Sunday, January 2, 2011

1970 love story
నాజ్ సెంటర్ కెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కుందాము వస్తావా అని మా ఫ్రెండ్ దేవమణి అడిగింది . గ్రీటింగ్ కార్డ్స్ నా ఎందుకు ? అన్నాను నేను . న్యూయియర్ కి మా వాళ్ళందరికీ పంపాలి . ఐనా న్యూ ఇయర్ లో గ్రీటింగ్స్ ఇచ్చుకోరా మీరు అంది మణి . ఏదేమిటో నాకు తెలీదని చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాను . అవును మరి అప్పటి వరకూ స్కూల్ లో కూడా ఎప్పుడూ న్యూ ఇయర్ కు విష్ చేసుకున్న గుర్తు లేదు ! నేను గుంటూర్ వుమెన్స్ కాలేజ్ లో పి.యు .సి చదువుతూ హాస్టల్ లో వున్నప్పుడు , అలా మొదటి సారిగా న్యూయియర్ కు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారని , విష్ చేసుకుంటారని తెలిసింది :) అప్పుడే గుంటూర్ లో కొత్తగా నాజ్ సెంటర్ వచ్చింది . అక్కడ ఇలాంటి వెరైటీ షాప్స్ వుండేవి . అక్కడ నుంచి పది రూపాయలకు కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ కొనుకొచ్చుకొని మణి ఆధ్వర్యములో మా ఫ్రెండ్స్ అందరమూ ఒకరికొరం ఇచ్చుకొని మా మొదటి హాపీ న్యూయియర్ చేసుకున్నాము .

నా రెండో కొత్తసంవత్సరాని కల్లా నా పెళ్ళైంది . కొత్త సంవత్సరం కోసమని ఆరునెలల ముందే ఏర్పాట్లు మొదలుపెట్టారు మా వారూ , ఆయన ఫ్రెండ్స్ . అప్పుడు మేము పూనా లో దపోడీ లోని మిలటరీ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్ లో వుండే వాళ్ళము . అందరూ స్టూడెంట్ ఆఫీసర్స్ నే . కొత్తగా పెళ్ళైన వాళ్ళే . మొదటి సారిగా భార్య తో కలిసి కొత్తసంవత్సరము డాన్స్ లో పార్టిస్పేట్ చేస్తున్నారు . ఎంత హంగామా . . . . . ఎంత హంగామ . దాని కోసమని డాన్స్ నేర్చుకోవటానికి , పూనా మేన్ స్ట్రీట్ లో వున్న డాన్స్ క్లాస్ లో చేరాము . డాన్స్ నేర్పించే అతని పేరు జేంస్ , అతని భార్య పేరు మేరీ అనుకుంటా . సరిగ్గా గుర్తులేదు . అలానే అనుకుందాం పోయిందేముంది ? జేంస్ పెద్ద గాలి వేస్తే ఎగిరిపోయేటట్టుండే వాడు , దానికి తగ్గట్టు టైట్ పాంట్ , టీషర్ట్ . చూడగానే నాకు చార్లీ చాప్లిన్ గుర్తొచ్చేవాడు . వన్ టూ త్రీ ఫౌర్ అంటూ స్టెప్స్ వేయిస్తుంటే నాకు చచ్చే నవ్వొచ్చేది . నవ్వుదామా అంటే , మావారేమో మహా సీరియస్ గా లైఫ్ అండ్ డెత్ క్వెశ్చన్ అన్నట్లు స్టెప్స్ వేస్తుండేవారు . మూతి బిగ బట్టుకొని అలానే స్టెప్స్ వేసేదానిని :) నో మేడం . అంత సీరియస్గా వుండకూడదు కాస్త లాఫింగ్ ఫేస్ వుండాలి అనేవాడు . హుం . . . నాయనా కొంచమేమిటి బోలెడంత లాఫింగూ అనుకునేదానిని , మనసులోనే సుమా ! పైకంటే ఇంకేమైనా వుందా ? అలా . . . అలా నవ్వుకుంటూ . . . నవ్వాపుకుంటూ మొత్తానికి న్యూయియర్ కల్లా డాన్స్ నేర్చుకున్నామండి .

