Saturday, March 19, 2011

సూపర్ మూన్ మా ఇంటికి వచ్చిన వేళ



సూపర్ మూన్ . . . సూపర్ మూన్ అంటూ వారం రోజుల నుండి టి. వి లు , పేపర్ లు హోరెత్తిస్తూ వూరిస్తున్నాయి . అదేమిటో చూద్దామని సాయంకాలం 6 . 30 కు మా డాబా పైకి వెళ్ళాను . ఆకాశమంతా లేత నీలి రంగు , ఆరెంజ్ రంగు లో వుంది . చంద్రుడేమో ఎర్రగా మెరిసిపోతూ ఇదో ఇలా దర్శనం ఇచ్చాడు . కాని అదేమిటో ఫొటోలో మటుకు ఆకాశం నల్లగా వచ్చేసింది !



7.30 కు కొబ్బరాకుల చాటు నుంచి ఇలా వచ్చేసాడు !



8.30 కు మా హాల్ లోకి వచ్చేసాడు :) ఫ్లాష్ తో ఓ రకం గా , ఫ్లాష్ లేకుండా ఆకుపచ్చగా బాగున్నాడు కదూ :))



అది రాత్రి 11 గంటల సమయము . చంద్రుడు ఎలా వున్నాడో చూద్దామని బాల్కనీ లోకి వచ్చాను . ఓహ్ ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయిందా అనిపించింది ! కలా నిజమా ????? నన్ను నేను గిల్లుకున్నాను . అబ్బా * * * నక్షత్రాలు కనిపించాయి .కాదు కాదు మా బాల్కనీలోకి చందమామ వచ్చేసాడు . తెల్లగా మెరిసిపోతున్నాడు . నిజం . . . సత్తెం ప్రమాణికంగా , , , సచ్చీ ఇదో ఇలా దిగి . . . వచ్చేసాడు !!!!!!!! ఆకాశం లో అలా , బాల్కనీ నేల మీద ఇలా * * * * *



చంద్రుని మీద అడుగేసి ఓ పెద్ద రోదసీ యాత్రికురాలును అయినట్లుగా ఫీలైపోయాను . కాకపోతే నా పాదము మీద చంద్రుని ఫొటో తీయటము నా వల్ల కాలేదు . స్చప్ ఏం చేస్తాను ? నాతో పాటు చంద్రుని మీద గెంతేందుకు నా మనవలూ దగ్గరలేరు హుం . . .

10 comments:

తృష్ణ said...

భలే తీసారండి ఫోటోలు..నేనూ అనుకున్నాను కానీ రోజంతా తిరిగివచ్చినమీదట ఓపిక లేకపోయింది.పోనీలెండి నా సరదాను ఈ ఫోటోల్లో చూసేస్కుని తుత్తి పడిపోతాను..:) mala gaaru,i always admire enthusiasm.

లత said...

కొబ్బరాకుల మధ్య చంద్రుడి ఫొటో భలే ఉందండి
చాలా బాగా తీశారు

తృష్ణ said...

అయ్యో, అచ్చు తప్పు పడిందండి.....i always admire your inthusiasm.

Lakshmi Raghava said...

మలాగారు
మా ఇంటికీ వచ్చాడు సూపర్ మామ కానీ మాకెవ్వరికీ తట్టని ఐడియాలు మాలాగారికే వస్తాయని బాగా తెలుసండి..అందుకే మీరెలా ఎక్ష్ప్రెస్స్ చేస్తారా అని చూసా హాట్స్ ఆఫ్

Lakshmi Raghava said...

మలాగారు
మా ఇంటికీ వచ్చాడు సూపర్ మామ కానీ మాకెవ్వరికీ తట్టని ఐడియాలు మాలాగారికే వస్తాయని బాగా తెలుసండి..అందుకే మీరెలా ఎక్ష్ప్రెస్స్ చేస్తారా అని చూసా హాట్స్ ఆఫ్

శ్రీలలిత said...

ఫొటోలు చాలా బాగున్నాయండీ...

Hima bindu said...

బాగున్నాయండీ ..

మురళి said...

బాగున్నాయండీ..

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
థాక్స్ అండి . మీరు మరీ మునగ చెట్టెక్కిస్తున్నారండి :)

& లత గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

లక్ష్మీ రాఘవ గారు ,
అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండీ బాబూ:)) థాంక్ యు.

&శ్రీలలిత గారు ,

& చిన్ని గారు ,

& మురళి గారు ,

మీకు నా ఫొటోలు నచ్చినందుకు ధన్యవాదాలండి .