Friday, March 18, 2011

వీడ్కోలు



వస్తావు వస్తావు అని ఎన్నెన్ని ఎదురు చూపులు చూసాను
అలిగి జారిన కొప్పులో మల్లెలు ముడవనే లేదు
ఆనందము తో హృదయము నిండనే లేదు
కనులారా నిన్ను కాంచనే లేదు
అప్పుడే మరలి వెళ్ళిపోతావా
చూడు చూడు మబ్బు చాటునుండి చందురుడు ఎలా వెక్కిరిస్తున్నాడో
ప్రియతమా నీకిది తగునా
వెళుతూ వెళుతూ వీడ్కోలు మాత్రము చెప్పకు
నీ వీడ్కోలును నేను భరించలేను .
_ _ _ _ _ _ _ _


(నెట్ లో ఏదో బొమ్మ కోసము వెతుకుతుంటే ఈ కొమ్మ నా కంట బడింది . చూడగానే చాలా నచ్చేసింది . ఎంత అంటే ఓ కవిత రాద్దామూ అన్నంతగా :) స్చప్ . . . మనము కవితలు అల్లటము లో చాలా వీకే ! పైగా ఏమి రాసినా రవి వర్మ బొమ్మకు న్యాయం చేయలేక తిట్ట్లు తింటానేమో అనే ఓ భయమూ లేకపోలేదు .( అంటే ఇప్పుడు న్యాయము చేసానని కాదు . ఓ ప్రయత్నం చేసానంతే ) కాని అలా వదిలేయ బుద్దీ కాలేదు :) సూపర్ మూన్ రోజులలో ఏ సూపర్ డూపర్ ఐడియా ఐనా రాకపోతుందా అన్న ఆశ కూడా అడియాశ ఐంది . ఎన్ని కథ లు ఆలోచించినా అవన్నీ ఇంతకు ముందు నేను చదివిన వాటిలాగే అనిపించాయి ! అందుకే మా ఫ్రెండ్స్ ను అడిగాను . మంచి అమ్మాయిలు అడగగానే రాసి ఇచ్చారు . మరి నేనూ ఓ ప్రయత్నం చేద్దామనుకొని ఇది రాసా :))) మరి దీని ని కవిత అంటారో , వచనమంటారో నాకైతె తెలీదు . )

మంజు , శ్రీ థాంక్ యు .

మా జయ కూడా ఈ రోజు రాసేసింది ! థాంక్ యు జయా .

తృష్ణ గారు థాంక్స్ అండి .

శ్రీలలితగారు కూడా రాసేసారు . థాంక్స్ అండి .

లక్కరాజు గారి కవిత ఇక్కడ . లక్కరాజు గారు థాంక్స్ అండి .

జ్ఞానప్రసూన గారు సురుచి లో రాశారు .

దేవి ప్రభాతకమలం లో మూడు విధాలు గా తన భావనను వ్యక్తీకరించింది .

జ్ఞానప్రసూనగారు , దేవి థాంక్ యు .

19 comments:

లత said...

సింపుల్ గా బావుంది మాలగారూ
ముగ్గురూ బాగా రాశారు

Padmarpita said...

బాగుందండి కవిత!

Rao S Lakkaraju said...

పొద్దున్న మీ పోస్ట్ చూసిన దగ్గర నుంచీ మీరు పెట్టిన పిక్చర్ "haunting me".సాయంత్రానికి మనసులో మాటలు కంప్యుటర్ లో కలిశాయి. అవే ఇక్కడ పెడుతున్నా. ఇంక హాయిగా నిద్దుర పోవచ్చు. మీరు అలా అటువంటి పిక్చర్లు పెడితే ఇలా ఇటువంటి సొంత కవిత్వాలు వస్తాయి.

రేపు వస్తావని
మాపు వస్తావని

కన్నుల్లో కాయేసి
ఎదురు చూశాను

టింగు రంగా అంటూ
నడిరేయి వచ్చావు

స్నాన పాదులు చేసి
జుట్టార బోశాను

ఏటి వడ్డున్నాను
ఏటోగా ఉంది

బయట సవ్వడి చూసి
నువ్వుదా అనుకొంటి

నీవు వస్తావని
ఎదురు చూస్తున్నా

వంటరిగా వున్నాను
జంట నవుదామని

మాలా కుమార్ said...

లత గారు ,
అమ్మయ్య బాగుంది కదా ! అసలు వ్రాయగలనో లేనో అనుకుంటూ ఏదో రాసాను థాంక్స్ అండి .

* పద్మార్పిత గారు ,
అమ్మో మీలాంటి కవియిత్రి మెచ్చుకున్నారంటే , పరవాలేదు బాగానే రాసానన్నమాట :)
థాంక్ యు .

మాలా కుమార్ said...

లక్కరాజు గారు ,
మీ కవిత చూడగానే చాలా , నిజం గా మాటల్లో చెప్పలేనంత సంతోషం అనిపించిందండి .
థాంక్ యు , థాంక్ యు వెరీ మచ్ .