ఓపక్క డాన్స్ క్లాస్లూ ఇంకో పక్క మేకప్ క్లాసులూ . మా ఇంట్లోనే కాప్టెన్ ఖన్నా , మిసెస్ . మౌళీ ఖన్నా వుండేవారు . క్వాటర్ లు తక్కువగా వుండటము వలన ఒకరింట్లో ఇంకొకరు , వాళ్ళకు ఇల్లు దొరికేదాకా షేర్ చేసుకొని వుడేవాళ్ళము . మాకు ముందుగా దొరకటముతో , మూడునెలలు కాప్టెన్ రామానుజం వాళ్ళు మాతో వున్నారు . వాళ్ళు వెళ్ళిపోయాక ఖన్నా వాళ్ళు వచ్చారు . మౌళి , పెళ్ళికి ముందు ఏయిర్ హోస్టెస్ గా చేసేది . అందువల్ల తనకు లేటెస్ట్ ఫాషన్స్ బాగా తెలిసేవి . నాకు ముందుగా ముడి వేయటము నేర్పింది . అప్పట్లో షర్మిళా ఠాగూర్ , ఆషాపరేక్ లాంటి హిందీ హీరోయిన్స్ బాక్ కోంబింగ్ చేసి , నడి నెత్తి మీదకు ఎత్తుగా కొప్పేసేవారు . మోకాళ్ళ దగ్గరగా చీరను టైట్ చేసి పిన్ పెట్టేవారు . అది చాలా ఫాషన్ . నాకు మామూలుగా కొప్పేయాలంటే నే , వత్తు జుట్టు మూలం గా చేతులు నొప్పులు అనేది మౌళి . పైగా మావారేమో బాక్ కోంబిన్ చేయమనేవారు . బాక్ కోంబింగ్ చేయకుండానే నారదుని మించిన కొప్పు . ఇహ బాక్ కోబ్ చేస్తే ఆ చిక్కులు తీసేటప్పటి కి , నేనూ , మౌళీ నీరసించేవాళ్ళము ! మావారి తో పోట్లాడి , గొడవపడి , ఇలా విసిగిస్తే నేను మాల కు హేయిర్ స్టైల్స్ నేర్పను అని బెదిరించి , మొత్తానికి ఏమైతేనేమి , మావారి దగ్గర నుండి వితౌట్ బాక్ కొంబింగ్ హేయిర్ స్టైల్ కు పర్మిషన్ సంపాదించింది మౌళి . హమ్మయ్య బతికిపోయాననుకున్నాను నేను ! సో మొత్తానికి , హేయిర్ స్టైల్ , సారీ స్టైల్ నేర్చుకున్నాను . న్యూయియర్ పార్టీకీ రెడీ .

రివర్ డాన్స్ అని పూనా లోని ముల్లా ముట్టా నదుల సంగమం మీద డాన్స్ పార్టీ అరేంజ్ చేసారు . రివర్ మీద చెక్కల తో స్టేజ్ లా కట్టారు . దాని మీదే బాండ్ . దాని మీదే డాన్స్ . అప్పటి ప్రముఖనటి తనూజ మా పార్టికి గెస్ట్ గా వచ్చింది . అమ్మో ఎంత మందో ! అన్ని యూనిట్ల వాళ్ళూ అక్కడే . అప్పటి వరకూ సరదాగానే వున్నా ఆ హడావిడి చూసేసరికి గుండెల్లో దడ . . . కాళ్ళల్లో వణుకు . . . పైగా టైట్ గా కట్టిన చీరతో అడుగులు తడబడు . . . తలమీద బేద్ద ముడి బరువు . . . అంతా కాసేపే . మా ఫ్రెండ్స్ అందరమూ గోల గోల గా కబురులూ డాన్సు . అంతే రాత్రి తెల్లవార్లూ డాన్సే . పొద్దునకల్లా అలసి సొలిసి మెస్ వాళ్ళు పెట్టిన బ్రేక్ ఫాస్ట్ తిని ఇంటికి చేరాము .


