Tuesday, October 19, 2010
టాటా వీడుకోలు . . . గుడ్ బై . . . ఇక సెలవు * * *
ఒక పోస్ట్ కోసం , గూగుల్ లో ఫొటో ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాను . ఇంతలో మా అబ్బాయి , అట్లా గూగుల్ నుంచి బ్రౌజ్ చేయకు , వాటికి కాపీ రైట్స్ వుంటాయి . ఎవరైనా అభ్యంతరము చెప్పవచ్చు . అన్నాడు . మరైతే ఎలా ? అని అడుగుతే , మనమే , మనకు కావలసి దానిని ఫొటో తీసుకోవాలి అన్నాడు . అన్నట్లుగానే నాకెప్పుడు అవసరమైనా , తనే ఫొటో తీసి నాకు మేయిల్ చేసేవాడు . చాలావరకు , వీలైంత వరకు ఫొటో లు తీసి ఇచ్చేవాడు . ఓసారి పియస్ యం లక్ష్మి గారు పొగడపూల గురించి వ్రాశారు . అక్కడ ఎవరో పొగడపూలు ఎలా వుంటాయి అని అడిగారు . అది చూస్తే , మా ఇంటి దగ్గరలో వున్న పొగడచెట్టు గుర్తొచ్చింది . మా అబ్బాయి వూళ్ళో లేడు , ఫొటో తీసి ఆవిడకు పంపటము ఎలా అని తెగ ఆలోచించి , చివరకు , మా కోడలు ఇంట్లోనే వున్నదని గుర్తొచ్చి , ఫొటో తీస్తావా అని అడిగాను . పాపం తను చేసుకునే పని ఆపి , బయటకొచ్చి ఫొటో తీసి ఇచ్చింది . అలా మా కోడలి ని కూడా డ్యూటీ ఎక్కించాను ! ఇంతలో మావారి సెల్ తో కూడా ఫొటోలు తీయచ్చు అని తెలిసింది . హాపీగా ఆ సెల్ తో కూడా ఫొటోలు తీసే దానిని . ఇలా మూడు సెల్లులు , ఆరు ఫొటోల తో కాలము గడిచి పోతూ వుండ గా . . . విధి వక్రించింది . మా వారి సెల్ కాస్తా దొంగోడెత్తుకెళ్ళాడు ! మా అబ్బాయికి టూర్ లు , మా కోడలి కి ఆఫీస్ పని ఎక్కవయ్యాయి .
కాకపోయినా వాళ్ళంతా ఎప్పుడూ బిజీ గా వుంటారు . అన్ని సార్లూ వాళ్ళకు కుదరక పోవచ్చు . ఎలా ????? ఏమి చేయటము ????? అవును గురూజీ ని అడుగుతే పోలే , అనుకొని అసలు ఫోటోలు ఎలా అప్ లోడ్ చేయాలి అని , జ్యోతి గారి ని అడిగాను . కెమేరా తో తీసి చేయాలి అని చెప్పారు . కెమేరాలో అప్ లోడ్ చేయటానికి వీలు వుంటుంది అని ఎలా చేయాలో చెప్పారు . అంతే , మా వారిని , మా అబ్బాయిని నాకో కెమేరా కావాలీ . . . అని షంటటము మొదలు పెట్టాను . ఇప్పుడు నీకు ఇంత అర్జెంట్ గా కెమేరా ఎందుకు అన్నారండీ మావారు . అదికాదండీ , మన టపాలు ఎవరైనా చదవాలంటే చక్కటి ఫొటోలుండాలి కదా ? 10000 రూపాయల కే మంచి కెమేరా వస్తుందిట . మా జ్యోతి గారు కొనుక్కోమన్నారు అన్నాను . 10 000 లేనండీ ఎక్కువకాదు అని కూడా నచ్చచెప్పాను . మా అబ్బాయి కొన్ని రోజులు ఆగు మాతే , ఇప్పుడు నేను తీసిస్తున్నాను కదా అని ఆ ప్రోగ్రాం ను వాయిదా చేసాడు . మరే నాలుగు దేశాలలో , నాలుగు మాల్ స్ ల లో ధర తెలుసుకోకుండా , ఎలా కొంటాడులే అనుకొన్నాను , కాని నా కో కెమేరా కావాలీ . . . అనే నా నసుగుడు మాత్రం ఆపలేదు !
