కువ కంగారు పడతారు ఈ బామ్మలూ, అమ్మమ్మలూ..కదూ. బుజ్జిగాడు మాత్రం బలే బాగున్నాడు.
psmlakshmi

Rajendra Devarapalli said...

చాలా ఆత్మీయంగా ఉందండి మీ వర్ణన.వీడిని ఇంతకుమునుపు చాలాచోట్ల చూసినా మీ అంత హృద్యంగా ఎక్కడా ఎవరూ రాయలేదు.

చెప్పాలంటే...... said...

బుజ్జి గాడి ఫొటోనే బాగుంది అనుకుంటే మీ టపా మరి బావుంది :)

జ్యోతిర్మయి said...

బుజ్జ్జి గాడు భలే వున్నాదండీ...

Lakshmi Raghava said...

yama urjantuga naaku naa manavaraalini chusi muddettukovalanipistondi..velliranaa?

జలతారు వెన్నెల said...

మలాకుమార్ గారు, నాకైతే అసలు ఎవరు తీసారో కాని ఈ చిత్రం,ఎంత బాగుందో! నాకు తెగ నచ్చేసిన మీ లైన్ " ఐనా ఆటెన్షన్ ఎందుకంటారు ? వాడు పాసైనాడా లేదా అనా ? లేక వాడి గర్ల్ ఫ్రెండ్ పాసైందా లేదా అనా ?"

మరువం ఉష said...

నిజానికి వాడి టెన్షన్ చూస్తే 'ఈసారైనా అమ్మమ్మ గట్టెక్కిందా?' అన్నట్టుగా లేదూ? ;) మీ స్వానుభవ "మామ్మరికపు" జాడలు ప్రోది లా ఉందీ వర్ణన...మనవళ్ళ/మనవరాళ్ళ మురిపాలు రుచిలోకి వచ్చాయిగా!

శ్రీలలిత said...

ఓ భగవంతుడా,
మా బుజ్జిగాడిని, వాడి గర్ల్ ఫ్రెండ్ నీ కూడా పాస్ చేయించు. నీకు కొబ్బరికాయ కొడతాను.

మాలా కుమార్ said...

రాజీ ,
నేనూ అక్కడ మీ కామెంట్ చూసి నవ్వుకున్నానండి :)

*ఉమా దేవి గారు ,

వాడిని చూస్తే ముద్దొచ్చినా , ఇంకో పక్క పాపం ఇంత చిన్నప్పటి నుంచే చదువులు , రిజల్ట్స్ అని , మీరన్నట్లుగా బాధ కూడా వేసిందండి . నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండి .

*పరిమళం గారు ,
థాంక్స్ అండి :)

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
మీరు చెప్పిందీ నిజమేనండి . పిల్లలకన్నా అమ్మమ్మలూ నాయనమ్మలూ తాతయ్యలే ఎక్కువ టెన్షన్ పడుతారు . మీకు త్వరలోనే అనుభవమవుతుందిలెండి :)

*రాజేంద్రకుమార్ గారు ,

మీ కాంప్లిమెంట్ కు థాంక్స్ అండి :)

*మంజు ,

థాంక్ యు .

మాలా కుమార్ said...

జ్యోతిర్మయి గారు ,

థాంక్స్ అండి .

*లక్ష్మీ రాఘవ గారు ,

ఇక ఆలెశ్యమెందుకు పదండి మీతోపాటు నేనూ వస్తాను :)

*జలతారు వెన్నెల గారు ,

అవునండి , అంత బాగా ఎవరుతీసారోకాని వాళ్ళను చాలా మెచ్చుకోవాలి .

థాంక్స్ అండి :)

మాలా కుమార్ said...

ఉషా ,

నిజమేనండి . మా మనవారాలైతే నాతో పోట్లాడుతుంది , నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు అని :) వాళ్ళ రిజల్ట్స్ వచ్చాక అమ్మయ్య అని ఉపిరిపీల్చుకొని దేవుడికో కొబ్బరికాయ కొడతాను :)

*శ్రీలలిత గారు ,
నేనూ అలాగే మొక్కుకుంటున్నానండి :) నాకు సపోర్ట్ వచ్చినందుకు థాంక్స్ అండి :)

సుజాత వేల్పూరి said...

ఫేస్ బుక్ నిండా వీడేనండీ!! :-))

ఆ.సౌమ్య said...

బోడిగాడు భలే ఉన్నాడు. ఆ టెన్షను, ఆ కళ్ళు ఆ ముక్కు...నోట్ళో వేళ్ళు పెట్టేసుకుని ముద్దొస్తున్నాడు బుజ్జిగాడు :))

ఇప్పుడు నవ్వుకుంటున్నాంగానీ ఆ రోజులు రాకపోవు అనిపిస్తోంది. LKG నుండీ IIT కోచింగ్ అని బోర్డులు పెట్టేస్తున్నారుగా! :((

మాలా కుమార్ said...

సుజాత గారు ,

నేను వీడిని చూసిన మొదటిరోజే , వీడిని ప్రమదావనానికి , ఫేస్ బుక్ కు తీసుకెళ్ళాను . అక్కడ మా ఫ్రెండ్ ఒకరు , మా కజిన్ వీడినితీసుకెళ్ళారు :)నాకు అంతే తెలుసు :) నాకు ఫేస్ బుక్ లో ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అందుకే వాడు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు . వీడి ని నేను చూడటం ఇదే మొదటిసారి :)

మాలా కుమార్ said...

సౌమ్యా ,

తెగ ముద్దొస్తున్నాడనేగా ఎత్తుకొచ్చుకున్నాను:)

నిజమేలే ఆ రోజులూ ఎంతోదూరం లేవు :)

వనజ తాతినేని/VanajaTatineni said...

:):))))
comments annee baagunnaayi.