శ్రీలలిత said...

ఈ బొమ్మ చూస్తుంటే
"యమునాతీరమునా
సంధ్యా సమయమునా
వేయికనులతొ రాధా
వేచియున్నది కాదా...."

పాట గుర్తుకొస్తోంది కదా..

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
నిజమేనండి , ఆ పాట ఈ బొమ్మ కు సరిగ్గా సరిపోయింది .

Lakshmi Raghava said...

మీ రు రాయగలరు అని తేలిపోయింది!!!ఇక మేము మీనుండి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటాము..

చెప్పాలంటే...... said...

మీకు రాయడం రాదనీ ఎవరు అన్నారండి బాబు ఇంత బాగా రాసారో...లక్క రాజు గారి ది కుడా చాలా చాలా బావుంది

మరువం ఉష said...

***** మీ కవితకి బదులు కవిత *****
ప్రియతమా, వగపు భారాల నీ సొగసు
అపరిమిత ప్రణయ ఆదమరుపు...
వెన్నెల కాంతుల్లో నా నవ్వు కానలేదా?
ఏటి గలగలల్లో నా పాట కలిపాను,
వీచే గాలుల్లో నా ఆశ దాచాను.
నిన్ను చేరితే నీ ఎదురుగా నేను
దూరాన నిలిస్తే నా నీడలు వేలు.

మాలా గారు, ;) మా భలే అభాండం వేసారే నా మీద జయ గారిని చాటు చేసుకుని.

"కనులారా నిన్ను కాంచనే లేదు
అప్పుడే మరలి వెళ్ళిపోతావా"

మీ కవిత కాస్త వెనగ్గా చూసానా, ఇంకా స్పందన తగ్గని మానసం ఏదో అనేలోగా మీరు సూపర్ ఉమన్ లా మరొక పోస్ట్ పెట్టారాయే.

ప్రవీణ said...

ఇంత బాగా రాసి రాయటం రాదు అంటున్నారే...సూపర్ గ ఉందండి మీ కవిత

మాలా కుమార్ said...

ఏన్నాళ్ళకెన్నాళ్ళకు కనిపించారు ఉషా . మీమీద అభాండమా లేదు లేదు . మిమ్మలిని చూసిన ఆనందం అది .
i miss you .

థాంక్ యు . థాంక్ యూ వెరీ మచ్ .

*ప్రవీణ గారు ,
థాంక్స్ అండి .

జ్యోతి said...

ఓహో! మీరు కవితలు కూడా మొదలెట్టారా? గుడ్ చాలా బావుంది. కంటిన్యూ...

రాజేశ్వరి నేదునూరి said...

మీ అందరి కవితలు చాలా చాలా బాగున్నాయి .చదివి నంత సేపు ఏదో మైకం ఆవహించి నట్టు. తేరుకోడానికి కొంచం టైం పట్టింది. నిజంగా " భావనా జగత్తులో మై మరపిం చ గల శక్తి అద్భుతం . మీ అందరికి ....హేట్సాఫ్ !

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
కంటిన్యూ అంటున్నారా ? చూద్దాం :) థాంక్స్ అండి .

* రాజేశ్వరి గారు ,
పనిలో పని మీరూ ఓ కవిత రాసేయాల్సింది .
ధన్యవాదాలండి .

praveena said...

ఇలాంటిదే మరో బొమ్మకు నేను ఆలోచనలు అని ఇలా రాసుకున్న కొన్ని నెలల క్రితం
http://alochanalu.wordpress.com/2011/01/30/%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81/
కుదిరితే చుడండి..

Anonymous said...

మెయిల్ లో వీడ్కోలు అని చూసి మీరెక్కడ బ్లాగులకి వీడ్కోలు చెప్పేస్తున్నారో అని ఖంగారుగా పరిగెట్టుకొచ్చేసా........ఇదా సంగతి . మీరెప్పటికయినా కవయిత్రి మొల్ల అంతటివారయిపోతారండీ! ( మా ఆయన నన్నలాగే దీవిస్తారు ఎందుకంటే మూడోతరగతిలో చదువుకున్న మొల్ల తప్ప మరో కవయిత్రి ఎవరూ ఆయనకి తెలీదు మరి )

మాలా కుమార్ said...

లలితా ,
మీ నోటి వాఖ్యాన నేను హంత పెద్ద కవియిత్రిని ఐతే మీకు లడ్డూలు పెడుతాను లెండి :) థాంక్యు .

Unknown said...

మాల గారూ,
కవిత బావుందండీ.మంచి ప్రయత్నం. మరిన్నిరాసేయండి మరి. లడ్డూల పండగ చేసుకుంటాం.
అన్నట్టు దీనిని కవిత అంటారో వచనమంటారో అన్నారు కదూ..మరో పేరు కూడా ఉందండోయ్...అదే తవిక..