Wednesday, September 14, 2011

రాధ - మధు



టి. వి చూసే అలవాటు లేని నేను , యద్దనపూడి నవల సీరియలా గా వస్తోంది అని విని , ఏదేమిటో చూద్దామని టి. వి ఆన్ చేసాను . అంతే రెండు సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే మా టి. వి ముందు హాజరు . రాధ - మధు సీరియల్ తెగ నచ్చేసి , అప్పుడప్పుడు పిల్లలతో కూడా టి. వి కోసం యుద్దం చేసేంతగా నచ్చేసింది :)))))

ఈ తియ్యనైన ఎడబాటు ప్రేమ కథ ను స్కార్ఫియో ప్రొడక్షన్ వారు " రాధ- మధు " గా టి . వి సీరియల్ గా తీసారు . ఈ సీరియల్ లో కథ ను బేస్ గా మాత్ర మే తీసుకున్నారు . తాతయ్యను , నానమ్మ గా చూపించారు . కొన్ని పాత్రల నిడివి ని పెంచారు . కొన్ని ఎక్స్ ట్రా పాత్రలు చేరాయి . ఐనా ప్రతిపాత్ర బలమైందే . ప్రతి పాత్రా అవసరమైందే అన్నట్లుగా వున్నాయి . వొకటి ఎక్కువ , వకటి తక్కువగా లేవు . చిన్న పాత్రల మీద కూడా శ్రద్ద చూపించారు . ఏ పాత్రను తీసుకున్నా సహజం గా అనిపించింది . డైలాగులు చాలా మామూలు బాషలో వున్నాయి . అనవసరమైన ఇంగ్లీష్ పదాలు లేవు .ఎక్కడా అతిలేదు . సంభాషణలు చాలా మాములుగా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లే వున్నాయి . అంతేకాని భారీ డైలాగులు లేవు . హాస్యం కూడా బాగా పండించారు . చాలా అద్భుతంగా తీసారు .

హీరో పేరు రాధాకృష్ణ . అందరూ రాధా అనిపిలుస్తుంటారు . హీరోయిన్ పేరు మధూలిక . మధు అని పిలుస్తుంటారు . నానమ్మ రాజరాజేశ్వరీ దేవి . కథ కు ప్రాణం ఈ మూడు పాత్ర లే . సినిమాలలో గుంపులో గోవిందమ్మ గా , చిన్న చిన్న పాత్రలు వేసే శివపార్వతి ని ముందు నానమ్మ గా చూసి , ఈమె ఏమి చేయగలదు అనుకున్నాను కాని , జమీందారు భార్య గా ఆ వశం ప్రతిష్ఠ కాపేడేందుకు కొడుకును దూరం చేసుకొన్నప్పుడూ , ఆ తరువాత పశ్చాతాపం చెందినప్పుడూ , మనవడి ని పెంచేటప్పుడు బాద్యత గల నానమ్మగా , మనవడి ని మార్చాలి , పెళ్ళి చేయాలి అని తపించినప్పుడూ , పనివాళ్ళ మీద కూడా అభిమానం చూపించేటప్పుడూ , పేద ఇంటి పిల్లను మనవడి కి ఇచ్చి పెళ్ళి చేసినప్పుడూ , రాధ ప్రేమ కథ తెలిసి , తనకు తెలీకుండానే ఇద్దరు అమ్మాయీల జీవితాన్ని నాశనం చేసానే అని పరితపించినప్పుడు , మితృ , గోపాలం ల బాల్య స్నేహితురాలిగా చాలా బాగా నటించింది . నటించింది అంటము కాదు జీవించింది . నానమ్మ అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . చాలా హుందాగా వుంది . రాధగా కళ్యాణ ప్రసాద్ తోరం , మధుగా మౌనిక చాలా సహజం గా వున్నారు . అసలు వాళ్ళిద్దరికీ సీరియల్ తీసే ముందే , ఎలా నటించాలి అని శిక్షణ ఇప్పించారేమో అని నా అనుమానం . వాళ్ళ హావ భావాలు , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ అన్నీ నాచురల్ గా వున్నాయి . ఆ పాత్రలకు తగ్గట్టుగా నవలలో నుంచి ప్రాణం పోసుకొని వచ్చారా అన్నట్లుగా వున్నారు . వాళ్ళ ముందు , శోభన్ బాబు , జయప్రద తేలి పోయారు . మధు చీర కట్టు చూస్తే సింతటిక్ చీరలు కూడా ఇంత అందం గా కట్టుకోవచ్చా అనిపించింది . పద్మశ్రీ , లక్ష్మి ల జడలు కూడా పెద్దగ్గానే వున్నా మధు జడ డామినేట్ చేసింది . నడుస్తూ , నడుస్తూ భుజం మీదు గా చూడటము ఓహ్ చాలా అందంగా అనిపించిందీ అమ్మాయి .(ఇన్ని తెలివితేటలు , అందమూ , మంచి గుణాలన్ని కలవోసిన అమ్మాయిని నిజ జీవితం లో భరించటం కష్టమేమో :)) కాకపోతే కొన్ని సార్లు మధు కాన్ ఫిడెన్స్ ఓవర్ గా చూపించిదా అనిపించింది .

