Wednesday, June 9, 2010

భూమికకు ధన్యవాదాలు

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు పోస్ట్ , ఏమైనా తప్పుగా రాస్తానా , ఎవరినైనా నొప్పిస్తానా , ఎవరినైనా మరిచిపోతానా ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుమానాల తో , చాలా భయపడుతూ పడుతూ రాసాను . నా బ్లాగ్ కు నేనే మహారాణిని కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు . మావారి మీద రాసినా , మనవళ్ళు , మనవరాళ్ళ మీద రాసినా మన వాళ్ళేకాబట్టి ఏమనుకోరులే అని ధైర్యం . వాళ్ళేకాదు మేమంతా నీ వాళ్ళ మే అని , నా రాతలను సంతోషం గా స్వీకరించారు మితృరాళ్ళు . ఆ ఆనందం తోనే వుబ్బి తబ్బిబౌతుంటే , భూమిక లో ప్రచురించి , నా ఆనందాన్ని ఆకాశమంత చేశారు , సత్యవతి గారు . సరదాగా మొదలు పెట్టిన ఈ ఆర్టికల్ ఇంతటి ఆదరణను పొందిదంటే నాకు నమ్మశక్యం కావటము లేదు . నా సంతోషాన్ని ఎలా తెలపాలో , మాటలు రావటము లేదు . సత్యవతి గారూ మీకు నా ధన్యవాదాలను ఎలా తెలపాలో నిజం గా తెలీటము లేదండి . మాటలు తడబడి పోతున్నాయంటే నమ్మండి . అచ్చులో మొదటి సారిగా నా పేరును చూపించారు . చాలా చాలా ధన్యవాదాలండి .

నా ఈ పోస్ట్ రాయటానికి కారణమైన , కృష్ణ వేణి , లలిత డి గార్లకు , లింకులు వెతికి పెట్టి సహకరించిన , వరూధిని , జ్యోతి , మధురవాణి , జయ , సుభద్ర గార్లకు ధన్య వాదాలు . పి .డి యఫ్ చేసిపెట్టిన జ్యోతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు . చదివి ఆదరించిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు .

ఈ మధ్య నా కర్సర్ ఎందుకో నా మాట వినటము లేదు . ఈ రోజే సత్యవతి గారి దగ్గర నుండి భూమిక పుస్తకం అందింది . థాంక్స్ చెబుదామని , ఇంతకు ముందున్న టైటిల్ , ఇంకా పిక్చర్ మారుద్దామని ఎడిట్ చేసేసరికి ఎటో వెళ్ళిపోయింది . అదృష్టవసాత్తు టెస్ట్ బ్లాగ్ లో వుండటము వలన మళ్ళీ పోస్ట్ చేయగలుగుతున్నాను !

4 comments:

మాలా కుమార్ said...

భావన ఇలా అభినందించారు ,
congratulations one more time Mala garu. మీకేమండీ చక్కని వ్యక్తీకరణ మీ సొంతం. ఇలానే ఎన్నెన్నో రాసి ఇంకా విజయ గాధలు పంచుకోవాలని ఆశిస్తున్నా.

భావన గారు ,
మీ ఎంకరేజ్ మెంట్ కు చాలా థాంక్స్ అండి . మీ వాఖ్య ఇలా తిరిగి ప్రచురించినందుకు సారీ అండి .

మాలా కుమార్ said...

మధురవాణి ఇలా అన్నారు ,
Hearty Congratulations Mala garu! Wish to see many more from you! :-)
June 3, 2010 11:32 PM



మధురవాణి ,
థాంక్ యు . మీ వాఖ్య ఇలా తిరిగి ప్రచురించినందుకు సారీ అండి .

శిశిర said...

అభినందనలు మాల గారు.

Padmarpita said...

ఇలాగే మరెన్నెన్నో వ్రాసి మురిపిస్తారని ఆశిస్తూ....