నలభై సంవత్సరాల తరువాత *************

రెండు నెలలక్రితం మా కొడుకు ,కోడలు , మనవడు , మనవరాలు యు. యస్ కు తిరిగి వెళ్ళారు . మా అమ్మాయి అత్తవారింట్లో వుంది . 1970 లో లా 2010 లోనూ నాకు నువ్వూ , నీకు నేను , ఒకరికొకరం నువ్వూనేనూ - - - మేమిద్దరమే :)


నిన్న రాత్రి యం . సి . యం . ఈ ఆ ఫీసర్స్ మెస్ పార్టీ లో , పూనా న్యూ యియర్ పార్టీ గురించి నా బ్లాగ్ లో రాసానని మావారికి , కల్నల్ . జాగిర్దార్ కు చెప్పాను . ప్రభా జాగిర్దార్ వెంటనే , అరే మీరు కూడా జేంస్ దగ్గరికి డాన్స్ క్లాసెస్ కు వెళ్ళారా అని , కల్నల్. జాగిర్దార్ కుమార్ తుంభీ గయేక్యా అని ఆశ్చర్యపోయారు . ఆ టైం లో వాళ్ళెళ్ళారు , ఈ టైం లో వీళ్ళేళ్ళారూ అనుకుంటూ ఇంకా ఎవరెవరు డాన్స్ నేర్చుకోవటానికి వెళ్ళారో గుర్తుతెచ్చుకున్నారు . అంటే ఫ్రెండ్స్ అంతా ఒకరికి తెలీకుండా ఇంకోరు క్లాస్ లకు వెళ్ళారన్నమాట వాళ్ళ గొప్పలు చూపించుకోవటానికి :) అందుకే మా కిచ్చిన అరగంటా కాగానే మమ్మలిని , కొంచం ఎక్కువసేపు వుంటామన్నా వుండనీయకుండా పంపేసేవాడు ! ఆ పార్టీని , జేంస్ ను తెగ తలుచుకొనారు , ఫ్రెండ్స్ ఇద్దరూ ! ' మాలా మమ్మలిని ఫార్టీ యియర్స్ వెనకకి తీసుకెళ్ళావు ' అని నన్నూ మెచ్చుకున్నారు :)

లవ్ స్టోరీ అంటూ కొత్త సంవత్సరం కథలు చెప్పానంటారా ? అంతే ఇంకేముంది చెప్పేందుకు ?

happy new year

21 comments:

భావన said...

బాగుంది మీ లవ్ స్టోరీ. పైన ఫోటో లో నిజంగానే పత సినిమాలో హిందీ హీరోయిన్ లా బలే క్యూట్ గా వున్నారు మాల గారు. ఈల వేసేము మేము ;-)

Anonymous said...

'అంత సీరియస్గా వుండకూడదు కాస్త లాఫింగ్ ఫేస్ వుండాలి అనేవాడు . హుం . . . నాయనా కొంచమేమిటి బోలెడంత లాఫింగూ అనుకునేదానిని '
:):)

Anonymous said...

బాగున్నాయండీ మీ ఙ్ఞాపకాలు. ఫోటోలు అంతకన్నా బాగున్నాయి.
శారద

3g said...

నేను నిజంగానే ఏదో హిందీ సినిమాలో స్టిల్ పెట్టారమో అనుకున్నా ఫొటోలో. నేనుకూడా విజిల్స్. అసలు మీ డాన్స్ ఫొటో పెట్టాల్సింది.

Hima bindu said...

చాలా బాగుందండీ నిజంగా మీరేదో లవ్ స్టొరీ చెబుతారు అనుకుంటే :-)
నేను 1984 lovestory చెబుతాను మీ ఇన్స్పిరషన్ తో బట్ ఇది రియల్ అండ్ ఫేల్యూర్ స్టొరీ :-)

జయ said...