నా గొడవ పడలేక ఓ శుభోదయాన , శుభముహూర్తాన మా అబ్బాయి తన బ్లాక్ బెర్రీ నాకు ఇచ్చేసాడు ! అంతే దాని తో ఎన్ని ఎన్నెన్ని ఫొటోలు తీసానని , అబ్బో చెప్పలేనన్ని . చింతకాయ పచ్చడి , సొరకాయ రసిపీలు , రాజమండ్రి , గోదావరి అందాలు , మా కాలనీ సొగసులు , నల్లటి వాన చినుకులు , కొత్త ఇల్లూ , అబ్బో ఒకటని చెప్పనా ? సంవత్సరము పైగా నాకు నచ్చినవన్నీ , ఎంచక్కా బంధించి ఇచ్చింది . నా టపాలలో చాలావరకు నా బ్లాక్ బెర్రీ తెచ్చిన ఫొటోలే . ఇన్ని రోజులు పని చేసీ . . . చేసీ నా నేస్తం అలసి పోయి , మూగపోయింది . మూతపడుతున్న కనురెప్పలను భారం గా ఎత్తి , నావైపు దీనం గా చూసింది . ఏ డాక్టరూ ఏ ఆపరేషన్ చేసి కనులు తెరిపించలేమన్నారు . . . నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి . స్చప్ . . . నన్ను వీడి వెళ్ళ లేక వెళ్ళ లేక వెళ్ళిపోయిన , నా స్నెహితురాలికి , కన్నీటి తో వీడ్కోలు పలకటము తప్ప నేనేమి చేయగలను ?
ఓ నా స్నేహితురాలా ,
మరువలేని , మధురమైన జ్ఞాపకాల చిత్ర్రాలను చిత్రించి ఇచ్చావు .
నీ ఉపకారమును నేనెన్నడూ మరువలేను . . . . . మరచిపోను ,
ఇకముందు నువ్వు నా టపాలకు సుందరమైన దృశ్యాలను ఇవ్వలేవు అని తలుచుకుంటే నే గుండె భారమై పోతోంది .
నీకేమీ చేయలేకపోయిన ఈ నిస్సహాయురాలిని క్షమించు మిత్రమా !
ఇదే నీకు నా కన్నీటి నివాళి !!!!!!
Subscribe to:
Post Comments (Atom)
45 comments:
ప్చ్
ప్రాణం లేనివైనా కొన్ని వస్తువులతో చాలా అనుబంధం ఏర్పడుతుంది. హుమ్మ్.. అయినా ఏది శాశ్వతం! :(
బ్లాక్ బెర్రీ పోయినా, దాంతో తీసిన ఫోటోలు ఉన్నాయిగా! :)
అయ్యో.. కొన్ని వస్తువులతో ఇలాగే అనుబంధం పెరిగిపోతుందండి. ప్చ్.
aiyyo so...sad andi...
ఎందుకని?పొరపాటున నీళ్లు పడ్డాయా?వాటె పిటీ మాలగారూ!
నాదీ బ్లాక్ బెర్రీనే. నాదాన్లో సిమ్ కన్నా ఎక్కువ ఉపయోగం ఫోటోలకే
అబ్బా ఇదా, ఇంకా మీరు బ్లాగులనొదిలి వెళ్ళిపోతున్నారేమోనని కంగారుగా పరిగెట్టుకొచ్చా...భలేవారే, జడిపించారుగా టైటిల్ తో!
అయ్యో పాపం ఎంత పని అయిదండి :)))
హహహ. నిజమే కొన్ని సమ్దర్భాల్లో అలానే ఉంటుంది
నాకంత పట్టింపులుండవు. వస్తువున్నంత కాలం జాగ్రత్తగా వాడుకుంటాను కానీ, పాడయ్యో, వదిలేయాల్సిన సమ్దర్భం వచ్చినప్పుడో అంతా ఫీల్ కాను. ఎందుకంటే తెలిసే జరుగుతుందిగా.
అయ్యో పాపం..
ayyoo ayayyoo
ప్చ్!!
హయ్యో.. ఎంత ఘోరం జరిగి పోయింది !
కష్టాలు బ్లాక్ బెర్రీ లకు కాకపొతే హాలీ బెర్రీకు వస్తాయా చెప్పండి
ఆ మొబైల్ పని చేసే కంపనీ వాడిది అయితే చక్కగా reimburse చేసేయోచ్చు :)
ఇండియా లో కొన్ని రోజుల్లో బాన్ చేస్తారంట..ఈ విషయం మీ మొబైల్ కి ముందే తెలిసిపోయింది అంతే :)
ఇందాకే మా ఈనాడు జర్నలిజం స్కూలు బ్యాచ్‌మేట్ రామూ (apmediakaburlu.blogspot.com) అస్త్రసన్యాసం చేస్తున్నాను అన్న భావన వచ్చేలాంటి పోస్ట్ వేశారు. ఆ షాక్ నుంచి తేరుకుని తనకు సాంత్వన వచనాలతో కామెంట్ పంపి చూద్దును కదా.. మీ పోస్ట్ శీర్షిక కూడా దాదాపుగా అదేలా ఉంది. ఇదేంట్రా నేను మొదలు పెట్టే తరుణంలో వీళ్లంతా స్వస్తి అంటున్నారు అనుకుని.. చదివా! మొత్తానికి మీ భావుకతకు హ్యాట్సాఫ్. ఆసాంతం చదివించగలిగారు.