జూలీ గా లహరి బాగా ఇమిడిపోయింది . అందరి సానుభూతి నీ దోచుంది . మిగితా పాత్ర ధారు లంతా కూడా బాగా చేసారు . కాకపోతే అందరివీ అసలు పేరులు తెలీలేదు . సాయన్న , గొదావరి , బాపి మొదలైన వారి అసలు పేర్లు తెలీలేదు . యువజంట రాధ - మధు తో పోటీ పడ్డారు గోపాలం ఆది లక్ష్మి , వెంకట్రావు , జానకమ్మ . సాయి , పద్మశ్రీ హాస్యాన్ని బాగా పండించారు . ముందు పారిజాతం పాత్ర అనవసరం అనుకున్నాను కాని రాధ - మధు ల ను కలిపేందుకు పరోక్షం గా ఆ పాత్రే సాయపడింది . రాఘవయ్య పాత్ర సగము నుంచి ముఖ్యమైన పాత్రైపోయింది . రాజు , శీను , సరోజ , భారతి , బబ్లు , అనసూయ , సన్నీ లాంటి చిన్న పాత్రల కు కూడా న్యాయం చేసారు . మధు ఆప్తులుగా మూర్తీ , లక్ష్మి బాగా చేసారు . మధు తమ్ముడు రవి చాలా ముద్దుగా వున్నాడు . వరమ్మ పాత్ర పల్లెటూరి అమ్మలక్కల పాత్ర ను సజీవం గా చూపారు . రాధ - మధు లను కలపాలని అందరూ ప్రయత్నం చేయటం టచీగా అనిపించింది .
ఇహ రాధ మధు కలుస్తారు అనుకోగానే ఏదో అవాంతరం రావటం , మనం ఉసూరు మనటం . అందుకే డైరక్టర్ దీనిని తీయని ఎడ్బాటు ప్రేమ కథ అన్నాడు :) సీరియల్ రెండు సంవత్సరాల పాటు కళ్ళు తిప్పుకోనీయకుండా టి. వి కి కట్టి పడేసిన అద్భుతమైన సీరియల్ ఇది . కాని , కొన్ని సార్లు సాగతీతగా అనిపించింది . కొన్ని చోట్ల పద్మశ్రీ , పారిజాతము ల ఎపిసోడ్స్ కొంచం బోర్ కొట్టించాయి . అలాగే ఆద్యంతమూ రాధ మధుల మేకప్ మొదలైన వాటిల్లో శ్రద్ద చూపించారు కాని చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి ఇద్దరి మేకప్, హేర్ స్టైల్ రెండూ బాగాలేవు . అంతకు ముందు రెండు పెళ్ళి కూతురి గెటప్ లో ముచ్చటగా వున్న మధుకు హేర్ స్టైల్ పూర్తిగా మార్చి , ఓవర్ మేకప్ చేసారు . పాన్ కేక్ బాగా కనిపించి మోటుగా వుంది . అంతవరకు వున్న అందమే పోయింది . అలాగే రాధ కు కూడా . హేర్ మొత్తం వెనక్కి దువ్వేసి , మేకప్ కూడా ఓవర్ గా చేసారు . ఒకేసారి గా ఇద్దరూ వయసు ఎక్కువ వాళ్ళుగా అగుపించారు . చిన్న చిన్న లోపాలు తప్ప సీరియల్ చాలా బాగుంది .
కొన్ని సరదా అబ్జర్వేషన్స్ ; రాజరాజేశ్వరి జమిందారిణి ఐనా , పాపం ఆ రాజమాత కు సీరియల్ మొత్తం లో పది చీరల కన్న ఎక్కువ లేవు ! మధు జడ మొదట్లో చాలా వదులుగ సన్నగా వుండి రాను రాను లావైంది . జుట్టు కు క్లిప్ పెట్టుకొని గుడికి వెళ్ళి నప్పుడు జుట్టు జడంత పొడువులేదు . సీరియల్ చివరలో జడకు బోలెడు క్లిప్స్ పెట్టారు . సీరియల్ అంతా బెడ్ కాఫీ తో మొదలుకొని , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ అన్నీ యధావిధిగా పెట్టారు . అందుకేనేమో సీరియల్ ఐపోయే సమయానికి అంతా కాస్త లావెక్కారు :) ప్రతి చిన్న విషయాన్ని అంటే ఎవరైనా ఆక్టర్ ఇక ముందు కనిపించరు అంటే ముందే వారిని పని మీద వూరికి పంపటం వగైరా చేసి మనకు డౌట్స్ రాకుండా చేసారు . కాని చివరలో రాధ కు , పేపర్ లో చూసి , ఆపరేషన్ కోసం సహాయం చేసింది రవి కేనని ఎలా తెలిసిందో చెప్పటం మర్చిపోయారు . సీరియల్ అంతా తన నొటి తో దడ దడ లాడించిన వరమ్మ లాస్ట్ సీన్ లో లేకపోవటం కొరతే మరి :)
ఇది యద్దనపూడి సులోచనారాణి నవల " గిరిజా కళ్యాణం " ఆధారం గా నిర్మించ బడింది . దాని కథ చిత్రమాలికలో " గిరిజా కళ్యాణం " లో చదవండి ..
ఇది యు ట్యూబ్ లో వుంది . చూడని వారు చూడవచ్చు .
కొస మెరుపేమిటంటే , ఈ సీరియల్ వస్తున్న రోజుల్లోనే ఎందుకో జి చానల్ పెడితే అందులో " ఆట" అనే ప్రోగ్రాం వస్తోంది . అప్పుడు మధు అందులో " ఆ అంటే అమలాపురం " పాటకు డాన్స్ చేస్తోంది . అది చూడగానే మనసంతా బాధ తో నిడిపోయింది . ఆర్టిస్టులంటే అన్నీ పాత్రలూ పోషించాలి కాని ఆ సీరియల్ వస్తుండగా ఆ అమ్మాయి ఈ డాన్స్ చేయకుండా వుండాల్సింది అనిపించింది :(