మా అక్కకి, బావగారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అప్పటి మీ కబుర్లు ఎన్ని చెప్పినా వినటానికి ఇప్పుడు, ఇక్కడ ఇంతమందిమి ఉన్నాంగా.

వేణూశ్రీకాంత్ said...

హ హ ప్రేమకథ బాగుందండి పైన ఫోటోలో నిజంగానే పాత హిందీ సినిమాల్లో హీరో హీరోయిన్ల లా ఉన్నారు మీ జంట :-)

లత said...

మీ స్టోరీ బావుందండీ,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

సుజ్జి said...

:D Very nice!

sunita said...

I too agree with Bhaavana:-)Two visils.

జ్యోతి said...

మాలగారు, అప్పుడూ ,ఇప్పుడు సినిమా హీరోహీరోయిన్లలా ఉన్నారు. పైన ఫోటోలో మాత్రం సూపర్...నాకైతే హిందీ సినిమా హీరోయిన్ గుర్తొస్తుంది. నిజంగా మీరేనా??

శ్రీలలిత said...

A forty year long love story.
Very nice.

సి.ఉమాదేవి said...

వసివాడని ప్రేమ, దాంపత్యంలో మొలక వేసినది మొదలు మానై దృఢంగా వేళ్లూని బలపడినపుడు, పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయినా గూడులో మిగిలిన పక్షి దంపతులకు జ్ఞాపకాల బలాన్ని మించిన టానిక్ ఏముంటుంది?

శిశిర said...

బాగుందండి. :)మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

psm.lakshmi said...

హమ్మయ్య. ఒక రహస్యం చెప్పేశారు. ఆ స్టెప్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. పనికొస్తాయి. గుర్తులేదంటే నేనేమీ వూరుకోను.
psmlakshmi

మాలా కుమార్ said...

భావనా ,
నేను న్యూయియర్ విష్ చెప్పాను . కాని మీకు నా ఫొటోనే కనిపించింది :)

* అను ,
థాంక్ యు .

*శారద గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

3జి ,
అబ్బాయ్ ఆయ్ ((((( . . . . . :)

*చిన్ని గారు ,
ఆ లవ్ స్టోరీ ఏదో త్వరగా చెప్పేయండి .

* జయ ,
థాంక్ యు .
మా కబుర్లా వినేవోపిక వుండాలేకాని బోలెడు చెపుతాను :)

మాలా కుమార్ said...

వేణూ శ్రీకాంత్,
థాంక్ యు .

*లత గారు ,
థాంక్స్ అండి .

*అబ్బో సుజ్జి వచ్చిందే :D

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
మరీ అంత అనుమానమైతే ఎలా అండి :)
థాంక్ యు అండి

*శ్రీలలిత గారు ,
ధన్యవాదాలండి .

*ఉమాదేవి గారు ,
చాలా బాగా చెప్పారండి . ఎంతైనా మీరు రచయిత్రి కదా . థాంక్ యు అండి .

*శిశిర ,
థాంక్ యు .

* లక్ష్మిగారు ,
రహస్యం చెప్పేసానా అయ్యో :)
ఇప్పుడా స్టెప్స్ ఎందుకండి కష్టపడి గుర్తుతెచ్చుకోవటం , ఇప్పుడెవరూ అలా చేయటములేదు . మేము చేసామంటే వింతగా చూస్తారు హి హి హి.

మధురవాణి said...

ఫోటోలో మీరు అచ్చం ఆశా పరేఖ్ లాగానే ఉన్నారు. వెరీ క్యూట్ లవ్ స్టోరీ! :)

Ennela said...

excellent love story....meeru iddaru...hero heroine laane unnaru...bhale baagundi...ippati photo kuda...alaa iddaru serious gaa and serious ga (???)dance chesaaraa..bhale untundi kadaa!