Tuesday, June 8, 2010
ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . .
మావారిని , టిఫిన్ కారియర్ తో సహా పంపించేసి , తలుపేసుకొని , హాయిగా లాప్ టాప్ ముందు సెటిల్ అయ్యాను . సుజ్జి తో కబుర్లు చెప్పుకుంటూ , నేను ఇంతకు ముందు ఏ ఏ పోస్టు లకు వాఖ్య లిచ్చానో వాటికి ఎవ్వరైనా రిప్లై ఇచ్చారా చూసుకొని , ( ఇంతకు ముందైతే ఏ పోస్ట్ లకు వాఖ్య లిచ్చానా అని తెగ ఆలోచించి ఆలోచించి సతమత మైయ్యేదానిని . ఇప్పుడా భాధ లేకుండా హారం వాళ్ళు అన్ని ఒక చోట వచ్చేలా చేసారు . అమ్మయ్యా థాంకూ హారం ) , ఇంకాసిని వాఖ్య లిచ్చేసరికి ఆకలి వేస్తున్నట్లు గా అనుమానం వచ్చింది . సరే ఏదో కాస్త తినొస్తే ఓ పనైపోతుంది కదా అని , స్టడీ రూం నుండి బయటకు వచ్చాను . ఇదేమిటీ ?? ఆయనను పంపించి మేన్ డోర్ వేసినట్లు గుర్తే ! తీసివుందేమిటి ? ? ?
ఏమిటో వేసాననుకున్నాను కాని వేయలేదన్నమాట , అనుకొని తలుపు వేసి వంటింట్లోకి నడుస్తుండగా ఫోన్ పిలిచింది . దాని సంగతి చూసొద్దామని అటెళ్ళాను . ఆ పనయ్యాక మళ్ళీ ఆకలి గోలెట్టింది . వాకే బాబా తింటున్నాను , అని ఆకలిని బుజ్జగిస్తూ బయటకొస్తే మళ్ళీ మేన్ డోర్ తీసి వుంది . . .
ఏమిటీ వేసాననుకొని మళ్ళీ వేయలేదా ? ? ?
కాని నాకింత మతి మరుపు లేదే ! కొంపదీసి ఏ దొంగోడో దూరలేదుకదా !! !
చిన్నగా చప్పుడు కాకుండా అడుగులు వేస్తూ ఇల్లంతా వెతికాను . ఎవ్వరూ లేరు . మరి ఇదేమి మాయ . . . పక్క తలుపు దగ్గరగా వేసి ( ఏ దొంగోడో వస్తే తొందరగా బయటకు పరుగెత్తొచ్చని ) , మేన్ డోర్ తలుపు వేసి , ఈ సారి బోల్ట్ వేసి పక్కకు తిప్పాను . ఐనా ఏమిటో అంతా అయోమయం అనుకుంటూ అలాగే సోఫా లో కూర్చుండి పోయాను . ఇంతలో ఎవ్వరో తలుపు గట్టిగా కొట్టారు . ఎవరబ్బా అనుకొని వస్తున్నా అంటూ లేచాను .
ఆగకుండా ధడా ధడ్ అని అలా కొడుతారేమిటి అనివిసుక్కుంటూ సోఫాలోనుండి లేస్తూ తలుపు వైపు చూస్తే , తలుపు గట్టిగా వూగుతూ . . . .
బోల్ట్ చిన్నగా పక్కకు తిరుగుతూ . . .
నేను భయం భయం గా చూస్తూ వుండగానే , , ,
బోల్ట్ వూడి పోయి , తలుపు ధఢ . . ధఢ . . . కొట్టుకుంటూ ధఢాల్ మని తెరుచుకుంది .
నిశ్చేస్టురాలినై నిలబడి పోయాను . అర్ధరాత్రి దయ్యాలొస్త్తాయంటారు , కాని మిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయా ? ? ? కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి . బుర్ర పని చేయటము లేదు . . .
అలా ఎంత సేపు నిలబడిపోయానో తెలీదు . మా పనమ్మాయి జహీరా లోపలి కొస్తూ క్యా అమ్మా ఐసే ఖడే హోగయే అని అడిగి , తలుపు వేసి , బోల్ట్ పెట్టి , నా జవాబు వినకుండానే లోపలి కెళ్ళింది . నేను ఉసూర్ మంటూ సోఫా లో కూలబడ్డాను . వెంటనే జహీరా బయటకొస్తూ , అమ్మా ఖానా నై ఖాయే క్యా ఆపకా ప్లేట్ నై హై అంటూ ఏదో చెపుతోంది . కాని ఆ మాటలు నా చెవిలోకి పోయే లోపలే . . .
ధఢా . . . ధఢ్ . . . ధడా . . . ధఢ్ . . . తలుపు భయంకరంగా వూగి పోతోంది .
బోల్ట్ పక్కకి తిరిగి పోతోంది . . .
నేను అప్రయత్నంగా లేచి నిలబడి , నిలువు గుడ్లేసుకొని చూస్తున్నాను . . . . .
తిరిగింది . . . బోల్ట్ వూడి పోయింది . . .
ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . . .
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
ఎందేంది మా సుబ్బులుని పనిలోనుండి తీసేసి ఆ జహీరాని పెట్టుకున్నందుకు మీరు మార్తాండ కు అపాలజీ చెప్పాల్సిందే
మా బస్తీ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
జహీరా అక్రమాలు డౌన్ డౌన్
సుబ్బులు నాయకత్వం వర్ధిల్లాలి
అందుకే హారర్ సినిమాలు ఎక్కువగా చూడొద్దు అంటారు
aap ithna darthaye kyu??...firbi aapka saath nowkari haina muje lagatha hai may commnet likeneka aap dekkenkabad fir darungga karesochke may kuch likatha nahi but socho ek baath jo dargaya o margaya muje ithna maalum hai:-)
ఏంటండోయ్.. ఈ మధ్యన హారర్ వారోత్సవాలు నడుస్తున్నాయా ఏం అందరు ఇలా భయపెడుతున్నారు. తొందర గా తరువాతి కధ మరి..
ఏమిటీ , పిచ్చాస్పత్రి లో వున్న సుబ్బులుకు అభిమాన సంఘమా ? అంటే ? ? ?
శ్రీనివాస్ గారు ,
నేను హారర్ సినిమాలు చూడటమా జోక్ .
* థాంక్ యు అండి అశోక్ పాపాయి గారు .
* భావనా ,
చెప్పేసాను . మీదే ఆలశ్యం .
Post a Comment