Friday, February 5, 2010
బంగారుతల్లి కి బర్త్ డే గ్రీటింగ్స్
"కంగ్రాట్యులేషన్ యంగ్ గ్రాన్మా" అంటూ వీసా స్టాంప్ వేసి పాస్ పోర్ట్ ఇస్తూ అతను విష్ చేయగానే ," నీ పేరేమిటి ? నీ ఏజ్ ఎంత ? మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది ? " అని రక రకాల ప్రశ్నల తో వేదించి , నువ్వు చెప్పేవి నేను నమ్మటము లేదు నీకు వీసా ఇవ్వనుపో అని ఇంతకు ముందు పంపించేసిన ఆవిడలా ఇతనూ , ఏమేమి అడుగుతాడో , అసలు ఆవిడ నేను చెప్పినది ఏది నమ్మలే దో , ఈ సారి కూడా వీసా రాకపోతే ఎలానో అని టెన్షన్ ... టెన్షన్ గా వున్న నాకు ఒక్క నిమిషం అతను ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు . అర్ధం కాగానే థాంక్ యు , థాంక్ యు అన్నానే కాని , ఏమీ అడగకుండా నే ఈయనకు , నేను గ్రాండ్ మా ను కాబోతున్నానని ఎలా తెసింది ? అయినా నాకెందుకులే అతను మళ్ళీ మనసు మార్చుకుంటే కష్టం అనుకొని గబ గబా నా పాస్ పోర్ట్ తీసుకొని , బతుకుజీవుడా అనుకుంటూ బయట పడ్డాను .
ఇహ అప్పటినుండి ఒకటే టెన్షన్ . మొదటిసారి అంత దూరం ఒక్క దాన్నే ప్రయాణం చేయటము . గ్లోబ్ లో అటువైపు కనిపిస్తున్న అమెరికా కు ఎలా వెళుతాను ? తలుచుకుంటేనే భయం . ప్రమోషన్ రాబోతున్న త్రిల్ల్ , మనవడా , మనవరాలా ? అనే సస్పెన్స్ ( అమ్మాయా ? అబ్బాయా ముందే తెలుసు కోవద్దని , మా అమ్మాయి , అల్లుడు తెలుసుకోలేదు ) మొత్తానికి అమెరికా ఐతే చేరుకున్నాను . అదేమిటో పగలు ఎప్పుడూ పడుకునే అలవాటు లేదు అయినా ఒకటే నిద్ర . అమ్మా కొంచం నిద్ర ఆపుకో జెట్ లాగ్ పోతుంది అన్నది సంజు . అదేమిటో ఏం రోగమో ఏం పాడో అనుకొని , నాకు అలాంటివి ఏవీ రావులే అంటూనే నిద్ర పోతున్నాను . అమ్మా అది రోగం కాదు , ఇలా నిద్ర పోవటమే అని నవ్వింది . ఎంతసేపు గడిచిందో , ఆంటీ , ఆంటీ లేవండి సంజును హాస్పెటల్ కి తీసుకెళ్ళాలి అని సతీష్ లేపేసాడు . అంతే మళ్ళీ టెన్షన్ మొదలు .
ఏం అమెరికా నో ఏం పాడో తల్లి , వీళ్ళకు ఏమైనా పిచ్చా ? లేబర్ రూంలో సంజు తో పాటు నేను , సతీష్ వుండటమేమిటి ? అసలే హాస్పెటల్ పేరు చెబితేనే కళ్ళు , కడుపు లో , గిర గిరా తిరిగిపోతుంది . అసలు నాకెక్కువ భయమా ? సతీష్ కెక్కువా తెల్చుకోవటము కష్టమే . అంతా అయోమయం , అస్తావిస్తం ! మాటి మాటికి బయటకు పరుగెత్తటము , సోఫా లో కాసేపు కూర్చొని రావటము . నా ఇబ్బంది చూసి సంజు ఫ్రెండ్ , శాంతిని పిలిచింది . ఏమిటో ఈ చిన్న పిల్లల తో నేను అనుకుంటూ మళ్ళీ బయట సోఫా లోకి చేరుకున్నాను . అంత టెన్షన్ లోనూ అక్కడ ఓ అమెరిక భర్త , ప్రెగ్నెంట్ భార్య తో చేయిస్తున్న ఎక్సర్సైజులు చూడగానే నవ్వొచ్చింది . పక్కున నవ్వేసాను . పాపం వాళ్ళూ నవ్వేసి , హాయ్ అన్నారు .( ఆ తరువాత సంజు , అలా నవ్వకూడదు అని కోపం చేసింది . అది వేరే సంగతి .) వీళ్ళ గోల నాకెందుకులే అనుకొని ,కళ్ళు మూసుకొని ,అమ్మాయైయనా , అబ్బాయైయనా పనికొస్తుంది అనుకుంటూ లలితా సహస్రనామాలు , హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను .
