Friday, June 3, 2011

నాకూ బ్లాగుకూ ఋణం తీరిపోయి _ _ _ _ _మన రోజువారీ కార్యక్రమం మొదలెడుదామని లాప్ టాప్ తీసాను . జిమేయిల్ తీసాను వాకే మేయిల్స్ చూసుకోవటం ఐపోయింది . లేఖిని తీసాను . ఆ తరువాత బ్లాగ్ డాష్ బోర్డ్ క్లిక్ చేసాను . ఇదేమిటి కొత్తగా పాస్ వర్డ్ అడుగుతోంది పేద్ద తెలీనట్లు ! మర్చిపోయిందేమోలే పాపం ఇచ్చేస్తే పోలే ! పాస్ వర్డ్ టైప్ చేసాను . రయ్ ((((( మని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాస్ వర్డ్ అడిగింది . హుం . . . మళ్ళీ ఇచ్చాను . అయ్యారే . . . . . యిదియేమి చోద్యము * * * * * ఎన్నిసార్లు పాస్ వర్డ్ ఇచ్చినా ఇటుల మాయమైపోవుచున్నది !!!!! మళ్ళీ . . . . . మళ్ళీ . . . అడుగుతోంది . ఏమి చేతును ?????? కాళ్ళూ చేతులూ ఆడకున్నవి >>>>> ఇక నేను బ్లాగ్ వ్రాయలేనా ????? అసలు ఏమైంది దీనికి ??? కొంపదీసి నిన్నటి వెల్లుల్లి ఘాటు పడక ఢాం * * * * * అన్లేదుకదా . . . . . అనవసరం గా వెల్లుల్లి కష్టాలు రాసానే !!!!! అప్పటికీ కొన్ని కష్టాలే రాసాను . అన్నీ రాసి వుంటే లాప్ టాప్ నే ఢాం . . . ఢాం అనేదేమో ((((( అని పరి పరి విధములుగా చింతించాను . కాని ఏమీ లాభం కనిపించలేదు . . . . .

ఇంక నా వల్ల కాదు అనుకొని మా మనవడి ని తీసుకు రమ్మని కార్ పంపాను . హాయ్ అమ్మమ్మా అనుకుంటూ మనవడు , మనవరాలు ఇద్దరూ వచ్చేసారు . మా కొడుకు కోడలు యు. యస్ కు వెళ్ళిపోయినప్పటి నుంచీ నాకు విక్కీ నే చేదోడు వాదోడు . అందుకే వాడికే నా గోడు చెప్పుకున్నాను . ఓ గంట సేపు తిప్పలు పడ్డాడు . సారీ అమ్మమ్మా ఏమైందో రావటం లేదు నాకూ తెలీటం లేదు అని చేతులెత్తేశాడు ! వాడికే రాక పోతే ఇక నాకు దిక్కెవరు ? అయ్యో . . . నాకూ బ్లాగ్ కూ ఋణం తీరిపోయిందా ? 2 1/2 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలను పంచుకున్న నా బ్లాగ్ మూగపోయిందా ????? ఏదీ దారి ? కళ్ళు చెమ్మగిలిపోగా రాని డాష్ బోర్డ్ వైపు అలాగే చూస్తూ కూర్చున్నాను . నా తోపాటు విక్కీ కూడా బిక్కమొహం వేసాడు . . . . .

సాయంకాలం మావారు రాగానే ఏడుపు గొంతుతో హేమండీ నా డాష్ బోర్డ్ కనిపించటం లేదు అని చెప్పాను . ఆయన గాభరా పడిపోతూ ఏమిటీ అన్నారు . ఓహో ఈయనకు డాష్ బోర్డ్ అంటే తెలీదు కదూ అనుకొని అదేమిటో , అదిలేక పోతే నాకెంత ఇబ్బందో పదినిమిషాలు వివరించి చెప్పాక అంతా విని ఓష్ అంతే కదా . . . నీ ఏడుపు మొహం చూసి ఇంకేమైందో అనుకున్నాను అని తీసిపారేసారు . ఇంకేమి కావాలి . ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది అని గొణుకున్నాను . ఏమనుకున్నారో , ఈ ఏడుపు పోతే తప్ప అన్నం పెట్టననుకున్నారేమో , లేదా జాలే వేసిందో పోనీ రవికి ఫోన్ చేసి కనుక్కో అని ఓ సలహా పడేశారు ! ఇంతరాత్రి ఏమి కాల్ చేస్తానులే అని వూరుకున్నాను .

