Wednesday, June 8, 2011

మా చిన్ని అదితి కి అభినందనలు"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)

ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .

మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !

19 comments:

చెప్పాలంటే...... said...

i wish u all the best & good luck

జ్యోతి said...

All the best Aditi.. may all your wishes come true..

Anonymous said...

All the best Aditi.

శిశిర said...

తను అందుకోవాలనుకుంటున్నవన్నీ అందాలని ఆశిస్తూ.. అదితికి అభినందనలు.

శ్రీలలిత said...

All the best Aditi..
May God bless you...

మధురవాణి said...

అదితి కి నా తరపు నుంచీ స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పండి మాలా గారు.. తనకి నచ్చింది చదువుకుని గొప్ప సైంటిస్ట్ అయిపోవాలని దీవించేస్తున్నా! :D

ఆ.సౌమ్య said...

అదితి చిన్నప్పటి ఫొటో బలే బుజ్జిగా ఉంది...బుగ్గలు లాగేసి ముద్దాడాలనిపిస్తున్నాది.

అదితి కి all the best....తను జీవితంలో గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా!

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

All the best and many more achievements.

క్రిష్ణవేణి said...

మాలగారూ అదితికి బోల్డు అభినందనలు. కానీ ఇప్పుడు తనని పొగిడితే అది మిమ్మల్నే అనుకుంటారా ఏమిటి మీరు? మరి మీరే కదా “”మా బంగారుతల్లి అంతా నా పోలికే :)” అని అన్నారు? కాబట్టి చెప్పదలిచినదేమనగా- నా అభినందనలన్నీ exclusive గా అదితికే. తను వాళ్ళ అమ్మమని ఎంతగా పోలినప్పటికీ అమ్మమ్మకి ఒక్కటి కూడా చెందదు గాక చెందదు.

మురళి said...

Wow, my best wishes to your grand daughter..

మాలా కుమార్ said...

thank you for all your good wishes, this encourages me to start my first day with excitement
aditi!:D

శివరంజని said...

wowwwwwwwwwwwwww అదితి కి నా తరపు నుంచీ స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పండి మాలా గారు ........ నేను ఆ చిన్న పాప అనుకున్నా కాలేజీ కి వెళుతుందా అయితే నా తరపున all the best. చెప్పండి

సుభద్ర said...

మలాగారు,

భలే ఉంది మీ పోస్ట్...అదితి అల్ డి బెస్ట్ చెప్పండి....మీ దీవెనలు,అదితి ఆశలు అన్ని ఫలి౦చాలి\అని కోరుకుంటున్నాను..కేక్ చాలా యమ్మి గా ఉంది చూడటానికి..

మాలా కుమార్ said...

ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు .
మధురవాణి , శివానీ ,
మీ ఇద్దరి బర్త్ డే విషెస్ ఫిబ్రవరీ లో మా అదితి కి పదిలంగా అందజేస్తాను . బెస్ట్ విషెస్ ఇప్పుడే ఇచేస్తాను . థాంక్ యు .

Anonymous said...

ఫొటో చాలా చాలా చాలా బాగున్నదండి,
పాములంటే భయం తగ్గిందా?

తార

మాలా కుమార్ said...

తార గారు ,
మా ఫొటో నచ్చినందుకు థాంక్స్ అండి .
పాములంటే భయము తగ్గటమా :-)))

రుక్మిణిదేవి said...

so....cute...........

బుద్దా మురళి said...

పాస్ వర్డ్ తెలిసి పోయింది శ్రీ ఆంజనేయ

మాలా కుమార్ said...

రుక్మిణి గారు ,
థాంక్స్ అండి .

బుద్దా మురళి గారు ,
పాస్ వర్డా ? ఏం పాస్ వర్డ్ ?ఐనా తెలిసిపోయిందా :))