* * * * * * * * * * * * * *
అమ్మవారి ముందు చేతులు జోడించి వేడుకొని , అందరి తో పాటు ముందుకు కదిలాను . వెంటనే పూజారి అలా వెళ్ళిపోతున్నావేమిటి ? ఈ ప్రసాదము తీసుకో , అమ్మకు ఎర్రంచు పసుపు చీర పెడుతాను అని మొక్కుకో అంటూ నా తలపైన అక్షితలు చల్లారు .
* * * * * * * * * * * * * *
ఆంటీ ఆంటీ అన్న పిలుపుతో అదేమిటి , గుడిలో ఈ పిలుపేమిటి అని చూద్దును కదా ఎదురుగా శాంతి , ఆంటీ పాప పుట్టింది అని చెపుతోంది . ఐతే ఇందాకటిది కల అన్నమాట !
అమ్మ పక్కన పాపాయి , అప్పుడే కళ్ళు తెరిచి చుట్టూ చూసేస్తోంది ." హాయ్ అమ్మమ్మా ఎలావున్నాను ? "
" బంగారుతల్లిలా వున్నావురా అమ్మలూ . ఎంత ముద్దొస్త్తున్నావో "
" అమ్మమ్మా నేను నీకు గాడ్స్ గిఫ్ట్ కదా ? "
" అవునురా బుజ్జీ "
" ఏయ్ అమ్మమ్మా , నేనిప్పుడు టీన్స్ లోకి వెళుతున్నాను . నన్నింకా , బుజ్జీ , కన్నా అనొద్దు ."
అమ్మో అప్పుడే మా బంగారుతల్లి టీనేజ్ గర్ల్ ఐపోతోందా ? కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది . నిన్న మొన్న నే ఇవన్నీ జరిగినట్లుగా వుంది . ఇంకా పొత్తిళ్ళ లో పాపాయిగా నే అనిపిస్తోంది .
కాని కాదుట ! పెద్ద అమ్మాయిట ! నాకెంటే పొడుగుట ! ఓకే ఓకే . ఒప్పుకుంటున్నాం మేడం .
మా బంగారుతల్లి అదితి కి జన్మదిన శుభాకాంక్షలు .
పై ఫొటో అదితి సొంతముగా వేసుకున్న సెల్ఫ్ పోట్రేట్ ది .
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
మీ బంగారు తల్లికి జన్మ దిన శుభ కాంక్షలు
దేవతల తల్లి పేరు అదితి
మంచి పేరు పెట్టారు
Many Many Happy Returns of the Day Aditi. Happy Birthday and god bless you my dear.
మీ అదితి కి మా తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు.
Happy B'day Aditi !May all your dreams come true :)
శుభాకాంక్షలు. అదితి కి నా జన్మదిన అభినందనలు. కలకాలం సుఖశాంతులతో, చక్కటి భవిష్యత్తు తో విలసిల్లాలని దీవిస్తున్నాను. All the best dear Aditi.
అదితి కి పుట్టినరోజు శుభాకాంక్షలు
చిట్టి తల్లి అదితికి జన్మ దిన శుభాకాంక్షలు. బొమ్మ ఎంత బాగా వేసిందో.May all her dreams come true.
చిన్నారి అదితి కి జన్మదిన శుభాకాంక్షలు. ఆమెలోని చిత్రకారిణికి అభినందలు కూడా! మా పాప గీతా కూడా ప్రత్యేక అభినందనలు చెప్పమన్నది.
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అదితికి...
పుట్టినరోజు శుభాకాంక్షలు..
ఈ బంగారుతల్లికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్ధిస్తున్నాను..
Happy Birthday to You Aditi
Enjoy the Day
thank you for all the blessings and good wishes...
ADITI:)
A very happy birthday to Adithi..!
and...She's really good at painting :)
Many happy returns of the day Aditi. :)
దేవుడు మీఇంటికి అతిధిగా పంపిన మీ బంగారుతల్లి అదితికి పుట్టినరోజు జేజేలు ....నూరు పండుగలు ఇలాగే జరుపుకోవాలని ఆశీస్సులు :)
apparao sastri gaaru ,
bhavana garu ,
venu srikanth garu ,
anveshi garu ,
jaya ,
lalita garu ,
satya garu ,
amma odi garu ,
srilalita garu ,
ushabala ,
madhuravani garu ,
srujana ,
parimalam garu ,
అందరికి ధన్యవాదాలండి .
special thanks to geeta.
A very happy birthday to Adithi!
Wow, super ga vesindi excellent,amazing.
belated happy birthday adithi.
mi latest tapa mr.pellam chadivinapudu miru inka recent ga married anukunna :).
kani ee tapa chadivaka telisindi ammamma ani ;)
Wow, super ga vesindi excellent,amazing.
belated happy birthday adithi.
mi latest tapa mr.pellam chadivinapudu miru inka recent ga married anukunna :).
kani ee tapa chadivaka telisindi ammamma ani ;)
స్వప్న గారు ,
నాకూ ,మా మనవరాలికి మీరిచ్చిన కాంప్లిమెంట్ కు థాంక్స్ అండి .
Post a Comment