కాని మీరు ఫోటో లో నివాళులు అర్పించింది బ్లాక్ బెర్రీ కాదె?
దానికి తెలిస్తే ఆత్మ క్షోబించదు
http://www.mobilewhack.com/blackberry_8705-2.jpg
flowers ఫోటోషాప్ లో వెతుక్కోవాలి
అయ్యయ్యో..:(
..hummm !
btw u were a blackberry girl! (Not only for the office guys - its for bloggers too..?) geeeee:)
ఫోటోలు ఎలా అప్ లోడ్ చేయాలి అని , జ్యోతి గారి ని అడిగాను . కెమేరా తో తీసి చేయాలి అని చెప్పారు
:)))))))))))))))))))))
హ్మ్ దాని ఋణం అంతటితో తీరిపోయింది అనుకోవడమేనండీ.. నిజంగా ఎక్కువరోజులు సర్వీస్ చేసిన ఇలాంటి వస్తువులు పాడైనపుడు చాలా బాధకలుగుతుంది.
రవిగారు,అఙ్ఞాత ఫోటోలో ఉన్నది బ్లాక్ బెర్రీ పెర్ల్ అనుకుంటా ఆ మధ్య స్లిమ్ స్మార్ట్ ఫోన్స్ తో పోటీ పడటానికి ఈ వెర్షన్ దించాడు. దీంట్లో ఫ్లిప్ మోడల్ కూడా ఉంది. visit http://in.blackberry.com/devices/blackberrypearl8100/
అయ్యో పాపం ఎంత పని అయిదండి :)))టైటిల్ చూసి ఏంటబ్బా అని అనుకున్నాను
అయ్యో!! పాపం బాధపడకండీ!! మళ్ళీ బ్లాక్ బెర్రి కొనేసేయండీ...చక్కగా దాంతో ఫోటోలు తీయడం మొదలుపెట్టండీ :)
శ్రీకాంత్ గారు మేము జూమ్ చేసి మరీ చూసాము ఈ ఫోటో ని.ఫోటో లో ఉన్న ఫోన్ బ్లాక్ బెర్రీ కాదు
I think it is Blacberry pearl
అనోనమస్ గారు ,
నా బ్లాక్ బెర్రీ కి అగ్ని పరీక్ష పెట్టారే :))
ఇది , వేణూ గారు , రౌడీగారు చెప్పినట్లు బ్లాక్ బెర్రి పెర్ల్ . మూడు సంవత్సరాల క్రితం , మా అబ్బాయి కొనుక్కున్నాడు . దాని బాటరీ వీక్ అయ్యి , చార్జింగ్ ఎక్కువ సేపు వుండటము లేదని ఏడెనిమిది నెలల క్రితం నాకు ఇచ్చాడు . ఇప్పుడు ఇంకో ఫొటో పెట్టాను చూడండి . దాని నుదుటిమీద తాటికాయంత అక్షరాల తో బ్లాక్ బెర్రి అని రాసివుంది . నేను పైన్ చెప్పిన టపాల ఫొటో లన్నీ దీనితో తీసినవే ! ఆ టపాల లింకులు ఇచ్చే వోపిక ప్రస్తుతము నాకు లేదు . మీరే వెతుక్కొని చూడండి .
అలాగే ఆ ఫ్లవర్స్ కోసం కూడా మీరు ఏ ఫొటో షాప్ నో వెతకక్కరలేదు .ఇక్కడ చూడండి .
అయ్యయ్యో :(
ఈ సారి మాంచి కెమెరా కొనుక్కోండి.
చిలకమూరు విజయమోహన్ గారు ,
:)
* మధురవాణి ,
అవును , ఆ ఫొటోలే జ్ఞాపకాలుగా మిగిలాయి .
*శిశిర ,
ఏమిటో అలా బంధం ఏర్పడింది :)
చెప్పాలంటే ,
హుం . . . సాడే . . .
* ఉమాదేవి గారు ,
నా పొరపాటేమీ లేదండి . నా దగ్గరికి వచ్చేసరికే దాని బాటరీ టైమైపోయింది . . దాని జీవితం ముగిసి పోయింది అంతే
*సృజన ,
నేనూ నా బ్లాక్ బెర్రీ ని ఫొటోలకే వుపయోగించేదానిని . ప్రస్తుతము , సిం వేసి అత్యవసరానికి అప్పుడప్పుడు వాడుతున్నాను .
సౌమ్యా ,
అప్పుడప్పుడే ఎక్కడ వెళుతాను ? కంగారు పడకండి , బహుషా ఇంకొన్ని రోజులు రాస్తానేమోలెండి :))))
*అశోక్ పాపాయ్ ,
అలాగే నవ్వండి :)))
*గీతాచార్య గారు ,
ఎంత నవ్వారండీ హి హి హి )
శ్రీలలిత గారు ,
స్చప్ . . . పాపం కదా !!!!