ఈ మద్య నవల ఆధారిత సినిమా ల గురించి చిత్రమాలిక లో వ్రాస్తున్నాను :) ఐతే నా దగ్గర అన్నీ యద్దనపూడి , యండమూరి , శరత్ బాబు నవలలు , సినిమాలే వున్నాయి . నాకు తెలిసినంతవరకు మాదిరెడ్డి , కొమ్మూరి వేణుగోపాల రావు , మల్లాది , కావలిపాటి విజయలక్ష్మి , బలభద్రపాత్రుని రమణి మొదలైన వారి నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి .కాని ఏ సినిమాలు ఏ నవలల ఆధారం గా వచ్చాయో తెలీటం లేదు . అలాగే కొన్ని నవలలు తెలుగు లో , హిందీ లో కూడా వచ్చాయి . ఎవరికైనా , నవల పేరు , అది సినిమా గా వచ్చిన సినిమా పేరు తెలిస్తే చెప్పగలరు ప్లీజ్ . అలాగే ఈ ఆర్టికల్ ఇలాగే కాకుండా ఇంకా కొంచం వేరుగా వ్రాయవచ్చేమో సలహాలు ఇచ్చినా సంతోషిస్తాను . ఆ * * * నవలలు , సినిమా సిడీ లు నేను కొనుక్కుంటానులెండి .నవలలైతే ప్రతినెలా కోటీ దాకా ఏమొస్తావులే అని నాలుగు నెలల క్రితమే మా ఇంటి వెనుకే విశాలాంద్ర వారు బ్రాంచ్ తెరిచారు . ఏ నవల కావాలన్నా తెప్పించి ఇస్తాం మేడం అని నాకు ప్రామిస్ చేసారు . కాబట్టి నొప్రాబ్లం :) సి.డి లే సుల్తాన్ బజార్ కు వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి . కాకపోతే దొరకాలి :)
అందరికీ అడ్వాన్స్ గా థాంకూలు :)

14 comments:

లత said...