ఒకటా ? రెండా ? మూడు బ్లాగులు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకు మనశ్శాంతి వుంటుందా ? రాత్రంతా నిద్రనే లేదు . నాకు ఎంత కంపెనీ ఇచ్చాయి ! ఎంతమంది స్నేహితులను సంపాదించిపెట్టాయి ! నాకు తోడూ నీడగా వున్నాయి ! ఇప్పుడు నన్ను దిక్కులేనిదానిగా వదిలేసి వెళ్ళిపోయాయి ! వాటికీ నాకూ ఋణం అంతేనేమో ! అయ్యో సాహితీ ఇక నేను నిన్ను చూడలేనా ! కమ్మటి కలలు కంటూ , చల్తే చల్తే అని హాపీగా బ్లాగ్ లోకాన్నీ చుట్టి రాలేనా ! అకటా ఎంత కష్టం వచ్చింది . పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు ఇవ్వకు దేవుడా !!! హుం ఎంత దిగులు పడ్డా ఏమిలాభం !

మరునాడు పొద్దున గబ గబా పనులు కానిచ్చుకొని , మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని సిస్టం ఓపెన్ చేసాను . శ్రీమద్ రమా రమణ గోవిందో హరి !!!!! మొదటికే మోసం * * * నెట్ గయాబ్ * * * ఆ పోవటం పోవటం ఐదు రోజులు అత్తా పత్తా లేకుండా పోయి నిన్న నే వచ్చింది . . . చిన్నగా జిమేయిల్ ఓపెన్ చేసాను . వచ్చింది . వెల్లులి కామెంట్స్ పబ్లిష్ చేసాను . లేఖిని వచ్చింది . ఇక తీయనా వద్దా . . . టెన్షన్ * * * టెన్షన్ * * * డెస్క్ టాప్ మీద వున్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను . . .

రెడీ . . .
వన్ . . .
టు . . .
త్రీఈ . . . ఈ . . . ఈ . . .
ధైర్యం విలోలంబాయే ( కరెక్టేనా ? ఏమో ?)
దేవా * * * దేవా * * * దేవా * * * శ్రీ ఆంజనేయా , ప్రసన్నాంజనేయా * * *
క్లిక్ & & & & &
వావ్ ( ( ( ( ( * * * * * వచ్చేసిందీ . . . ఈ . . . ఈ. . .
హబ్బా ఎంత సంతోషం ! మాటల్లో రాతల్లో చెప్పలేనంత !!! తప్పిపోయిన బిడ్డ దొరికినంత :))

22 comments:

లత said...

నిజమేనండి,ఒకోసారి ఎంత విసిగిస్తుందో ఏమైపొయిందో అని కంగారు పుట్టేస్తుంది.కాసేపాగితే మళ్ళీ వచ్చేస్తుంది ఆరు నెలలకే నాకు ఇలా ఉంటే మీ టెన్షన్ అర్ధం అవుతోంది
బ్లాగానుబంధం ఇదేనేమో

Anonymous said...

Chala baga rasaaru

సుభద్ర said...

హమ్మయ్య కొత్త పాఠం నేర్చుకున్నారా??
ఇక నాకు బ్లాగ్ మిస్ ఐతే అన్న తెక్షనే లేదు...
టైటిల్ చూసి అదిరిపోయా........అమ్మో ఏంటి మాలాగారు కో౦పదీసి బ్లాగ్ కాని ................(అమంగళం ప్రతిహతం అవుగాక) అనుకున్నా..
థాంక్ గాడ్..

మురళి said...

ఇది అప్పుడప్పుడూ నాక్కూడా అనుభవమేనండీ.. ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తో ఈ సమస్య ఎక్కువ..

కృష్ణప్రియ said...

:)

రాజ్యలక్ష్మి.N said...

నిజమే మాలాకుమార్ గారు.
మొన్నామధ్య ఒక రెండు రోజులు బ్లాగర్
పని చేయలేదు..
ఎవో టెక్నికల్ రీజన్స్ వల్ల అని అన్నారు..
ఆ రెండు రోజులు నేను కూడా తెగ బాధపడ్డాను..
నా బ్లాగ్స్ ఏమవుతాయా అని...

krishnaveni said...

మాలగారూ, Title చూసి గాభరా పడ్డాను. సరే పూర్తిగా చదివితే “ హమ్మా ఇంతే కదా!” అనుకున్నాను. అయినా చెప్పేను కదా! మీ sense of humor ఇలా దినదిన ప్రవర్థమానం అవుతోందని? చిన్న topic ని ఎంచుకుని ఎంత బాగా రాసేరో

శ్రీలలిత said...

అబ్బే... మిమ్మల్నలా గాయబ్ కానిస్తామా...
ఎంత ధైర్యముండాలి ఆ డేష్ బోర్డ్ కి...?
ఏది ఏమైనా మీ మొర ఆ భగవంతుడు విన్నాడు..
కాదు... కాదు...
మమ్మల్ని కనికరించాడు...
మీ బ్లాగ్ మళ్ళీ ప్రత్యక్షమైనందుకు ఆ దేవదేవునికి వేయి దండాలు...

రత్న మాల said...

మాలా గారు రాసే పద్దతి బాగుంది.

Vamsi Krishna said...