* జగ్గం పేట్ గారు ,
అయ్యయ్యోనేనండి . . .
* సునీతగారు ,
హూమ్మ్ !!
హరే కృష్ణా ,
నిజమే చాలా ఘోరం జరిగిపోయింది !!
* జర్నో ముచ్చట్లు గారు ,
నా రాత మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి .
*రవి గారు ,
అది బ్లాక్ బెర్రినేనండి . అందుకే దాని ఆత్మ ఏమాత్రమూ క్షోభిల్లదు గాక క్షోభిల్లదు !
మనసు పలికే అయ్యయ్యో . . :)
* సుజాత గారు ,
నేనిప్పటికీ బ్లాక్ బెర్రి గర్ల్ నేనండి . దాన్ని అప్పుడప్పుడు సెల్ అవతారము లో వాడుతుంటాను . ఫొటోలు తీయగలను , కాని చూడలేను , డౌన్ లోడ్ చేయలేను అంతే !
* రౌడీ గారూ ,
హే చూశారా ?????? మీ LOL . . . వదిలేసి , ఎంత పెద్ద కామెంట్ రాసారో ! ఎంత నవ్వారో ! అందుకేనండి నేను అలా రాసింది . నాకు తెలుసు నన్ను వెక్కిరించటానికి మీరు వస్తారని :)))))))))))))))))))))
నా బ్లాక్ బెర్రి ని , బ్లాక్ బెర్రిగా నిర్ధారించినందుకు థాంక్ యు :))
వేణూ శ్రీకాంత్ గారు ,
బ్లాక్ బెర్రి పర్ల్ లింక్ వెతికే శ్రమను తప్పించారు . థాంక్ యూ వెరీ మచ్.
మీఉ మీ లాప్ టాప్ గురించి వ్రాసారని చాటింగ్ ఫ్రెండ్ అనిత చెప్పారు . చూద్దామనే అనుకుంటూ వున్నాను . ఈ రెండు రోజులూ కొంచం బిజీ . అందువల్ల ఇంకా మీ బ్లాగ్ కు రాలేదు . వచ్చి చూస్తాను .
* శివరంజనీ ,
మీరూ టైటిల్ చూశి మోసపోయారా :)
*ఇందు గారు ,
నేను బ్లాక్ బెర్రీ కొనటమే అమ్మో ! కష్టమండి .
రాధిక గారు ,
అదే , కెమేరా కొనమనే మా వాళ్ళను సతాయిస్తున్నానండి (
అయ్యో!! పాపం :(
Mala garu,
I will present you as my birthday gift
my birthday is on 21st november
With Love
coming soon
నేస్త గారు ,
:(
అనోనమస్ గారు ,
అలా అంటారా ? ఐతే వాకే :( అడ్వాన్స్ గా థాంకు . హపీ బర్త్ డే !
ఇంతకి 10000 వేలు పెట్టి కెమెరా కొనటం గురించి మివారు ఎమంతున్నారిప్పుడు
పాపం బ్లాక్ బెర్రీ ముగపొయిన తరువత ?
వంశీ ,
ఆ ((( . . . ఏమంటారు ? తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు .
Pttara mari ?
ఆదే చేస్తున్నా :))
మాల గారు అవునండీ నాకు కూడా నాన్ లివింగ్ థింగ్స్ పై మమకారం ఎక్కువే. ఇది వరకు నా ఇయర్ ఫోన్స్ మరియూ ల్యాప్ టాప్ గురించి టపాలు రాశాను మీకు సులువుగా ఉంటుందని ఇక్కడ లింకులు ఇస్తున్నాను కుదిరినపుడు చదవండి.
http://venusrikanth.blogspot.com/2010/05/blog-post.html
http://venusrikanth.blogspot.com/2010/01/blog-post_13.html
హయ్యో, హయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది మాలాగారూ..బాధ పడకండి. ఏం చేస్తాం కష్టాలు మలుషులకి రాక మాకులకొస్తాయా...
psmlakshmi
మాల గారు thanks for your comments on my laptop post. కొన్ని కారణాల వలన ఆ పోస్ట్ లోని మిగతా కామెంట్లు ఏవీ ప్రచురించలేదు అందుకనే మీ కామెంట్ కూడా ప్రచురించడం లేదు. మీ వ్యాఖ్య నాకు అందింది అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను.
లక్ష్మి గారు ,
మీ ఓదార్పుకు ధన్యవాదాలండి .
* వేణు శ్రీకాంత్ ,
మీరు చూసారు కదా , నా కామెంట్ , ఓకే నండి .
Post a Comment