నేను సీరియల్ చూడలేదు కానీ శివపార్వతి అందులో చాలా బావున్నారు మాలగారూ
నిజం, అంత చక్కటి పాత్ర చేసి ఆ అమ్మాయికి ఇంకా పిచ్చి డాన్సులు ఎందుకో అర్ధం కాదు

sai krishna alapati said...

సిరయాల్ కి బద్ద వ్యతిరేకిని నేను మా అమ్మ వాళ్ళు సేరియల్స్ చూస్తుంటే రిమోట్ లాక్కొని ఏమిటి ఇ చెత్త అని వేరే చానెల్స్ పెట్టె వాడిని కని ఒక రోజు ఇ సిరయాల్ ఎలా చూసానో తెలియదు అప్పటి నుంచి ఫాల్లో అయిపోయే వాడిని . తనని నేను అంతకు ముందే సినిమా లలో సైడ్ వేషాలు వేసి నప్పటి నుంచి గమనిoచాను కాని అక్కడ ఎక్కడ లేని అందం ఇ సేరియాల్ లో కని పించింది ..వీళ్ళు ఇద్దరే ముఖ్య పాత్రలు గా వేరే నాటిక కూడా మా టీవీ లో వచ్చింది ....ఆడి కూడా చూసే వాడిని అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టటం మొదలు పెట్టారు మేము చూస్తుంటే రిమోట్ లాక్కునే వాడివి ఇప్పుడు ఎలా చేస్తున్నావ్ రా అని ....పిచ్చి ఎంత గా ఎక్కింది అంటే ఏ రోజు అన్న చూడ లేక పోతే ఇంటికి కాల్ చేసి అడిగే వాడిని ఏమి అయ్యింది అని .ఆ రెండు సిరయల్స్ తప్ప నేను ఏమి చూడ లేదు చూడ లేను కూడా ....మా అమ్మ నేను పుట్టి నప్పుడు మొదలు ఐన మొగలి రేకులు అనే సిరయాల్ కి పిచ్చ్చి అభిమాని ......

Anonymous said...

నాకు చాలా ఇష్టవండీ ఈ సీరియల్ . రాధ, మధు ఎంత అందంగా వుంటారో . ఇంతింత కళ్ళతో ఆ అమ్మాయి చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది . రాధాకృష్ణ ఇప్పుడు బాలేదు . ఆ సీరియల్ లో చాలా బావున్నాడు అంత వివరంగా రాసారు ఈ పాత్రలన్నీ మీకు ఇంకా గుర్తున్నాయా గ్రేట్ అండీ మీరు

మురళి said...

మొత్తం చూడలేదు కానండీ.. కొన్ని ఎపిసోడ్స్ చూశాను.. 'పర్లేదు.. గిరిజా కల్యాణం కి న్యాయం జరుగుతోంది' అనిపించింది..
మీరు రాసినదానికి వంక పెట్టడానికి ఏముంటుంది చెప్పండి?

శ్రీలలిత said...

ఒక టీవీ సీరియల్ గురించి వివరంగా రాసారు. బాగుంది. అది ఏ నవల ఆధారంగా తీసారో రాసారు. అదీ బాగుంది. ఆ నవల ఆధారంగా నిర్మించిన సినిమా పేరు, అది ఎలా వుందో కూడా రాసారు. బహు బాగుంది.
ఆ సీరియల్లో పాత్రలు, వాటిని పోషించిన విధానము, వారి ఆంగికము, అభినయము అన్నీ అంత వివరంగా చెప్పారు. చిన్న పెద్దా పాత్రలందరి పేర్లూ చెప్పారు.. హాస్యం గురించి మాట్లాడారు. క్లైమాక్స్ గురించి కూడా చెప్పారు.
అన్నీ ఇంత బాగా చెప్పాక, మీరు చెప్పిన ఒక్క విషయం మటుకు అస్సలు బాగులేదు..
అదేంటంటే... దీనిని వేరే విధంగా రాయడానికి సలహాలు అడిగారు చూడండీ.. అది అస్సలు బాగాలేదు.
మీరు రాసిన విధానమే చాలా బాగుంది. అలాగే అన్నీ రాసెయ్యండి. చదివి పెట్టేస్తాం.

నాకు వెంటనే గుర్తొచ్చిన నవలా సినిమాలు ఇవి. ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా చెపుతాను.
మాదిరెడ్డి సులోచన నవల.. కలవారి సంసారం.. అదే పెరుతో సినిమా.
వంశీ నవల.. మహల్లో కోకిల.. కోకిల పేరుతో సినిమా.
కోడూరి కౌసల్యాదేవి.. చక్రభ్రమణం..డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమా.
సూర్యదేవర రామమోహనరావ్.. త్రినేత్రుడు.. ఒంటరిపోరాటం పేరుతో సినిమా.