భయపెట్టావ్ కద అత్తయ..
రాసి రాసి వైరాగ్యం వచ్చిందెమొ ఇక రాయవెమొ అనుకున్నా...

మాలా కుమార్ said...

లత గారు ,
కాస్తా కూస్తా కాదు రెండున్నరేళ్ళ బ్లాగానుభంధం మరి :)

& అనోనమస్ గారు ,
థాంక్స్ అండి .

&సుభద్ర ,
ఆహా కొత్తపాఠము నేర్చుకున్నాను . ఐనా అంత తొందరగా బ్లాగ్ ను వదిలేరకం కాదులే మనం . కనీసం ఇంకో వందేళ్ళైనా రాస్తాను :)

మాలా కుమార్ said...

ముర్ళి గారు ,
నేను ఫై ఫాక్స్ ను వాడతానండి . నాకు ఇలా కావటము ఇదే మొదటి సారి .
థాంక్స్ అండి .

&కృష్ణప్రియ గారు ,
నవ్వినందుకు థాంక్స్ అండి .

&రాజీ ,
అవునట . ఆ తరువాత నేనూ ఆ విష్యము ఎక్కడో చదివాను . కాని ముందు చాలా దిగులేసింది .

మాలా కుమార్ said...

కృష్ణవేణి గారు ,
ఇది చిన్న విషయమా ? అమ్మో చాలా పెద్ద సమస్య అండి :)
కామెంట్ రాయటము రాదంటూనే బాగానే రాసారుకదా ! థాంక్ యు .

& శ్రీలలిత గారు ,
మీ అందరి బుర్రలూ తినే యోగము నాకింకా వుంది . అందుకే గాయబ్ కాలేదు .
మీ దండాల తో పాటు నా దండాలు కూడా పెట్టేయండి మరి :)

మాలా కుమార్ said...

రత్నమాల గారు ,
మీ తలపై చిన్నగా , చిన్నగానే సుమా తట్టి వెళ్ళి మీ బ్లాగ్ చూసి వచ్చానండి . మీ బ్లాగ్ బాగుందండి .
మీ మెప్పుదలకు ధన్యవాదాలండి .

& వంశీ ,
అప్పుడే నాకు వైరాగ్యం వస్తే ఎలాగరా నాయనా !
భయపడకు నా రాతలు ఇంకా కొన్నేళ్ళు రాస్తానులే :))

నేస్తం said...

మొన్న నాకు అలాగే అయ్యింది మాలగారు ...ఏడుపొచ్చేసింది దెబ్బకు..ఈ బ్లాగర్ ఏమిటో బాబు భలే టెన్షన్ పెట్టేస్తున్నాడుకదా

సుజ్జి said...

అచ్చోచ్చో.. భయపడేసాను కదా...!!

ramya said...

హ్మ్మ్మ్... ఇలా టెన్షన్ పడితే ఎలాగండీ! మొత్తం బ్యాకప్ తీసి పెట్టుకొండి. ఉల్లాసంగా ఉత్సాహంగా బ్లాగింగ్ కొనసాగించండి :)

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
ఈ మద్య ఈ బ్లాగర్ ఇలానే తింగరి వేషాలు వేస్తోంది .

& సుజ్జి ,
భయపడ్డావా ? ఎందుకు :)

మాలా కుమార్ said...

రమ్య గారు ,
ఏదో రాసేయటమే కాని , బాకప్ చేయటము గట్రా తెలీదండి . అందుకే కాస్త టెన్షన్ :)
థాంక్స్ అండి .

sairavik said...

mari emainattabba!!! emo le ippudu vachindi gaa... enjoy
-ravi komarraju

Unknown said...

మీరు రుణ మీ సొంత వ్యాపార, మీరు ప్రారంభ న, మీరు ప్రణాళికా మీరు తీవ్రంగా తక్షణ ఋణం ఆర్థిక సాయం పొందే అనుకుంటున్నారా? ఈ మేము వ్యక్తిగత రుణ, వ్యాపార రుణ, వ్యాపార రుణాలు, మరియు 2% వడ్డీ రేటు వద్ద అప్పు అన్ని రకాల వారికి ఎందుకంటే మీ కోరిక పొందడానికి అవకాశం ఉంది.
మేము $ 1000 కు $ 50,000,000.00 నుండి కుడి ఆస్ట్రేలియా అంతటా వరకు అసురక్షిత మరియు రుణాలను అందించేందుకు. రుణాలు ఆన్లైన్ కోసం వర్తించే మరియు సాధారణంగా ఆమోదిత మరియు 24 గంటల్లో కస్టమర్ ఖాతాలకు నిధులను కలిగి చేయవచ్చు. కేవలం దరఖాస్తు వద్ద ఇప్పుడు మమ్మల్ని సంప్రదించండి: {guaranteeloantrust@yahoo.com

Lakshmi Raghava said...

Menu maa blog chusukuni enno rojulaindi! Try chesta.. Thanks for reminding.....baagaa rasaaru maala garu