మాలా కుమార్ said...

లత గారు ,
అవునండి . ఆ డాన్స్ 5 గంటలకు చూసి , రాత్రి రాధ మధు లో చూసేసరికి కొంచం కష్టం గానే వుండింది . ఇప్పటికీ అదే అనుకుంటాను ఆ డాన్స్ చేసి సీరియల్ ఇమేజ్ పోగొట్టుకుంది అని .

* సాయి కృష్ణ ఆలపాటిగారు ,
ఆ సీరియల్ అందరినీ అలా కట్టేసిందండి . రెడో ది లయ కూడా యద్దనపూడి నవల మధురస్వప్నం అండి . అదీ బాగుంది .

మాలా కుమార్ said...

లలిత గారూ ,
గుర్తుండటమా ఏమన్నానా , ఇది రాయటానికని యు ట్యూబ్ లో మళ్ళీ చూసానండి . అక్కడక్కడ చూసి రాద్దామనుకున్న దానిని ఓ నెల రోజులు ఐ ఏ యస్ ఎగ్జాంస్ కు ప్రిపేర్ ఐనట్లు రోజు 7 గంటలు చూసాను :)
నేను చూసిన సీరియల్స్ ముచ్చటగా మూడు , అవి , రాధ మధు , లయ , అమ్మమ్మా . కాం . అంతే వాళ్ళు మళ్ళి ఇంకెండులోనైనా ఆక్ట్ చేస్తున్నారో లేదో తెలీదండి . అవున్లెండి ఆ సీరియల్ చివరకొచ్చెసరికే ఇద్దరూ కొద్దిగా పెద్ద వాళ్ళ లా అగుపించారు .

* మురళి గారు ,
నేను రాసిన దానికి వంక పెట్టలేరా :) థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు ,
రిప్లై వివరం గా ఇచ్చారే థాంక్స్ అండి .
నేను వ్రాస్తున్న పద్దతే బాగుందంటారు . మరిమీరు చెప్పాక నేను కాదనేదేముంది ?
మీరిచ్చిన ఇంఫర్మెషన్ కు థాంక్స్ అండి . అవి దొరుకు తాయేమో ప్రయత్నిస్తాను .

నీహారిక said...

మాల గారు,
జడలు ఎప్పుడూ ఒకేలా ఉండటం ఎలా సాధ్యం?? అర్ధం చేసుకోరూ...???

ఏంజెలినా జోలీ లాంటి వంటమనిషిని కోరుకుంటే, షకీలా లాంటి వంటమనిషి దొరికింది.

వద్దు... నువ్వే వండాలి అని గొడవ !!
I hate cooking !!

ఎలా ఒప్పించాలో మీ సలహా కావాలి. మీ కంటోన్మెంట్ ఏరియా లో కాకుండా, మా కంటోన్మెంట్ ఏరియా లో కాకుండా.... బయట ఏదయినా హైదరాబాద్ బిరియానీ దొరికే రెస్టరెంట్ లో కూర్చుని తింటూ చర్చిద్దాం. ఎపుడు కలుద్దాం చెప్పండి ??

మాలా కుమార్ said...

నిహారిక గారు ,
హుం అడగక అడగక నా సలహానే అడిగారూ :)
నేను బిరియాని తిననండి . ఎంచక్క ఓరీస్ లో లంచ్ చేద్దాం :)

రసజ్ఞ said...

అసలు సాగతీస్తూ ఏడుపుల పెడబబ్బుల సీరియల్స్ అంటేనే ఇష్టపడని నేను మొదటి సారి ఇష్టంగా చూసినది రాధ మధునే! మధు ఎంత బాగుంటుందో! ఎంతో చక్కగా వ్రాశారు!

మాలా కుమార్ said...

రసజ్ఞ గారు ,
థాంక్స్ అండి .

srinivas g s said...

when ever we r having free time we watch this serial in youtube. rajeswari gari patra chitrana pi phd cheyavacchu anipinchindi naku. g s srinivasa rao ph: 9908073052

srinivas g s said...

when ever we r having free time we watch this serial in youtube. rajeswari gari patra chitrana pi phd cheyavacchu anipinchindi naku. g s srinivasa rao ph: 9908073052